ఇది కదా మేకప్‌ అంటే.. | Viral: Makeup Video Transformation Will Leave You Stunned. See The Trick | Sakshi
Sakshi News home page

ఇది కదా మేకప్‌ అంటే..

Published Sat, Aug 4 2018 4:16 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Viral: Makeup Video Transformation Will Leave You Stunned. See The Trick - Sakshi

అందంగా కన్పించడం కోసం మేకప్‌ వేసుకోవడం సాధారణమే.  మేకప్‌తో  అనేకమంది కళాకారులు మాయ చేయడం కూడా  చాలాసార్లు చూశాం. కానీ  నమ్మశక్యం కానంతగా  ముఖాకృతిని మార్చి వేసి, మేకప్‌ మ్యాజిక్‌ సృష్టించిందో ఓ యువతి.  అద్భుతమైన కళికారిణి పేరు  చైనాకు చెందిన  హువావా.  మేకప్‌ ట్రిక్స్‌తో గుర్తుపట్టలేనంతగా పూర్తిగా మారిపోయి నెటిజనులను షాక్‌ చేస్తోంది.   దీనికి  సంబంధించిన వీడియో చైనీస్‌ వీడియో ప్లాట్‌ఫాం యుకులో  సెన్సేషన్‌ అయ్యింది.  ఒక్క రోజులోనే 20లక్షల మందికి పైగా వీక్షించగా, వేల కొద్ది లైక్‌లు, షేర్స్‌ను సొంతం చేసుకుంది.  ఫౌండేషన్‌, లెన్సెస్‌, లిప్‌స్టిక్‌ వంటివాటితో పాటు ప్రొస్థటిక్‌ (కృత్రిమ అవయవం)  ముక్కును అమర్చుకుని,  మేకప్‌ వేసుకుని  పూర్తిగా మారిపోయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు మేకప్‌ వేసుకోవడం, తొలగించడంతోపాటు, నకిలీ ముక్కు అని మనకు రుజువు కావడానికి ఏకంగా కత్తెరను వాడడాన్ని ఈ వీడియో చూపించడం విశేషం. అమ్మాయిల  మేకప్‌ మాయాజాలంపై  గతంలో చాలా జోక్స్‌ పేలినప్పటికీ, ఈ అలంకరణ నైపుణ్యాన్ని మాత్రం అభినందించకుండా  ఉండలేం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement