
రెప్పపాటులో తప్పిన ముప్పు
ఆ పిల్లాడికి స్కూలుకు వెళ్లడం ఇష్టం లేనట్లుంది.. అయినా తప్పనిసరై వెళ్లాల్సి వస్తోంది. దాంతో స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తూ.. ఫుట్పాత్ మీద అటూ ఇటూ తిరుగుతున్నాడు. కాళ్లతో అక్కడున్న గ్రిల్ను తంతున్నాడు. మళ్లీ అక్కడ ఉండబుద్ధి వెయ్యలేదు.. దాంతో అలా పక్కకు వెళ్తున్నాడు. అంతలో ఉన్నట్టుండి ఓ కారు వేగంగా ఫుట్పాత్ మీదకు దూసుకొచ్చింది.
ఫుట్పాత్తో పాటు.. అతడు అప్పుడే దాటిన కరెంటు స్తంభాన్ని కూడా ఢీకొంది. అంతే, ఒక్కసారిగా ఆ పిల్లాడు ఉలిక్కిపడ్డాడు. తనకు భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయని తెలుసుకుని హమ్మయ్య అనుకున్నాడు. ఈ వీడియో గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.