ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. మౌంట్ వెర్నాన్ లో తెల్లవారుజామున 3గంటలకు హైవేపై ఆగిన ఓ కారును పోలీసులు గుర్తించారు. ఎందుకు ఆగిందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన పోలీసులు ఓ వ్యక్తిని, అతనితో పాటు ఓ మహిళను గుర్తించారు. వివరాలు సేకరించగా ఇద్దరు కూడా తప్పుడు పేర్లు చెప్పినట్టు ఆన్ లైన్ రికార్డుల్లో తేలింది.
వాళ్లిద్దరు పాత నేరస్థులు బ్రాండెన్ గ్రిఫిన్ (23), ఆయన భార్య క్రిస్టియానో శాంటోస్ (31)గా గుర్తించారు. తప్పుడు వివరాలు చెప్పడంతో పాటు వీరిద్ధరిపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేర్వేరు కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
పోలీసులుకు సహకరించాల్సింది పోయి పెనుగులాటకు దిగాడు గ్రాఫిన్. పోలీసుల దగ్గర ఉన్న ఓ తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. వారు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు గ్రాఫిన్. క్రిస్టియానో శాంటోస్ ను అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో అంతా పోలీసులు ధరించిన బాడీ కెమెరాలో రికార్డు అయింది. లొంగిపోవాలని సూచించినప్పటికీ గ్రాఫిన్ కాల్పులకు దిగాడని పోలీసులు తెలిపారు.
🚨Officer Involved Shooting
— Illinois Crime Cam (@illinoiscrime) May 12, 2023
📌#MTVernon #Illinois
23-year-old Brandon Griffin and 31-year-old Christine Santos were stopped by the Illinois State Police and both had arrest warrants. Following an altercation: Griffin was later found deceased after shooting at the troopers. pic.twitter.com/LJSxWTIcoZ
Comments
Please login to add a commentAdd a comment