state police
-
క్షణాల్లో కాల్చివేత, అమెరికాలో సంచలనం.. దడ పుట్టిస్తున్న వీడియో
ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. మౌంట్ వెర్నాన్ లో తెల్లవారుజామున 3గంటలకు హైవేపై ఆగిన ఓ కారును పోలీసులు గుర్తించారు. ఎందుకు ఆగిందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన పోలీసులు ఓ వ్యక్తిని, అతనితో పాటు ఓ మహిళను గుర్తించారు. వివరాలు సేకరించగా ఇద్దరు కూడా తప్పుడు పేర్లు చెప్పినట్టు ఆన్ లైన్ రికార్డుల్లో తేలింది. వాళ్లిద్దరు పాత నేరస్థులు బ్రాండెన్ గ్రిఫిన్ (23), ఆయన భార్య క్రిస్టియానో శాంటోస్ (31)గా గుర్తించారు. తప్పుడు వివరాలు చెప్పడంతో పాటు వీరిద్ధరిపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేర్వేరు కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులుకు సహకరించాల్సింది పోయి పెనుగులాటకు దిగాడు గ్రాఫిన్. పోలీసుల దగ్గర ఉన్న ఓ తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. వారు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు గ్రాఫిన్. క్రిస్టియానో శాంటోస్ ను అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో అంతా పోలీసులు ధరించిన బాడీ కెమెరాలో రికార్డు అయింది. లొంగిపోవాలని సూచించినప్పటికీ గ్రాఫిన్ కాల్పులకు దిగాడని పోలీసులు తెలిపారు. 🚨Officer Involved Shooting 📌#MTVernon #Illinois 23-year-old Brandon Griffin and 31-year-old Christine Santos were stopped by the Illinois State Police and both had arrest warrants. Following an altercation: Griffin was later found deceased after shooting at the troopers. pic.twitter.com/LJSxWTIcoZ — Illinois Crime Cam (@illinoiscrime) May 12, 2023 -
దాడి గురించి 2 రోజుల ముందే హెచ్చరించారా..?
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ఈ దారుణం గురించి రెండు రోజుల ముందే హెచ్చరించిందా అంటే.. అవుననే అంటున్నారు అధికారులు. రెండు రోజుల క్రితం జైషే మహ్మద్ వర్గాలు అఫ్గానిస్తాన్‌లో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశాయి. అఫ్గానిస్తాన్‌లో దాడి జరిగిన తీరు.. గురువారం పుల్వామాలో జరిగిన దాడి రెండు ఒకేలా ఉన్నట్లు సమాచారం. అఫ్గానిస్తాన్‌లో కూడా పేలుడు పదార్థంతో ఉన్న వాహనాన్ని ఉపయోగించి ముష్కరులు దారుణానికి తెగబడ్డారు. గురువారం పుల్వామాలో కూడా ఇదే తరహా దాడే జరిగింది. అయితే ఈ వీడియోను రెండు రోజుల క్రితమే గమనించిన జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు.. వీడియోతో పాటు అవసరమైన ఇన్‌పుట్స్‌ను కూడా ఇంటిలిజెన్స్ వర్గాలకు షేర్ చేసినట్లు సమాచారం. అయితే ఇంటిలిజెన్స్ అధికారులు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని... ఫలితంగా 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని అంటున్నారు విశ్లేషకులు. దాడి పట్ల ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లే సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండవచ్చని భావిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిసింది.(ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) -
మన పోలీస్.. నంబర్ 1
∙ మెరుగైన సేవలందిస్తున్నారు ∙ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు ∙ ఫ్ల్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం ∙ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఎంతో మార్పు కనిపిస్తోంది ∙ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇబ్రహీంపట్నంరూరల్: మన రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచారని.. ఆ పేరును అలాగే నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయిని మాట్లాడారు. భారతదేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖ ఆదర్శంగా నిలిచిందన్నారు. పోలీస్ శాఖ గతంలోకంటే మెరుగ్గా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. చెర్వులను దత్తత తీసుకోవడం, హరితహారం కార్యక్రమంలో పాలుపంచుకోవడం లాంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని నాయిని చెప్పారు. పోలీసులంతా మన బంధువులని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శాఖలో మార్పు వచ్చిందన్నారు. పోలీసులు గర్వపడకుండా ప్రజలు వచ్చినప్పుడు మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఇతరుల వద్ద చేయి చాచకుండా ప్రతి నగర పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ.75వేలు, జిల్లా పోలీస్ స్టేషనుకు రూ.50వేలు, గ్రామీణ పోలీస్ స్టేషన్లకు రూ.25వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. పోలీసులు నిరాశ చెందకుండా విధులు నిర్వర్తించాలని.. ప్రభుత్వం తమకు అండగాఉంటుందన్నారు. పోలీస్ శాఖ బలోపేతం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి మహేందర్‌రెడ్డి పోలీస్ డిపార్టుమెంట్ గతంకంటే ఇప్పుడు బాగా పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అందుబాటులో ఉంటుందన్నారు. పోలీసుశాఖ బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పోలీసులు సహకరిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధునాతన పోలీస్ స్టేషన్లు నిర్మించడానికి సహకరిస్తామన్నారు. బషీరాబాద్ మండలంలో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను ఈ నెల14న ప్రారంభిస్తామని మహేందర్‌రెడ్డి చెప్పారు. అనంతరంప్రతి ఒక్కరు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడాలని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ రూపొందించిన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పోస్టర్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి,డీజీపీ అనురాగ్‌శర్మ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు అవిష్కరించారు. పోలీస్‌స్టేషన్ గదులు, ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన షీ టీం, ట్రైనింగ్గది, కౌన్సెలింగ్ గదులు, రిసెప్షన్, సీఐ గదులను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి , డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, కృష్ణారెడ్డి పరిశీలించారు. జనరల్ డైరీలో హోంమంత్రి చేతితో రాసి ప్రారంభించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఢఈ సందర్భంగా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌కు గురునానక్ విద్యా సంస్థలు, భారత్ విద్యా సంస్థల అధినేతలు కంప్యూటర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, పోలీస్ హౌజింగ్ బోర్డు ఎండీ మల్లారెడ్డి, చైర్మన్ దామోదర్, రాచకొండ జాయింట్ సీపీ తరుణ్‌జోషీ, ఏసీపీ మల్లారెడ్డి. ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి, హరిత, జెడ్పీటీసీ సభ్యుడు అయిలయ్య, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పోలీసులకు సీఎం అభినందనలు
ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణకు పతకాల పంట సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో సత్తా చాటిన రాష్ట్ర పోలీసులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. కొత్త రాష్ట్రం ఈ ఘనత సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మైసూరులో జరిగిన ఈ పోటీల్లో దేశంలో ఉత్తమ రాష్ట్రానికి అందించే ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ తోపాటు పలు పతకాలను రాష్ట్ర పోలీసులు గెలుపొందారు. ఈ మేరకు ట్రోఫీలు, పతకాల వివరాలు వెల్లడిస్తూ సీఎం కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సైంటిఫిక్ ఎయిడ్ టూ ఇన్వెస్టిగేషన్ బృందం రెండు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలుపొందింది. ఫోరెన్సిక్ సైన్స్ రాత పరీక్షలో సీఐడీ ఎస్ఐ డి.విశ్వేశ్వర్ బంగారు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ వెండి, నల్లగొండ జిల్లా చందంపేట ఎస్ఐ ఆర్.సతీశ్ కాంస్య పతకాలు గెలు పొందారు. లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పోటీ విభాగంలో సీఐడీ ఇన్స్పెక్టర్ టి.అమృత్ రెడ్డి బంగారు పతకం.. పోర్ట్రెయిట్ పార్ల్ విభాగంలో సీఐడీ ఏఎస్ఐ ఎం.రామకృష్ణ వెండి పతకాన్ని గెలుపొందారు. తెలంగాణ పోలీసుల జాగిలం రీటా బంగారు పతకాన్ని గెలుపొందింది. సైంటిఫిక్ ఎయిడ్ టూ ఇన్వెస్టిగేషన్ విభాగంలో తెలంగాణ పోలీసులు విన్నర్స్ ట్రోఫీ, హార్డ్ లైనర్స్ ట్రోఫీలను, కంప్యూటర్ అవేర్నెస్ విభాగంలో రన్నర్స్ ట్రోఫీలను గెలుపొందారు. -
ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదుల చర్యలతో ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు కూడా పోలీసులతో ప్రత్యేక తర్ఫీదు ఇప్పించాలని నిర్ణయించారు. తద్వారా ఉగ్రవాద చర్యలను సులభంగా పసిగట్టడంతోపాటు నష్టాన్ని భారీగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. నగరాలు, పట్టణాలలోకి కొత్తగా వచ్చే వ్యక్తులు, అనుమానితుల విషయాలను ఎప్పటికప్పుడు పోలీసుకు చేరేలా ఒక వ్యవస్థను రూపొందించబోతున్నారు. ముఖ్యమైన ప్రాంతాలు, ప్రదేశాల వద్ద కాపాలా కాయడంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలదే ప్రముఖ పాత్ర. వీరికి ఇప్పటి వరకు ఎలాంటి శిక్షణ లేదు. దీంతో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించడంలో ప్రైవేటు సెక్యూరిటీ గుర్తించలేకపోతున్నారు. ఈ మేరకు ఇటీవల పలుచోట్ల పోలీసులు నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో లోపాలు బయటపడ్డాయి. వీటిని అధిగమించేందుకు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. అందుకు అనుగుణంగా త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించడం కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానితులపై డేగకన్ను హైదరాబాద్‌తోపాటు ముఖ్యమైన నగరాలు, పట్టణాల్ల డేగకన్నుతో విస్తృతమైన భద్రతాచర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. లుంబినీ పార్కు, గోకుల్‌ఛాట్, మక్కా మసీదు తదితర ప్రాం తాల్లో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో వాటిని పునరావృతం కాకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లతో నిత్యం సమాచారం పంచుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. -
మరింత వేగంగా పోలీసు సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ మరో ముందడుగు వేసింది. అన్ని రకాల పోలీసు సేవలను సాంకేతిక పరిజ్ఞానంతో ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ‘ఫస్ట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టం ఆఫ్ తెలంగాణ స్టేట్’(ఫస్ట్) కార్యక్రమంలో భాగంగా సమాచారం అందిన వెంటనే సేవలు అందించేందుకు, పోలీసు శాఖలోని అన్ని ఆధునిక వ్యవస్థలను ‘కమాండ్ అండ్ కంట్రోల్’ సిస్టంతో అనుసంధానించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం అమలులో వున్న ‘డయల్ 100’ వ్యవస్థ కూడా ‘కమాండ్ అండ్ కంట్రోల్’తో అనుసంధానం కానుంది. కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో అనుసంధానానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం కోసం రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వస్తే దేశంలో అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించుకునే పోలీసు విభాగంగా తెలంగాణ పోలీసు శాఖ గుర్తింపు పొందనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
అమలులోకి తెలంగాణ రాష్ట్ర పోలీసు కొత్త లోగో
అందరికీ ఒకటే 60 వేల మంది సిబ్బందికి దశలవారీగా పంపిణీ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కొత్త లోగో అమలులోకి వచ్చింది. ఉమ్మడిరాష్ట్రంలో ధరించిన లోగోకు బదులుగా ఈ కొత్త లోగోను ధరించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు, హర్యానా, కర్ణాటకలకు చెందిన తయారీదారులకు మొత్తం 60 వేల లోగోలకు పోలీసుశాఖ ఆర్డర్లిచ్చినట్టు తెలిసింది. నెవీబ్లూ రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో పైన బంగారురంగు సింహాలతో కూడిన అశోకచిహ్నం, దాని కింద ‘సత్యమేవజయతే’ సూక్తిని ఏర్పాటు చేశారు. తెల్లరంగులో తెలంగాణ స్టేట్ అని రాసి, దాని కింద పోలీస్ అని రెడ్బ్రాండ్తో పెద్ద అక్షరాలను చిత్రీకరించారు. దీని కింద డ్యూటీ, ఆనర్, కంపాషన్ అని పోలీసు విద్యుక్త ధర్మాన్ని సూచించే అక్షరాలను పేర్కొన్నారు. ఈ లోగో రూపకల్పనకు వివిధ రాష్ట్రాలతో పాటు, కేంద్రప్రభుత్వ పరిధిలోని వివిధ పోలీసు బలగాలు, అంతర్జాతీయ పోలీసు శాఖలు ఉపయోగిస్తున్న లోగోలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆడంబరాలకు పోకుండా సరళంగా కనిపించేలా రాష్ట్ర పోలీసు లోగోను పోలీసు అధికారుల కమిటీ రూపొందించింది. ఇందుకు ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ సహకారం తీసుకున్నారు. దీనిని అందరికీ ఆమోదయోగ్యంగా రూపొందించడంలో డీజీపీ అనురాగ్‌శర్మ నేతృత్వంలో ిపీ అండ్ ఎల్ ఐజీ నవీన్‌చంద్, ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేశ్ తదితర అధికారులు నెలా పదిహేను రోజులుగా తీవ్రంగా కృషి చేశారు. లోగోలో పేర్కొన్న డ్యూటీ, ఆనర్, కంపాషన్ అనే పదాలకు అధికారులు విస్తృతార్థాలను కల్పించారు. డ్యూటీకి సంయమనం, నిష్పక్షపాతం, బాధ్యతాయుతం, రహస్యాలను కాపాడడం, చట్టాన్ని గౌరవించడంగా పేర్కొన్నారు. అలాగే ఆనర్ అనే పదానికి నిజాయతీ, పారదర్శకత, సమగ్రత, ప్రతిష్ఠ, గౌరవంతో మెలగడంగా పేర్కొన్నారు. కంపాషన్ అంటే మానవత్వం, సానుభూతి, కరుణ, సహనం, సేవాగుణం, ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకోవడం, జవాబుదారీతనం, ప్రజాస్వామికంగా వ్యవహరించడం, స్నేహంగా మెలగడం వంటి గుణాలను విశదీకరించారు. ఇదిలాఉండగా, లోగో పొడవు 98 మిల్లిమీటర్లు, వెడల్పు 76 మిల్లిమీటర్లు ఉంది. ఇదే లోగోను కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ధరించాల్సి ఉంటుంది. -
ఆపరేషన్ ‘ఆమ్లా’ ఆరంభం
సాక్షి, చెన్నై: ముంబైలో పేలుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ పేలుళ్లకు పాల్పడిన తీవ్రవాదులు సముద్రమార్గం గుండానే దేశంలోకి చొరబడినట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా సముద్ర తీరాల్లో భద్రతను పెంచారు. రాష్ట్రంలో పదమూడు జిల్లాలు సముద్ర తీరాల్లోనే ఉన్నాయి. దీంతో భారత కోస్టు గార్డ్, నావికాదళంతోపాటుగా మెరైన్ పోలీసులు, హార్బర్ పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీరి పని తీరుకు సవాల్ విసిరే రీతిలో, ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో పసిగట్టేందుకు ఆపరేషన్ ఆమ్లా మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు.ఆపరేషన్ ఆరంభం : 36 గంటల పాటు సాగే ఈ ఆపరేషన్ ఆమ్లా మాక్ డ్రిల్ బుధవారం ఉదయం ఆరు గంటలకు ఆరంభం అయిం ది. మరుసటి రోజు రాత్రి వరకు సముద్ర తీరాల్లో గస్తీ కట్టుదిట్టంగా ఉంటుంది. ఆదిశగా రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, కడలూరు, తూత్తుకుడి, నాగపట్నం, రామనాధపురం, కన్యాకుమారి తదితర 13 సముద్ర తీర జిల్లాల్లో నిఘాను పటిష్ట వంతం చేశారు. ఓ వైపు భారత కోస్ట్ గార్డ్, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని సముద్ర తీర భద్రతా విభాగం, కేంద్ర బలగాలు, మెరైన్ పోలీసులు డేగ క ళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోకి సముద్ర తీరం గుండా తీవ్రవాదులు గుంపులు గుంపులుగా బయలు దేరినట్టు ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సముద్ర తీర జిల్లాల పోలీసు స్టేషన్లకు, ప్రత్యేక భద్రతా విభాగాలు, అధికారులకు పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి సమాచారం చేర వేశారు. పరుగో పరుగు: తీవ్రవాదుల చొరబాటు సమాచారంతో సముద్ర తీర జిల్లాల్లో భద్ర తా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మఫ్టీలో చొరబడే పోలీసుల(తీవ్రవాదుల)ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల్ని తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో నూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పడవల్లో సముద్రంలోకి దూసుకెళ్లారు. చేపల వేట నుంచి వస్తున్న జాలర్లను తనిఖీల అనంత రం అనుమతించారు. కాశిమేడు హార్బర్లోకి ఆరున్నర గంటల సమయంలో వేర్వురుగా రెండు పడవల్లో చెన్నైలోకి చొరబడేందుకు యత్నించిన ఆరుగురిని అరెస్టు చేశారు. నీలాంకరైలో మరో ముగ్గురిని అరెస్టు చేశా రు. ఇంకా మరి కొంత మంది జట్టులు జట్టులుగా సముద్ర తీర జిల్లాల్లో చొరబడనుండడంతో వారి కోసం వేట కొనసాగుతోంది. ఆమ్లా ఆపరేషన్ గురువారం రాత్రి వరకు కొనసాగుతుండడంతో పోలీసులకు విశ్రాంతి లేనట్టే. మఫ్టీలో ఉన్న వాళ్లను వదలి పెట్టిన పక్షంలో ఎక్కడ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న ఆందోళనలతో సముద్ర తీరాల్లో కళ్లు కాయలు కాచేలా భద్ర తా విధుల్లో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈ సారి ఆమ్లా ఆపరేషన్‌లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరినిసైతం కలుపుకున్నారు. బంగారం పట్టి వేత: ఆపరేషన్ ఆమ్లాలో భాగంగా తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సమయంలో ఓ యువకుడు కోయంబేడులోకి రావడం, అతడి వద్ద జరిపిన తనిఖీల్లో బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. నగదు సైతం లభించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భువనేశ్వర్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌గా తేలింది. కోయంబత్తూరులోని ఓ బంగారం దుకాణానికి వీటిని తీసుకెళ్తున్న ట్టు పేర్కొన్నా, అందుకు తగ్గ రశీదులు అతడి వద్ద లేవు. పట్టుబడిన 8 కిలోల బంగారం, రూ.8 లక్షల నగదును వాణిజ్య పన్నుల విభాగం అధికారులకు అప్పగించారు. -
అధికారుల కృషి ఫలితమే ఈ గుర్తింపు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించడానికి అధికారుల కృషే కారణమని డీజీపీ ప్రసాదరావు కొనియాడారు. పోలీసు విభాగంపై ప్రచురించిన రెండు పుస్తకాలను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వీటికి తుదిరూపం ఇవ్వడానికి మాజీ ఐపీఎస్ అధికారి ఎస్.ఉమాపతి, మాజీ అదనపు ఎస్పీ కె.సుధాకర్ ఎంతో కృషి చేశారని డీజీపీ ప్రసంశించారు. ‘గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ఏపీ పోలీసు’ పేరుతో తీసుకొచ్చిన పుస్తకంలో సైబరాబాద్, మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు సేవ చేయడానికి అనుసరించిన విధానాల గురించి వివరించారు. ‘ప్రాజెక్ట్-పీపుల్స్ పోలీసింగ్’ పేరుతో ఉన్న పుస్తకంలో ప్రజలతో స్నేహ భావంతో మెలిగేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని పేర్కొన్నారు. అలాగే, ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసు విభాగం జారీ చేసిన మెమోలు, మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను పొందుపరిచారు. ఈ పుస్తకాలను బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రచురించింది. -
రాష్ట్ర పోలీసుల్ని అప్రమత్తం చేసిన కేంద్రం
హైదరాబాద్ : తెలంగాణ బిల్లు నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరం అయితే రాష్ట్రానికి అదనపు బలగాలను దించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే సీమాంధ్ర జిల్లాల్లోనూ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. తెలంగాణ బిల్లు పై చర్చ నేపథ్యంలో సీమాంధ్రలో మళ్లీ ఆందోళనలు ఉధృతమైన విషయం తెలిసిందే.