కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా భయాకన వాతావరణం నెలకొంది. యుద్దం వేళ ఎటునుంచి ఏ మిస్సైల్, బాంబు వచ్చి పడుతుందోనన్న భయంతో ప్రజలు బ్రతుకు పోరాటం సాగిస్తున్నారు. మరోవైపు కొందరు ఉక్రెనియన్లు మాత్రం దేశం కోసం సైనికుల్లా మారి పోరాటం చేస్తున్నారు. తాజాగా రష్యా దళాలు ఉక్రెయిన్ సైనికులపై దాడులను కొనసాగిస్తున్న వేళ ఓ ఆస్తక్తికర ఘటన చోటుచేసుకుంది.
రష్యా బలగాల దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని బెర్డయాన్‌స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను అమర్చారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఉక్రెయిన్ పౌరుడు ఆ ల్యాండ్‌మైన్‌ను చూశాడు. అయితే, దాని గురించి బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వకుండనే అనుకున్నదే తడవుగా రోడ్డు మీద ఉన్న ఆ ల్యాండ్‌మైన్‌కు రెండు చేతులతో(రక్షణ దుస్తులు, పరికరాలు లేకుండానే) పట్టుకొని దూరంగా వెళ్లి విసిరిపారేశాడు. ల్యాండ్‌మైన్‌ను తీసుకువెళ్తున్న సమయంలో బాంబు పట్టుకున్నాననే టెన్షన్ లేకుండా అతను సిగరేట్ తాగుతూ ఓ హీరోలా దాన్ని పట్టుకుని నడిచాడు.
A Ukrainian in Berdyansk spotted a mine on the road and didn't wait around for a bomb disposal unit - at great risk to life and limb, he removed the mine, clearing the way for the Ukrainian military.#nucleaire #WARINUKRAINE #RussiaUkraineWar #worldwar3 pic.twitter.com/BbSfHA8DXe
— Indian Army Fan Club (@VaadeD) March 1, 2022
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి తెగువను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వు తోపు సామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment