landmine
-
30మందిని కాపాడి ఆర్మీ జవాన్ వీరమరణం
కంభం/నార్పల: తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి కాపాడి.. తాను మాత్రం దాని బారిన బడి ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద సోమవారం విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్ ల్యాండ్‌మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య(45) జమ్మూలోని పూంచ్ జిల్లాలో 30 మంది జవానులతో కలిసి సరిహద్దు వద్ద కాపలా కాస్తున్నాడు. అంతలో అక్కడ ల్యాండ్‌మైన్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే తోటి జవాన్లను దూరంగా పంపించేసి తాను పొరపాటున దాని ఉచ్చులో చిక్కుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. అధికార లాంఛనాలు ముగించుకుని మృతదేహాన్ని బెంగళూరు వరకు విమానంలో.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తరలించనున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి వెంకట సుబ్బయ్య కొన్నేళ్ల కిందట చనిపోగా, తల్లి గాలెమ్మ గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ఆ తల్లి కుమారుడి ఫొటో పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. మృతుడి భార్య లీల స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం నార్పాల. ఇద్దరు పిల్లలతో ఆమె అక్కడే ఉంటోంది. మృతదేహాన్ని నార్పాల గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో బంధువులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్ భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. -
ఎల్ఓసీ వద్ద పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ల్యాండ్‌మైన్‌పై కాలు పెట్టడంతో పేలుడు సంభవించి భారత ఆర్మీ జవాను ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. రాజౌరీ జిల్లా నౌషేరాలో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు పెట్రోలింగ్‌లో ఉండగా ఒక జవాను ల్యాండ్‌మైన్‌పై అడుగు పెట్టడంతో ప్రమాదవశాత్తూ అది ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించండో ముగ్గురు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించగా ఒక సైనికుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే మరణించిన జవాన్ వివరాలను ఇంకా భారత ఆర్మీ వెల్లడించలేదు. -
పాకిస్తాన్లో దారుణం.. తండ్రిని చంపినట్టే కుమారుడిని కూడా..
ఇస్లామాబాద్: సోమవారం అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ల్యాండ్‌మైన్ పేల్చారు దుండగులు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ (యుసి) ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యుసి ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులను లక్ష్యంగా చేసుకుని దుండగులు రిమోట్ సాయంతో పేల్చడానికి ల్యాండ్‌మైన్ అమర్చారని పంజ్గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో తెలిపారు. వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు రాగానే దుండగులు రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ ఉన్నట్లు వీరంతా బల్గతార్, పంజ్గూర్ ప్రాంతానికి చెందినవారని అన్నారు. ఈ ప్రమాదం జరిగిన చోటే 2014లో ఇష్తియాక్ యాకూబ్ తండ్రి యాకుబ్ బల్గాత్రి తోపాటు అతని పదిమంది అనుచరులను కూడా ఇదే తరహాలో బాంబుదాడిలో హత్య చేయబడ్డారు. ఆనాటి ఆ దాడికి సూత్రధారులం తామేనంటూ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(BLF) అప్పుడే ప్రకటించింది. తాజాగా జరిగిన సంఘటనకు కూడా వారే బాధ్యులై ఉంటారని అధికారులు భయపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి -
యుద్ధం ఆమె జీవితాన్ని చీకటిమయం చేసింది...ఐనా ఆమే గెలిచింది
Nurse shares first dance with husband: రష్యా గత రెండు నెలలకు పైగా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ నేపథ్యంలో వేలాది మంది నిరాశ్రయలవ్వగా, లక్షలాదిమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లిపోయారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ శిథిలానగరంగా మారిపోవడమే కాకుండా అక్కడ భూభాగాలన్నీ పేలని మందుపాత్రలు, మందుగుండు సామాగ్రితో నిండిపోయింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లో లుహాన్స్లోని ఒక్సానా బాలండినా, వాసిలివ్ అనే జంట ఇంటికి వెళ్తున్న సమయంలో ఊహించని భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. బాలండినా నడుస్తున్నప్పుడూ పొరపాటున ల్యాండ్‌మైన్ పై పడిపోయింది. అంతే ఒక్కసారిగా ల్యాండ్‌మైన్ పెద్ద శబ్దంతో పేలడంతో ఆమె నెలపై ఒకవైపుగా పడిపోయింది. ఐతే ఆమె వెనుకే వస్తున్న ఆమె భర్తకి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో బాలండినాను ఆమె భర్త వాసిలివ్ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఐతే ఆమె ఆ సమయంలో అచేతనంగా పడి ఉందని తనకు ఏమ చేయాలో కూడా పాలిపోలేదని చెబుతున్నాడు. తాను ఇక బతకుతుందని కూడా అనుకోలేదని ఆశలన్ని వదిలేసుకున్నాని చెప్పుకొచ్చాడు. మరొవైపు రష్యా దళాలు ఉక్రెయిన్‌పై బాంబుల వర్షంతో విరుచుకుపడుతుండటంతో వారు ఆసుపత్రిలోనే నెలరోజుల పైనే గడపాల్సి వచ్చింది. ఇంకోవైపు వైద్యులు బాలండినాకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె ఈ ప్రమాదం కారణంగా రెండు కాళ్లను, ఎడమ చేతి నాలుగు వేళ్లను కోల్పోయింది. తర్వాత కొన్ని రోజులకు ఆమె కోలుకోవడం ప్రారంభించింది. బాలండినా మాత్రం తాను చాలా రోజులు చీకటి గదిలో గడపానని, ఇక జీవించాలని అనుకోలేదంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది. తన భర్త సహకారంతో తాను ఈ రోజు పూర్తిగా కోలుకుని బయటపడిగలిగానని చెప్పుకొచ్చింది. బాలండినా ఒక నర్సు, ఆమెకు ఏడేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురు ఉన్నారు. ఈ మేరకు ఆమె నాటి ఘటన తదనంతరం కోలుకుని ఆరోగ్యంగా పూర్తి స్థాయిలో బయటపడ్డాక ఆ ఆసుపత్రి వార్డులోనే తన భర్తతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ❤️🇺🇦 Very special lovestory. A nurse from Lysychansk, who has lost both legs on a russian mine, got married in Lviv. On March 27, Victor and Oksana were coming back home, when a russian mine exploded. The man was not injured, but Oksana's both legs were torn off by the explosion. pic.twitter.com/X1AQNwKwyu — Verkhovna Rada of Ukraine - Ukrainian Parliament (@ua_parliament) May 2, 2022 (చదవండి: హామీకి రష్యా తూట్లు.. పుతిన్ స్పందన కరువు!) -
నువ్వు తోపు సామి.. ఉక్రెయిన్ పౌరుడి తెగువకు ఫిదా.. వీడియో వైరల్
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా భయాకన వాతావరణం నెలకొంది. యుద్దం వేళ ఎటునుంచి ఏ మిస్సైల్, బాంబు వచ్చి పడుతుందోనన్న భయంతో ప్రజలు బ్రతుకు పోరాటం సాగిస్తున్నారు. మరోవైపు కొందరు ఉక్రెనియన్లు మాత్రం దేశం కోసం సైనికుల్లా మారి పోరాటం చేస్తున్నారు. తాజాగా రష్యా దళాలు ఉక్రెయిన్ సైనికులపై దాడులను కొనసాగిస్తున్న వేళ ఓ ఆస్తక్తికర ఘటన చోటుచేసుకుంది. రష్యా బలగాల దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను అమర్చారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఉక్రెయిన్ పౌరుడు ఆ ల్యాండ్‌మైన్‌ను చూశాడు. అయితే, దాని గురించి బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వకుండనే అనుకున్నదే తడవుగా రోడ్డు మీద ఉన్న ఆ ల్యాండ్‌మైన్‌కు రెండు చేతులతో(రక్షణ దుస్తులు, పరికరాలు లేకుండానే) పట్టుకొని దూరంగా వెళ్లి విసిరిపారేశాడు. ల్యాండ్‌మైన్‌ను తీసుకువెళ్తున్న సమయంలో బాంబు పట్టుకున్నాననే టెన్షన్ లేకుండా అతను సిగరేట్ తాగుతూ ఓ హీరోలా దాన్ని పట్టుకుని నడిచాడు. A Ukrainian in Berdyansk spotted a mine on the road and didn't wait around for a bomb disposal unit - at great risk to life and limb, he removed the mine, clearing the way for the Ukrainian military.#nucleaire #WARINUKRAINE #RussiaUkraineWar #worldwar3 pic.twitter.com/BbSfHA8DXe — Indian Army Fan Club (@VaadeD) March 1, 2022 ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి తెగువను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వు తోపు సామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఆ మందుపాతర 20ఏళ్ల నాటిది
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): గాలింపు చర్యలకోసం వచ్చే పోలీసులను హతమార్చాలనే లక్ష్యంతో 20 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్ నక్సలైట్లు గ్రెనేడ్ల రూపంలో అమర్చిన మందుపాతరను తాజాగా వెలికితీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో బయటపడ్డ గ్రెనేడ్లు పోలీసులను లక్ష్యం గా చేసుకునే అమర్చినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, మందుపాతరల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రెండోరోజు ఆదివారం జాగిలాల సహాయంతో బాంబు స్క్వాడ్ బృందాలు దుమాల పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. 20 ఏళ్ల క్రితం దుమాలను కేంద్రంగా చేసుకొని అప్పటి పీపుల్స్‌వార్, జనశక్తి నక్సలైట్లుతమ కార్యకలాపాలు కొనసాగించారు. పలుసార్లు ఇదే ప్రాంతంలో పోలీసుల నుంచి నక్సలైట్లు త్రుటిలో తప్పించుకున్న సంఘటనలున్నాయి. పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో నక్సలైట్లు చిట్టివాగు ప్రాంతంలో అమర్చిన గ్రెనేడ్లు 20 ఏళ్ల అనంతరం బయటపడినట్లు చెబుతున్నారు. దుమాల అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఎక్కడెక్కడ మందుపాతరలు అమర్చారన్న దానిపై జిల్లా బాంబు స్క్వాడ్ బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయి. మందుపాతరలను వెలికి తీయడానికి మాజీ నక్సలైట్ల సాయాన్ని తీసుకుంటున్నారు. నాడు రాగట్టపల్లిలో.. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్టపల్లిలో జనశక్తి నక్సలైట్లు గడ్డివాములో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు కొద్దిరోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. గడ్డివాములో పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు లొంగిపోయిన నక్సలైట్ల ద్వారా పోలీసులు సమాచారం సేకరించారు. దుమాలలోనూ 20 ఏళ్ల క్రితం మందుపాతరల రూపంలో దాచి ఉంచిన గ్రెనేడ్లను స్వాధీనం చేసుకోవడం, ఈ రెండు సంఘటనలు పక్కపక్క గ్రామాల్లోనే చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దుమాలలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు అమర్చిన గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వర్ స్పష్టం చేశారు. పీపుల్స్‌వార్ నక్సలైట్లు మాత్రమే గ్రెనేడ్లను మందుపాతర్లుగా వాడతారని ఆయన వివరించారు. -
ల్యాండ్‌మైన్ పేలుడు.. పదిమంది మృతి
ఇస్లామాబాద్: ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ల్యాండ్‌మైన్ ధాటికి ముక్కలైంది. పాకిస్తాన్‌లోని కుర్రం ఏజెన్సీలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. వాహనం గొడార్ గ్రామం నుంచి సొడా గ్రామానికి వెళ్తుండగా ల్యాండ్‌మైన్ పేలుడు సంభవించింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాఫ్టర్ సహాయంతో పెషావర్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుర్రం ఏజెన్సీ ఆఫ్గన్ సరిహద్దుల్లో ఉన్న ట్రైబల్ ప్రాంతం. -
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘రోబో పోలీసులు’
న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, ఇతరుల మరణాలకు కారణమవు తున్న మందుపాతరలు, ఆధునాతన పేలుడు పరికరాలను గుర్తించేందుకుగాను త్వరలోనే ‘రోబో పోలీసు’లను ప్రవేశపెట్టేందుకు సీఆర్పీఎఫ్ సిద్ధమవుతోంది. ఈ రోబో పోలీసు పరికరం మట్టిరోడ్లు, ఇతర ప్రాంతాల్లో దాచి ఉంచిన బాంబులను గుర్తించడంతోపాటు నిర్వీర్యం చేస్తుందని సీఆర్పీఎఫ్ డీజీ కె.దుర్గా ప్రసాద్ సోమవారం వెల్లడించారు. మందుపాతరలపై కాలుపెట్టినా రక్షణ కల్పించే కొత్త రకం బూట్లను హైదరాబాద్‌లోని ఓ సంస్థ సహాయంతో తయారు చేస్తున్నామన్నారు. -
మందుపాతర పేల్చిన మావోయిస్టులు
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు భద్రత విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో భద్రతా బలగాలకు చెందిన ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐఈడీ బాంబు సాయంతో ఈ పేలుడుకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు మావోయిస్టుల కోసం సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
విరుచుకుపడ్డ మావోయిస్టులు
మందుపాతర పేలి ఎనిమిది మంది బీఎస్ఎఫ్ ట్రైనీ జవాన్లు మృతి సాక్షి నెట్వర్క్, విజయనగరం/సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టులు చెలరేగి పోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో కేంద్ర బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చి భారీ దాడికి దిగారు. 13 మంది బీఎస్ఎఫ్ జవాన్లు వస్తున్న జీపును లక్ష్యంగా ఎంచుకుని సాలూరు–జైపూర్ మధ్య 26వ నంబర్ జాతీయ రహదారిపై ముంగిరిగుమ్మి వద్ద బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కల్వర్టును పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగా త్రులకు తొలుత సాలూరు, ఒడిశాలోని పొట్టంగి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు తునాతునకల య్యాయి. ఒక మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. జీపులో ప్రయాణించిన 13 మంది సెలక్షన్ లో ఎంపికైనప్పటికీ ఏడాదిగా ఉద్యోగం పొందలేకపోయారు. కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయడంతో ఇటీవల ఉద్యోగ నియామక ఉత్తర్వులొచ్చాయి. ఈ ఉత్తర్వులతో వీరు పోలీసు జీపులో కొరాఫుట్ నుంచి కటక్‌కు శిక్షణకు వెళ్తుండగా మావోయి స్టుల దాడికి గురయ్యారు. వీరంతా అసిస్టెంట్ డ్రైవర్ హోదా గలవారు. ఘటన స్థలం ఒడిశా సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పక్కా పథకం ప్రకారం పేలుడు పైపులైను డిటోనేటర్ల ద్వారా మావోయిస్టులు ఈ పేలుడుకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని రాంగఢ్‌లో మావోయిస్టులపై జరిగిన ఎన్ కౌంటర్‌కు నిరసనగా పక్కా పథకంతో ప్రతీకార దాడికి దిగినట్టు సమాచారం. పేలుడు ఘటన వెనక 15 మంది వరకు మావోయిస్టులు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒడిశా సరిహద్దులోని కొరాపుట్ చెక్ పోస్టు వద్ద, ఆంధ్రా సరిహద్దులోని పి.కొనవలస చెక్‌పోస్టు వద్ద నిఘా ఉంచి బీఎస్ఎఫ్ జవాన్లు వెళ్తున్న జీపును లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే సాలూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీశారు. ఒక్కరోజు కూడా శిక్షణ తీసుకోని ట్రైనీ జవాన్లను మావోయిస్టులు మట్టుబెట్టడం దారుణమని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. కాగా, మల్కన్ గిరి ఎన్ కౌంటర్ (30 మంది మావోయిస్టులు మృతి చెందారు) జరిగి సరిగ్గా వంద రోజులైన నేపథ్యంలో ఈ దాడి జరగడం విశేషం. ఘటన నేపథ్యంలో ఏజెన్సీ బలగాలను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిట్ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులు, కోవర్టులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తులసీ మజై, సోమనాథ్ సిసా, పి.నాయక్, చిట్ట దాస్, సంజయ్‌కుమార్ దాస్, ఎల్.కే. నాథ్, అర్జున్ కుమార్ నాయక్, ప్రదీప్మాలిక్, రాధేశ్యాం దాస్, సుభరాన్ కుమార్ దాస్, గణేష్ ప్రసాద్ దాస్, ప్రమోద్‌కుమార్ బిశ్వాల్, ప్రదీప్త కుమార్ రౌత్లలో ఎనిమిది మంది చనిపోయారు. మిగతా ఐదుగురు విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎవరు మృతులు, ఎవరు క్షతగాత్రులోఅధికారులు తెలియజేయలేదు. -
విరుచుకుపడ్డ మావోయిస్టులు
-
తాలిపేరు వద్ద మందుపాతర లభ్యం
చెర్ల : ఖమ్మం జిల్లా చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలుప వద్ద మందుపాతరను పోలీసులు గుర్తించారు. పోలీసులే టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. బాంబ్ డిస్పోజిల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది రప్పించి మందు పాతరను నిర్వీర్యం చేశారు. -
బీజాపూర్‌లో పేలిన మందుపాతర
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలిన ఘటనలో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా మహదేవ్ ఘాట్ వద్ద గురువారం మందుపాతర పేలింది. దీంతో సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ 85 వ బెటాలియన్‌కు చెందిన సురేంద్రకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతర అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర స్వాధీనం
ఛత్తీస్‌గఢ్: భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-అర్నాపూర్ రోడ్డులో బుధవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా.. నక్సల్స్ అమర్చిన 2 కిలోల మందుపాతర బయటపడింది. దీంతో పొలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. -
చింతూరు లో పేలిన మందుపాతర
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి- పేగ మార్గంలోని శుక్రవారం మందు పాతర పేలింది. దీనిని మావోయిస్టులు అమర్చినట్లుగా అనుమానిస్తున్నారు. అటవీప్రాంతంలో సంభవించిన ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనా స్థలిని జిల్లా పోలీసు అధికారులు పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. -
మందుపాతర పేల్చిన మావోయిస్టులు
-గడ్చిరోలి బూటకపు ఎన్కౌంటర్ బూటకమని వెల్లడి -ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ బంద్ పాటించాలని వాల్‌పోస్టర్లు చర్ల ఖమ్మం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ఆనంద్‌కాలనీ సమీపంలో మావోయిస్టులు శనివారం రాత్రి మందు పాతర పేల్చారు. ఈ నెల 22న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహిరీ పోలీస్‌స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ జూన్ 26న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని మండల కేంద్రంలోని ఆనంద్‌కాలనీ (చర్ల-ఉంజుపల్లి మార్గం) వద్ద రహదారి పక్కన పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లు వేయడంతోపాటు మందుపాతరను పేల్చారు. గతంలో పలు సందర్భాల్లో మావోయిస్టులు బంద్ పిలుపునివ్వగా పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ సారి బంద్‌ను విజయవంతం చేసేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. ప్రధాన రహదారి (బీటీ రోడ్) పక్కనే మందు పాతరను ఏర్పాటు చేసిన మావోయిస్టులు సుమారు 50 మీటర్ల దూరం వరకు విద్యుత్ వైరును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి దీనిని పేల్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ పేరిట పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లు సైతం అంటించారు. మావోయిస్టు పార్టీ గడ్జిరోలి జిల్లా కమిటీ సభ్యుడు చార్లెస్ అలియాస్ శోభన్, ఏరియా కమిటీ సభ్యుడు ముకేష్‌తోపాటు మరో పీఎల్జీఏ సభ్యుడిని ఇన్ఫార్మర్ల సమాచారంతో పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ కథ అల్లారని, దీనిని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు తీవ్రంగా ఖండించాలని కోరారు. కాగా, చర్ల పోలీస్‌స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. -
బాంబు పేలుడు కేసులో కొత్త మలుపు
ఇదే తరహాలో కేరళలోని కొల్లంలో పేలుడు కేరళ వైపు చిత్తూరు పోలీసుల చూపు చిత్తూరు: ఏప్రిల్.. 7. చిత్తూరులోని న్యాయస్థానాల సముదాయంలో పట్టపగలు న్యాయమూర్తులు ఉపయోగించే ప్రొటోకాల్ వాహనం కింద బాంబు పేలింది. దీంతో ఓ న్యాయవాది వద్ద పనిచేసే గుమస్తా కాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీన్ కట్ చేస్తే... బుధవారం.. కేరళ రాష్ట్రం కొల్లామ్‌లోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఓ జీపు కింద మందు పాతర పేలింది. ఇందులో కూడా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరులో జరిగిన ఘటన, కొల్లామ్ ఘటన రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు పోలీసులు కేరళ ఘటనపై దృష్టి సారించారు. చిత్తూరు నగరంలో బాంబు పేలుడు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరక్కుండా నిందితులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేరళలోని కొల్లాం న్యాయస్థానాల సముదాయంలో బుధవారం బాంబు పేలుడు జరిగింది. చిత్తూరులో పార్కింగ్‌లో ఉన్న కారు కింద బాంబుపెట్టి పేలుడు సృష్టించారో ఇదీ అలాగే జరిగింది. కొల్లామ్‌లో న్యాయస్థానాల సముదాయం, కలెక్టరేట్ రెండూ ఒకే చోట ఉన్నాయి. చిత్తూరులో ఉపయోగించినట్లే పేలుడులో గన్‌పౌడర్‌ను తక్కువ మొత్తం ఉంచారు. అంటే ఎవర్నీ టార్గెట్ చేయడానికి కాదు.. భయపెట్టడానికన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు ఘటనలకు ఏవైనా సంబంధాలున్నాయా..? అనే దిశగా చిత్తూరు పోలీసులు సమాలోచన చేస్తున్నారు. చిత్తూరు నుంచి ఓ బృందాన్ని కొల్లామ్‌కు పంపి, అక్కడి పరిస్థితిపై ఆరా తీయడానికి చిత్తూరు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
మందుపాతర పేలుడు : సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
మావోయిస్టులు అమర్చిన మందుపాత పేలి ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘనట ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమాజిల్లాలో జరిగింది. మావోయిస్టులు మూడు రోజుల బంద్ పిలుపు ఇచ్చిన నేపద్యంలో.. జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో జవాన్లు లక్షంగా ఏర్పాటు చేసి మందుపాత పేలింది. గాయపడిన జవాన్లను వైద్యం కోసం తరలించారు. ఘటకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టుల మందుపాతరకు మహిళ బలి
చింతూరు : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో వరుసగా జరుగుతున్న మందుపాతరల పేలుళ్లకు సాధారణ పౌరులూ బలవుతున్నారు. సుక్మా జిల్లాలో గురువారం మొర్లిగూడ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఓ చిన్నారి బలవ్వగా తాజాగా శుక్రవారం ఇదే జిల్లాలోని భెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలోగల కొత్తచెరువు గ్రామం వద్ద జరిగిన పేలుడుకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. గోర్ఖా గ్రామం కోసీపారాకు చెందిన ముచ్చిక హిడ్మా (55) విప్పపూలు ఏరుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళుతున్న క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేసింది. అది పేలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో మహిళకు గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలో వారం వ్యవధిలో మూడు మందుపాతరల పేలుళ్లకు ముగ్గురు బలి కావడంతో గ్రామీణులు రహదారులపై నడవాలంటేనే వణికిపోతున్నారు. -
అడవి..అలజడి
♦ పేలిన మందు పాతర... ♦ అటు మావోలు.. ఇటు ఖాకీలు.. ♦ ప్రతీకారేచ్ఛతో ఇరువర్గాలు ♦ భయాందోళనలో ఆదివాసీలు భద్రాచలం: మూడు రాష్ట్రాల సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పోలీసులు, మావోలు వరుస దాడులకు సై అంటున్నారు. ఇరువర్గాలు వ్యూహాత్మక దాడులకు పాల్పడుతుండటంతో అటవీ ప్రాంతాలు నెత్తురోడుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంటకు కూతవేటు దూరంలో మొర్లగూడ అటవీ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న రహదారులను తనిఖీ చేసేందుకు సీఆర్పీఎఫ్ 217 బెటాలియన్ జవాన్లు క్యాంపు నుంచి వెళ్లారు. ఆ జవాన్లను లక్ష్యంగా చేసుకొని మావోలు మందుపాతర అమర్చారు. రహదారులను తనిఖీ చేస్తూ అటుగా వెళ్లిన జవాన్లు మందుపాతరపై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో డిప్యూటీ కమాండెంట్లు ప్రభాత్ త్రిపాఠి, శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ రంగరాఘవన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం సీఐ సారంగపాణి, ఎస్సై కరుణాకర్, సీఆర్పీఎఫ్ అధికారులు వారికి ఆస్పత్రిలో తక్షణమే వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో వారికి చికిత్స చేశారు. త్రిపాఠికి ఆక్సిజన్‌తో పాటు వెంటిలేటర్ సౌకర్యం కల్పించాల్సి ఉండటంతో ఏరియా ఆస్పత్రి నుంచి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మిగతా ఇద్దరికి ఏరియా ఆస్పత్రిలోనే చికిత్స చేశారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రంగ రాఘవన్(42) మృతిచెందాడు. మారణకాండ తప్పదా..! మావోలు ప్రతీకారేచ్ఛకు దిగుతున్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా మావోయిస్టులు హతమవుతున్నారు. తమదైన శైలిలో మావోలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన వారిని గుర్తించి.. ప్రజా కోర్టులు నిర్వహించి.. అక్కడి ప్రజల తీర్పు మేరకు వారిని హతమార్చుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించే ఛత్తీస్‌గఢ్ పోలీస్ బలగాలపై విరుచుకుపడుతున్నారు. గతంలో జరిగిన ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోలు మృతిచెందగా.. అందుకు రెట్టింపు సంఖ్యలో అనుమానితులు, చత్తీస్‌గఢ్ పోలీసులను మావోలు హతమార్చారు. జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని కంచాలలో 2008లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోలు మృతిచెందారు. అది జరిగిన మూడు నెలల వ్యవధిలోనే ఘటనకు బాధ్యులను చేస్తూ చర్ల మండలంతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలకు చెందిన సుమారు 30 మందిని మావోలు హతమార్చారు. 2014లో పువ్వర్తిలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోలు మృతిచెందారు. అదేరోజు పువ్వర్తి కాల్పుల్లో పాల్గొన్న గ్రేహౌండ్స్ ఆర్ఐని వెంటాడి కౌరగట్ట వద్ద దారుణంగా నరికి చంపి.. పోలీసులకు సవాల్ విసిరారు. ఆర్ఐ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు వెనుకంజ వేసే రీతిన నాడు మావోలు ప్రతిదాడులకు పాల్పడ్డారు. ఈనెల 1న బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో బొట్టెంతోగు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోలు మృతిచెందారు. ఇది జరిగిన రెండో రోజే మావోలు ఛత్తీస్‌గఢ్ పోలీసులపై పంజా విసిరారు. బీజాపూర్ జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో దబ్బమడక అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ఛత్తీస్‌గఢ్ బలగాలపై విరుచుకుపడ్డారు. భీకర పోరులో ప్రత్యేక కోబ్రా బలగాలకు చెందిన ముగ్గురు అధికారులు మృతిచెందగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిణామాలను చూస్తే.. మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ మారణకాండ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దుల్లో హై అలర్ట్ బొట్టెంతోగు ఎన్కౌంటర్లో 9 మంది సహచరులను కోల్పోయిన మావోలు ప్రతీకారేచ్ఛతో దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ తరువాత ప్రత్యేక పోలీసు బలగాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఇటు పోలీసులు, అటు మావోల వ్యూహాత్మక దాడులతో సరిహద్దు అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగుతోంది. శుక్రవారం మావోయిస్టులు మందుపాతర అమర్చిన ప్రదేశం భద్రాచలానికి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో హై అలర్ట్ ప్రకటించారు. అడవి అంతా మందుపాతరలేనా..! పోలీసులను దెబ్బతీసేందుకు సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున మందుపాతరలు అమర్చినట్లు శుక్రవారం జరిగిన ఘటనతో తేటతెల్లమవుతోంది. సీఆర్పీఎఫ్ జవాన్లనే టార్గెట్‌గా చేసుకొని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఇదే రీతిన అడవుల్లో మరెక్కడైనా అమర్చారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా కూంబింగ్ సమయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు. -
మందుపాతర పేలి జవానుకు గాయాలు
జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ మందుపాతర విధ్వంసం సృష్టించింది. పేలుడు ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన జమ్ము కశ్మీర్ సాంబా జిల్లాలో ఏర్పాటుచేసిన మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఉజాన్ బారా కు తీవ్ర గాయాలయ్యాయి. ఉజాన్ బారా బృదం బోర్డర్ ఔట్ పోస్ట్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. గాయపడిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రోటోకాల్ పాటించకే ప్రాణాలు పోయాయ్!
హుస్సేనాబాద్: ప్రోటోకాల్ పాటించకపోవడం మూలంగానే బుధవారం జార్ఖండ్‌లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో ఏడుగురు పోలీసులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. వాటిని పెడచెవిన పెట్టి ఒకే మినీ ట్రక్కులో 13 మంది సిబ్బంది ప్రయాణించడం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హుస్సేనాబాద్‌కు 22 కిలోమీటర్ల దూరంలో చిన్న కల్వర్టు వద్ద పేల్చిన మందుపాతరతో మీటరులోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. పోలీసులు మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దుండగులు మందుపాతరను కేవలం 50 మీటర్ల దూరం నుండి పేల్చినట్లు పోలీసులు గుర్తిచారు. పేలుడు దాటికి ధ్వంసమైన మినీ ట్రక్కు భాగాలు 100 మీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై జార్ఖండ్ డీజీపీ డీకే పాండే మాట్లాడుతూ.. 'రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా మా సిబ్బంది నిబంధనల ఉల్లంఘనకు నేను బాధ్యత వహిస్తున్నాను. కానీ జవాన్ల మరణాన్ని వృధాగా పోనివ్వం. 2016లో జార్ఖండ్‌లో మావోయిస్టులను లేకుండా చేస్తాం' అని తెలిపారు. -
కొయ్యూరులో మందు పాతర్లు లభ్యం
కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని చెల్దిగడ్డ వద్ద మావోయిస్టులు అమర్చిన రెండు మందు పాతర్లలను పోలీసులు వెలికి తీశారు. కూంబింగ్‌లో భాగంగా సోమవారం బోదరాల అటవీ ప్రాంతంలో మందుపాతరలను గుర్తించారు. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. కొయ్యూరు, మంప సీఐ, ఎస్సై లతో పాటు స్పెషల్ పోలీసులను మావోయిస్టులు టార్గెట్ గా చేసుకున్నట్టు సమాచారం. -
సిట్టింగ్ వాలీబాల్!
కొలంబియా: వాలీబాల్ క్రీడను సాధారణంగా నించుని ఆడతారు. కానీ ప్రత్యేక కారణంతో కొలంబియాలో కూర్చుని వాలీబాల్ ఆడుతున్నారు. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నవారందరూ కొంబోడియాలో మందుపాతర పేలుళ్ల కారణంగా కాళ్లు, చేతులు కోల్పోయిన సైనికులు, పౌరులు. బుధవారం బెలో మున్సిపాలిటీ నిర్వహించిన సిట్టింగ్ వాలీబాల్ నేషనల్ చాంపియన్ షిప్ లో వీరు పాల్గొన్నారు. తమకు కాళ్లు, చేతులు లేనప్పటికీ ఉత్సాహంగా వీరు వాలీబాల్ ఆడారు. రెండు కాళ్లు లేనివారు, ఒక కాలు, ఒక చేయి మాత్రమే ఉన్నవారు ఇందులో పాల్గొన్నారు. మందుపాతరలు తమను వికలాంగులుగా మార్చినా తమ సంకల్పం చెక్కుచెదరలేదని వీళ్లు నిరూపించారు. మందుపాతరలు అధికంగా దేశాల్లో కంబోడియా ఒకటి. ల్యాండ్ మైన్స్ పేలుళ్లు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. ప్రభుత్వానికి, ఎఫ్ఏఆర్సీ గెరిల్లాలకు మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మరికొన్ని వారాల్లో అమల్లోకి రానుంది. దీంతోనైనా మందుపాతర్లకు పాతర వేస్తారేమో చూడాలి. -
'అమ్మో.. బతికి బయటపడ్డారు'
గయ: తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాస్తంత వేగంగా ఉన్నట్లయితే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. బీహార్‌లో మావోయిస్టుల వేటను కొనసాగిస్తున్న పోలీసులు కొంత సమయం ఆలస్యం, కొద్ది మీటర్ల దూరంతో ఉండటంవల్ల మందుపాతర పేలుళ్ల బారినుంచి తప్పించుకున్నారు. బీహార్‌లోని గయ జిల్లాలో మావోయిస్టుల గాలింపులు చేపడుతున్న పోలీసులు శుక్రవారం బిర్నావన్ అనే గ్రామ సమీపంలోకి చేరుకునే సరికి ఒక్కసారిగా మావోయిస్టులు రెండు శక్తిమంత మందుపాతరలు పేల్చివేశారు. ఇది పోలీసు వాహనాలకు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగింది. దీంతో షాక్‌కు గురైన పోలీసులు వెంటనే తేరుకుని అప్రమత్తమై ఆ చుట్టుపక్కల కొద్ది సేపు సోదాలు నిర్వహించారు.