బీజాపూర్‌లో పేలిన మందుపాతర
Published Thu, Jan 12 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలిన ఘటనలో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా మహదేవ్ ఘాట్ వద్ద గురువారం మందుపాతర పేలింది. దీంతో సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ 85 వ బెటాలియన్‌కు చెందిన సురేంద్రకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతర అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Advertisement
Advertisement