రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ జర్నలిస్ట్ హత్యకు గురైన ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోడ్డు పనుల్లో అవినీతి జరిగిందని ఈమధ్య ఆయన స్టోరీ చేశారు. అందుకే ఆయన్ని హతమార్చి ఉంటారనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అందులో ఓ కాంట్రాక్టర్ ఉన్నాడు.
బీజాపూర్‌కు చెందిన ముఖేశ్ చంద్రాకర్(mukesh chandrakar) గతంలో పలు పత్రికలు, చానెళ్లలో పనిచేయగా ప్రస్తుతం ఓ టీవీలో పనిచేస్తూనే.. సొంతంగా బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ చానెల్ నడిపిస్తున్నారు. ఈనెల 1న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో ముఖేశ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా విచారిస్తుండగా బీజాపూర్‌లోని చట్టాన్‌పారా(Chattanpara) ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని గుర్తించారు. సదరు ఇల్లు కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్‌దిగా తేలింది. సురేష్‌ను హైదరాబాద్‌లో బీజాపూర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.
మధ్యవర్తిగా వార్తల్లో..
ఛత్తీస్‌గఢ్‌లో పలు సందర్భాల్లో కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే ముఖేశ్ అడవుల్లోకి వెళ్లి చర్చల ద్వారా వారిని విడిపించిన ఘటనలు ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దు తెర్రెం సమీపాన ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చి సీఆర్‌పీఎఫ్(CRPF) కానిస్టేబుల్ రాకేశ్‌సింగ్‌ను కిడ్నాప్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, జవాన్ కుటుంబీలకు వినతితో మావోయిస్టులతో చర్చలు జరిపి జవాన్‌ను బయటకు తీసుకొచ్చారు. అంతకు ముందు బీజాపూర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏఈని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే సహచర జర్నలిస్టులతో కలిసి ఆయన మావోయిస్టులతో చర్చలు జరిపి విడిపించారు.
Comments
Please login to add a commentAdd a comment