bijapur
-
మావోయిస్టుల బంకర్ స్వాధీనం.. కొత్త టెక్నాలజీతో బాంబుల తయారీ!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 20 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ క్రమంలోనే తుమ్రైల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ బంకర్‌ను జవాన్లు గుర్తించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామ్రాగిని స్వాధీనం చేసుకున్నారు.బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రైల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ బంకర్‌ను డీఆర్జీ జవాన్లు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సైనికులకు హాని కలిగించే విధంగా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు నక్సలైట్లు గాజు సీసాలు ఉపయోగిస్తున్నట్లు భద్రత బలగాలు గుర్తించాయి. ఆయుధాలు తయారు చేసే యంత్రాలు, ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను గుర్తించారు.బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేరు, మారేడుబాక అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు తాలిపేరు నది ఒడ్డున తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో ఈ సొరంగాన్ని కనుగొన్నట్టు తెలిపారు. దీంతో, మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేతలు కూడా ఉన్నారు. -
జర్నలిస్ట్ దారుణ హత్య
-
సంచలనంగా జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రాకర్ కేసు.. ముగ్గురి అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ జర్నలిస్ట్ హత్యకు గురైన ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోడ్డు పనుల్లో అవినీతి జరిగిందని ఈమధ్య ఆయన స్టోరీ చేశారు. అందుకే ఆయన్ని హతమార్చి ఉంటారనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అందులో ఓ కాంట్రాక్టర్ ఉన్నాడు. బీజాపూర్‌కు చెందిన ముఖేశ్ చంద్రాకర్(mukesh chandrakar) గతంలో పలు పత్రికలు, చానెళ్లలో పనిచేయగా ప్రస్తుతం ఓ టీవీలో పనిచేస్తూనే.. సొంతంగా బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ చానెల్ నడిపిస్తున్నారు. ఈనెల 1న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో ముఖేశ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా విచారిస్తుండగా బీజాపూర్‌లోని చట్టాన్పారా(Chattanpara) ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని గుర్తించారు. సదరు ఇల్లు కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్దిగా తేలింది. సురేష్‌ను హైదరాబాద్‌లో బీజాపూర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.మధ్యవర్తిగా వార్తల్లో.. ఛత్తీస్‌గఢ్‌లో పలు సందర్భాల్లో కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే ముఖేశ్ అడవుల్లోకి వెళ్లి చర్చల ద్వారా వారిని విడిపించిన ఘటనలు ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దు తెర్రెం సమీపాన ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చి సీఆర్పీఎఫ్(CRPF) కానిస్టేబుల్ రాకేశ్సింగ్ను కిడ్నాప్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, జవాన్ కుటుంబీలకు వినతితో మావోయిస్టులతో చర్చలు జరిపి జవాన్‌ను బయటకు తీసుకొచ్చారు. అంతకు ముందు బీజాపూర్‌కు చెందిన ఎన్ఆర్ఈజీఎస్ ఏఈని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే సహచర జర్నలిస్టులతో కలిసి ఆయన మావోయిస్టులతో చర్చలు జరిపి విడిపించారు. -
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై ఓ విద్యార్థి విన్యాసం
-
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం(మే25) పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు సమాచారం. మీర్తూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, వైర్లెస్ సెట్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు బీజాపూర్ పోలీసులు తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్
భువనేశ్వర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందిఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఈ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో మూడు జిల్లాల నుంచి భద్రతా బలగాలు పాల్గొన్నాయి.బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల నుంచి సుమారు 1200 మంది DRG, STF, COBRA, CRPF సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. అగ్రశ్రేణి నక్సల్స్ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఎన్‌కౌంటర్‌పై నిఘా పెట్టారు. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం పోలీసుల బలగాలు, మావోల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధి కొర్చోలి, లేంద్ర గ్రామాల సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్, కోబ్రా కమాండో , బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కొర్చేలి, లేంద్ర మధ్య అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు పది మంది మావోయిస్టుల మృతి మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 11 గంటల సమయాన మళ్లీ వారికి మావోలు తారసపడి కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా పది మంది మావోయిస్టులు మృతి చెందారని, ఇందులో ఒక మహిళ ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజు వెల్లడించారు. మృతులు మావోల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెండో కంపెనీ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనలో సుమారు 30 మంది మావోలు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయాల పాలై తప్పించుకున్నట్లు భావించి పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఘటనాస్థలి నుంచి పెద్ద మొత్తంలో లైట్ మెషీన్ గన్స్, ఏకే 47 తుపాకులు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు, మందుపాతరలు, పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని బాలా ఘాట్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఘటనలో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతి చెందారు. వారిని సాజంతి అలియాస్ క్రాంతి(38), రఘు అలియాస్ షేర్ సింగ్(52)గా గుర్తించారు. ఘటనా స్థలిలో ఆయుధాలు దొరికాయి. సాజంతిపై రూ.29 లక్షలు, రఘుపై రూ.14 లక్షల రివార్డులున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం. గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన నక్సల్స్ మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు ఇంకా ఎదురు కాల్పుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రతా బలగాలు, పోలీసుల..చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నారు. -
మూడు క్యాంపులపై మావోయిస్టుల దాడి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు, జవాన్ల పరస్పర కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న పోలీసు క్యాంప్‌లపై మావోలు మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంప్‌లు, పామేడు పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో లాంచర్లతో దాడిని ప్రారంభించిన మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుదాడికి దిగగా తెల్లవార్లూ ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల ప్రధాన దారులపై చెట్లు నరికి అడ్డంగా వేసి నిప్పుపెట్టి రహదారిని మూసి వేశారు. ఆ మార్గాల గుండా వస్తున్న గ్రామస్తులను వెనక్కి పంపించారు. మూడు చోట్లా ఏకకాలంలో రాకెట్ లాంచర్లు విసురుతూ, మందుపాతరలు పేల్చుతూ భయోత్పాతం సృష్టించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. ధర్మారం క్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతుండగా అందులోని జవాన్లతో పాటు పని చేసేందుకు గుంటూరు నుంచి వచి్చన 40 మంది కూలీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ధర్మారం క్యాంప్‌పై జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
మావోయిస్టులకు చెందిన రూ.10 లక్షలు స్వాధీనం
బిజాపూర్: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలకు చెందినట్లుగా భావిస్తున్న రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్‌లో చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్నార్ గ్రామానికి చెందిన దినేశ్ తాటి(23) శుక్రవారం స్థానిక ట్రాక్టర్ షోరూంకు వచ్చాడు. పోలీసులు అతడిని అనుమానంతో ప్రశ్నించగా గంగలూర్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఆ నోట్లను మార్చాలంటూ తనకు ఇచ్చారని వెల్లడించాడు. రూ.2 వేల నోట్లతో ట్రాక్టర్ కొనేందుకు వచ్చానన్నాడు. ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ.. సెప్టెంబర్ 30ని ఆఖరు తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. మే 25న మావోయిస్టు కమాండర్ ఇచ్చిన రూ.6 లక్షల విలువైన 2 వేల నోట్లను పట్టుకుని, బిజాపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెల 10న దంతెవాడ జిల్లాలోనూ రూ.1 లక్ష విలువైన రెండు వేల నోట్లను పట్టుకుని, ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. -
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి
-
తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో హిడ్మా హతం?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇదిలా ఉంటే, మావోయిస్టు కేంద్ర కమిటీ హిడ్మా మృతిని ఇప్పటిదాకా ధృవీకరించలేదు. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. కాగా, 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చిన మావోయిస్టు హిడ్మా. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. చదివింది మాత్రం 7వ తరగతే అయినా మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో కీలక నేతగా ఎదిగాడు హిడ్మా. అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ చేయడంలో హిడ్మా వ్యూహాలు చాలా సార్లు సక్సెస్ కావడంతో.. హిట్ లిస్టులో ఉన్నాడు. ఉర్పల్ మెట్లలో 2007లో జరిగిన 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది జవాన్లు, 2017లో 12 మంది జవాన్లు మృతి చెందిన ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి పార్టీ, రెండోది సాయుధ బలగం, మూడు ప్రజా ప్రభుత్వం. మూడు విభాగాల్లోనూ పని చేసిన హిడ్మాపై 45 లక్షల రూపాయల రివార్డు ఉంది. -
సూపర్ మార్కెట్లో టీమిండియా క్రికెటర్ గొడవ
టీమిండియా మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ తన చర్యలతో వార్తల్లో నిలిచింది. ఒక సూపర్ మార్కెట్లో సిబ్బందితో గొడవపడింది. తన స్నేహితులతో కలిసి సూపర్ మార్కెట్‌కు వచ్చిన ఆమె ఏదో విషయమై సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. కాసేపటికే ఆ గొడవ పెద్దదిగా మారింది. ఎంతలా అంటే రాజేశ్వరి గైక్వాడ్ కోపంతో ఊగిపోతూ వారిపై దాడి చేసే వరకు వెళ్లింది. కర్నాటకలోని బీజాపూర్‌లో ఈ ఘటన జరిగింది. గొడవ చేసిన తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికి తర్వాత ఆమె సన్నిహితులు వచ్చి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవకు సంబంధించిందంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.దీంతో సూపర్ మార్కెట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత రాజేశ్వరితోపాటు సూపర్ మార్కెట్ సిబ్బంది సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ఈ గొడవకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. 2014లో ఇండియా తరఫున శ్రీలంకతో మ్యాచ్ ద్వారా రాజేశ్వరి గైక్వాడ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2017లో వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన ఇండియన్ టీమ్‌లో రాజేశ్వరి సభ్యురాలు. అదే వరల్డ్‌కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కూడా చేసింది. మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ చరిత్రలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు (5/15) నమోదు చేసింది. -
సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయట!
సమాధులు తవ్వితే ఎముకలొస్తాయి. కానీ... సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయని నమ్ముతున్నారు. ఎక్కడో కాదు.. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా కలకేరిలో కొన్ని రోజులుగా వానలు పడకపోవడంతో చనిపోయినవాళ్ల శాపమేనని నమ్మిన గ్రామస్తులు... గత నెలలో మరణించినవాళ్ల జాబితా తీశారు. వాళ్ల సమాధులకు తల ఎటువైపున్నాయో కుటుంబ సభ్యుల సహాయంతో గుర్తించారు. తలకు రెండు అడుగుల దూరంలో ఓ గుంత తవ్వి చనిపోయిన వాళ్ల నోరువైపుగా పైపు పెట్టి వాటర్ ట్యాంకర్‌తో నీటిని వదిలారు. 25 సమాధులకు అలా నీటిని పోసి, ప్రక్రియ పూర్తి చేసిన కొద్దిసేపటికే వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయట. .3వేల జనాభా ఉన్న కలకేరి గ్రామస్తుల్లో ఈ నమ్మకం కొన్నేళ్ల కిందటే బలపడింది. నోరు తెరిచి చనిపోయిన ఓ వృద్ధుడి నోటిని మూయకుండానే ఖననం చేశారట. అప్పటినుంచి వానలు పడక... గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చిందట. ఓ జ్యోతిష్యుడి దగ్గరకెళ్లి అడిగితే... చనిపోయిన వృద్ధుడి గురించి చెప్పాడట. వెంటనే వెళ్లి అతని సమాధిని తవ్వి నీటిని పోస్తే... వర్షం వచ్చిందట. ఇక అప్పటినుంచి దాన్నే నమ్ముతూ వానలు రానప్పుడల్లా పాటిస్తున్నారు గ్రామస్తులు. ఈ వింత నమ్మకాలు మనదేశంలోనే కాదు..ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. గ్రామంలో వానలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఇటీవల ఓ మెక్సికన్ మేయర్ మొసలినే పెళ్లి చేసుకున్నాడు. చదవండి: మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి షాక్ -
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బందీగా ఉన్న ఏఎస్ఐ మురళీని హత్య చేశారు. అనంతరం మురళీ మృతదేహాన్ని గంగుళూరు వద్ద రహదారిపై పడేశారు. మృతదేహం వద్ద ఒక లేఖను వదిలి వెళ్లారు. ఈ నెల 21న గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలనార్ గ్రామంలో ఏఎస్ఐ మురళీని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి విదితమే. నాలుగు రోజుల తర్వాత కిడ్నాప్ ఘటన విషాదంతో ముగిసింది. మురళీని విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు విన్నవించిన మావోయిస్టులు కనికరించలేదు. ఏఎస్ఐ విడుదలకు గోండ్వానా సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ యత్నించిన సంగతి తెలిసిందే. చర్చలు జరిపే సమయంలోనే మురళీని మావోయిస్టులు హత్య చేశారు. చదవండి: కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. -
బంధీగా ఉన్న మురళీని హత్య చేసిన మావోయిస్టులు
-
మావోయిస్టు ఆజాద్ భార్య అరెస్ట్
సాక్షి, బీజాపూర్: దివంగత మావోయిస్టు అగ్రనేత ఆజాద్ భార్య, మహిళా మావోయిస్టు నాయకురాలు సుజాత అలియాస్ నాగరం రూపాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మహిళా మావోయిస్టు నేత రూప అరెస్ట్‌ను బీజాపూర్ ఎస్పీ దివ్యంగ్ పటేల్ ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, డీవీపీ సభ్యురాలిగా సుజాత మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కర్ణాటకతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో కూడా ఆమె పనిచేసింది. మావోల కదలికలపై కన్నేసిన పోలీసులు రూపను ఎట్టకేలకు పట్టుకున్నారు. సుజాతను కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు పంపిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఇది నక్సల్ కేసులలో ఇప్పటివరకు సాధించిన ఘన విజయంగా పోలీసులు పేర్కొంటున్నారు. -
మావోయిస్టుల పంజా : ఎస్పీ నాయకుడి హత్య
చత్తీస్‌గఢ్ : మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. సమాజ్ వాదీ పార్టీ నేత సంతోష్ పూనెంను కాల్చి చంపారు. బీజాపూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం అందించిన సమాచారం ప్రకారం కాంట్రాక్టర్ , మరిముల్లాకు చెందిన సంతోష్ పూనెంను మంగళవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. అనంతరం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని యాంటి నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ సుధేరాజ్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు 15 కి.మీ దూరంలో దట్టమైన అడవిలో ఈ ఘటన జరిగిట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించామని, వారి నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా సంతోస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పార్టీ తరపున బీజాపూర్‌నుంచి పోటీచేశారు.ప్రస్తుతం బస్తర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. -
ఛత్తీస్‌లో ఎన్కౌంటర్
రాయ్‌పూర్/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో గురువారం ఉదయం బీజాపూర్ అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర డీజీపీ డీఎం అవస్థి మీడియాకు వెల్లడించారు. బీజాపూర్ జిల్లా బైరంగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యులు రాజ్మన్ మందవీ, సుఖ్‌లాల్‌లు సుమారు 50 నుంచి 60 మంది సభ్యులతో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి నుంచి అక్కడ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయానికి భద్రతా బలగాలు బోర్‌గా గ్రామ పరిధిలోకి ప్రవేశించగానే వారిపైకి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా మావోయిస్టులపైకి ఎదురు కాల్పులు ప్రారంభించారు. సుమారు రెండున్నర గంటల సేపు జరిగిన ఈ కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి లోడ్ చేసిన 11 గన్లు, 315 రివాల్వర్లు, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను గుర్తించాల్సి ఉందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోనూ, ఈ ఏడాదిలోనూ ఇది తొలి ఎన్కౌంటర్ కావడం గమనార్హం. -
బీజాపూర్‌లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లా భైరాన్ గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 10మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కాగా మావోయిస్టుల మృతిని బీజాపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ అధికారికంగా ధ్రువీకరించారు. కాగా భైరాంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందటంతో ఇంద్రావతి నది సమీపంలోని అబూజ్మడ్ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపి 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. -
ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల అలజడి
-
కర్ణాటకపై కేంద్రం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుంది
-
మీ మాటలు కడుపులు నింపవు: సోనియాగాంధీ
సాక్షి, బెంగళూరు: వాస్తవాలను వక్రీకరించటంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుంటారని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం బీజాపూర్ జిల్లా విజయపురలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సుమారు రెండేళ్ల తర్వాత ఆమె బహిరంగ సభలో పాల్గొనటంతో పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. ప్రజలు సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. ‘మోదీగారు ఓ మంచి వక్త అన్న సంగతిని నేనూ అంగీకరిస్తా. కానీ, ఆయన ఇప్పుడు ఓ నటుడిలా మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఆకలితో ఉన్న వాళ్ల కడుపు నింపవన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది. కర్ణాటక విషయంలో కేంద్రం పక్షపాత ధోరణిలో వ్యవహరించటం అందరూ చూశారు. కరువు విషయమై మీ ముఖ్యమంత్రి(సిద్ధరామయ్యని ఉద్దేశించి) ప్రధానిని కలవటానికి ఢిల్లీ వెళ్లారు. కానీ, ప్రధాని మాత్రం అందుకు సుముఖత చూపలేదు. రైతులనే కాదు.. యావత్ కన్నడ ప్రజలను ప్రధానిని అవమానించారు. పుండు మీద కారం చల్లినట్లు కేంద్రం ఇచ్చే కరువు పరిహారం విషయంలోనూ కర్ణాటకకు అన్యాయం జరిగింది. సబ్కా సాథ్-సబ్కా వికాస్ అంటే ఇదేనా?’ అని కేంద్రాన్ని ఆమె నిలదీశారు. .. ‘తప్పు చేసినప్పుడల్లా ఆయన(మోదీ) వాస్తవాలను వక్రీకరిస్తుంటారు. రాజకీయాల కోసం త్యాగధనుల పేర్లను ఆయన వాడుకుంటారు. అడ్డగోలుగా అభివృద్ధి హామీలిచ్చారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వచ్చారు. కానీ, కాంగ్రెస్ మాత్రం కర్ణాటక అభివృద్ధి కోసం కృషి చేసింది. తన సంక్షేమ పథకాలతో సిద్ధరామయ్య కర్ణాటకను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రవేశపెడితే.. దానిని బీజేపీ వ్యతిరేకించింది. రైతులనే కాదు అన్ని వర్గాల వారిని తప్పుడు హామీలతో మోదీ మోసం చేశారు. కానీ, పేదల కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్న పార్టీ కాంగ్రెస్సే. అందుకే మరోసారి అవకాశం ఇవ్వండి’ అని సోనియా గాంధీ ప్రసంగం ముగించారు. -
రేపటి నుంచి సోనియా ప్రచారం
బెంగళూరు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకుతున్నారు. బీజాపూర్‌లో మంగళవారం ఓ ర్యాలీలో ఆమె ప్రసంగించనున్నారు. 21 నెలల విరామం తర్వాత సోనియా మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు 2016 ఆగస్టు 2న వెళ్తుండగా ఆమె మార్గమధ్యంలో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో శాసనసభ ఎన్నికలు జరగ్గా సోనియా ఏ రాష్ట్రంలోనూ ప్రచారం చేయలేదు. బీజాపూర్‌లో సోనియా ర్యాలీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామంతర్వాత ఆమె తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లోనే ప్రచారం చేయబోతున్నారనీ, ఈ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యమనేందుకు ఇదో ఉదాహరణ అని కర్ణాటక కాంగ్రెస్ తాత్కాలిక కార్యదర్శి మాణిక్యం టాగూర్ పేర్కొన్నారు. 1998లో తొలి ఎన్నికల ప్రసంగం 1998లో సోనియా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది జనవరి 11న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు (సోనియా భర్త రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురైన చోటు)లో తొలిసారి ఆమె ఎన్నికల ప్రసంగం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె రెండుసార్లు మాత్రమే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా విరామం తీసుకున్నారు. ఇటీవలి 21 నెలల వరుస విరామానికి తోడు 2012లో మణిపూర్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా మిలిటెంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరిక మేరకు సోనియా ప్రచారం చేయలేదు. సోనియా బీజాపూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనే మంగళవారమే అదే జిల్లాలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఓ భారీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనుండటం కొసమెరుపు. -
బీజాపూర్‌లో మోదీ కేర్‌కు బీజం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక పథకం మోదీ కేర్‌గా పిలిచే ఆయుష్మాన్ భారత్‌ను ఈనెల 14న చత్తీస్‌ఘర్‌లోని బీజాపూర్‌లో ఆయన ప్రారంభించనున్నారు. పథకం కింద దేశంలోనే తొలి వెల్నెస్ సెంటర్‌ను మోదీ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 115 జిల్లాలను ఈ పథకం కిందకు తీసుకువస్తూ రియల్‌టైమ్ పర్యవేక్షణ చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలను మిళితం చేయడం, ప్రజా ఉద్యమం ద్వారా జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రేరేపించడం వంటి చర్యలను చేపడతారు. మెరుగైన ఫలితాలను సాధించిన జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆయుష్మాన్ భారత్ కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. వ్యాధుల నియంత్రణ, నివారణ, ముందస్తు జాగ్రత్తలే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తారు.దేశంలోని పేద కుటుంబాలకు రూ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.