మందుపాతర పేల్చిన మావోయిస్టులు | landmine blast in bijapur | Sakshi
Sakshi News home page

మందుపాతర పేల్చిన మావోయిస్టులు

Published Fri, Feb 17 2017 11:49 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

landmine blast in bijapur

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు భద్రత విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో భద్రతా బలగాలకు చెందిన ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని బీజాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐఈడీ బాంబు సాయంతో ఈ పేలుడుకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు మావోయిస్టుల కోసం సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement