
సాక్షి, బీజాపూర్: దివంగత మావోయిస్టు అగ్రనేత ఆజాద్ భార్య, మహిళా మావోయిస్టు నాయకురాలు సుజాత అలియాస్ నాగరం రూపాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మహిళా మావోయిస్టు నేత రూప అరెస్ట్‌ను బీజాపూర్ ఎస్పీ దివ్యంగ్ పటేల్ ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, డీవీపీ సభ్యురాలిగా సుజాత మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కర్ణాటకతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో కూడా ఆమె పనిచేసింది. మావోల కదలికలపై కన్నేసిన పోలీసులు రూపను ఎట్టకేలకు పట్టుకున్నారు. సుజాతను కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు పంపిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఇది నక్సల్ కేసులలో ఇప్పటివరకు సాధించిన ఘన విజయంగా పోలీసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment