
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. గంగుళూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున లొంగిపోయారు. లొంగిపోయిన 17 మంది మావోయిస్టుల్లో 9 మందిపై 24 లక్షల రివార్డ్ ఉందని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. గంగుళూరు ఏరియా కమిటీ డీవీసీఎం దినేష్ మొడియం దంపతులు లొంగిపోయారు.
2025లో ఇప్పటి వరకూ 65 మంది మావోయిస్టులు లొంగిపోయారని..137 మందిని అరెస్టు చేశాం. 56 మంది వేర్వేరు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి రూ. 25 వేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment