చత్తీస్‌గఢ్: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. గంగలూర్ పీఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
కాగా, గత నెల ఛత్తీస్‌గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment