bijapur district
-
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శుక్రవారం మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులకు దిగారు. ఇరువురి నడుమ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగాయి. కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. అదేసమయంలో, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఒక బారెల్ గ్రెనేడ్ లాంఛర్, 12 బోర్ గన్, దేశవాళీ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు లభించాయన్నారు. ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెల్సిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధి పూజారి కాంకేర్– నంబి సమీపాన కర్రిగుట్టల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున కర్రిగుట్ట అడవుల్లో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నడుమ గంటసేపు ఎదురుకాల్పులు కొనసాగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒక ఏకే–47, ఒక మెషీన్‌గన్, ఒక 12 బోర్ తుపాకీతో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, ఔషధా లు, నిత్యావసర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకు‹Ùపూర్ గ్రామానికి చెందిన అన్నె సంతోష్ అలియాస్ శ్రీధర్ అలియాస్ సాగర్‌గా గుర్తించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడైన(ఎస్సీఎం) సాగర్.. సెంట్రల్ రీజియన్ కమాండ్(సీఈసీ)కు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉంది. -
దద్దరిల్లిన దండకారణ్యం.. 13 మంది మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా పోలీసుల, భద్రతా బలగాల కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్‌లో నిన్న( సోమవారం) జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. కోర్చోలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిన్న సాయంత్రం వరకు 10 మంది మావోయిస్టులు మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ పూర్తైన అనంతరం మరో ముగ్గురు మావోయిస్టులు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సుమారు 8 గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి. కుంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్, బస్తర్ ఫైటర్స్ పాల్గొన్నారు. ఇక.. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పది రోజుల వ్యవధిలో నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇప్పటివరకు మొత్తం 25 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి -
మూడు క్యాంపులపై మావోయిస్టుల దాడి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు, జవాన్ల పరస్పర కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న పోలీసు క్యాంప్‌లపై మావోలు మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంప్‌లు, పామేడు పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో లాంచర్లతో దాడిని ప్రారంభించిన మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుదాడికి దిగగా తెల్లవార్లూ ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల ప్రధాన దారులపై చెట్లు నరికి అడ్డంగా వేసి నిప్పుపెట్టి రహదారిని మూసి వేశారు. ఆ మార్గాల గుండా వస్తున్న గ్రామస్తులను వెనక్కి పంపించారు. మూడు చోట్లా ఏకకాలంలో రాకెట్ లాంచర్లు విసురుతూ, మందుపాతరలు పేల్చుతూ భయోత్పాతం సృష్టించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. ధర్మారం క్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతుండగా అందులోని జవాన్లతో పాటు పని చేసేందుకు గుంటూరు నుంచి వచి్చన 40 మంది కూలీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ధర్మారం క్యాంప్‌పై జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
బీజాపూర్: ఉద్యోగుల కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రహదారి పనులను పరిశీలించేందుకు మావోయిస్టుల కంచుకోటగా భావించే గోర్న మంకేలికి వెళ్ళిన పీఎంజీఎస్‌వై సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్, అతని సహాయకుడు అటెండర్ లక్ష్మణ్ పరాత్‌గిరిని నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. గురువారం నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. రోడ్డు పనులను తనిఖీ నిమిత్తం వెళ్లిన వారు నేటికీ తిరిగి రాకపోవడంతో ఆ శాఖ ఉద్యోగుల్లో కలవరం కలిగిస్తోంది. కాగా, ఈ ఘటనపై పీఎంజీఎస్‌వై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. అయితే ఉద్యోగుల మిస్సింగ్‌కు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
సరిహద్దులో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో సోమవారం తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు బీజాపూర్ – ములుగు జిల్లా పేరూరు పోలీస్‌స్టేషన్ పరిధి టేకులగూడకు 25 కిలోమీటర్ల దూరంలోని తర్లగూడ అటవీప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ హత్యలు చేయడానికి, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి వ్యూహరచన చేస్తోందనే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ములుగు, బీజాపూర్ పోలీసు బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ దళ సభ్యులు పోలీసుల పైకి కాల్పులు జరపగా ప్రత్యేక దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పుల అనంతరం ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఒక ఎస్ఎల్ఆర్ లైట్ మెషీన్‌గన్, ఒక ఏకే–47, ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రి, తూటాలు, 12 కిట్‌బ్యాగులు లభ్యమయ్యాయి. కాల్పులు జరుపుతూ కొంతమంది మావోయిస్టులు పారిపోయారు. పారిపోయిన వారి కోసం ప్రత్యేక దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. సంఘటన ప్రదేశం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందని చెప్పారు. మృతులు వీరే: ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట సోమవారం విడుదలైన ప్రకటనలో ఆ వివరాలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ రీజనల్ సెంటర్ సీఆర్సీ కంపెనీ–2కు చెందిన నరోటి దామాల్ (మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతం), సోడి రామాల్ (బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం), పూ నెం బద్రు అలియాస్ కల్లు (బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ) అమరులైనట్టు పేర్కొన్నారు. రేపు బంద్‌కు పిలుపు ములుగు జిల్లా టేకులగూడ అడవిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌గా జగన్ ప్రకటించారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వల్ల ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెట్టింపు ఉత్సాహంతో అణచివేతకు పూనుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 27న రాష్ట్రబంద్‌ను పాటించాలని జగన్ కోరారు. -
బీజాపూర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా గల్గాం అడవిలో మంళవారం ఉదయం నుంచి పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉసూర్-గల్గాం గ్రామాల మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన జవాన్ అఖిలేష్‌ను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. -
బస్తర్‌లో అనూహ్య ఎన్కౌంటర్: ముగ్గురు గిరిజనులు మృతి
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని బస్తర్ అటవీ ప్రాంతంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయానికి తోడు పోలీసులు-నక్సలైట్ల మధ్య ఘర్షణ సామాన్య ప్రజానీకం ప్రాణాలను బలితీసుకుంటున్నది. బీజాపూర్ జిల్లా సిల్గర్ పోలీసు బేస్ క్యాంపు వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఆదివాసీ గిరిజనులు మరణించారు. గత నెలలో మావోయిస్టులు పోలీసులపై భీకర దాడికి పాల్పడిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే తాజాగా ఈ సంఘటన జరిగింది. ఎన్కౌంటర్ వార్తలను బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత మరింత అప్రమత్తమైన బలగాలు కేంద్ర, రాష్ట్ర ఆదేశాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో కొత్త క్యాంపులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచి సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీకి చెందిన జవాన్లు అడవిలో ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. అలా కొత్తగా ఏర్పాటైన ఓ క్యాంపుపైన నేడు మధ్యాహ్నం మావోయస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో ఈ అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. బస్తర్ రీజియన్ లోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో గల సిల్గర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇటీవలే కొత్త క్యాంపును ఏర్పాటు చేశాయి. గత నెల జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని వారి ఏరివేత లక్ష్యంగా కొత్త క్యాంప్ నుంచి బలగాలు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. కొంత కాలంగా ఇటు పోలీసులు, అటు నక్సలైట్ల మధ్య నలిగిపోతున్న స్థానిక ఆదివాసీ గిరిజనులు.. క్యాంపును అక్కడి నుంచి ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ మే 14 నుంచి మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా సిల్గర్ వద్దకు గిరిజనులు భారీ ఎత్తున వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు గిరిజనులకు నచ్చ చెప్పి ఆందోళన కార్యక్రమాలు విరమింపచేశారు. తిరిగి ఈ రోజు వేలాది మంది పోలీసు శిబిరం వద్దకు చేరుకున్నారు. పోలీస్ క్యాంపు వద్ద నిరసన చేస్తున్న క్రమంలో అందులో కొందరు పోలీసు శిబిరంపై దాడికి పాల్పడ్డారు. దీంతో తిరిగి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మృతి చెందారు. ఆదివాసీల మాటు నుంచి నక్సల్స్ పోలీసు శిబిరంపై కాల్పులు జరిపినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ తెలిపారు. ప్రస్తుతం సిల్గర్ పోలీసు శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు బలగాలను భారీగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య -
వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేశారు. గంగుళూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామకనార్ గ్రామంలో గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్ శారద వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి హెల్త్ వర్కర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు అక్కడికి వచ్చారు. శారద, మరో ఇద్దరు హెల్త్ వర్కర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్పీ కమలోచన్ కాశ్యప్ ధ్రువీకరించారు. కాగా, వైద్య సిబ్బంది కిడ్నాప్‌తో బీజాపూర్‌లో కలకలం రేగింది. మావోయిస్టులను అరెస్టు చేయలేదు చర్ల: మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని బస్తర్ రేంజ్ ఐజీ సౌందర్‌రాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల తర్వాత కొందరు గ్రామస్తులు పోలీసులతో కలసి బేస్ క్యాంపు వరకు వచ్చారని, ఆ తర్వాత వారందరినీ వెంటనే తిరిగి వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. చదవండి: రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు -
కాల్పులు జరిగిన అటవీ ప్రాంతంలో బుల్లెట్ల వర్షం
-
విషాదం నింపిన విహారయాత్ర
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం విహారయాత్ర పెనువిషాదాన్ని నింపింది. విహారయాత్రకని వెళ్లిన 20 మంది బాలికల బృందంలోని ఇద్దరు పడవలో ప్రయాణిస్తూ అదుపు తప్పి నీటిలో పడి గల్లంతయ్యారు. బీజాపూర్ జిల్లాలోని జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. 20 మంది బాలికల బృందం బీజాపూర్ జిల్లాలోని మింగాచల్ నదికి విహారయాత్రకని వచ్చారు. వారిలో ఇద్దరు బాలికలు సరదాగా పడవ ఎక్కారు. అయితే కాసపటికే ప్రమాదవశాత్తు పడవ నదిలో బోల్తా పడడంతో ఇద్దరు బాలికలు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన మిగతా బాలికలు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. -
పేలుడు ధాటికి తునాతునకలైన కారు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో తర్రెం వద్ద మందు పాతరలు పేల్చారు. రహదారిపై వెళుతున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి: యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య) ఇదిలా ఉండగా.. పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో లేఖ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఆ నలుగురు పోలీసులను చంపేశారు
-
ఆ నలుగురు పోలీసులను చంపేశారు
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో సోమవారం రాత్రి కిడ్నాప్‌కు గురైన నలుగురు పోలీసు ఉన్నతాధికారులను మావోయిస్టులు చంపేశారు. సదరు పోలీసు మృతదేహాలను బుధవారం ఉదయం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నాలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్‌కు గురైన ప్రాంతానికి కేవలం 5 కి.మీ దూరంలో వీరి మృతదేహాలను స్థానికులు కనుగోన్నారు. బీజాపూర్ జిల్లాలో కుట్రూకి వెళ్తున్న బస్సును మావోయిస్టులు సోమవారం రాత్రి అడ్డగించి... అందులో ప్రయాణిస్తున్న నలుగురు పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ డీజీపీ అమర్నాథ్ ఉపాధ్యాయ సోమవారం రాత్రి ప్రకటించారు. అయితే కిడ్నాప్ గురైన పోలీసు సిబ్బంది కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీజీపీ అమరనాథ్ వెల్లడించారు. కుట్రూ పరిసర ప్రాంతాలలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. -
మావోల దాడిలో నలుగురు జవాన్లు మృతి
చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. బుధవారం ముర్కీనార్ బేస్ క్యాంపులో సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ కార్యక్రమం జరుగుతుండడంతో 50 మంది జవాన్లు రోడ్ ఓపెనింగ్ విధుల నిమిత్తం ముర్కీనార్, చేరామంగి ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో జవాన్లు నకున్పాల్ వద్దకు రాగానే అప్పటికే అక్కడ పొంచిఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. కాల్పులతో పాటు మావోయిస్టులు రహదారిపై, చెట్లపై అమర్చిన శక్తిమంతమైన 9 మందుపాతర్లను, 2 హ్యాండ్ గ్రనేడ్లను పేల్చడంతో జవాన్లు చెల్లాచెదురయ్యారు. ఈ కాల్పుల్లో ముందు వరుసలో వెళ్తున్న నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని అస్సాంకు చెందిన దగాతా బయాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దిలీప్‌కుమార్, అమితాబ్ మిశ్రా, మధ్యప్రదేశ్‌కు చెందిన మదన్‌లాల్‌గా గుర్తించారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. కాల్పుల అనంతరం మావోయిస్టులు జవాన్లకు చెందిన ఏకే 47, ఎస్ఎల్ఆర్ 303 రైఫిళ్లతో పాటు గ్రనేడ్ లాంచర్‌ను అపహరించుకుపోయారు. కాగా, ఘటనా స్థలంలో పేలని ఐఈడీ, హ్యాండ్ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్: 9 మంది మృతి
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్‌జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇరువైపుల మొత్తం 9 మంది మృతి చెందారు. ఈ ఎదురు కాల్పులలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలోనే ఈ నెల 4న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గంగలూరు పోలీసులు అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పిడియా గ్రామం వద్ద మావోలతో ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, నాటు తుపాకి, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.