
ప్రతీకాత్మక చిత్రం
బీజాపూర్: ఉద్యోగుల కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రహదారి పనులను పరిశీలించేందుకు మావోయిస్టుల కంచుకోటగా భావించే గోర్న మంకేలికి వెళ్ళిన పీఎంజీఎస్‌వై సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్, అతని సహాయకుడు అటెండర్ లక్ష్మణ్ పరాత్‌గిరిని నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
గురువారం నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. రోడ్డు పనులను తనిఖీ నిమిత్తం వెళ్లిన వారు నేటికీ తిరిగి రాకపోవడంతో ఆ శాఖ ఉద్యోగుల్లో కలవరం కలిగిస్తోంది. కాగా, ఈ ఘటనపై పీఎంజీఎస్‌వై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. అయితే ఉద్యోగుల మిస్సింగ్‌కు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment