Pradhan Mantri Gram Sadak Yojana
-
ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
బీజాపూర్: ఉద్యోగుల కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రహదారి పనులను పరిశీలించేందుకు మావోయిస్టుల కంచుకోటగా భావించే గోర్న మంకేలికి వెళ్ళిన పీఎంజీఎస్వై సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్, అతని సహాయకుడు అటెండర్ లక్ష్మణ్ పరాత్గిరిని నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. గురువారం నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. రోడ్డు పనులను తనిఖీ నిమిత్తం వెళ్లిన వారు నేటికీ తిరిగి రాకపోవడంతో ఆ శాఖ ఉద్యోగుల్లో కలవరం కలిగిస్తోంది. కాగా, ఈ ఘటనపై పీఎంజీఎస్వై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. అయితే ఉద్యోగుల మిస్సింగ్కు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
‘ఉజ్వల’ ఫలాలు అందట్లేదు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత పేద ప్రజలను ఎల్పీజీ సిలిండర్ల వాడకం వైపు మొగ్గేలా చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్యూవై) కార్యక్రమ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉజ్వల పథకం కింద ప్రజలను సిలిండర్లను కొనేలా చేయగలిగినా.. వాటిని పూర్తిగా వినియోగించేలా చేయడంలో యంత్రాంగం విఫలమైనట్లు తేలింది. పథకం కింద కేంద్రం పేద మహిళలకు సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్లిస్తో్తంది. పథకం ప్రారంభమైన తొలి 40 నెలల్లో 8 కోట్ల మందికి పైగా ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నట్లు అధ్యయ నం పేర్కొంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంచేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కట్టె పొయ్యిలనే వాడుతున్నారనీ, వంటకు ఎల్పీజీని మాత్రమే వాడితేనే సత్ఫలితాలు అందుతాయని అభిప్రాయపడ్డారు. -
నాణ్యతా లోపాలను సహించం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద చేపట్టిన రహదారుల నిర్మాణంలో నాణ్యతాలోపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరం గల్ జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారు లు, వర్క్ ఏజెన్సీలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నాబార్డ్, పీఎంజీ ఎస్వై నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి అడ్డగోలుగా అంచనాలను పెంచినా, పనులు చేయడంలో జాప్యం జరిగినా కఠిన చర్యలు తీసు కుంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు మెమోలు జారీచేయడంతో పాటు, ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సూచిం చారు. అనుమతిచ్చిన వారంలోపే పనులు ప్రారంభించాలని, 15 రోజుల్లోగా శంకు స్థాపన జరగాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రహదారులు, వంతెనల పనులన్నీ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.