న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత పేద ప్రజలను ఎల్పీజీ సిలిండర్ల వాడకం వైపు మొగ్గేలా చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై) కార్యక్రమ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉజ్వల పథకం కింద ప్రజలను సిలిండర్లను కొనేలా చేయగలిగినా.. వాటిని పూర్తిగా వినియోగించేలా చేయడంలో యంత్రాంగం విఫలమైనట్లు తేలింది. పథకం కింద కేంద్రం పేద మహిళలకు సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్లిస్తో్తంది. పథకం ప్రారంభమైన తొలి 40 నెలల్లో 8 కోట్ల మందికి పైగా ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నట్లు అధ్యయ నం పేర్కొంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంచేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కట్టె పొయ్యిలనే వాడుతున్నారనీ, వంటకు ఎల్పీజీని మాత్రమే వాడితేనే సత్ఫలితాలు అందుతాయని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment