Paytm Offers Cashback On Booking LPG Cylinders Through The App - Sakshi
Sakshi News home page

పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు!

Nov 29 2022 9:15 PM | Updated on Nov 30 2022 8:31 AM

Paytm Offers Cashback On Booking Lpg Cylinders Through The App - Sakshi

దేశీయ ఆన్‌లైన్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు శుభవార్త చెప్పింది. భారత్‌ గ్యాస్‌ (Bharatgas), ఇండేన్‌ (Indane), హెచ్‌పీ( HP) సంస్థల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ బుకింగ్‌లపై అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందిస్తోంది పేటీఎం. వినియోగదారులు మొదటి గ్యాస్ బుకింగ్‌పై ఫ్లాట్ రూ. 15 క్యాష్‌బ్యాక్, అదే Paytm వాలెట్ ద్వారా సిలిండర్ బుకింగ్‌ చేస్తే రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. వీటితో పాటు అదనంగా, యూజర్లు తమ బుకింగ్‌ను ట్రాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది.

ఈ ఆఫర్‌ ఎల్‌పీజీ సిలిండర్‌లను బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ వర్తిస్తుందని ప్రకటించింది. కొత్త వినియోగదారులు రూ. 15 క్యాష్‌బ్యాక్ పొందడానికి "FIRSTGAS" కోడ్‌, పేటీఎం వాలెట్‌ని ఉపయోగించి సిలిండర్‌ల బుకింగ్‌ చేసే యూజర్లు "WALLET50GAS" కోడ్‌ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

ముఖ్యంగా, మొదటి బుకింగ్ తర్వాత, యాప్ బుకింగ్ వివరాలను కూడా సేవ్ చేస్తుంది, తద్వారా తదుపరి బుకింగ్‌ కోసం యూజర్లు 17-అంకెల ఎల్‌పీజీ ఐడీ(LPG ID) తదితర వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుకింగ్ ప్రక్రియ పూర్తవగానే మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు 2-3 రోజుల్లో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ ద్వారా డెలివరీ చేస్తుంది.

చదవండి: బంపర్‌ ఆఫర్‌..ఆ క్రెడిట్‌ కార్డ్‌ ఉంటే 68 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఫ్రీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement