Cash Back Offer
-
బంపర్ ఆఫర్.. ఈ కెడ్రిట్ కార్డ్ ఉండే 10% క్యాష్‌బ్యాక్, ఇంకా బోలెడు బెనిఫిట్స్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ, ప్రైవేట్‌రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సంయుక్తంగా క్రెడిట్ కార్డును మార్కెట్లోకి విడుదల చేసింది. మాస్టర్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేయనున్నట్లు తెలిపింది. స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుండడం ఈ కార్డు ప్రత్యేకత. అంతేకాకుండా ఇతర కొనుగోళ్లపైనా రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి. బెనిఫిట్స్ ఇవే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, స్విగ్గీ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కిరాణా డెలివరీ, డైనింగ్ అవుట్ మరియు మరిన్నింటిలో ఖర్చులపై 10% క్యాష్‌బ్యాక్‌తో సహా అనేక రకాల ప్రయోజనాలను ఈ కార్డుదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.500. వార్షిక రుసుముగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే వార్షిక రుసుము రద్దు చేస్తారు. రెంట్ పేమెంట్, యుటిలిటీ బిల్స్, ఫ్యూయల్, ఇన్సురెన్స్, ఈఎంఐ, జ్యువెలరీ కొనుగోళ్లకు క్యాష్ బ్యాక్ వర్తించదు. ఒక నెలలో 10 శాతం క్యాష్‌బ్యాక్ కింద రూ.1,500 లభిస్తుంది. 5 శాతం క్యాష్బ్యాక్కూ అదే పరిమితి వర్తిస్తుంది. 1 శాతం క్యాష్‌బ్యాక్‌కు నెలలో గరిష్ఠ పరిమితి రూ.500గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మఈజీ, బుక్‌మైషో ఇంకా మరెన్నో ప్లాట్‌ఫారమ్‌లలో షాపింగ్ చేయడంపై కార్డ్ హోల్డర్లు 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందుకుంటారు. ఈ అదనపు 5% క్యాష్‌బ్యాక్ ప్రయోజనం Nike, H&M, Adidas, Zara మొదలైన బ్రాండెడ్ వెబ్సైట్లకు కూడా వర్తిస్తుంది.ఇంకా, కస్టమర్లు ఇతర ఖర్చులపై 1% తిరిగి పొందుతారు. కార్డ్ హోల్డర్లు స్విగ్గీ మనీ రూపంలో క్యాష్‌బ్యాక్ పొందుతారు. వీటిని వివిధ లావాదేవీల కోసం స్విగ్గీ అంతటా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా కార్డ్ హోల్డర్లు 3-నెలల కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్‌ను పొందగలరు. ఇది ఫుడ్, కిరాణా, డైనింగ్ అవుట్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్‌లలో ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ పొందడంతో పాటు, స్విగ్గీ, HDFC కార్డ్ హోల్డర్లు ఉచిత బస, భోజనం, కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్‌షిప్‌లతో పాటు మరిన్ని వంటి ప్రపంచ స్థాయి మాస్టర్‌కార్డ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. స్విగ్గీ యాప్‌లో వారం పది రోజుల్లో దశలవారీగా ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి రానుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు స్విగ్గి యాప్ లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చదవండి ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే? -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు!
దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు శుభవార్త చెప్పింది. భారత్ గ్యాస్ (Bharatgas), ఇండేన్ (Indane), హెచ్‌పీ( HP) సంస్థల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లపై అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది పేటీఎం. వినియోగదారులు మొదటి గ్యాస్ బుకింగ్‌పై ఫ్లాట్ రూ. 15 క్యాష్‌బ్యాక్, అదే Paytm వాలెట్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేస్తే రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. వీటితో పాటు అదనంగా, యూజర్లు తమ బుకింగ్‌ను ట్రాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఈ ఆఫర్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ వర్తిస్తుందని ప్రకటించింది. కొత్త వినియోగదారులు రూ. 15 క్యాష్‌బ్యాక్ పొందడానికి "FIRSTGAS" కోడ్, పేటీఎం వాలెట్‌ని ఉపయోగించి సిలిండర్ల బుకింగ్ చేసే యూజర్లు "WALLET50GAS" కోడ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, మొదటి బుకింగ్ తర్వాత, యాప్ బుకింగ్ వివరాలను కూడా సేవ్ చేస్తుంది, తద్వారా తదుపరి బుకింగ్ కోసం యూజర్లు 17-అంకెల ఎల్పీజీ ఐడీ(LPG ID) తదితర వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుకింగ్ ప్రక్రియ పూర్తవగానే మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు 2-3 రోజుల్లో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ ద్వారా డెలివరీ చేస్తుంది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
గూగుల్ పే పై యూజర్స్ ఫైర్
-
ధంతేరస్ 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్
సాక్షి, ముంబై: ధంతేరస్ 2022కి టాప్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే బంపర్ ఆఫర్ అందిస్తోంది. తన ఫ్లాట్‌ఫాం ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసిన వినియోగ దారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. రానున్న ధన్తేరస్ సందర్భంగా గోల్డెన్ డేస్ ప్రచారంలో భాగంగా వినియోగదారుల బంగారం, వెండి కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లపై రూ. 2,500, వెండి కొనుగోళ్లపై రూ. 500 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు ఎవరు అర్హులు? అక్టోబర్ 26 వరకు బంగారం లేదా వెండి కొనుగోళ్లను చేసినట్లయితే, కస్టమర్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు. ధంతేరస్ సందర్భంగా యాప్లోఈ ఆఫర్ పొందాలంటే రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ బంగారం ,వెండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు 99.99 శాతం స్వచ్ఛమైన 24కె బంగారం, వెండిని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బీమా చేయబడిన డోర్‌స్టెప్ డెలివరీ అవకాశం ఉంది. లేదంటే ధృవీకృత 24కే గోల్డ్ బార్లను ఉచితం సేఫ్‌గా డిజిటల్‌గా గ్రేడ్ గోల్డ్ లాకర్లో దాచుకోవచ్చు. బంగారాన్ని ఎలా కొనుగోలు చేయాలి ♦ ఫోన్‌పేలో సైట్ దిగువన ఉన్న వెల్త్ చిహ్నాన్ని ఎంచుకోండి. ♦ బంగారం, వెండి ఏది కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఎంచుకుని, పేమెంట్ పద్ధతిని ఎంచుకోవాలి. ♦ ఆప్షన్లలో 'స్టార్ట్ అక్యుమ్యులేటింగ్' లేదా ‘బై మోర్ గోల్డ్ ఎంచుకోవాలి. ఆ తరువాత డోర్ డెలివరీ కావాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. ♦ చివరగా మీరుకొనాలనుకునే బంగారు లేదా వెండి నాణేలను క్లిక్ చేయవచ్చు. సంబంధిత నగదును నమోదు చేసి 'ప్రొసీడ్' బటన్‌పై క్లిక్ చేయాలి. -
యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టిన శామ్సంగ్.. అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్, ఏడాది మొత్తం!
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఇండియా తాజాగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌తో జత కట్టింది. కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీనితో శాంసంగ్ ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోళ్లపై ఏడాది పొడవునా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వీసా సిగ్నేచర్, వీసా ఇన్ఫినిట్ అని ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి. సిగ్నేచర్ వేరియంట్ కార్డుతో ఏటా రూ. 10,000 వరకు (నెలవారీ పరిమితి రూ. 2,500), ఇన్ఫినిటీ వేరియంట్ కార్డుతో రూ. 20,000 వరకు (నెలవారీ పరిమితి రూ. 5,000) క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కనీస లావాదేవీ విలువ అంటూ ఏమీ ఉండదు. సిగ్నేచర్ కార్డు వార్షిక ఫీజు రూ. 500, ఇన్ఫినిటీ కార్డు ఫీజు రూ. 5000గా (పన్నులు అదనం) ఉంటుంది. వినియోగదారులకు మరింత మెరుగైన డీల్స్ అందించేందుకు బిగ్‌బాస్కెట్, మింత్రా, టాటా 1ఎంజీ, అర్బన్ కంపెనీ, జొమాటో మొదలైన సంస్థలతో చేతులు శాంసంగ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపాయి. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
ఫ్లిప్‌కార్ట్ పేటీఎంతో డీల్: ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్
సాక్షి,ముంబై: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై 80 శాతందాకా డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఆపిల్ ఐఫోన్13, నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ఫోన్లు సహా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు పేటీఎం ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లను అందించనుంది. పేటీఎం యూపీఐ, పేటీఎం వాలెట్ చెల్లింపులపై ఆఫర్లను అందివ్వనుంది. ఇందుకోసం పేటీఎంతో డీల్ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 250 అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసినట్లయితే రూ.25 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను, పేటీఎం యూపీఐ, వాలెట్ 500 రూపాయలు అంతకంటే ఎక్కువున్న చెల్లింపులపై రూ. 50 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022తో భాగస్వామ్యంపై పేటీఎం ప్రతినిధి సంతోషం ప్రకటించారు. దీని ద్వారా భారతదేశంలోని చిన్న నగరాలు పట్టణాల్లోని మిలియన్ల మంది షాపర్లకు సురక్షితమైన చెల్లింపుల అనుభవాన్ని అందించనున్నామన్నారు. బిగ్ బిలియన్ డే 2022 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై డిస్కౌంట్లను, ఇంకా దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్, బ్యూటీ ఉత్పత్తులు, బొమ్మలు తదితర అనేక ఉత్పత్తులపై ఆఫర్లను కూడా పొందవచ్చు. ఇప్పటికే ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్కొనుగోళ్లపై 10శాతం, గరిష్టంగా రూ.1500 దాకా ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. -
తొమ్మిదో వసంతంలోకి ‘బి న్యూ మొబైల్స్’
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ విక్రయ సంస్థ బి న్యూ మొబైల్స్ ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకుని, తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50% వరకు స్టోర్స్‌లో, ఆన్‌లైన్‌లోనూ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎంపిక చేసిన టీవీలపై రూ.7వేల వరకు, లాప్‌ట్యాబ్‌లపై రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది. ప్రారంభ ధర రూ.1,599కే స్మార్ట్ వాచ్‌లను పొందవచ్చు. ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 7.5% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ప్రజల నిత్య జీవనంలో కీలకమైన సెల్ఫోన్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సామాన్యులకు అందజేయడంలో బి న్యూ ముందంజలో ఉంటుందని సంస్థ సీఎండీ యరగుంట్ల బాలాజీ చౌదరి తెలిపారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో 150పైకి షో రూమ్‌లను కలిగి ఉన్నాము. తర్వలోనే మరిన్ని షోరూంలను అందుబాటులోకి తీసుకొస్తాము. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి ప్రజలకు సెల్ఫోన్లను తక్కువ ధరలకే అందించేందుకు గ్రామీణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిని సారించాము’’అని బాలాజీ పేర్కొన్నారు. -
పేటీఎం సరికొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్.. వివరాలు ఇదిగో...
ముంబై: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కస్టమర్లకు మరోసారి 4కా 100 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ సందర్భంగా యూపీఐ నగదు బదిలీపై ఈ అద్భుతమైన ఆఫర్‌ను తిరిగి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ జూన్ 19 వరకు ఉంటుంది. మ్యాచ్ రోజుల్లో కొత్త కస్టమర్లు పేటీఎం యూపీఐ ఉపయోగించి నాలుగు రూపాయలు పంపితే రూ.100 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఇప్పటికే యాప్ కలిగిన కస్టమర్లు రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా రూ.100 వరకు క్యాష్ బ్యాక్ పొందగలరని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఇండియా వర్సెస్ సిరీస్‌లో ఈ ఆఫర్‌ను తొలిసారి ప్రవేశపెట్టినపుడు లక్షల మంది కస్టమర్లు రూ.100 క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకున్నారు. చదవండి: ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి! -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆఫర్ దేశవ్యా ప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది. -
పేటీఎం బంపర్ ఆఫర్ ! రూ. 4 ట్రాన్స్ఫర్ చేస్తే.. రూ. 100 క్యాష్‌బ్యాక్
హైదరాబాద్: వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ పేటీఎం నగదు బదిలీపై ‘‘4 కా 100 క్యాష్‌బ్యాక్’’ ఆఫర్‌ను ప్రకటించింది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ మ్యాచ్ రోజుల్లో కస్టమర్లు పేటీఎం యూపీఐ ద్వారా నాలుగు రూపాయలు బదిలీ చేస్తే రూ.100 హామీ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 20 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, హర్భజన్ సింగ్‌లతో పాటు విండీస్ ఆటగాడు క్రిస్ గేల్లు ఆన్లైన్ ప్రచాకర్తలుగా వ్యవహరిస్తున్నారు. -
లాట్ మొబైల్ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా ఆఫర్లను ఇస్తున్నట్లు లాట్ మొబైల్స్ తెలిపింది. అమెజాన్ పే, బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.3500 క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. పేటీఎం మాల్ పేమెంట్ ద్వారా 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్, ఓచర్ల రూపంలో మరో ఐదుశాతం వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి పదిశాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది. శాంసంగ్ మొబైల్స్, ల్యాప్‌ట్యాబ్‌ల కొనుగోలుపై రూ.15000 వరకు, వన్‌ప్లస్ మొబైల్స్ పైన రూ.10000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్మార్ట్ టీవీలపై రూ.3500ల తక్షణ క్యాష్‌బ్యాక్‌ను, హెచ్‌పీ ల్యాప్ట్యాబ్లపై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే బ్రాండెడ్ ఉపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది. పండుగ సందర్భంగా లాట్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లు కస్టమర్లంతా వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్ కోరారు. -
హ్యాపీ మొబైల్ క్యాష్ బ్యాక్ ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: హ్యాపీ మొబైల్స్ దీపావళి పండుగ సందర్భంగా ‘‘క్యాష్ బ్యాక్ ధమాకా’’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎలాంటి లక్కీ డ్రా లేకుండా ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి అందించనుంది. మొబైల్, ల్యాప్ ట్యాబ్, టీవీల కొనుగోళ్లపై 10% వరకు క్యాష్ బ్యాక్‌ను పొందొచ్చు. శాంసంగ్, ఒప్పో, వివో మొబైళ్ల కొనుగోలుపై రూ.3000 వరకు, ఐఫోన్ కొనుగోలుపై రూ. 6000 వరకు, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ. 3000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందించవచ్చు. అన్ని మొబైల్ ఉపకరణలపై 60% వరకు తగ్గింపు పొందవచ్చు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, మొబిక్విక్, పేటీఎంల ద్వారా 10% వరకు తక్షణ క్యాష్ బ్యాక్‌ను పొందొచ్చు. ప్రత్యేక ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ తెలిపారు. -
SBI: క్రెడిట్‌కార్డు వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్
భారతీయ స్టేట్ బ్యాంక్(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కార్డు వినియోగదారుల కోసం దమ్దార్ దస్ పేరుతో పండుగ ఆఫర్ ప్రకటించింది. క్రెడిట్ కార్డ్స్ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ అందుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ఈఎంఐ కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. దసరా, దీపావళి పండుగ సీజన్ వచ్చేసింది. ఈ మూడ్‌కి తగ్గట్లే ఆన్లైన్లో షాపింగ్ జోరందుకుంటుంది. కార్డుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగ సీజన్ కాబట్టే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపింది ఎస్బీఐ. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 3 నుంచి కేవలం మూడు రోజులపాటు వర్తించనుంది. ఆన్లైన్లో మొబైల్స్, అప్లియెన్సెస్, హోం డెకర్.. తదితర కొనుగోళ్లకు దమ్దార్ దస్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే బీమా, యాత్రలు, వాలెట్, ఆభరణాలు, విద్య, ఆరోగ్యం, పౌర సేవలకు ఇది వర్తించదు అని కంపెనీ తెలిపింది. పూర్తి వివరాల కోసం దమ్దార్ దస్ లింక్‌ను క్లిక్ చేయండి. -
జియో స్పెషల్ ఆఫర్... ఈ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్
మొబైల్ ఇంటర్నెట్ యూసేజీలో విప్లవాత్మక మార్పలకు కారణమైన జియో సంస్థ తన వినియోగదారులకు మరో ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని పలు రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని ప్రకటించింది. రియలన్స్ జియోకి సంబంధించి మోస్ట్ పాపులర్ ప్లాన్స్‌గా ఉన్న రూ. 249, రూ.555, రూ. 599లపై జియో 20 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే మైజియో యాప్ నుంచే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జీ పూర్తయిన వెంటనే క్యాష్‌బ్యాక్ అమౌంట్ ఖాతాలో జమ అవుతాయి. వీటిని తదుపరి రీఛార్జ్ సమయంలో ఉపయోగించుకోవచ్చు. చదవండి : చైనా ఫోన్లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ -
రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్.. ఎప్పుడు, ఎక్కడ
కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్లకు యమహా గుడ్‌న్యూస్ చెప్పింది. కోవిడ్ కష్టకాలంలో వారు చేసిన సేవలకు గుర్తిస్తూ తమ స్కూటర్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. యమహా సంస్థను నెలకొల్పి 66 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చామని యమహా తెలిపింది. ఫ్రంట్‌లైన్ వారియర్లకే కరోనా సంక్షోభ సమయంలో రిస్క్ చేసి విధులు నిర్వర్తించిన మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆర్మీ , మున్సిపాలిటీ సిబ్బందికి తమ ఆఫర్ వర్తిస్తుందని యమహా తెలిపింది. రూ.5000 క్యాష్‌బ్యాక్ యమహాలో పాపులర్ మోడల్స్‌గా ఉన్న ఫాసినో 125 ఎఫ్ఐ, రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ మోడల్స్‌పై రూ. 5,000 డిస్కౌంట్ ఇస్తున్నట్టు యమహా ప్రకటించింది. ఫ్రంట్ లైన్ వర్కర్లందరికీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తింప చేస్తామని, వారికి తగ్గింపు ధరకే స్కూటర్లు అందిస్తామని యమహా మోటర్ గ్రూప్ ఇండియా చైర్మన్ మోటోఫ్యూమి శితార ప్రకటించారు. ఆన్‌రోడ్ ప్రైస్ @ హైదరాబాద్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ స్కూటర్ ఆన్‌రోడ్ ధర హైదరాబాద్‌లో రూ. 87,925 ఉండగా యమహా రే జెడ్ఆర్ 125 ధర రూ. 91,125గా ఉంది. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కరర్లకు ఈ రెండు మోడళ్లపై ప్రత్యేకంగా రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను యమహా వర్తింప చేసింది. -
కస్టమర్లకు హోండా శుభవార్త !
వెబ్‌డెస్క్: కస్టమర్లకు హోండా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఫ్రీ సర్వీసులు పొందలేకపోయిన వారికి ఉపశమనం కలిగించే ఆఫర్ ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు గడువులో ఫ్రీ సర్వీసులు పొందలేక పోయిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నెలల కాలంలో ముగిసిపోయే వారంటీ, ఫ్రీ సర్వీసులను జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు హోండా సంస్థ పేర్కొంది. పెరిగిన హోండా షైన్ ధర ఇండియన అర్బన్ మార్కెట్లో పట్టున్న హోండా సంస్థ ధరలు పెంచింది. హోండా టూవీలర్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న షైన్ మోడల్ ధరను పెంచింది. బీఎస్ 6 ప్రమాణాలతో తయారు చేసిన హోండా షైన్ బైక్ రేటు రూ. 1072 పెంచింది. గడిచిన రెండు నెలల్లో వరుసగా రెండోసారి షైన్ బైక్ రేటును హోండా పెంచింది. ప్రస్తుతం ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం షైన్ బైక్ డ్రమ్వేరియంట్ మోడల్ ధర రూ. 71,550 ఉండగా డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 76,346గా ఉంది. ప్రస్తుత ధరల పెంపుతో వీటిపై అదనంగా రూ. 1072 వ్యయం కానుంది. పెరిగిన ధరపై జీఎస్టీ, ఇతర లోకల్ ట్యాక్సులు కలుపుకుని కొనుగోలు దారులపై అదనంగా దాదాపు రెండు వేల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఓ వైపు షైన్ బైక్ ధరలు పెంచిన హోండా సంస్థ మరోవైపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు జూన్ 30లోపు హోండా షైన్ బైకును కొనుగోలు చేస్తే.. రూ. 3500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చంటూ ప్రత్యేక ఆఫర్‌ను హోండా సంస్థ ప్రకటించింది. -
జియో క్యాష్ బ్యాక్ ఆఫర్స్: అప్పటి వరకు మాత్రమే..
న్యూఢిల్లీ : ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎమ్, ఫోన్ పే, అమెజాన్, మోబీక్విక్, ఫ్రీఛార్జ్ యాప్‌ల ద్వారా రిఛార్జ్ చేసుకునేవారికి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కింద 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా రివార్డులు అందించనుంది. ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్ 28 వరకు మాత్రమే ఉంటుంది. ( మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ ) పేటీఎమ్ జియోలోకి కొత్తగా ప్రవేశించిన కస్టమర్లు పేటీఎమ్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నట్లయితే మూడుసార్లు 100 రూపాయల చొప్పున కచ్చితమైన క్యాష్ రివార్డు పొందొచ్చు. అదే పాత కస్టమర్లు అయితే 1000 రూపాయల దాకా క్యాష్ రివార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. ఇందుకోసం కనీసం రూ. 48 రూపాయల విలువ గల రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్‌పే ఫోన్‌పే ద్వారా రిఛార్జ్ చేసుకునే జియో కొత్త కస్టమర్లకు రూ. 140 దాకా క్యాష్ బ్యాక్‌తో పాటు ఓ స్క్రాచ్ కార్డ్ వస్తుంది. వీటి ద్వారా రూ.260 విలువ గల క్యాష్ రివార్డులను పొందొచ్చు. పాత కస్టమర్లు అయితే మొదటి రీఛార్జ్ కింద రూ.120 పొందొచ్చు. అది కూడా యూపీఐ ఐడీ ద్వారా రీఛార్జ్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందటానికి కనీసం రూ.125 విలువ గల రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ అమెజాన్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నట్లుయితే రూ. 125 క్యాష్ రివార్డు పొందొచ్చు. ఈ ఆఫర్ పాత, కొత్త కస్టమర్లకు ఒకేలా వర్తిస్తుంది. ఈ రివార్డులను అమెజాన్ షాపింగ్ కోసం వాడుకోవచ్చు. మోబీక్విక్ ఈ యాప్ ద్వారా మీరు రూ. 149 అంతకంటే ఎక్కువ విలువ గల రిఛార్జ్ చేసుకుంటే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. గరిష్టంగా రూ. 50 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందటానికి ‘NJI050’ కోడ్‌ని ఎంటర్ చేయాలి. పాత కస్టమర్లు అయితే రిఛార్జ్ మొత్తంలో 50 శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. గరిష్టంగా రూ. 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందుచ్చు. ఇందుకోసం ‘JIO50P’ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఫ్రీఛార్జ్ ఫ్రీఛార్జ్ ద్వారా కొత్త జియో కస్టమర్లు రూ.30.. పాత కస్టమర్లు రూ. 20 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ‘JIO30’... ‘JIO20’ కోడ్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. -
హైదరాబాద్ మెట్రో క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: మెట్రో స్మార్ట్ కార్డున్న ప్రయాణికులకు క్యాష్ బ్యాక్ పథకంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హెచ్ఎంఆర్ ఎండీ స్పష్టతనిచ్చారు. స్మార్ట్‌కార్డు కొనుగోలు లేదా రీచార్జీ చేసిన నాటినుంచి 90 రోజులపాటు క్యాష్ బ్యాక్ స్కీం వర్తిస్తుంది. స్మార్ట్ కార్డు రీచార్జీని మెట్రో స్టేషన్లలో లేదా పేటీఎం, టీ- సవారీ యాప్‌ల ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. స్టేషన్లలో రీచార్జీ చేసిన వెంటనే క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. యాప్ ద్వారా చేసుకుంటే రెండు గంటల సమయం పడుతుందని తెలిపారు. రూ.100 నుంచి రూ.300 మొత్తాన్ని స్మార్ట్ కార్డులో రీచార్జీ చేసుకుంటే క్యాష్ బ్యాక్ వర్తించదు. కానీ ప్రయాణ చార్జీలో 10 శాతం రాయితీ లభిస్తుంది. రూ.400 నుంచి రూ.2000 వరకు స్మార్ట్‌కార్డులో రీచార్జీ చేసుకునే వారికి క్యాష్ బ్యాక్‌తో పాటు ప్రయాణ చార్జీల్లోనూ 10 శాతం రాయితీ లభిస్తుందన్నమాట. అంటే కనీసం రూ.400 నుంచి రూ.2000 వరకు రీచార్జీ చేసుకునేవారికే అధిక ప్రయోజనం చేకూరనుంది. స్మార్ట్ కార్డులో ఎంత రీచార్జీ చేసుకుంటే.. ఎంత క్యాష్‌బ్యాక్ లభిస్తుందంటే.. రీచార్జీ చేసుకునే మొత్తం లభించే క్యాష్ బ్యాక్ కార్డులో జమయ్యే మొత్తం (క్యాష్‌బ్యాక్‌తో కలిపి) 400 100 500 500 150 650 1000 300 1300 1500 600 2100 1750 700 2450 2000 800 2800 -
ఆఫర్లు లేవు... క్యాష్‌బ్యాక్ రాదు!
అనిరుధ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంటికి అవసరమైన సరుకులు, ఇతరత్రా కొనుగోలుకు సంబంధించిన నెలవారీ ఖర్చులన్నీ డిజిటల్ చెల్లింపులతోనే పూర్తి చేస్తాడు. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఇతర కూపన్లు వస్తుండటమే కారణం. కానీ రెండు నెలలుగా డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు రాలేదు. అలాగే ఎలాంటి కూపన్లు రాలేదు. కొన్ని సందర్భాల్లో డిజిటల్ చెల్లింపులతో పోలిస్తే సాధారణ కొనుగోలులో తక్కువ ధరకే వస్తుండటంతో అవసరాన్ని బట్టి చెల్లింపులు చేస్తున్నాడు. (ఐసీయూ తరహాలో..) సందీప్ తండ్రికి షుగర్, బీపీ ఉంది. ప్రతి నెల ఓ బ్రాండెడ్ ఫార్మసీ దుకాణంలో మందులు కొనుగోలు చేస్తాడు. ఈ రెండు మందులకు ప్రతి నెల రూ.810 చెల్లిస్తాడు. వాస్తవానికి దుకాణాదారు ఈ మాత్రల ఎంఆర్పీ ధరపై 15 శాతం డిస్కౌంట్ ఇస్తుండేవాడు. కానీ ఇటీవల మాత్రలు కొనుగోలు చేసేందుకు వెళ్తే ఎంఆర్పీ ధరకే మందులు ఇస్తున్నట్లు చెబుతూ రూ.952 తీసుకున్నాడు. ఇదేమిటని అడిగితే కంపెనీ ఆఫర్ ఇవ్వడం లేదని చేతులు దులుపుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో తలపెట్టిన లాక్డౌన్ సగటు వ్యక్తి ఖర్చులపై తీవ్ర ప్రభావానే చూపుతోంది. లాక్డౌన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లో పరిస్థితులు భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సడలింపులతో నిత్యావసర సరుకుల దుకాణాలే కాకుండా ఇతర వ్యాపార సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే వ్యాపార శైలిలో భారీ మార్పులొచ్చాయి. గతం లో సరుకులను కొంత తగ్గిం పు ధరకు అమ్మగా, ఇప్పుడు ఎంఆర్పీకే విక్రయిస్తున్నా రు. దీంతో సరుకులు కొనుగోలు చేసేవారు ఉసూరుమంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు చాలా దుకాణాల్లో నిర్దేశిత మొత్తంలో కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉండేవి. నిత్యావసరాల కొనుగోలుపై ఈ ఆఫర్లు భారీగా ఉండేవి. సూపర్ మార్కెట్లలో ఒకటి కొంటే మరోటి ఉచితం లాంటి ఆఫర్లు చాలా కనిపించేవి. కొన్ని సరుకులపై 10 శాతం, 20 శాతం డిస్కౌంట్లు ఉండేవి. ప్రస్తుతం వ్యాపార సంస్థలు వీటికి పూర్తిగా మంగళం పాడేశాయి. డిజిటల్ చెల్లింపుల్లో ఆఫర్లు కట్... అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు పలు సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చేవి. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి సంస్థలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో చాలా మంది ఈ చెల్లింపులకు అలవాటుపడ్డారు. రీచార్జ్‌లు, బిల్లుల చెల్లింపులతో పాటు నగదు బదిలీ చేయడంపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భారీగానే ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ ప్రోత్సాహకాలను ఆయా కంపెనీలు ఇవ్వడం లేదు. ఎలాంటి లావాదేవీలు చేసినా క్యాష్‌బ్యాక్ రావడంలేదని వినియోగదారులు చెబుతున్నారు. -
ల్యాప్‌టాప్స్‌పై భారీ క్యాష్‌బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దసరా, దీపావళి పండుగల సీజన్లో ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు ఆఫర్లతో పోటీపడుతున్నాయి. కస్టమర్లు రూ.50,000 వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ దక్కించుకోవచ్చు. 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సైతం అందుకోవచ్చు. అష్యూర్డ్ గిఫ్ట్స, రివార్డులు, బోనస్ పాయింట్లు అదనం. వడ్డీ లేని వాయిదాల్లో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలవారీ వాయిదా రూ.1,400లతో ప్రారంభం అవుతుంది. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ కంపెనీలు కొత్త మోడళ్లతో రంగంలోకి దిగాయని ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. సీజన్ కోసం కంపెనీలు ఇప్పటికే 25 దాకా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయని చెప్పారు. -
పేటీఎంలో క్యాష్‌బ్యాక్ స్కాం
-
పేటీఎంలో రూ.10కోట్ల క్యాష్‌బ్యాక్ స్కాం
ముంబై: ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని తమ అంతర్గత విచారణలో తేలినట్లు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. ‘దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్ లభిస్తుండటాన్ని మా టీమ్ గుర్తించింది. దీన్ని మరింత లోతుగా పరిశీలించాలని మా ఆడిటర్లను కోరాం‘ అని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఆడిటింగ్ సంస్థ ఈవై నిర్వహించిన ఆడిట్లో కొందరు జూనియర్ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్ కుంభకోణానికి తెరతీసినట్లు వెల్లడైందని ఆయన వివరించారు. మరోవైపు, ఇప్పటిదాకా పేమెంట్స్ వ్యవస్థలోకి మెసేజింగ్ యాప్ వాట్సాప్ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్ శేఖర్ శర్మ తాజాగా స్వరం మార్చారు. వాట్సాప్ లాంటి సంస్థల రాక స్వాగతించదగ్గ పరిణామమేనన్నారు. భారతీయ చట్టాలను పాటించడానికి సిద్ధంగా లేని సంస్థలను మాత్రమే తాను వ్యతిరేకించానని ఆయన చెప్పారు. క్యాష్‌బ్యాక్‌లిచ్చినా ఫర్వాలేదు .. క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో వ్యాపారం లాభసాటిగా ఉండదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఇలాంటివి ఇచ్చినా వ్యాపారం నిలదొక్కుకోగలదని శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరింత మంది యూజర్లు, వ్యాపారులకు చేరువయ్యేందుకు భారీగా వ్యయాలు చేస్తున్నందున లాభాల్లోకి మళ్లేందుకు మరికాస్త సమయం పట్టవచ్చన్నారు. యూజర్ల సంఖ్య 30 నుంచి 50 కోట్ల దాకా, వ్యాపార సంస్థల సంఖ్య ప్రస్తుతమున్న 1.2 కోట్ల నుంచి 4 కోట్లకు పెరిగేదాకా లాభాలు నమోదు కాకపోవచ్చని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పేటీఎంలో క్యాష్‌బ్యాక్ స్కాం -
కిరాణాపై అమెజాన్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్
సాక్షి,న్యూఢిల్లీ: గత ఏడాది గ్రాసరీస్ (కిరాణా,ఆహారోత్పత్తులుఇతరత్రా) వ్యాపారంలోకి అడుగుపెట్టిన ప్రముఖ ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్ ఈ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సూపర్ వాల్యూ డే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో నెలవారీ సరుకుల కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సేల్ మార్చి 7వ తేదీవరకు కొనసాగుతుంది. ఎస్బీఐ లేదా ఐసీఐసీ కార్డులు, అమెజాన్ పే, అమెజాన్ డిజిటల్వాలెట్ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్లను అందిస్తుంది. ఎస్బీఐ కార్డుపై దాదాపు 600 రూపాయల దాకా డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ కస్టమర్లకు ఈ అవకాశం మార్చి 4-7 తేదీల మధ్య అందుబాటులో ఉంది. మార్చి 1-3వ తేదీల మధ్య ఐసీఐసీఐ కార్డు కొనుగోళ్లపై ఆఫర్స్‌ను అందుకోవచ్చు. రూ. 1500 కొనుగోళ్ళపై ఐసీఐసీఐ కస్టమర్లు 15శాతం దాకా క్యాష్‌బ్యాక్ లేదా 600దాకా డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ప్రతీనెల ఒకటవ తేదీనుంచి 7వ తేదీవరకు 40శాతం తగ్గింపు లేదా, 15శాతం క్యాష్ బ్యాక్ అందివ్వనున్నట్టు వెబ్సైట్లో వెల్లడించింది. మరిన్ని వివరాలు అమెజాన్ వెబ్సైట్లో లభ్యం. -
జియో దివాలీ ఆఫర్ : 100శాతం క్యాష్‌బ్యాక్
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ సారధ్యంలోని టెలికం కంపెనీ రిలయన్స్ జియో బంపర్ఆఫర్ తీసుకొచ్చింది. గత ఏడాది దీపావళి సందర్భంగా లాంచ్ చేసిన ధనాధన్ ఆఫర్‌లాంటి ఆఫర్‌ను ఈ ఏడాది కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో దివాలీ ఆఫర్ 100 శాతం క్యాష్‌బ్యాక్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీని ప్రకారం రూ .149 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై వంద శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. నవంబర్ 30వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జియో ప్రైమ్ సభ్యులతో పాటు కొత్త, పాత జియో సభ్యులందరూ ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు. దీపావళి ఆఫర్‌గా ప్రీపెయిడ్ రీచార్జ్‌లపై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్. రూ .149, రూ. 198, రూ 299, రూ .349, రూ. 398, రూ 399, రూ .448, రూ 449, 498, రూ .509, రూ. 799, రూ. 999, రూ. 1699, రూ. 1999, రూ. 4999 రూ. 9999. ప్లాన్లపై ఈ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ రిలయన్స్ డిజిటల్ కూపన్లు రూపంలో ఉంటుంది. రూ.509 వరకు రీచార్జ్‌లపై ఒక కూపన్‌ను అందిస్తోంది. ఆపైన రీచార్జ్‌లపై అందించే కూపన్లు ఒకటి కంటే ఎక్కువ కూపన్లలో ఆఫర్ చేయనుంది. డిసెంబరు 31, 2018 వరకు క్యాష్ బ్యాక్ కూపన్లు చెల్లుతాయి. రిలయెన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో రూ.5 వేలు, అంతకన్నా ఎక్కువ విలువైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో మాత్రమే ఈ కూపన్లను వాడుకోవచ్చు. కాగా దాదాపు ఇవే నిబంధనలతో ఇటీవల రూ.1699 ప్లాన్ కింద 365 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ అందించేలా అన్లిమిటెడ్ ఏడాది ప్లాన్‌ను కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
విమాన టిక్కెట్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్
దేశీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడుతూ ఎవరైతే విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటారో వారికి రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఇండిగో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 2018 ఏప్రిల్ 18 నుంచి 2018 ఏప్రిల్ 21 మధ్యలో టిక్కెట్లను బుక్ చేసుకునే వారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కనీస లావాదేవీ రూ.7500 ఉండాలి. అంతేకాక ఇండిగో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే కార్డుల ద్వారా నిర్వహించే మొట్టమొదటి చెల్లుబాటు లావాదేవీ మాత్రమే ఈ ఆఫర్ కింద ప్రయోజనాలకు అర్హత సాధిస్తుంది. టిక్కెట్ బుక్ చేసిన 90 రోజుల్లో కస్టమర్ల కార్డుకు ఈ క్యాష్ బ్యాక్ అందుతుంది. ఈ ఆఫర్‌ను, క్యాష్‌బ్యాక్‌ను ట్రాన్సఫర్ చేయడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి కుదరదని ఇండిగో పేర్కొంది. ఈ ఆఫర్లో పాల్గొనే కస్టమర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏమన్నా దెబ్బతింటే ఇండిగో బాధ్యత వహించదని కూడా తెలిపింది. ఈ ఆఫర్‌ను మరే ఇతర ఆఫర్ లేదా ప్రమోషన్‌కు కలుపబోమని ఇండిగో వెల్లడించింది. ముందస్తు ప్రకటన లేకుండానే ఆ ఆఫర్‌ను ఇండిగో, సిటీ బ్యాంకు ఏ సమయంలోనైనా సవరించడం లేదా ఆపివేయడం జరుగవచ్చని, ఈ ఆఫర్‌పై ఉన్న అన్ని ఫిర్యాదులను, సమస్యలను సిటీ బ్యాంకుతో సంప్రదించి పరిష్కరించుకోవాలని, ఇండిగో దీనికి బాధ్యత వహించదని కూడా చెప్పింది. -
బడ్జెట్ ధరలో నోకియా1: జియో క్యాష్‌బ్యాక్
సాక్షి,న్యూఢిల్లీ: నోకియా బడ్జెట్ ధరలో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ గో ఓఎస్ తో పనిచేసే నోకియా 1 ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.5,499గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి( బుధవారం) దీని విక్రయానికి అందుబాటులో ఉంటుదని కంపెనీ ప్రకటించింది. గత నెలలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్ 2018 సదస్సులో ఈ ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 1 గో ఎడిషన్‌ను పరిచయం చేసింది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు రిలయన్స్ జియో ద్వారా క్యాష్ బ్యాక్ఆఫర్ కూడా ఉంది. జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్ టెలికం సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్ జియో రూ. 2,200, క్యాష్ బ్యాక్ తో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 3,299 లభ్యం కానుందని హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించింది. అంతేకాదు 60జీబీ డేటా ఉచితం. అలాగే కోటక్ 811 పొదుపు ఖాతా తెరవడంద్వారా మొబైల్ 12 నెలల ప్రమాదం బీమా రెడ్‌బస్‌లో ఫస్ట్బుకింగ్పై 20 శాతం డిస్కౌంట్ ఉంటుందని సంస్థ ప్రకటనలో పేర్కొంది. నోకియా 1 ఆండ్రాయిడ్ గో ఫీచర్లు 4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే 480x854 పిక్సెల్ రిజల్యూషన్ 1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 1జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజీ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5 ఎంపీ వెనుక కెమెరా 2 ఎంపీ సెల్ఫీ కెమెరా 2150 ఎంఏహెచ్ బ్యాటరీ -
4జీ ఫోన్లపై వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. ట్రాన్స్మిషన్ టెక్నాలజీకి చెందిన 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు 2,200 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు తమ మధ్య ఒక అంగీకారం కుదిరిందని ఇరు సంస్థలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. రూ. 6,990 - రూ.14,990 మధ్య టెక్నో ఐ సిరీస్ మొబైల్స్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ పొందేందుకు కస్టమర్లు మార్చి 14వ తేదీనుంచి జూన్ 30, 2018 వరకు ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలి. అయితే పాత, కొత్త ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందాలంటే నెలకు రూ.150 చొప్పున 18నెలలపాటు రీచార్జ్ చేసుకోవాలి. పిదప మొదటి విడతగా రూ.900, మరో 18నెలలపాటు రూ.150 రీచార్జ్‌పై మిగిలిన రూ.1300 క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది. ఈ మొత్తం నగదును వోడాపోన్ ఎం-పైసా వాలెట్లో జమ చేస్తుంది. దీంతోపాటు వోడాఫోన్ ప్లే 3నెలల సభ్యత్వం ఉచితం. తద్వారా టెక్నో కస్టమర్లు అన్ లెమిటెడ్ ప్రీమియం వీడియో కంటెంట్‌ను పొందవచ్చు. -
జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై రూ.700 క్యాష్‌బ్యాక్
రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న '100 శాతం పైగా క్యాష్‌బ్యాక్' తుది గడువును ఆ కంపెనీ పొడిగించింది. మార్చి 15 వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ కింద రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ యూజర్లకు లభించనుంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ కేవలం జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. రీఛార్జ్ ఓచర్లు, వాలెట్ క్యాష్‌బ్యాక్‌ల రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను జియో అందిస్తోంది. రూ.398, ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై 400 రూపాయల విలువైన ఎనిమిది ఓచర్లను కంపెనీ ఆఫర్ చేయనుందని జియో.కామ్ పేర్కొంది. ఇవి వెంటనే కస్టమర్ల అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. మైజియో యాప్‌లో 'మై ఓచర్స్' కింద కనిపిస్తాయి. మిగతా 300 రూపాయలను ఫ్రీఛార్జ్, మొబిక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్‌పే వంటి డిజిటల్ వాలెట్ల ద్వారా అందిస్తోంది. మొబిక్విక్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే జియో ప్రైమ్ మెంబర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అదే పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే కొత్త కస్టమర్లకు రూ.80, పాత కస్టమర్లకు రూ.50 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అమెజాన్ పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటే జియో కొత్త, పాత యూజర్లకు రూ.50 క్యాష్బ్యాకే లభిస్తోంది. ఫోన్‌పే ద్వారా జియో కొత్త యూజర్లకు రూ.90 క్యాష్‌బ్యాక్, పాత యూజర్లకు రూ.60 క్యాష్‌బ్యాక్ అందుతోంది. ఫ్రీఛార్జ్ నుంచి కొత్త జియో యూజర్లకు రూ.75 క్యాష్‌బ్యాక్, పాత యూజర్లకు రూ.30 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
ఐడియా రూ.2వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్
సాక్షి, ముంబై: టెలికా ఆపరేటర్ ఐడియా గురువారం కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రటకించింది. ఇప్పటివరకూ డేటా వార్తో కస్టమర్లను ఆకట్టుకున్న టెలికాం సంస్థలు ఇపుడిక క్యాష్‌బ్యాక్‌లపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా జియో, ఎయిర్టెల్ తరహాలో ఐడియా కూడా 4 జీ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ అందించనుంది. ఫిబ్రవరి 23 శుక్రవారం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఐడియా ప్రకటించింది. 4జీ హ్యాండ్సెట్స్ ద్వారా 4జీ నెట్వర్క్కి కస్టమర్ అప్ గ్రేడ్ చేయడమే తమ లక్ష్యమని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా ప్రకటించిన ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రీపెయిడ్ , పోస్ట్ పెయిడ్ యూజర్లకి వర్తిస్తంఉది. అయితే ప్ రీపెయిడ్ యూజర్లు ప్రతినెలా రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో రోజుకు 1.4 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ లోకల్ ఎస్టీడీ) పాటు, రోజుకి వంద ఎస్ఎంస్లు ఉచితం. ఈ 199 రూపాయల రీచార్జ్ మొదటి 18 నెలల కాలంలో మూడువేల రూపాయల విలువైన రీఛార్జ్‌లు చేసుకుంటే మొదటి దఫాగా రూ. 750 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. మరో 18 నెలల రీచార్జ్ అనంతరం మరో 1,250 రూపాయల క్యాష్ బ్యాక్ కస్టమర్లకు అందిస్తుంది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు, అన్ని నిర్వాణ వాయిస్ కాంబో పధకాలకు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. 36 నెలల వ్యవధిలో రూ. 389 రీచార్జ్ ప్లాన్‌తో మొదలయ్యే ప్లాన్లపై ఆఫర్ ఏప్రిల్ 30, 2018 వరకు అందుబాటులో ఉంటుంది. -
విమాన టికెట్ రూ.899లకే..క్యాష్‌బ్యాక్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థ న్యూ ఇయర్ విక్రయాలను ప్రకటించింది. నేటి(సోమవారం)నుంచి మూడు రోజులు పాటు ఈ సేల్ నిర్వహించనుంది. ఈ న్యూ ఇయర్ సేల్‌లో విమాన టికెట్ల ప్రారంభ ధర రూ. 899 గా ఉంటుందని ఇండిగో ప్రకటించింది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసిన చెల్లింపులపై10శాతం దాకా క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. తద్వారా సుమారు రూ.600 వరకు అదనపు ప్రయోజనం అలాగే మరో రూ. 600 వరకువరకు అదనంగా రూ. 600 వరకు ఇండిగో స్పెషల్ సర్వీస్ వోచర్లు కూడా అందుబాటులోఉంటాయని తెలిపింది.అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్లు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణాలకు చెల్లుబాటులో ఉంటాయి. ఇండిగో అధికారిక వెబ్ సైట్ www.goindigo.in, సంస్థ యాప్‌తోపాటు ఇతర బుకింగ్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. నిబంధనలు-షరతులు: - ఈ ప్రయాణ కాల వ్యవధిలో రూ .899 నుంచి ధరలు ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లను కాన్సిల్ చేసుకుంటే కేవలం చట్టపరమైన పన్నులు తిరిగి ఇవ్వబడతాయి.గ్రూప్ బుకింగులకు ఈ ఆఫర్ వర్తించదు. ఎంపిక చేసిన విమానాల్లో పరిమిత సీట్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పరిమితి ముగిసిన తరువాత రెగ్యులర్ ఛార్జీలు వర్తిస్తాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇండిగో వెబ్సైట్లో లభ్యం. -
జియో గుడ్‌న్యూస్ : ఆ ఆఫర్ గడువు పెంపు
రిలయన్స్ జియో మరోసారి తన త్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ గడువును పొడిగించింది. ఈ ఆఫర్ గడువును మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ.. కొత్త డెడ్‌లైన్‌గా డిసెంబర్ 25గా నిర్ణయించింది. అప్పటి వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. అంతకముందు కంపెనీ ప్రకటించిన ఈ త్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ గడువు డిసెంబర్ 15తో ముగిసింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 25 మధ్యలో రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేయించుకునే కన్జ్యూమర్లకు రూ.2599 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద మైజియో, జియో.కామ్ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్ చేస్తోంది. తర్వాత రీఛార్జ్ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్‌లతో పాటు ఆన్లైన్ ఫ్యాషన్, ట్రావెల్ కొనుగోళ్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ ఓచర్ల స్టేటస్‌ను తెలుసుకోవడం కోసం జియో సబ్స్క్రైబర్లు మై జియో యాప్‌లోని మై ఓచర్స్ సెక్షన్లో చెక్ చేసుకోవచ్చు. -
4జీ ఫోన్లపై వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
ఎంపికచేసిన మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్ఫోన్లపై టెలికాం దిగ్గజం వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. మైక్రోమ్యాక్స్‌తో కొత్త భాగస్వామ్యం ఏర్పరుచుకుంటున్నట్టు గురువారం ప్రకటించిన వొడాఫోన్, ఈ మేరకు క్యాష్‌బ్యాక్ వివరాలను కూడా వెల్లడించింది. గురువారం ప్రకటించిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్, మైక్రోమ్యాక్స్ భారత్ 3, మైక్రోమ్యాక్స్ భారత్ 4, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 1 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వొడాఫోన్ కొత్త, పాత కస్టమర్లు పైన పేర్కొన్న ఆ నాలుగు స్మార్ట్ఫోన్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు 36 నెలల పాటు నెలకు కనీసం రూ.150 వరకు వొడాఫోన్ రీఛార్జ్‌లు చేయించుకోవాలి. ఇలా చేసిన కస్టమర్లకు తొలి 18 నెలలు ముగియగానే, రూ.900 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత 18 నెలలు ముగియగానే రూ.1300 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంటే మొత్తంగా రూ.2,200 వరకు క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందనున్నారు. సబ్‌స్క్రైబర్ వొడాఫోన్ ఎం-పెసా వాలెట్లో ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేయనున్నారు. గత నెలలో కూడా వొడాఫోన్, మైక్రోమ్యాక్స్లు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. అప్పుడు మైక్రోమ్యాక్స్ భారత్ 2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ రూ.999కే అందుబాటులోకి వచ్చింది. మోడల్ పేరు భారత్2 ప్లస్ భారత్ 3 భారత్ 4 కాన్వాస్ 1 18 నెలల అనంతరం క్యాష్‌బ్యాక్ రూ.900 రూ.900 రూ.900 రూ.900 36 నెలల అనంతరం క్యాష్‌బ్యాక్ రూ.1300 రూ.1300 రూ.1300 రూ.1300 మార్కెట్ ఆపరేటింగ్ ధర రూ.3749 రూ.4499 రూ.4999 రూ.5999 మొత్తం క్యాష్‌బ్యాక్ రూ.2200 రూ.2200 రూ.2200 రూ.2200 తుది ధర రూ.1549 రూ.2299 రూ.2799 రూ.3799 -
టెల్కోల 'క్యాష్'బ్యాక్..!
దేశీ టెలికం పరిశ్రమలో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఉన్న కస్టమర్లను కాపాడుకోవటమే కాక... కొత్త యూజర్లను ఆకర్షించాలి కనుక పోటీ మరింత పెరిగింది. అన్నింటికీ మించి ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యతా పడింది. అందుకే టెలికం సంస్థలు ఇపుడు వరుసపెట్టి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కంపెనీల 100 శాతం క్యాష్‌బ్యాక్..!! రిలయన్స్ జియో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ప్రైమ్ యూజర్లు రూ.399, ఆపై టారిఫ్‌ల రీచార్జ్‌లపై ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఇదే దార్లో ఎయిర్టెల్ కూడా ఇలాంటి ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. రూ.349 రీచార్జ్‌పై ఇది వర్తిస్తుంది. ఐడియా సైతం రూ.357తో రీచార్జ్ చేస్తే 100 శాతం క్యాష్‌బ్యాక్ అని ప్రకటించింది. కాకపోతే ఈ ఆఫర్లు అన్నిటికీ పరిమితులుంటాయి. మొత్తం క్యాష్‌బ్యాక్ వచ్చినా... దాన్ని యూజర్లు ఒకే సారి వినియోగించుకోలేరు. వరుసగా ఓ ఏడాదో, పదిసార్లో రీచార్జ్ చేస్తే ఆ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. అంటే... అప్పటిదాకా యూజర్లను తమ సర్వీసులకు కట్టుబడేలా చూసుకోవచ్చు. అదీ కథ. ఏఆర్‌పీయూలో 40 క్షీణత టెలికం కంపెనీలకు ఏఆర్‌పీయూనే కీలక కొలమానం. ఇందులో వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ సెప్టెంబర్‌లో 40 శాతం క్షీణత నమోదైంది. దీనికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా జియో ఎంట్రీతో ధరల పోటీ మొదలైంది. దీంతో బండిల్ వాయిస్, డేటా ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!! ‘టెలికం పరిశ్రమలోని తీవ్రమైన పోటీ నేపథ్యంలో టెల్కోలు కస్టమర్లను రక్షించుకునేందుకు తీవ్రంగానే కష్టపడుతున్నాయి. అందుకే పలు ప్లాన్లను ఆవిష్కరిస్తున్నాయి. క్యాష్‌బ్యాక్ అనేది వాటిల్లో ఒక రకం’ అని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. కాగా టెలికం సంస్థలు ప్రస్తుతం రూ.340–రూ.380 ధరల శ్రేణిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయని కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ రీసెర్చ్ అనలిస్ట్ సత్యజిత్ సిన్హా చెప్పారు. ‘‘ఇది వరకు టెల్కోలు వేర్వేరు ధరల శ్రేణిలో వివిధ ఆఫర్లను ప్రకటించేవి. ఇవి తక్కువ ధరల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఆపరేటర్లు రూ.340–రూ.380 ధరల శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నారు’’ అని ఆయన వివరించారు. దీంతో ఏఆర్పీయూ అనేది పెరిగితే పెరుగుతుంది, లేకపోతే స్థిరంగా ఉంటుంది, అంతేకానీ తగ్గదని తెలిపారు. ఏడాది కిందట టెల్కోలు రూ.250–260 ధరల శ్రేణిపై దృష్టి కేంద్రీకరించాయన్నారు. టారిఫ్‌లు పెరుగుతాయ్!! క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కొన్నాళ్లే పనిచేస్తాయని ఐఐఎఫ్ఎల్ మార్కెట్స్, కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ చెప్పారు. వీటి ద్వారా పరమిత కాలమే యూజర్లను ఆకర్షించొచ్చన్నారు. ఆఫర్లతో స్వల్పకాలంలో ఏఆర్‌పీయూలో పెరుగుదల ఉండొచ్చన్నారు. పరిశ్రమలో వచ్చే 6–9 నెలల్లో స్థిరీకరణ పూర్తవుతుందని అంచనా వేశారు. ‘‘అప్పుడు మూడు కంపెనీలే ఉంటాయి. ఆ తర్వాత నుంచి టారిఫ్‌లు క్రమంగా పెరుగుతాయి. ఎందుకంటే జియో ఎంట్రీతో ఐడియా, వొడాఫోన్ విలీనమౌతున్నాయి. భారతీ ఎయిర్టెల్.. టాటా టెలీసర్వీసెస్ వైర్లెస్ బిజినెస్‌ను సొంతం చేసుకుంటోంది. ఇది టెలినార్ ఇండియాను కొనేసింది. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన 2జీ, 3జీ వాయిస్ బిజినెస్‌ను మూసేసింది. ఎయిర్‌సెల్ తన కార్యకలాపాలను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది’ అని వివరించారు. -
అపరిమిత కాలింగ్ ప్లాన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్
ఎయిర్‌సెల్ తన అపరిమిత కాలింగ్ ప్లాన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్ పే బ్యాలెన్స్ వాడి పేమెంట్లను జరిపిన వారికి ఈ క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు తెలిపింది. అమెజాన్.ఇన్, పే బ్యాలెన్స్ ద్వారా కొనుగోలు చేసిన ఎంపికచేసిన ఎయిర్‌సెల్ రీఛార్జ్‌లకు మాత్రమే ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రూ.75 మేర క్యాష్‌బ్యాక్ అందించనున్నట్టు పేర్కొంది. అదనంగా రూ.146 ప్లాన్‌ను ఎయిర్‌సెల్ లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్ కింద 28 రోజుల పాటు 5జీబీ 3జీ, 2జీ డేటాను, అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఎయిర్‌సెల్ మొబైల్ యాప్, అమెజాన్ ద్వారా తాము బెస్ట్ రీఛార్జ్‌లను ఆఫర్ చేయనున్నామని ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ చెప్పారు. ఎయిర్‌సెల్ యాప్, అమెజాన్ పేపై ఈ విలువ ఆధారిత ఆఫర్లతో వినియోగదారులను ఆహ్లాదపరచడం మాత్రమే కాకుండా, తమ ఫోన్లలో లభించే డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని స్వీకరించి, ఆ స్థాయిలను పెంచాలని నిశ్చయించుకున్నారు. ఎయిర్‌సెల్‌తో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అమెజాన్ పేమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ జగనాథన్ చెప్పారు. కాగ, ఎయిర్‌సెల్‌కు, ఇతర టెల్కోలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి షాకిస్తూ తాజాగా త్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.399, ఆపై మొత్తాలపై రూ.2,599 విలువైన ప్రయోజనాలు తమ ప్రైమ్ యూజర్లకు అందించనున్నట్టు పేర్కొంది. -
రిలయన్స్ జియో 'ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్'
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ జియోకు కౌంటర్‌గా టెల్కోలు తీసుకొస్తున్న ప్లాన్లకు షాకిస్తూ.. ముఖేష్ అంబానీ కంపెనీ మరో బంపర్ ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది. దివాళి సందర్భంగా ఆఫర్ చేసిన క్యాష్‌బ్యాక్‌ను మరోసారి తన ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ప్రవేశపెట్టింది. ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. రూ.399, ఆపై మొత్తాల రీఛార్జ్‌లకు రూ.2599 విలువైన ప్రయోజనాలను ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ కింద అందించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. దివాళి సందర్భంగా కేవలం రూ.399 రీఛార్జ్ ప్యాక్‌పై మాత్రమే అందుబాటులో ఉన్న క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను, ప్రస్తుతం రూ.399, ఆపై మొత్తాలన్నింటికీ ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. నవంబర్ 10 నుంచి ఈ ఆఫర్ నవంబర్ 25 వరకు అందుబాటులోకి రానుంది. అంతేకాక అదనంగా జియో పార్టనర్ వాలెట్లు అమెజాన్‌పే, యాక్సిస్‌పే, ఫ్రీఛార్జ్, మొబిక్విక్, పేటీఎం, ఫోన్‌పే నుంచి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ప్రతి రీఛార్జ్‌పై ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ కింద రూ.300 వరకు అందించనున్నట్టు తెలిపింది. జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్... ఈ ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లో మైజియో, జియో.కామ్ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను జియో అందించనుంది. రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్ చేయనుంది. తర్వాత రీఛార్జ్ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. డిజిటల్ వాలెట్ల నుంచి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్‌లు అందనున్నాయి. ఉదాహరణకు మీరు జియో నెట్వర్క్ వాడుతున్న కొత్త యూజర్ అయినట్టు అయితే, అమెజాన్ పే వాడి రూ.459తో రీఛార్జ్ చేసుకుంటే, రూ.400 విలువైన వోచర్లు, పే బ్యాలెన్స్ కింద రూ.99 క్యాష్‌బ్యాక్ మొత్తం రూ.499 అందనుంది. అదేవిధంగా భాగస్వామ్య ఆపరేటర్ల ద్వారా కూడా జియో తన కొత్త కస్టమర్లకు ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. ఇప్పటికే వాడుతున్న జియో కస్టమర్ల కంటే కూడా కొత్త కస్టమర్లకే ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భాగస్వామ్య వాలెట్ కొత్త యూజర్లకు క్యాష్‌బ్యాక్ పాత యూజర్లకు క్యాష్‌బ్యాక్ మొబిక్విక్ రూ.300(కోడ్-న్యూజియో) రూ.149(కోడ్-జియో149) యాక్సిస్ పే రూ.100 రూ.35 అమెజాన్ పే రూ.99 రూ.20 ఫోన్‌పే రూ.75 రూ.30 పేటీఎం రూ.50(కోడ్-న్యూజియో) రూ.15(కోడ్-పేటీఎంజియో) ఫ్రీఛార్జ్ రూ.50(కోడ్-జియో50) నిల్ పైన పేర్కొన్న క్యాష్‌బ్యాక్‌లు మాత్రమే కాక, రూ.2599 విలువైన ఇతర ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. ట్రావెల్ సైట్లకు, ఫ్యాషన్‌కు కూడా వోచర్లను అందిస్తోంది. ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. -
ఐ ఫోన్ ఎక్స్:ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఆపిల్10వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్లోకి వచ్చిన ఆపిల్ అత్యంత ఖరీదైన ఫోన్ ఐఫోన్ ఎక్స్‌పై ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 3నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నఆపిల్ ఐఫోన్ ఎక్స్ పై ఎయిర్ టెల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా రూ. 10వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ ఆఫర్ లభించనుంది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలనుంచి శనివారంఉదయం 7. గంటల వరకు ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్వినియోగదారులకు ఈ ఆఫర్అందుబాటులోఉంటుందని భారతి ఎయిర్టెల్ సీఎంఓ రాజ్ పూడిపెద్ది ప్రకటించారు. నవంబర్ 3 సాయంత్రం 6గంటలనుంచి కొత్తగా ప్రారంభించిన ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో ఐఫోన్ ఎక్స్ ఫోన్లను ఎయిర్టెల్ విక్రయించనుంది. ముఖ్యంగా సిటీ బ్యాంక్ క్రెడిట్‌కార్డు ద్వారా కొనుగోలుచేసే ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.10వేల క్యాష బ్యాక్ పొందొచ్చునని ఎయిర్టెల్ ప్రకటించింది. నవంబరు 3వ తేదీ సా. 6గంటలనుంచి మరునాడు ఉదయం 7గంటలవరకు మాత్రమే ఈ సౌలభ్యమని తెలిపింది. పూర్తిగా నగదు చెల్లించిన(నో ఈఎంఐ ఆప్షన్ ) పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల్లో ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ కింద ఈ ఆఫర్ అందుబాటులోఉంటుందని పేర్కొంది. అయితే ప్రీ ఆర్డర్ కోసం ప్రముఖ ఈ కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోఉన్నప్పటికీ.. ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో ఐఫోన్ఎక్స్ ఇంకా లిస్ట్ అయినట్టు చూపించడం లేదు. కాగాఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ సేవలు ప్రస్తుతం భారతదేశంలోని 21 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆపిల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ నవంబరు 3నుంచి గ్లోబల్ మార్కెట్లలోకి విక్రయానికి రానున్న సంగతి తెలిసిందే. -
వార్ కంటిన్యూ: ఎయిర్టెల్ 100 శాతం క్యాష్‌బ్యాక్
టెలికాం మార్కెట్లో టారిఫ్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. జియోకు ఫెస్టివల్ సీజన్లో రూ.399 ప్లాన్‌పై ప్రకటించిన 100 శాతం క్యాష్‌బ్యాక్ మాదిరి, టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ కూడా అచ్చం అదే ఆఫర్‌ను తీసుకొచ్చింది. తన ప్రీపెయిడ్ యూజర్లకు ఎయిర్టెల్ రూ.349 ప్లాన్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఇది కూడా పరిమిత కాల వ్యవధిలోనే ఆఫర్ చేస్తోంది. ఇది కేవలం పరిమిత కాల ఆఫర్ అని, ఎప్పుడైనా ఇది ముగియవచ్చని కంపెనీ పేర్కొంది. కానీ ఈ ఆఫర్ తుది గడువు ఎప్పుడో వెల్లడించలేదు. కంపెనీ డైరెక్ట్‌గా కాక, వాయిదాల పద్ధతిలో ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని అందిస్తోంది. ఎయిర్టెల్ కస్టమర్లు తొలుత రూ.349తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. తరువాత 7 వాయిదాల్లో మొత్తం రీఫండ్ చేస్తోంది. అంటే రూ.349ను ఏడు నెలల్లో వెనక్కి ఇచ్చేస్తుందన్నమాట. ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నవారు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, మై ఎయిర్టెల్ యాప్ ద్వారా రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. రూ.349 ప్లాన్ కింద ఎయిర్టెల్ 28జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది. అంతేకాక ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు. రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు. -
ఐఫోన్ 8, 8 ప్లస్‌పై పేటీఎం భారీ క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ : ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు కొన్ని రోజుల క్రితమే భారత మార్కెట్లోకి లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29 నుంచి ఇవి విక్రయానికి వచ్చాయి. లాంచ్ అయిన వెంటనే ఈ స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పలు ఆఫర్లను తీసుకొచ్చాయి. తాజాగా పేటీఎం కూడా ఈ కొత్త ఐఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలుచేసిన కస్టమర్లకు 15 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఐఫోన్ 8, 8 ప్లస్ ఏది కొనుగోలు చేసినా తొలుత ఫ్లాట్ రూ.9,000 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. యస్ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికైతే అదనంగా మరో రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ఆఫర్ చేయనుంది. ఈ ఆఫర్ కేవలం పేటీఎం వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిన్నటి నుంచి వాలిడ్‌లో ఉన్న ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రేపటి(అక్టోబర్ 12) వరకు ఉండనుంది. క్యాష్ బ్యాక్‌లో తొలుత రూ.9000ను కొనుగోలు చేసిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. అనంతరం నవంబర్ 20 లేదా అంతకంటే ముందు వరకు మిగిలిన రూ.6,000 క్యాష్ బ్యాక్ రీఫండ్ అవనుంది. పేటీఎంలో రూ.61,700గా లిస్టు అయిన ఐఫోన్ 8 64జీబీ వేరియంట్ ధర రూ.9000 క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.52,700గా ఉంది. అదేవిధంగా 64జీబీ వేరియంట్ ఐఫోన్ 8 ప్లస్ ధర రూ.9000 క్యాష్‌బ్యాక్ అనంతరం 61,195 రూపాయలు. 256జీబీ వేరియంట్ ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.65,870గా, రూ.76,749గా ఉన్నాయి. ఒకవేళ యూజర్లు యస్ బ్యాంక్ యూజర్లు అయితే ఆ ధరలపై మరో 6,000 రూపాయలు తగ్గుతాయి. -
బీఎస్ఎన్ఎల్ దసరా ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ దసరా కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాయిస్ రీఛార్జ్‌లపై 50 శాతం క్యాష్‌బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. దసరా విజయ్ ఆఫర్ కింద ఈ క్యాష్‌బ్యాక్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ప్రమోషనల్ ఆఫర్‌తో పాటు ఈ క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ఆఫర్ చేయనుంది. అంతేకాక తన మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా రీఛార్జ్‌లు చేపించుకుంటే ఫుల్ టాక్ టైమ్ ఆఫర్లను పరిమిత కాల వ్యవధిలో అందించనున్నట్టు కూడా తెలిపింది. ఈ రెండు ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్25 నుంచి ఇవి లైవ్‌గా అందించనున్నారు. బీఎస్ఎన్ఎల్ తాజా ఆఫర్ కింద, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 25 మధ్య రీఛార్జ్ ప్యాక్‌లను కొనుగోలు చేసే కస్టమర్లు, రీఛార్జ్ విలువలపై 50 శాతం క్యాష్‌బ్యాక్ పొందనున్నారు. రూ.42, రూ.44, రూ.65, రూ.69, రూ.88, రూ.122 టాక్ టైమ్ రీఛార్జ్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫుల్ టాక్ టైమ్ ఆఫర్ కేవలం రూ.30 రీఛార్జ్పైనే ఉండనుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 2తో ముగియనుంది. పండుగ సీజన్లో అదనపు ప్రయోజనాలతో తాము మీ ముందుకు వస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్కే మిట్టల్ చెప్పారు. తమ ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు చాలా ఎఫ్‌టీటీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్టు కూడా పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో లాంచ్ చేసిన ప్రమోషనల్ ఆఫర్ కింద ఆన్-నెట్ కాల్స్ టారిఫ్‌ను నిమిషానికి 15 పైసలకు తగ్గించింది. ఆఫ్-నెట్ కాల్స్‌ను నిమిషానికి 35పైసలకు కుదించింది. 8 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌పై 30 రోజుల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్యాన్ ఇండియా బేసిస్‌లో 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ సర్వీసులను లాంచ్ చేసేందుకు కూడా బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తోంది. -
లెక్కల గారడీలతో జాగ్రత్త..
అప్ టు 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ చూసి ఆన్లైన్ పోర్టల్‌లో టికెట్లు బుక్ చేసుకున్నాడు వినయ్. ఎలాగూ.. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది కదా అని ఈ సారి స్లీపర్ క్లాస్ బస్‌లో టికెట్లు బుక్ చేశాడు. రూ. 3,000 పెట్టి విశాఖపట్నానికి రెండు టికెట్లు తీసుకున్నాడు. ఆఫర్ కింద తిరిగి రూ. 1,500 వెనక్కి వస్తాయి కదా.. ఒక టికెట్ మీద ఇద్దరు ప్రయాణం చేస్తున్నాం అని సంతోషంలో బుక్ చేశాడు. కానీ తీరా అకౌంట్లోకి చూస్తే క్యాష్ బ్యాక్ కింద రూ. 200 మాత్రమే వెనక్కి రావడంతో లబోదిబోమంటూ కంపెనీకి ఫోన్ చేశాడు. కాల్‌సెంటర్ వాళ్ల సమాధానం విన్న వినయ్ గుడ్లు వెళ్లబెట్టాడు. ఈ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 200 మాత్రమే వెనక్కి ఇస్తారంట. మరి 50% క్యాష్ బ్యాక్ అన్న ప్రకటన సంగతి ఏంటి అని రెట్టించి అడిగితే.... రూ. 400 టికెట్ తీసుకున్న వాళ్లకి 50% వస్తుందని, ఆ పైన మొత్తం పెరిగే కొద్ది ఈ శాతం తగ్గుతూ వస్తుందని సెలవిచ్చారు. వినియోగదారులను ఆకర్షించడానికి సంస్థలు అనుసరిస్తున్న లెక్కల గిమ్మిక్కులు ఇవి. ఇప్పుడు ఈ ఆఫర్ల సంస్కృతి ఫైనాన్షియల్ ప్రోడక్టులకు కూడా వ్యాపించింది. పెట్టుబడి, రుణ పథకాలపై విధ కంపెనీలు అనుసరిస్తున్న గిమ్మిక్కు ప్రచారాలపై అవగాహన కల్పించేదే ఈ కథనం. అధిక రాబడి, సున్నా శాతానికే రుణాలు వంటి ప్రకటనలు మనకు తరుచూ కనిపిస్తూనే ఉంటాయి. తీరా వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఇవి భిన్నంగా ఉంటాయి. పైకి కనపడని ఎన్నో చార్జీలు, షరతులు వాస్తవ రాబడిని తగ్గించేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రచారంలో ఉన్న వివిధ మార్కెటింగ్ ప్రచార పథకాలు, వీటిల్లో ఉండే జిమ్మిక్కులను ఇప్పుడు పరిశీలిద్దాం.. రుసుములు లేకుండా క్రెడిట్ కార్డు ఈ మెయిల్ ఓపెన్ చేయగానే లేక తరుచు మొబైల్స్‌కు ఇటువంటి మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. వీటికి ఆశపడి వెంటనే దరఖాస్తు చేసుకోవద్దు. అసలు ఎటువంటి రుసుములు లేకుండా జీరో కాస్ట్‌కే కార్డును ఎందుకిస్తున్నాయన్న విషయం పరిశీలించండి. ఇది తెలియాలంటే ముందు జీరో కాస్ట్ వర్తించాలంటే కంపెనీ పెట్టిన నియమ నిబంధనలను తప్పక చూడాలి. సాధారణంగా ఈ ఆఫర్ కింద కార్డులు ఇస్తున్నప్పుడు మొదటి ఏడాదికి ఎటువంటి రుసుములు వసూలు చేయవు. అలా కాకుండా జీవితాంతం ఎటువంటి రుసుములు వసూలు చేయము అని చెపితే దానికి తప్పకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రతీ ఏడాది నిర్ధిష్ట మొత్తం కొన్నప్పుడు మాత్రమే వార్షిక రుసుములు రద్దు చేస్తారు. ఉదాహరణకు ఏటా కనీసం రూ. 30,000 కార్డుపై లావాదేవీలు చేస్తే వార్షిక రుసుములు రద్దు వంటి నిబంధనలుంటాయి. 9 శాతానికే పర్సనల్ లోన్స్ తొమ్మిది శాతం సింపుల్ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలు.. ఇదే ఆఖరి అవకాశం.. పర్సనల్ లోన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. వంటి ఈ మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటును 13 నుంచి 18 శాతం దాకా వసూలు చేస్తున్నాయి. అంతకంటే తక్కువ వడ్డీరేటుకి అందులో సింపుల్ వడ్డీరేటుకే ఇస్తున్నారంటే ఎవరైనా ఎందుకు కాదంటారు. కానీ ఇక్కడ వడ్డీరేటును ఏ విధంగా లెక్కిస్తున్నారన్న విషయాన్ని గమనించాలి. సాధారణంగా రుణాలపై వడ్డీరేట్లను ప్రతీ నెలా కట్టేయగా మిగిలిన మొత్తంపై లెక్కించి ఈఎంఐని నిర్దేశిస్తారు. కానీ ఇలా తక్కువ వడ్డీరేటుకు ఆఫర్ చేసే రుణాల్లో రుణం మొత్తంపైన లెక్కిస్తారు. ఈ లెక్కన చూస్తే చివరకు ఇది ఏ 16 శాతానికో తేలుతుంది. ఇలా తక్కువ వడ్డీరేటును చూపించడం ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. 10 శాతం బోనస్ బీమా కంపెనీలు అధిక బోనస్‌లు ఇస్తున్నట్లు ప్రకటిస్తుంటాయి. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఆ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. బీమా కంపెనీలు బోనస్‌లను షమ్ అష్యూర్డ్ (తీసుకున్న బీమా రక్షణ మొత్తం)పై ప్రకటిస్తాయి. కానీ కొన్ని ఎండోమెంట్ పాలసీల్లో కట్టే ప్రీమియం షమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు కట్టిన ప్రీమియాన్ని లెక్కలోకి తీసుకుంటే సగటున 6 శాతం గిట్టుబాటు అవుతుంది. నెలకు రూ.5,000తో 20 ఏళ్లలో కోటిన్నర.. ఎలా! ఇటువంటి ఆఫర్లు మనం ఎక్కువగా బీమా కంపెనీల్లో చూస్తుంటాం. చూడగానే ఇన్వెస్ట్ చేసేయాలన్నట్టుగా ఉంటాయివి. సామాన్యుడు ఊహించలేని కోటిన్నర రూపాయల నిధిని ప్రతీ నెలా చిన్న మొత్తంతో సమకూర్చుకోవచ్చన్నదే ఈ ఆకర్షణకు ప్రధాన కారణం. ఇలాంటి ఆఫర్లలో వాళ్లు చెపుతున్న గణాంకాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూడాలి. సాధారణంగా అధిక రాబడి రేటుతో ఈ భారీ మొత్తాలను చూపిస్తారు. ఇందులో వార్షిక వ్యయాలు వంటి ఇతర చార్జీలను చూపించరు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ రాబడి ఇంతకంటే తక్కువగా ఉంటుంది. అంతేకాదు కనిష్ట రాబడి రేటుకు ఎంత మొత్తం వస్తుందన్న విషయం కూడా అడిగి తెలుసుకోండి. గుర్తుంచుకోండి.. వ్యాపారంలో ఏదీ కూడా ఉచితంగా ఇవ్వరన్న విషయం మర్చిపోవద్దు ఏదైనా కొనేటప్పుడు లేదా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నియమ నిబంధనలు క్షుణ్నంగా చదవండి అంకెలను చూసి మురిసిపోకుండా, వాస్తవ రాబడులను గణించి సరిచూసుకోండి