
రిలయన్స్ జియో మరోసారి తన త్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ గడువును పొడిగించింది. ఈ ఆఫర్ గడువును మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ.. కొత్త డెడ్‌లైన్‌గా డిసెంబర్ 25గా నిర్ణయించింది. అప్పటి వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. అంతకముందు కంపెనీ ప్రకటించిన ఈ త్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ గడువు డిసెంబర్ 15తో ముగిసింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 25 మధ్యలో రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేయించుకునే కన్జ్యూమర్లకు రూ.2599 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి.
జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద మైజియో, జియో.కామ్ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్ చేస్తోంది. తర్వాత రీఛార్జ్ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్‌లతో పాటు ఆన్‌లైన్ ఫ్యాషన్, ట్రావెల్ కొనుగోళ్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ ఓచర్ల స్టేటస్‌ను తెలుసుకోవడం కోసం జియో సబ్‌స్క్రైబర్లు మై జియో యాప్‌లోని మై ఓచర్స్ సెక్షన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment