రిలయన్స్‌ జియో 'ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌' | Jio Offer to Provide Benefits of Up to Rs. 2,599 on Recharges of Rs. 399 and Above   | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియో 'ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌'

Published Thu, Nov 9 2017 4:32 PM | Last Updated on Thu, Nov 9 2017 4:39 PM

Jio Offer to Provide Benefits of Up to Rs. 2,599 on Recharges of Rs. 399 and Above   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియోకు కౌంటర్‌గా టెల్కోలు తీసుకొస్తున్న ప్లాన్లకు షాకిస్తూ.. ముఖేష్‌ అంబానీ కంపెనీ మరో బంపర్‌ ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది. దివాళి సందర్భంగా ఆఫర్‌ చేసిన క్యాష్‌బ్యాక్‌ను మరోసారి తన ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లకు ప్రవేశపెట్టింది. ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ పేరుతో వీటిని తీసుకొచ్చింది. రూ.399, ఆపై మొత్తాల రీఛార్జ్‌లకు రూ.2599 విలువైన ప్రయోజనాలను ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ కింద అందించనున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. దివాళి సందర్భంగా కేవలం రూ.399 రీఛార్జ్‌ ప్యాక్‌పై మాత్రమే అందుబాటులో ఉన్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను, ప్రస్తుతం రూ.399, ఆపై మొత్తాలన్నింటికీ ఆఫర్‌ చేయనున్నట్టు తెలిసింది. నవంబర్‌ 10 నుంచి ఈ ఆఫర్‌ నవంబర్‌ 25 వరకు అందుబాటులోకి రానుంది. అంతేకాక అదనంగా జియో పార్టనర్‌ వాలెట్లు అమెజాన్‌పే, యాక్సిస్‌పే, ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, ఫోన్‌పే నుంచి రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు ప్రతి రీఛార్జ్‌పై ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ కింద రూ.300 వరకు అందించనున్నట్టు తెలిపింది.

జియో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌...
ఈ ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌లో మైజియో, జియో.కామ్‌ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను జియో అందించనుంది. రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్‌ చేయనుంది. తర్వాత రీఛార్జ్‌ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. డిజిటల్‌ వాలెట్ల నుంచి రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్‌లు అందనున్నాయి.


ఉదాహరణకు మీరు జియో నెట్‌వర్క్‌ వాడుతున్న కొత్త యూజర్‌ అయినట్టు అయితే, అమెజాన్‌ పే వాడి రూ.459తో రీఛార్జ్‌ చేసుకుంటే, రూ.400 విలువైన వోచర్లు, పే బ్యాలెన్స్‌ కింద రూ.99 క్యాష్‌బ్యాక్‌ మొత్తం రూ.499 అందనుంది. అదేవిధంగా భాగస్వామ్య ఆపరేటర్ల ద్వారా కూడా జియో తన కొత్త కస్టమర్లకు ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. ఇప్పటికే వాడుతున్న జియో కస్టమర్ల కంటే కూడా కొత్త కస్టమర్లకే ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

భాగస్వామ్య వాలెట్‌                                            కొత్త యూజర్లకు క్యాష్‌బ్యాక్‌                  పాత యూజర్లకు క్యాష్‌బ్యాక్‌
మొబిక్విక్‌                                                        రూ.300(కోడ్‌-న్యూజియో)                     రూ.149(కోడ్‌-జియో149)
యాక్సిస్‌ పే                                                      రూ.100                                           రూ.35
అమెజాన్‌ పే                                                      రూ.99                                            రూ.20
ఫోన్‌పే                                                             రూ.75                                            రూ.30
పేటీఎం                                                            రూ.50(కోడ్‌-న్యూజియో)                      రూ.15(కోడ్‌-పేటీఎంజియో)
ఫ్రీఛార్జ్‌                                                             రూ.50(కోడ్‌-జియో50)                                నిల్‌
పైన పేర్కొన్న క్యాష్‌బ్యాక్‌లు మాత్రమే కాక, రూ.2599 విలువైన ఇతర ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. ట్రావెల్ సైట్లకు, ఫ్యాషన్‌కు కూడా వోచర్లను అందిస్తోంది. ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కేవలం జియో ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement