
రిలయన్స్ జియో (Reliance Jio) తన రెండు ప్రముఖ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లకు (recharge plans) సంబంధించి మార్పులు చేసింది. రూ. 69 ప్లాన్, రూ. 139 ప్యాక్‌ల వ్యాలిడిటీని సవరించింది. ఈ ప్లాన్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీని ప్రవేశపెట్టింది. అలాగే కొద్ది రోజుల క్రితం రూ. 448 ప్లాన్‌ను కూడా జియో అప్‌డేట్ చేసింది. రూ. 189 ప్యాక్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.
గతంలో రూ.69, రూ.139 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీ ఉండేది కాదు. యూజర్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీనే వీటికీ వర్తించేది. అంటే యూజర్ ఖాతాలో యాక్టివ్ బేస్ రీఛార్జ్ ఉన్నంత కాలం ఉంటాయి. ఉదాహరణకు, బేస్ ప్యాక్‌కు 30 రోజులు వ్యాలిడిటీ ఉంటే, యాడ్-ఆన్ అదే కాలానికి యాక్టివ్‌గా ఉండేది.
కొత్త సవరణ ప్రకారం, రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇప్పుడు కేవలం 7 రోజుల స్టాండ్‌ఎలోన్ వాలిడిటీతో వస్తాయి. అంటే బేస్ ప్యాక్‌తో ముడిపడి ఉన్న మునుపటి దీర్ఘకాల వ్యాలిడిటీకి భిన్నంగా, ఈ ప్లాన్‌ల కింద అందించిన డేటాను వినియోగించుకోవడానికి వినియోగదారులకు ఒక వారం మాత్రమే సమయం ఉంటుంది.
ఇక డేటా ప్రయోజనాల విషయానికొస్తే, రూ.69 ప్లాన్ 6జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అదే రూ.139 ప్లాన్ 12జీబీ డేటా అందిస్తుంది. కేటాయించిన డేటా వినియోగించిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకి పడిపోతుంది. ఇవి డేటా-ఓన్లీ ప్లాన్‌లు అని గమనించడం ముఖ్యం. అంటే అవి వాయిస్ కాల్స్ లేదా ఎస్‌ఎంసెస్ వంటి ప్రయోజనాలు ఉండవు. అంతేకాకుండా యూజర్ నంబర్‌లో యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే ఈ యాడ్-ఆన్‌లు పనిచేస్తాయి.
మళ్లీ రూ.189 ప్లాన్
యాడ్ ఆన్ ప్యాక్‌లలో సవరణలతో పాటు, రిలయన్స్ జియో తన రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది. దీనిని కొంతకాలం తొలగించగా ఇటీవల మళ్లీ 'అఫర్డబుల్ ప్యాక్‌లు' విభాగం కింద చేర్చింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తంగా 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు జియోటీవీ, జియోసినిమా (ప్రీమియం కంటెంట్ మినహా), జియోక్లౌడ్ స్టోరేజ్ వంటి జియో సేవలను కూడా పొందగలరు.
రూ.448 ప్లాన్ ధర తగ్గింపు
జియో తన రూ.448 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.445కి తగ్గించింది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అదనంగా సబ్‌స్క్రైబర్‌లు జీ5, జియో సినిమా ప్రీమియం, సోనీ లివ్, లయన్‌స్టేజ్ ప్లే, వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment