
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, జియోఫైబర్ ప్లాన్‌లను జియో హాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్‌తో అప్‌డేట్ చేసింది. వీటిలో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక కొత్త ప్లాన్‌ను తీసుకురాగా, డిస్నీ+ హాట్‌స్టార్‌కు బదులుగా జియోహాట్‌స్టార్‌ను చేర్చడానికి మరికొన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ జియోఫైబర్ ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది.
జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో తన రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అప్‌డేట్ చేసింది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, అపరిమిత 5G డేటా, రోజుకు 2GB 4G డేటాతో వస్తుంది. అదనంగా, ఇది జియో టీవీ, జియోక్లౌడ్‌తో పాటు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇందులో చేర్చిన జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 'మొబైల్' ప్లాన్ అని గమనించడం ముఖ్యం.
జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియోఫైబర్ ప్లాన్‌లు
జియోఫైబర్ రూ.999 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 150 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందుతారు. అలాగే ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.
జియోఫైబర్ రూ.1,499 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 300 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను అందుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.
జియోఫైబర్ రూ.2,499 ప్లాన్: అపరిమిత డేటా , వాయిస్ కాలింగ్‌తో 500 Mbps వేగాన్ని అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను ఆనందించవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.
రూ.3999, రూ.8499 ప్లాన్లు: అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 1 Gbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందుతారు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.
జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు
జియో ఎయిర్ ఫైబర్ రూ.599 ప్లాన్: 1000GB డేటా, 30Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్ స్టార్ తో సహా మొత్తం 9 ఓటీటీలను అందిస్తుంది.
జియో రూ.899, రూ.1199 ప్లాన్లు: 1000GB డేటా, 100Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్‌తో సహా మొత్తం 13 ఓటీటీలను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment