JioFiber
-
ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్ల కోసం ప్రైమ్ మెంబర్ షిప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్ షిప్‌తో పలు సేవలను ఉచితంగా పొందవచ్చును. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, వేగవంతమైన డెలివరీ సేవలను అమెజాన్ అందిస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ కోసం సంవత్సరానికి రూ.999 అమెజాన్ వసూలు చేస్తోంది. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌కు ఎలాంటి డబ్బులను చెల్లించకుండా సేవలను ఉచితంగా పొందవచ్చును. అది ఎలా అంటే.. మీరు కచ్చితంగా ఎయిర్టెల్ లేదా జియో ఫైబర్ కల్గిఉన్న వినియోగదారుడై ఉండాలి. ఎయిర్టెల్ తన కస్టమర్లకు పలు రీఛార్జ్‌లపై అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌ను నెల రోజులపాటు ఉచితంగా అందిస్తోంది. ఎయిర్టెల్ వినియోగదారులు రూ .349, రూ. 299 రిచార్జ్ చేస్తే 30 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చును. ఎయిర్‌టెల్‌తో పాటుగా జియో ఫైబర్ కూడా ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. జియోఫైబర్‌కు సంబంధించిన 999,1499, 2499,3999,8499 ప్లాన్లతో రీచార్జ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చును. -
జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్
జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. భారత్ లో అత్యంత ప్రజాదరణ గల డిస్కవరీ ప్లస్ కంటెంట్‌ను జియో తన ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ భాగస్వామ్యం ద్వారా డిస్కవరీ ప్లస్ సైన్స్, అడ్వెంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ యానిమేషన్ వంటి కంటెంట్‌ను జియోఫైబర్ వినియోగదారులు ఉచితంగా ఆస్వాదించవచ్చు. డిస్కవరీ ప్లస్ ప్లాట్‌ఫాం ప్రేక్షకుల కోసం నాన్-ఫిక్షన్ కంటెంట్‌ను హోస్ట్ చేస్తుంది. ఈ స్ట్రీమింగ్ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీతో సహా పలు భాషలలో కంటెంట్ అందిస్తుంది. కొత్త, ఇప్పటికే జియో ఫైబర్ వినియోగదారులు రూ.999తో పాటు దాని పై ప్లాన్ ఎంచుకుంటే మాత్రమే ఈ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. ఈ కొత్త భాగస్వామ్యం వల్ల జియోఫైబర్ కస్టమర్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఇంటూ ది వైల్డ్ సిరీస్‌తో సహా ఇతర డిస్కవరీ నెట్వర్క్ ప్రీమియం షోలు యాక్సెస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్, గోల్డ్ రష్, ఎక్స్‌పెడిషన్ అన్ నౌన్, 90 డే ఫైనాన్స్, హౌ ది యూనివర్స్ వర్క్స్ వంటి ప్రత్యేకమైన కంటెంట్ చూడవచ్చు. వీటితో పాటు జియోఫైబర్ వినియోగదారులు వందే భారత్ ఫ్లైట్ IX1344: హోప్ టు సర్వైవల్, సీక్రెట్స్ ఆఫ్ సినౌలి, మిషన్ ఫ్రంట్‌లైన్, సూపర్ సోల్, లడఖ్ వారియర్ తదితర సిరీస్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే జియో 14 సంస్థలకు చెందిన ఓటిటీ కంటెంట్ ను ఉచితంగా అందిస్తుంది. ఇప్పడు ఆ జాబితాలో డిస్కవరీ ప్లస్ వచ్చి చేరింది. చదవండి: ఈ బ్యాంకు పాస్‌బుక్, చెక్‌బుక్‌లు ఏప్రిల్ 1 నుంచి చెల్లవు -
నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్
ముంబై, సాక్షి: నెలకు రూ. 500 లోపు ఖర్చులో నెట్ కనెక్షన్ తీసుకుందామనుకునే వినియోగదారులకు శుభవార్త. పలు కంపెనీలు రూ. 500లోపు అద్దెలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జాబితాలో ఎయిర్టెల్, రిలయన్స్ జియోతోపాటు.. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎగ్జైటెల్ చేరాయి. పలు ఆఫర్లు రూ. 399తోనే ప్రారంభంకానున్నాయి. చదవండి: (బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు) పలు ఆఫర్లు ఈ ఏడాది(2020) టెలికం కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించి పలు ఆఫర్లు ప్రకటించాయి. పీఎస్‌యూ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రమోషనల్ సమయంలో డేటా పెంచడం వంటి ఆఫర్లు ప్రకటించగా.. జియో ఫైబర్ రూ. 399 నుంచి ప్రారంభమయ్యే సర్వీసులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని సమకూర్చింది. ఇక ఎగ్జైటెల్ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో డేటా పరిమితిలేని ప్యాకేజీలు ప్రకటించింది. నెలకు రూ. 500లోపు చెల్లించే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల వివరాలివి.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్: నెలకు రూ. 499 ధరలో అన్లిమిటెడ్ బ్రాండ్‌బ్యాండ్ ప్లాన్ ఇది. 40 ఎంబీపీఎస్ స్పీడ్వరకూ లభించే ఈ ప్లాన్‌లో భాగంగా పరిమితిలేని ఇంటర్నెట్ను అందిస్తోంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్కు సబ్స్క్రిన్సన్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ తదితర సౌకర్యాలు సైతం లభిస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా వూట్ బేసిక్, ఈరోస్ నౌ, హాంగామా ప్లే, షెమారూ ఎం, అల్ట్రాను పొందవచ్చు. చదవండి: (హీరో ఈసైకిల్@ 49,000) బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్: 100 జీబీ సీయూఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ. 499 ధరలో అందిస్తోంది. నెలకు 100 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. నెలవారీ జీబీ తదుపరి 50 ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్‌లో 2 ఎంబీపీఎస్‌కు స్పీడ్ తగ్గనుంది. జియోఫైబర్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ పథకంలో ఎలాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్లనూ కంపెనీ ఆఫర్ చేయడంలేదు. అయితే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎగ్జైటెల్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా వినియోగదారులు ఏడాది కాలానికి సబ్‌స్ర్కయిబ్ చేస్తే.. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఇందుకు ఒకేసారి రూ. 4,788ను చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్‌లో భాగంగా (నెలకు రూ. 449 అద్దె) ఏడాదికి రూ. 5,388, లేదా (రూ. 499 అద్దె) రూ. 5,988 ఒకేసారి చెల్లిస్తే 200 ఎంబీపీఎస్ లేదా 300ఎంబీపీఎస్ స్సీడ్‌తో సర్వీసులు అందించనుంది. ఇలా కాకుండా 9 నెలలకే కావాలనుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 424 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. ఇదే ఆఫర్లో 6 నెలల కోసం రూ. 490 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. -
జియో ఫైబర్ : 30 రోజులు ఫ్రీ ట్రయల్
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్ తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ప్రకటించింది. ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వీటిని తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుండి జియోఫైబర్ కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక నె లరోజులుపాటు ఎలాంటి కండీషన్లు లేని 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది వీరితోపాటు ఆగస్టు 15, 31 మధ్య ప్లాన్ తీసుకున్న జియోఫైబర్ పాత కస్టమర్లకు కూడా 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది. అలాగే 999, 1499 ప్లాన్లలో 1500 విలువైన 12 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ) చందా ఉచితం. 4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుతారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులు కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రయోజనాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతారు. విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమైన ప్రస్తుత సమయంలో వీటిని తీసుకొచ్చామని జియో ఫైబర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త జియోఫైబర్ ప్రణాళికలు ప్రయోజనాలు అపరిమిత ఇంటర్నెట్ సిమెట్రిక్ స్పీడ్ (అప్లోడ్ వేగం = డౌన్లోడ్ వేగం) నెలకు 399 నుండి ప్రారంభమయ్యే ప్రణాళికలు అదనపు ఖర్చు లేకుండా టాప్ 12 ఓటీటీ యాప్స్ ఉచితం జియోఫైబర్ నో-కండిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ 150 ఎంబీపీసెస్ అపరిమిత ఇంటర్నెట్ 4కే సెట్ టాప్ బాక్స్ ఉచిత వాయిస్ కాలింగ్ నచ్చకపోతే, (ఎలాంటి ప్రశ్నలు సమాధానం చెప్పాల్సిన అవసంర లేకుండానే) ప్లాన్ వెనక్కి తీసుకోవచ్చు. జియో ఫైబర్ కొత్త ప్లాన్స్ 399 రూపాయల ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ 699 రూపాయల ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ 999 రూపాయల ప్లాన్ లో 150 ఎంబీపీఎస్ స్పీడ్ 1,499 రూపాయల ప్లాన్ లో300 ఎంబీపీఎస్ స్పీడ్ -
జియో ఫైబర్ : రిలయన్స్ తాజా ప్రణాళికలు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో ప్రపంచ దిగ్గజాల ద్వారా వరుస పెట్టుబడులతో హోరెత్తించిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అననుబంధ సంస్థలో పెట్టుబడుల సమీరణపై దృష్టి కేంద్రీకరించింది. జియో ఫైబర్ పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (రిలయన్స్ : "నెట్‌మెడ్స్" డీల్) జియో ఫైబర్ లో మేజర్ వాటాను సౌదీ అరేబియా ఆధారిత పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్)కు విక్రయించనుంది. తద్వారా వందకోట్ల డాలర్ల (సుమారు 7495 కోట్ల రూపాయలు) విలువైన పెట్టుబడిని రిలయన్స్ దక్కించుకోనుంది. అలాగే పీఐఎఫ్‌తో పాటు, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఎడిఐఎ) కూడా ఆర్ఐఎల్ తో మరో డీల్ చేసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. 300 బిలియన్ డాలర్ల విలువైన పోర్ట్‌ఫోలియోను సాధించే లక్ష్యంలో భాగంగా ఈ చర్చలు సాగుతున్నట్టు తెలిపింది. అయితే ఈ ఒప్పందంపై ఆర్ఐఎల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ రెండు ఒప్పందాలు నిర్ధారణ అయితే ఆర్ఐఎల్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా పీఐఎఫ్ ఇప్పటికే జియోలో భారీ పెట్టుబడులు పెట్టింది. మరోవైపు మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ సౌదీ అరామ్కో కూడా రిలయన్స్ పెట్రో కెమికల్ రిఫైనింగ్ వ్యాపారంలో మేజర్ వాటాను కొనుగోలు చేయడానికి ఆర్ఐఎల్తో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. -
జియో ఫైబర్‌లో భారీ పెట్టుబడులు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోలో వరుస పెట్టుబడులను సాధించిన రిలయన్స్ తాజాగా జియో ఫైబర్‌లో పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా దోహా ఆధారిత ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) జియో ఫైబర్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తో చర్చలు జరుపుతోంది. (రిలయన్స్ రికార్డుల దూకుడు) జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచే మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ (ఇన్విట్)లో 1.5 బిలియన్ డాలర్ల (11200 కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ రడీ అవుతోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం కోసం సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, మోయిల్స్ అండ్ కంపెనీ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ నేతృత్వంలోని కన్సార్షియం, రిలయన్స్‌లో 25, 215 కోట్ల రూపాయల పెట్టబడులు పెట్టింది. 2019లో రిలయన్స్ జియో ఇన్ ఫో కామ్ నుంచి ఫైబర్ బిజినెస్ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ డీమెర్జ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత 7లక్షల కిలోమీటర్ల నెట్ వర్క్‌ను దేశవ్యాప్తంగా11లక్షల కిలోమీటర్ల పరిధికి విస్తరించాలని ఉన్న జియో డిజిటల్ ఫైబర్ లక్ష్యంగా పెట్టుకుంది. -
జియో ఫైబర్ ఆఫర్ : జీ5 ప్రీమియం ఉచితం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన జియోఫైబర్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ సెట్-టాప్ బాక్స్‌ను ఉపయోగిస్తున్న వారికి జీ 5 ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందించనుంది. మొత్తం 12 భాషల్లో, 1.25 లక్షల ఆన్-డిమాండ్ కంటెంట్ , 100 కి పైగా లైవ్‌టీవీ చానెల్ల ప్రీమియం కంటెంట్ మొత్తం లైబ్రరీకి యాక్సెస్ లబిస్తుంది. సిల్వర్ త్రైమాసిక, ఆపై ప్లాన్లలో జియో ఫైబర్ వినియోగదారులు జీ 5 ప్రీమియం కంటెంట్‌కు అర్హులు. జీ5 కాంప్లిమెంటరీ యాక్సెస్ కొత్త , ఇప్పటికే ఉన్న జియో ఫైబర్ వినియోగదారులు, గోల్డ్ ప్లాన్ తోపాటు, త్రైమాసిక లేదా వార్షిక సిల్వర్ ప్రణాళికతో రీఛార్జ్ చేస్తే డిఫాల్ట్‌గా జీ 5 ప్రీమియం కంటెంట్‌కు ప్రాప్యత లభిస్తుంది. నెలవారీ సిల్వర్ ప్లాన్‌లో కొత్త జియోఫైబర్ వినియోగదారుల కోసం, ప్రీమియం కంటెంట్ మొదటి మూడు రీఛార్జ్‌లకు అందుబాటులో ఉంటుంది. మరింత ప్రీమియం కంటెంట్ కోసం చూస్తున్న వినియోగదారులు ప్రీమియం ఓటీటీ సేవలు, అధిక వేగం, ఎక్కువ బ్రాడ్‌బ్యాండ్ డేటాను అందించే గోల్డ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. జియో గోల్డ్ ప్లాన్ 250 ఎంబీపీఎస్ వరకు డేటా వేగం అన్లిమిటెడ్ ఇంటర్నెట్ (నెలవారీ 1,750 జీబీ డేటా వరకు) అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ జీ 5, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, సోనీలైవ్, సన్నెక్స్ట్, వూట్, ఆల్ట్‌బాలాజీ, లయన్స్‌గేట్, హోయిచోయ్, షెమరూమ్, జియో సినిమా, జియోసావ్న్ లాంటి ప్రీమియం ఓటీటీ సేవలను పొందవచ్చు. అన్లిమిటెడ్ వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ కూడా ఉంది) జియో అనువర్తనాలకు అపరిమిత ప్రాప్యత -
జియో మరో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : అద్భుతమైన ఆఫర్లతో వినియోగదార్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తాజాగా జియోఫైబర్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. రూ. 999 అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. జియో ఫైబర్ గోల్డ్ , ఆపైన ప్లాన్ లో ఉన్న జియోఫైబర్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. (జియో మ్యానియా : క్యూలో టాప్ ఇన్వెస్టర్) బంపర్ ఆఫర్ అమితాబ్ బచ్చన్ ఆయుష్మాన్ ఖురానా నటించిన "గులాబో సితాబో' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆస్వాదించవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో (హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళం, మలయాళం, గుజరాతీ, తెలుగు, కన్నడ, పంజాబీ , బెంగాలీ)తో పాటు యాడ్ ఫ్రీ మ్యూజిక్ , ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ సౌలభ్యం. పాత , కొత్త గోల్డ్ కస్టమర్లుకు ఈ ఆఫర్‌కు అర్హులు. అలాగే ఈ ఆఫర్ పొందేందుకు జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు రీఛార్జ్ చేయవచ్చు లేదంటే పాత ప్లాన్ లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం పొందడం ఎలా? జియో ఫైబర్ గోల్డ్ లేదా పై ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. మై జియో యాప్ లేదా జియో.కామ్ తో జియో ఫైబర్ ఖాతాకు లాగిన్ కావాలి. ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అమెజాన్ ప్రైమ్ ఖాతాకు సైన్-ఇన్ చేయాలి. జియోఫైబర్ గోల్డ్ ప్లాన్ ఆఫర్లు 250 ఎంబీపీఎస్ వేగంతో డేటా నెలకు 1,750 జీబీ డేటా వరకు అపరిమిత ఇంటర్నెట్ అపరిమిత వాయిస్ కాలింగ్ అపరిమిత వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ కూడా ఉంది) ఇతర జియో ఆప్ లకు అన్ లిమిటెడ్ యాక్సెస్ -
జియో సంచలనం : నెలకు 1.1 టీబీ ఉచిత డేటా
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన అనంతరం రిలయన్స్ జియో, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోనూ తనదైన ముద్ర వేసుకునేందుకు వచ్చేస్తోంది. జియోఫైబర్ పేరుతో త్వరలో ఈ సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్ చేయబోతోంది. ప్రస్తుతం యూజర్లకు ఉచిత డేటాతో ఫైబర్-టూ-ది-హోమ్ ప్రీవ్యూ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీవ్యూ ప్లాన్లలో భాగంగా ఇనిషియల్ ప్లాన్ కింద 1.1టీబీ వరకు డేటాను యూజర్లకు అందిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ సర్వీసులను ఎంపిక చేసిన నగరాలు అహ్మదాబాద్, చెన్నై, జమ్నానగర్, ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో జియో టెస్ట్ చేస్తోంది. ఈ ఏడాది చివరిలో జియోఫైబర్ సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్ చేయబోతున్నారు. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మంచి ట్రాక్‌లో ఉన్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గతేడాది జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 ఎంబీపీఎస్ స్పీడులో నెలకు 100జీబీ ఉచిత డేటాను జియోఫైబర్ ఇన్షియల్ ప్లాన్ కింద ఆఫర్ చేస్తుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు.. ఒక్కసారి ఈ ఎఫ్‌యూపీ అయిపోతే, టాప్-అప్ల రూపంలో 40జీబీ ఉచిత డేటా అందుబాటులోకి తెస్తుందని, ఇలా నెలలో 25 సార్లు అందించి మొత్తంగా 1.1టీబీ ఉచిత డేటాను ఆఫర్ చేస్తుందని తెలిపారు. అయితే ఈ 1.1టీబీ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడులో అందిస్తుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. గృహ వినియోగదారులకు, వ్యాపార కస్టమర్లకు ఇద్దరికీ ఈ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని, 30 నగరాల్లో 100 మిలియన్ టెలివిజన్ కస్టమర్లను టార్గెట్‌గా తీసుకుని వీటిని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. రూ.4500 ఇంటరస్ట్ ఫ్రీ సెక్యురిటీ డిపాజిట్‌తో జియోఫైబర్ కనెక్షన్ తొలుత మార్కెట్లోకి వస్తుందని, అనంతరం ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేయనుంది. -
వచ్చే నెలలోనే జియోఫైబర్?
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఎట్టకేలకు అతి తక్కువ ధర కలిగిన ఫైబర్ బ్రాడుబ్యాండ్ నెట్వర్క్ జియోఫైబర్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి చివరిలో దీన్ని లాంచ్ చేయాలని భావిస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2017 చివరిలోనే జియోఫైబర్ మార్కెట్లోకి వస్తుందని పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ అవి జరుగలేదు. తాజా రిపోర్టుల ప్రకారం వచ్చే నెలలో కంపెనీ అధికారికంగా జియోఫైబర్‌ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. జియోఫైబర్‌ను ప్రస్తుతం రిలయన్స్ జియో 10 నగరాల్లో టెస్ట్ చేస్తోంది. లాంచింగ్ సమయంలో ఆరు నగరాలు ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, జమ్నగర్, సూరత్, వడోదరాలలో అందుబాటులోకి తీసుకొస్తామని జియోకేర్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. అంతకముందు విడుదలైన రిపోర్టుల ప్రకారం జియోఫైబర్ ప్లాన్లు రూ.500 నుంచి ప్రారంభమవుతాయని తెలిసింది. రూ.500కు 600జీబీ డేటాను కంపెనీ ఆఫర్ చేయనున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. హైయర్ ప్యాకేజీలు నెలకు రూ.2000 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్యాకేజీల కింద 1000 జీబీ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. జియోమీడియా షేర్ డివైజ్, స్మార్ట్ సెటాప్ బాక్స్, రూటర్స్, పవర్ లైన్ కమ్యూనికేషన్ ప్లగ్స్‌తో జియోఫైబర్ సర్వీసులు మార్కెట్లోకి రానున్నాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులతో పాటు ఇంటర్నట్ ఆఫ్ థింగ్స్‌ను జియోఫైబర్ మరింత వ్యాప్తిచేయనుంది. -
జియోఫైబర్ త్వరలోనే వచ్చేస్తుంది
జియోఫైబర్ వచ్చేస్తోంది.. ఎప్పుడొస్తోంది అంటే ఎవరికీ సరియైన తేదీలు తెలియవు. ప్రస్తుతం రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్‌కు చెందిన ఆస్తులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉంది. ఈ ఆస్తులు కొనుగోలు అవగానే, జియోఫైబర్ లాంచ్ డేట్‌ను ప్రకటిస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. జియోకు, ఆర్‌కామ్‌కు మధ్య జరుగుతున్న ఈ డీల్‌లో ఆర్‌కామ్‌కు చెందిన 850, 900, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండ్స్‌లో 122.4 యూనిట్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను జియో కొనుగోలు చేస్తోంది. 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 43వేల టవర్లు ఈ డీల్‌లో భాగమే. ఇప్పటికే వైర్లెస్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న జియో, 1,78,000 కిలీమీటర్లకు పైగా ఫైబర్ నెట్‌వర్క్‌తో భవిష్యత్తులో మరింత దూసుకెళ్తుందని తెలుస్తోంది. ఫైబర్ నెట్వర్క్ కేవలం ఖరీదైనవి మాత్రమే కాక, ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఫైబర్ నెట్వర్క్ లేకుండా... జియోఫైబర్ 100ఎంబీపీఎస్ స్పీడును ఆఫర్ చేయలేదు. ప్రారంభంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిరూపించుకోవాలంటే, జియో కచ్చితంగా తన ఫైబర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాల్సిందే. అంతకముందు రిపోర్టుల ప్రకారం జియోకు 3,00,000 కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్ ఉంది. ఆర్‌కామ్ ఫైబర్ నెట్‌వర్క్‌ను దక్కించుకున్న అనంతరం ఎక్కువ ప్రాంతాల్లో, చాలా వేగవంతంగా దీన్ని లాంచ్ చేయడానికి వీలవుతుందని టెక్ వర్గాలు తెలిపాయి. ఉచితంగా మూడు నెలల ట్రయల్ నేపథ్యంలో జియో ఎంపికచేసిన ప్రాంతాల్లో జియోఫైబర్‌ను అందుబాటులో ఉంచింది. జియోఫైబర్ ద్వారా కనీసం 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ను వాడుకోవచ్చు. -
ఇంకెన్ని సంచలనాలో: జియో యూజర్లు బీ రెడీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక సాధారణ సమావేశానికి(ఏజీఎం) సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. సూపర్ స్పీడులో అత్యధిక డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం వంటి ఆఫర్లతో ఇప్పటికే టెలికాం మార్కెట్‌ను కుదిపేసిన రిలయన్స్, ఈ మీటింగ్‌లో చేయబోయే ప్రకటనలపై మార్కెట్లో సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఈ సమావేశంలోనే అత్యంత చౌకైన 4జీ ఫీచర్ ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేయబోతుందని టాక్. జియో ఫీచర్ ఫోన్‌పై ఇప్పటికే పలు ఆసక్తికర రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఫోన్ 500 రూపాయలకే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌తో మొబైల్ సెక్టార్లో కూడా ముఖేష్ అంబానీ సంచలనాలు సృష్టించబోతున్నారని రిపోర్టులు పేర్కొన్నాయి. మరోవైపు జియో ఫీచర్ ఫోన్‌ను తయారుచేసేందుకు ఈ కంపెనీకి, ఇంటెక్స్కు మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ మానుఫ్రాక్చరింగ్ చర్చలు తుది దశలో ఉన్నాయని ఇంటెక్స్ స్పష్టంచేసింది. ఫీచర్ ఫోన్‌తో పాటు బ్రాడ్ బ్యాండు నెట్వర్క్ జియోఫైబర్‌ను కూడా రిలయన్స్ ఆవిష్కరించబోతుందని టాక్. ఈ ప్రకటన కూడా బ్రాడ్ బ్యాండు ఇండస్ట్రీని షేక్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే కంపెనీ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, జమ్మునగర్, సూరత్, వడోదరా వంటి ప్రాంతాల్లో జియోఫైబర్ ప్రీవ్యూ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా తీసుకురాబోతున్న ఈ సేవలపై జీరో రూపాయలకు 3 నెలల పాటు ప్రతినెలా 100ఎంబీపీఎస్ స్పీడులో 100జీబీ డేటాను జియో తన కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి తొలుత 4500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా తర్వాత రీఫండ్ చేయనున్నామని కంపెనీ అంతకముందే క్లారిటీ ఇచ్చేసింది. బ్రాడ్‌బ్యాండు సర్వీసు ధరలు కూడా 500 రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసింది. 500 రూపాయలకు 600జీబీ డేటా, 2000 రూపాయలకు 1000జీబీ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడులో జియో ఆఫర్ చేయనుంది.