జియో మరో బంపర్ ఆఫర్ | Reliance Jio Fiber offers one-year free Amazon Prime with these plans | Sakshi
Sakshi News home page

జియో మరో బంపర్ ఆఫర్

Published Fri, Jun 12 2020 2:51 PM | Last Updated on Fri, Jun 12 2020 7:39 PM

Reliance Jio Fiber offers one-year free Amazon Prime with these plans - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, ముంబై : అద్భుతమైన ఆఫర్లతో వినియోగదార్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో  తాజాగా  జియోఫైబర్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది.  రూ. 999 అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్టు  జియో ప్రకటించింది.  జియో ఫైబర్ గోల్డ్ , ఆపైన ప్లాన్ లో ఉన్న జియోఫైబర్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. (జియో మ్యానియా : క్యూలో టాప్ ఇన్వెస్టర్)

బంపర్ ఆఫర్ 

  • అమితాబ్  బచ్చన్ ఆయుష్మాన్ ఖురానా నటించిన "గులాబో సితాబో' సినిమాను   అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆస్వాదించవచ్చు.
  • అమెజాన్ ప్రైమ్ వీడియో (హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళం, మలయాళం, గుజరాతీ, తెలుగు, కన్నడ, పంజాబీ , బెంగాలీ)తో పాటు  యాడ్ ఫ్రీ  మ్యూజిక్ , ప్రైమ్ గేమింగ్,  ప్రైమ్ రీడింగ్  సౌలభ్యం.
  • పాత , కొత్త గోల్డ్ కస్టమర్లుకు ఈ ఆఫర్‌కు అర్హులు. అలాగే ఈ ఆఫర్ పొందేందుకు జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు రీఛార్జ్ చేయవచ్చు లేదంటే పాత ప్లాన్ లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం పొందడం ఎలా?
జియో ఫైబర్ గోల్డ్ లేదా పై ప్లాన్‌ను రీఛార్జ్  చేసుకోవాలి.
మై జియో యాప్ లేదా జియో.కామ్ తో జియో ఫైబర్ ఖాతాకు లాగిన్ కావాలి.
ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అమెజాన్ ప్రైమ్ ఖాతాకు సైన్-ఇన్ చేయాలి.

జియోఫైబర్ గోల్డ్ ప్లాన్  ఆఫర్లు

  • 250 ఎంబీపీఎస్ వేగంతో  డేటా 
  • నెలకు 1,750 జీబీ డేటా వరకు అపరిమిత ఇంటర్నెట్ 
  • అపరిమిత వాయిస్ కాలింగ్
  • అపరిమిత వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ కూడా ఉంది)
  • ఇతర జియో ఆప్ లకు అన్ లిమిటెడ్ యాక్సెస్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement