కరోనా దెబ్బకు ఓటీటీ మార్కెట్ విపరీతంగా పుంజుకుంది. వందల కోట్లలో ఓటీటీ వేల కోట్లుకు చేరింది. ఈ క్రమంలో ఓటీటీల సంస్థలు కస్టమర్లను పెంచుకునే పనిలో పడ్డాయి. అందుకోసమే ప్రత్యేకంగా సిరీస్‌లు, సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నాయి. కంటెంట్ వరకు అంతా బాగున్న కస్టమర్లు పైసలు పెట్టి సబ్‌స్క్రైబర్లుగా మార్చడం కోసం మొబైల్ ఓన్లీ ప్లాన్స్‌ను (Mobile Only Plans) కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో
అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో కోసం మొబైల్-మాత్రమే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ .దీని ధర రూ. 599, ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ మొబైల్ డివైజ్ సబ్‌స్క్రైబర్‌లకు ప్రైమ్ వీడియో యాక్సెస్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది ఉచిత డెలివరీలు, అమెజాన్ మ్యూజిక్ మొదలైన ఇతర ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలను ఉండవని గమనించుకోవాలి.
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌తో సహా అనేక రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది, దీని ధర నెలకు రూ.149. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫాంలో SD (480p) క్యాలిటీ అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్
డిస్ని+హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్ డివైజ్ కోసం నెలవారీ, వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది. దీని ధర మూడు నెలలకు రూ.149, సంవత్సరానికి రూ.499. ఈ రెండు ప్లాన్‌లు యాడ్-సపోర్టుతో వస్తాయి. ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ చేయగలరు.
వూట్ సెలెక్ట్ మొబైల్ ప్లాన్
Voot Select సంవత్సరానికి రూ. 299 ఖరీదు చేసే ఒక మొబైల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఒక డివైజ్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. SD 720p స్ట్రీమింగ్‌ను అవకాశం ఉంటుంది.
సోనీలైవ్ మొబైల్ ప్లాన్
సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సంవత్సరానికి రూ.599తో ఉంది. ఇది ఒక మొబైల్ డివైజ్‌లో మాత్రమే 720p స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంటుంది.
జీ5
జీ5లో మొబైల్ ప్లాన్ అందుబాటులో లేదు. అయితే, ఇది సంవత్సర వ్యాలిడిటీ, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది. వాటి ధర రూ.999( సంవత్సరం) , రూ. 399 (3 నెలలు).
చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
Comments
Please login to add a commentAdd a comment