
పండుగ సీజన్ సందర్భంగా టెలికం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా ‘జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా‘ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం అక్టోబర్ 18 – 28 మధ్యలో కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్లు, ప్లాన్లు తీసుకునే వారికి రూ. 6,500 వరకు విలువ చేసే ప్రయోజనాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వీటిలో 100% వేల్యూ బ్యాక్‌తో పాటు, 15 రోజుల అదనపు వేలిడిటీ ఉచితంగా ఉంటాయని తెలిపింది.
రూ. 599 ప్లాన్‌తో 6 నెలల రీచార్జి, అలాగే రూ. 899 ప్లాన్‌తో 6 నెలల రీచార్జి పథకాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ రెండింటితో పాటు నెలకు రూ. 899 చొప్పున మూడు నెలల ప్లాన్‌కి 100 శాతం వేల్యూ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది, కానీ 15 రోజుల అదనపు వేలిడిటీ మాత్రం లభించదు.
ఏజియో, రిలయన్స్ డిజిటల్, నెట్‌మెట్స్, ఇక్సిగో వోచర్ల రూపంలో వేల్యూ బ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి. సదరు ప్లాన్లను కొనుగోలు చేసే వారు రూ. 6,000 విలువ చేసే 4కే జియోఫైబర్ సెట్ టాప్ బాక్స్ ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే పొందవచ్చని కంపెనీ తెలిపింది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment