festival season
-
Sankranti 2025: పండక కళ, ఫేస్ గ్లో కోసం ఇలా చేయండి!
సంబరాల సంక్రాంతి సందడి సమీపిస్తోంది. ఏడాదిలో తొలి పండుగ సంక్రాంతి అంటే చాలా హడావిడి ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా తెలుగువారిలో మరింత సందడి ఉంటుంది. పిండివంటలు, షాపింగ్‌లు కాదు అందంగా కనిపించడం అమ్మాయిలకు అందరికీ ఇష్టం. కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ఉత్పత్తులు కాకుండా, సహజంగా ముఖ చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా మార్చడంతో పాటు కొన్ని సంరక్షణా టిప్స్ తెలుసుకుందాం.పండగ సందర్బంగా ముఖంమెరిసిపోవాలంటే.. ఇంట్లోనే దొరికే కొన్ని రకాల పదార్థాలో బ్యూటీ ప్యాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. అలాగే ప్యాక్‌కు ముందు ముఖారికి ఆవిరి పట్టడం వలన మృత కణాలు తొలిగి, చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. దీంతో మనం వేసుకున్న ప్యాక్ పోషకాలు అంది ముఖం మరింత అందంగా, షైనీగా ఉంటుంది.పొటాటో ప్యాక్ఒక చిన్న బంగాళదుంప (Potato) తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ,పల్చటి క్లాత్‌తో వడకట్టి రసం తీసుకోవాలి. ఈ రసంలో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి(Rice Flour) కొద్ది పెరుగు,(Curd) కొద్దిగా బాదం ఆయిల్ వేసిన అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో నల్లమచ్చలు తొలిగి ఫేస్ అందంగా కనిపిస్తుంది.శనగ పిండి ప్యాక్రెండు స్పూన్ల శనగపిండి, కొద్దిగా పసుపు, రోజ్ వాటర్, పాల మీగడ, తేనె కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆవిరిపట్టి చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. ఆరిన తరువాత మృదువుగా పిండిని తొలగిస్తూ, శుభ్రంగా కడుక్కోవాలి. ఇన్స్టంట్ గ్లో వస్తుంది. అలాగే వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని తలస్నానం చేసేముందు నలుగు పెట్టుకుంటే ముఖంతో పాటు చర్మానికి కూడా రాస్తే చాలా మంచిది. (కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?)కాఫీ పౌడర్కాఫీ పౌడర్, కొద్దిగా చక్కెర, నిమ్మరసం వేసి ముఖానికి అప్లయ్ చేయాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. దీన్ని చేతులు, ముంచేతులు, మెడమీద కూడా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టడం: వేడినీళ్లలో కాసిన్ని పుదీనా ఆకులు, తులసి, వేపాకులు, పసుపు వేసి ముఖమంతా చెమటలు పట్టేదాకా ఆవిరి పడితే చర్మం బాగా శుభ్రపడుతుంది. చర్మం రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోదోసకాయ నీటితో ఆవిరిదోసకాయ ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి. నీరు బాగా మరిగిన తరువాత ఈ నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఇందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేయచ్చు. దీని నుండి వచ్చే ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. నూనె, దుమ్ము, ధూళి కారణంగా మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు క్లియర్ అవుతాయి.నిమ్మకాయమరుగుతున్న నీటిలో కొద్దిగా నిమ్మరసం, గ్రీన్ టీ బ్యాగ్ లేదా టీ ఆకులు వేయాలి. నీటిని దించాక దీంట్లో కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఈ ఆవిరిని ముఖానికి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. చర్మం మీద ఉన్న మృత కణాలు, మురికి క్లీన్ అవుతాయి.మాయిశ్చరైజర్‌గా బాదం నూనెచలికాలం చర్మం పొడిబారడం సహజంగా జరుగుతుంటుంది కాబట్టి నూనె శాతం ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి.∙బాదం నూనె, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. టీ స్పూన్ బాదాం నూనెలో అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి మృదువుగా మర్దన చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం పొడిబారదు. -
గిగ్ వర్కర్లకు ఫుల్ డిమాండ్
ముంబై: ఈ ఏడాది పండుగల సందర్భంగా తాత్కాలిక కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోల్చితే గిగ్ వర్కర్లు (తాత్కాలిక ఉద్యోగులు)/ఫ్రీలాన్సర్ల డిమాండ్ 23 శాతం పెరిగినట్టు ‘అవ్సార్’ గివ్ వర్కర్స్ నివేదిక వెల్లడించింది. రిటైల్ రంగంలో వచ్చిన మార్పులు, కస్టమర్ల వినియోగం, వారి అంచనాలు పెరగడం, ఈ కామర్స్ సంస్థల విస్తరణ ఈ డిమాండ్‌కు మద్దతునిచ్చినట్టు తెలిపింది. పండుగల సందర్భంగా 12 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు ఏర్పడినట్టు వెల్లడించింది. ఉద్యోగ నియామక సేవలు అందించే అవ్సార్ తన ప్లాట్‌ఫామ్‌పై డేటాను విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు విడుదల చేసింది. లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్, కస్టమర్ సపోర్ట్ రంగాలపై అధ్యయనం చేసింది. ద్వితీయ శ్రేణి పట్టణాలైన సూరత్, జైపూర్, లక్నో తాత్కాలిక పనివారికి ప్రధాన కేంద్రాలుగా మారినట్టు తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మొత్తం మీద ఉపాధి పరంగా ముందున్నట్టు, మొత్తం డిమాండ్‌లో ఈ మూడు మెట్రోల నుంచే 53 శాతం ఉన్నట్టు వెల్లడించింది. సంప్రదాయంగా మెట్రోల్లో కనిపించే తాత్కాలిక కార్మికుల సంస్కృతి, టైర్ 2 పట్టణాలకూ విస్తరిస్తున్నట్టు పేర్కొంది. పెరిగిన వేతనాలు: నైపుణ్య మానవవనరులను ఆకర్షించేందుకు ఈ సీజన్లో కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేసినట్టు తెలిపింది. ఫీల్డ్ టెక్నీషియన్లకు ప్రతి నెలా రూ.35,000, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, డెలివరీ బాధ్యతలకు రూ.18,000–28,000 వరకు చెల్లించినట్టు వివరించింది. అధిక డిమాండ్ ఉండే నైపుణ్య పనుల నిర్వహణకు మానవ వనరుల కొరత, సేలకు డిమాండ్ అధిక వేతనాలకు దారితీసినట్టు తెలిపింది. ప్రధానంగా లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్ రంగాలు తాత్కాలిక ఉద్యోగులకు ఈ ఏడాది పండుగల సీజన్లో ఎక్కువ ఉపాధి కల్పించినట్టు వెల్లడించింది. దేశ ఉపాధి రంగంపై గిగ్ ఎకానమీ దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. పట్టణాల్లో తగ్గిన నిరుద్యోగం సెప్టెంబర్ త్రైమాసికంలో 6.4%పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 6.4 శాతానికి దిగొచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నిరుద్యోగం 6.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.6 శాతంగా ఉండడం గమనార్హం. నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) 24వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను విడుదల చేసింది. పట్టణాల్లో 15 ఏళ్లు నిండిన మహిళల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ చివరికి 8.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 8.6 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది జూన్ చివరికి 9 శాతంగా ఉంది. 15 ఏళ్లు నిండిన పురుషులకు సంబంధించి పట్టణ నిరుద్యోగం సెప్టెంబర్ చివరికి 5.7 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6 శాతం కాగా, ఈ ఏడాది జూన్ చివరికి 5.8 శాతంగా ఉంది. జూలై–సెప్టెంబర్ కాలంలో కారి్మకుల భాగస్వామ్య రేటు 50.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఏడాది సెప్టెంబర్ చివరికి ఇది 50.1 శాతంగా ఉంది. -
8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. ఓ వైపు ఆటోమొబైల్ కంపెనీ తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలు ఉద్యోగులను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 'మీషో' (Meesho) కంపెనీ ఏకంగా 8.5 లక్షల ఉద్యుగులను నియమించుకోవడానికి సన్నద్ధమవుతోంది.పండుగ సీజన్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి మీషో సిద్ధమైంది. ఉద్యోగ నియామకాల్లో 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, టైర్ 4 నగరాల్లో ఉండనున్నట్లు సమాచారం.ఈ కామర్స్ దిగ్గజం మీషో డెలివెరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, షాడోఫాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం కూడా ఉద్యోగ నియమాలకు పెంచడంలో సహాయపడింది. ఉద్యోగులలో పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, రిటర్న్‌లను నిర్వహించడానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.ఇదీ చదవండి: ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?ఉద్యోగ నియమాలకు కారణంఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. పండుగ సీజన్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మీషో ఈ చర్యలు తీసుకుంటోంది. -
పండగ సీజన్‌పై ఫోకస్.. లక్ష ఉద్యోగాలకు అవకాశం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌పై మరింతగా కసరత్తు చేస్తోంది. రాబోయే బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 సేల్ కోసం పెద్ద ఎత్తున నియామకాలు జరపనుంది. కొత్తగా 1 లక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్ అసోసియేట్లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లు, కిరాణా పార్ట్నర్లు, డెలివరీ డ్రైవర్లు మొదలైన సిబ్బందిని తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.పండుగ సీజన్ కోసం కొత్త వర్కర్లకు అవసరమైన శిక్షణనివ్వనున్నట్లు వివరించింది. ఇప్పటికే తొమ్మిది నగరాల్లో 11 కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్‌సీ) ప్రారంభించినట్లు, దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 83కి చేరినట్లు ఫ్లిప్‌కార్ట్ వివరించింది. సామాజిక–ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్న లక్ష్యంతో ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా ఒకవైపు తమ నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటు మరోవైపు ఆర్థిక వృద్ధికి దోహదపడాలని, స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వివరించింది. తమ సరఫరా వ్యవస్థ కార్యకలాపాలు నిరాటంకంగా సాగేలా, పెరుగుతున్న డిమాండ్ ప్రకారం నిల్వల నిర్వహణ, ప్రోడక్టుల లభ్యత మొదలైన అంశాలను మెరుగుపర్చుకునేందుకు వినూత్నమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పండుగల సీజన్లో ఈ–కామర్స్ కంపెనీలు కల్పించే ఉద్యోగాలు సాధారణంగా ఆయా సీజన్లకు పరిమితమైనవిగా ఉంటాయి. -
హోలీ 2024: రంగుల్లో మునిగి తేలిన కుర్రకారు (ఫోటోలు)
-
సంక్రాంతి సెలవులతో సొంతూళ్లకు వెళ్తున్న నగరవాసులు
-
8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రైస్ కార్డుదారులందరికీ సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జనవరిలో ఎనిమిదివేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 23వ తేదీలోగా మండలస్థాయి నిల్వ కేంద్రాలకు (ఎంఎల్ఎస్ పాయింట్లకు) సరుకు తరలించనుంది. ప్రస్తుత నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది. గిరిజన ప్రాంతాల్లోని జీసీసీల ద్వారా కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు సాగించేలా ప్రోత్సహించనుంది. ఏడాదిగా మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రలో భారీవర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కందిపప్పునకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్తపంట వస్తుండటంతో రేటు నెమ్మదిగా దిగొస్తోంది. ఒకప్పుడు మార్కెట్లో కిలో కందిపప్పు రూ.115 ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేటు రూ.160–170కి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు. మధ్యలో మూడు, నాలుగునెలలు మార్కెట్లో లోటు ఉండటంతో పీడీఎస్‌లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గోధుమపిండికి డిమాండ్ పీడీఎస్ లబ్దిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టికాహార పదార్థాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫోరి్టఫైడ్ (విటమిన్లతో కూడిన) గోధుమపిండిని పరిచయం చేసింది. ప్రజల నుంచి స్పందన బాగుండటంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు మూడువేల టన్నుల గోధుమపిండి సరఫరా చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కిలో రూ.16కే అందిస్తుండటం గమనార్హం. లబ్ధిదారులకు దీన్ని మరింత తక్కువ రేటుకు ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపనుంది. రైస్ కార్డుదారుల ఇష్టం మేరకు కిలో బియ్యానికి బదులు కిలో గోధుమపిండి ఇవ్వనుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిమాణాన్ని తగ్గించుకుని దానికి బదులు గోధుమలను సరఫరా చేస్తుంది. వాటిని ప్రాసెసింగ్ చేసి ఫోరి్టఫైడ్ అనంతరం ప్యాకింగ్, రవాణాకు అయ్యే ఖర్చులను లెక్కించి పౌరసరఫరాలశాఖ ధర నిర్ణయించనుంది. ఈ విధంగా కిలో రూ.11–12కే గోధుమపిండి ఇవ్వొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే నెలకు 1,800 టన్నుల గోధుమలను కేంద్రం అందిస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొత్తం కార్డుదారులకు గోధుమపిండిని అందుబాటులో ఉంచేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు పంచదార, రాయలసీమలో చిరుధాన్యాల పంపిణీకి అవసరమైన నిల్వలను తరలిస్తోంది. నెలాఖరులోగా కందుల సేకరణ పౌరసరఫరాలసంస్థ ద్వారా స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందులు సేకరించడంతోపాటు వాటిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసి తిరిగి పీడీఎస్‌లోకి ప్రవేశపెట్టేలా పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ నెలాఖరులోగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. అవసరమైతే మార్కెట్ రేటును చెల్లించైనా రైతుల నుంచి 35 వేల టన్నులకుపైగా కందులను సేకరించాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగానే రవాణా, కూలీ, గోతాల ఖర్చులను సైతం రైతులకు ఇవ్వనుంది. కందులు సేకరించిన వారంలోగా రైతుల ఖాతాల్లో మద్దతు ధరను జమచేయనుంది. నాణ్యతలో రాజీలేకుండా ఇప్పటివరకు పీడీఎస్‌లో పంపిణీ చేస్తున్న కందిపప్పు బయట ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నదే. తొలిసారిగా ఏపీలో పండిన పంటను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి మర ఆడించి ప్రత్యేక ప్యాకింగ్‌లో రైస్ కార్డుదారులకు ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా అక్కడక్కడ కందిపప్పు నాణ్యతపై వస్తున్న విమర్శలను అధిగమించవచ్చు. ఏపీ అవసరాలకు తగినంత నిల్వలను ఇక్కడే సేకరిస్తాం. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇకపై జాప్యం లేని పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకేలోని క్షేత్రస్థాయి సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలసంస్థ సిబ్బంది సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించి కందులు కొనుగోలు చేస్తా – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ -
భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?
భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండుగల్లో ఒకటైన 'దీపావళి' సందర్భంగా దేశీయ మార్కెట్లో బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. వాహన అమ్మకాలు, బంగారం, నిత్యావసర వస్తువుల సేల్స్ ఒక ఎత్తయితే, టపాసులు విక్రయాలే మరో ఎత్తుగా సాగుతాయి. రాబోయే దీపావళిని దృష్టిలో ఉంచుకుని భారత్ చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించింది. దీని వల్ల చైనాకు వేలకోట్లు నష్టం వాటిల్లుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చైనా వస్తువులను భారతదేశంలోకి దిగుమతి చేసుకోకూడదని తీసుకున్న నిర్ణయంతో చైనా సుమారు రూ. 50,000 కోట్ల వ్యాపార నష్టాన్ని చవిచూడనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చైనా ఉత్పత్తుల బహిష్కరణకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలునివ్వడంతో దీపావళి సమయంలో చైనా ఉత్పతుల దిగుమతులు భారీగా తగ్గుతాయి. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచడానికి 'సీఏఐటీ' ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి! 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించాడు. దీపావళి పండుగ సమయంలో వినియోగదారులు సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తూ.. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చైనా ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, లక్నో, చండీగఢ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కతా, రాంచీ, గౌహతి, పాట్నా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురై, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, బదులుగా భారతీయ వస్తువులకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా భారీ నష్టం.. ప్రతి సంవత్సరం పండుగ సీజన్లలో భారతీయ వ్యాపారులు చైనా నుంచి రూ.70,000 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటారని సమాచారం. అయితే భారత్ తీసుకున్న నిర్ణయంతో చైనా.. రాఖీ సందర్భంగా సుమారు రూ.5,000 కోట్లు, వినాయక చవితి సమయంలో రూ. 500 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. -
పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం
విజయదశమితో మొదలైన పండుగ సీజన్ జోరుగా ముందుకు సాగుతోంది. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ పండుగ సీజన్లో టాటా, మారుతి, హ్యుందాయ్ వంటి కార్ డీలర్లు తమ లైనప్‌లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్.. 👉టాటా ఆల్ట్రోజ్ - రూ. 30,000 👉టాటా టియాగో - రూ. 40,000 👉రెనాల్ట్ క్విడ్ - రూ. 50,000 👉హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ - రూ. 55,000 👉మారుతి సుజుకి బాలెనో - రూ. 55,000 👉మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - రూ. 58,000 👉మారుతి సుజుకి ఇగ్నిస్ - రూ. 65,000 👉మారుతి సుజుకి ఆల్టో కే10 - రూ. 70,000 👉మారుతి సుజుకి సెలెరియో - రూ. 73,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి. -
పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్!
పండుగ సీజన్లో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, మంచి స్మార్ట్ఫోన్లను కొనటానికి కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ ఫోన్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో మోటరోలా కంపెనీకి చెందిన 'ఎడ్జ్ 40 నియో' ఒకటి. ఇది 6.55 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, చిక్ వేగన్-లెదర్ బ్యాక్ డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 64 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030, 6nm ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐకూ జెడ్7 ప్రో (iQOO Z7 Pro) ఐకూ జెడ్7 ప్రో మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో స్మార్ట్‌ఫోన్. దీని ధర కూడా రూ. 25000 కంటే తక్కువే. 125జీబీ, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ పొందుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 4,600mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 2 (Lava Agni 2) మన జాబితాలో మూడవ మొబైల్ లావా అగ్ని 2. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి, 8జీబీ ర్యామ్ పొందుతుంది. వైబ్రెంట్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా అద్భుతంగా ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro) పోకో ఎక్స్5 ప్రో మంచి డిజైన్, క్వాలిటీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్. ఇది 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్స్ పొందుతుంది. -
రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు
దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. ఈ కథనంలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా XUV700 దీపావళి సందర్భంగా కొనుగోలు చేయదగిన ఉత్తమ SUV. దీని ప్రారంభ ధర రూ. 14.47 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ 185 పీఎస్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా హారియర్ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కంపెనీకి చెందిన హారియర్ కూడా మన జాబితాలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారునిలోని 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 170 పీఎస్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆల్కజార్ రూ.17.73 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ ఆల్కజార్ కూడా ఈ పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఉత్తమ మోడల్. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 Bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఎంజి హెక్టర్ మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ హెక్టర్ రూ. 17.99 లక్షల ధర వద్ద లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! కియా సెల్టోస్ సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్‌కి చెందిన సెల్టోస్ దేశీయ మార్కెట్లో రూ. 13.60 లక్షల ధర వద్ద లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 115 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. -
రూపాయికే బస్ టికెట్..అయితే ఈ చాన్స్ ఎంతమందికి దక్కుతుందో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్ బుకింగ్ యాప్ అభిబస్ ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక్క రూపాయికే టికెట్ పొందే అవకాశం ఉంది. అయితే ఎంత మందికి ఈ చాన్స్ దక్కుతుందనేది కంపెనీ ప్రకటించలేదు. అక్టోబర్ 19 నుంచి 25 మధ్య ప్రయాణ తేదీలకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ దక్కని వారిలో రోజుకు 100 మంది లక్కీ విన్నర్స్‌కు బస్ టికెట్ వోచర్స్ ఇస్తారు. ఈ ఆఫర్ ప్రైవేట్ బస్‌లు, ఎంపిక చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్ బుకింగ్స్‌కు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. -
13 బిలియన్ డాలర్ల దీపావళి పండుగ..చిన్న సంస్థలకు మరింత లాభసాటిగా
ముంబై: దేశీ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఈసారి దీపావళి పండుగ మరింత లాభసాటిగా ఉండనుంది. ఈ–కామర్స్ ద్వారా 13 బిలియన్ డాలర్ల మేర వ్యాపారాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని ఎంఎస్ఎంఈలు మరింత ఎక్కువగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి. టెక్ ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ షిప్‌రాకెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం ఆర్డర్లలో 10–15 శాతం ఆర్డర్లు తొలిసారిగా ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి నుంచే ఉండనున్నాయి. పండుగ అమ్మకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) 28 శాతం వాటాతో అగ్రస్థానంలో, 13 శాతం వాటాతో ముంబై, 7 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్ వినియోగం పెరిగింది. షిప్రాకెట్కి వచ్చే ఆర్డర్లలో 56 శాతం వాటా మెట్రోయేతర నగరాల నుంచే ఉంటోంది. ఎగుమతులు అప్.. పండుగ సీజన్లో ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువగా కృత్రిమ జ్యుయలరీ, సౌందర్య సంరక్షణ, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, హోమ్ ఫర్నిషింగ్స్ మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూఏఈలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అదనంగా మూడు గిడ్డంగులను సమకూర్చుకుంది. ఆర్డర్లను సత్వరం ప్రాసెస్ చేసేందుకు సిబ్బంది సంఖ్యను 50 శాతం మేర పెంచుకుంది. -
చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - రూ.10 వేలు కంటే తక్కువే!
ఇప్పటికే పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఓ కొత్త మొబైల్ తక్కువ ధరలో కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారికోసం రూ. 10వేలు లోపు లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లను ఈ కథనంలో చూసేద్దాం. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 రూ. 10 కంటే ధరలో లభించే స్మార్ట్‌ఫోన్. ఇది 6.6-అంగుళాల HD+ డిస్ప్లే కలిగి, 13 మెగా ఫిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ మొబైల్ MediaTek Helio A20 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ 12 మన జాబితాలో తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్ఫోన్ల రెడ్మి 12 ఒకటి. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, పెద్ద సెన్సార్, అధునాతన పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 2022 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ మొబైల్ MediaTek Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదీ చదవండి: డ్రైవర్‌కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా శాంసంగ్ గేలక్సీ ఎమ్13 బ్యాంక్ ఆఫర్లతో పనిలేకుండానే తక్కువ ధరకు మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ధృడమైన ప్లాస్టిక్ బాడీ మరియు ట్రిపుల్-కెమెరా సెటప్, ఎక్సినోస్ ప్రాసెసర్ పొందుతుంది. రియల్‌మి Narzo 50i రియల్మీ Narzo 50i మంచి కలర్ ఆప్షన్స్‌లో లభించే బెస్ట్ మొబైల్. ఇది Unisoc T612 ప్రాసెసర్ కలిగి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమరా సిస్టం కూడా బాగానే ఉంటుంది. ఈ మొబైల్ ధర కూడా రూ. 10,000 కంటే తక్కువ. -
పండుగ సీజన్లో వాటి కొనుగోళ్లకే మొగ్గు.. డెలాయిట్ సర్వే సంచలన రిపోర్ట్!
న్యూఢిల్లీ: ప్రస్తుత పండుగల సీజన్లో వినియోగదారులు అధిక వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు డెలాయిట్ సర్వే వెల్లడించింది. లగ్జరీ, సెలబ్రేటరీ (వేడుకలకు సంబంధించి) వస్తువుల కొనుగోలు పెరగడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఊహించని పెద్ద మొత్తంలో ఖర్చులు వచ్చినా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ‘డెలాయిట్ కన్జ్యూమర్ సిగ్నల్ రీసెర్చ్’ సర్వేలో సగం మంది చెప్పారు. ‘‘భారత్‌లో పండుగల సీజన్ సమీపిస్తోంది. దీంతో వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతోంది. 56 శాతం మంది వేడుకలకు సంబంధించిన (పుట్టిన రోజు, వివాహం తదితర) వస్తువులు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు’’అని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. సమీప కాలంలో వస్త్రాలు, వ్యక్తిగత సంరక్షణ, వినోదం, విహారంపై వ్యయాలు పెరగొచ్చని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని సాధిస్తుండడంతో, వినియోగదారులు విలాస వస్తువులు, ఖరీదైన వస్తువుల కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నట్టు డెలాయిట్ ఆసియా పసిఫిక్ పార్ట్నర్ రాజీవ్‌సింగ్ పేర్కొన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రవాణా, ఆతిథ్యానికి కూడా ఇదే ధోరణి విస్తరిస్తున్నట్టు చెప్పారు. టైర్ 2, 3 పట్టణాల్లోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగం పెరగనుందని, దీంతో రిటైల్, ఆటోమోటివ్, రవాణా, ఆతిథ్య రంగాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. భారత వినియోగదారులు కేవలం విలావవంతమైన కొనుగోళ్లకే పరిమితం కావడం లేదని, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. ఇందుకు నిదర్శంగా దేశీయ, అంతర్జాతీయ విమాన బుకింగ్‌లను పేర్కొంది. -
వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'వినాయక చవితి' ప్రారంభం కానుంది. మరి కొన్ని రోజులు దేశం మొత్తం వాడవాడల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా గణేష్ ఉత్సవాల్లో మునిగి తేలుతారు. గత ఏడాది ఈ పండుగ సందర్భంగా రూ. 300 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది ఎంత బిజినెస్ జరగవచ్చు? ఎలాంటి వస్తువుల వ్యాపారం ఎక్కువగా ఉంటుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిఏఐటి రిపోర్ట్.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అందించిన సమాచారం ప్రకారం.. ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహాల బిజినెస్ రూ. 20 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తుంది. గతంలో చైనా నుంచి విగ్రహాలు దిగుమతయ్యేవి, కానీ క్రమంగా వీటి దిగుమతి భాగా తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో బిజినెస్ ఊపందుకుంది. ప్రస్తుతం మన దేశంలో పర్యావరణాన్ని కలుషితం చేయకూడదనే ఉద్దేశ్యంతో మట్టి, ఆవు పేడతో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి నిమజ్జనం కూడా చాలా సులభంగా ఉంటుంది. విగ్రహాలు తయారు చేసేవారు సంవత్సరం పొడువునా.. లేదా కొన్ని నెలలు అదేపనిలో నిమగ్నమైపోతారు. అయితే వినాయక చవితి ప్రారంభానికి ముందే దేశంలో బిజినెస్ మొదలైపోతుంది. ఇదీ చదవండి: మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు.. హోండా, కేటీఎమ్, కవాసకి ఈ ఏడాది కూడా అప్పుడే పండుగ శోభ మొదలైపోయింది.. హైదరాబాద్ నగరంలో ఏ వీధిలో చూసిన వినాయక విగ్రహాలు ఏర్పాటు వేగంగా జరుగుతోంది. కేవలం విగ్రహాలు మాత్రమే కాకుండా పూజా సామగ్రి, అలంకార వస్తువుల వ్యాపారం కూడా బాగా ఊపందుకుంటాయి. కొంతమంది బంగారం కొనుగోలు చేయడం కూడా సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇలా గణేష్ చతుర్థి సందర్భంగా కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఈ ఏడాది గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ వ్యాపారం జరుగుతుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ కామర్స్‌లో కొలువుల పండుగ
హైదరాబాద్: నిరుద్యోగులకు కొలువుల పండుగ రానుంది. పండుగల విక్రయాలకు ముందు ఈ కామర్స్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు చోటు చేసుకోనున్నాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ తగ్గింపులు, ఆఫర్లతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. దీంతో ఏడాది పండుగల సీజన్ సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు ఈ కామర్స్ సంస్థలు నెట్వర్క్ బలోపేతంపై దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కామర్స్ రంగంలో తాత్కాలిక ఉద్యోగాలు పెద్ద ఎత్తున రానున్నాయని నియామక సేవలు అందించే టీమ్‌లీజ్ సరీ్వసెస్ సంస్థ తెలిపింది. పరిశ్రమలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ఈ అంచనాకు వచి్చంది. కేవలం దక్షిణాదిలోనే 4 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 7,00,000 తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 30 శాతం చొప్పున కొలువులు ఏర్పడతాయని తెలిపింది. పండుగల సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర టైర్–1 పట్టణాల్లో నియామకాలు పెద్ద ఎత్తున ఉంటాయని, కోయంబత్తూర్, కోచి, మైసూర్ తదితర ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం నియామకాలు విస్తరించొచ్చని అంచనా వేసింది. వేర్‌హౌస్ కార్యకలాపాల్లో (గోదాములు) 30 శాతం, డెలివరీ విభాగంలో 60 శాతం, కాల్‌సెంటర్ కార్యకలాపాల కోసం 10 శాతం నియామకాలు ఉంటాయని పేర్కొంది. ‘‘గడిచిన త్రైమాసికం నుంచి ప్రముఖ ఈకామర్స్ సంస్థలు పండుగల సీజన్‌కు సంబంధించి ఆశావహ ప్రణాళికలను ప్రకటించాయి. వినియోగదారులు భారీగా ఉండడం, భారత్‌లో తయారీని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తుండడం, ఎఫ్‌డీఐ, డిజిటైజేషన్ తదితర చర్యలు దేశంలో తాత్కాలిక కారి్మకుల పని వ్యవస్థను అధికంగా ప్రభావితం చేస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సరీ్వసెస్ బిజినెస్ హెడ్ బాలసుబ్రమణియన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తాత్కాలిక కారి్మకులు దేశవ్యాప్తంగా 25 శాతం మేర పెరుగుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో అయితే ఇది 30 శాతంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష సీజనల్ ఉద్యోగాలు రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను అనుగుణంగా తాము సరఫరా వ్యవస్థలో లక్ష తాత్కాలిక (సీజనల్) ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ హబ్‌లలో ఈ నియామకాలు చేపట్టనుంది. స్థానిక కిరాణా డెలివరీ భాగస్వాములు, మహిళలు, వికలాంగులను సైతం నియమించుకోనున్నట్టు తెలిపింది. తద్వారా వైవిధ్యమైన సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ‘‘బిగ్ బిలియన్ డేస్ (డిస్కౌంట్ సేల్) నిజంగా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ కామర్స్‌లో ఉండే మంచి గురించి లక్షలాది మంది కస్టమర్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ మంది మొదటిసారి కస్టమర్లే ఉంటున్నారు’’అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రి తెలిపారు. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయాలు చేపడుతుంటుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఉండే సంక్లిష్టతలు, స్థాయికి అనుగుణంగా తాము సామర్థ్యాన్ని, నిల్వ స్థాయి, సారి్టంగ్, ప్యాకేజింగ్, మానవవనరులను, డెలివరీ భాగస్వాములను పెంచుకోవాల్సి ఉంటుందని బద్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 40 శాతానికి పైగా షిప్మెంట్లను స్థానిక కిరాణా భాగస్వాములతో డెలివరీ చేసే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. -
పండుగ సీజన్ అదిరింది.. రిటైల్ వ్యాపారులకు లక్ష కోట్లకు పైగా విక్రయాలు!
దీపావళి వస్తే వ్యాపారాలకు పండగే. ఎందుకంటే గృహాలంకరణ, దుస్తులు, టపాకాయలంటూ ప్రజలు భారీగా షాపింగ్ చేస్తుంటారు. అందుకే వ్యాపారులు ఈ సమయాన్ని ముఖ్యంగా భావిస్తారు. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా తెరపైకి వచ్చేస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు, స్థానికంగా ఉన్న వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు మొదలైన వారికి విక్రయాలకు పండగ సీజన్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ ఏడాది పండగ సందర్భంగా సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 23 వరకు, దేశంలో ఇప్పటికే 1.25 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) తెలిపింది. అయితే దీపావళి సేల్‌లో మొత్తం వ్యాపారం 1.50 లక్షల కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. శతాబ్దాలుగా భారతదేశంలోని వ్యాపారులు దీపావళి సందర్భంగా వారి వ్యాపార సంస్థలలో దీపావళి పూజను సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు చాలా వ్యాపారాలు డిజిటల్ టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. మరోవైపు జీఎస్టీ పోర్టల్ కూడా తోడవడంతో ఇప్పుడు అన్ని వ్యాపారాలు జీఎస్టీ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారులు దీపావళి పూజలో.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లను పూజిస్తారు. మరోవైపు బయోమెట్రిక్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ నగదు టెల్లర్లు, డిజిటల్ చెల్లింపులను మొదలైనవాటిని కూడా దీపావళి పూజలో చేర్చారు. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనల జోరు
-
క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ ఆఫర్లు.. భలే ఉందిగా!
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన క్రోమా దీపావళి పండగ సందర్భంగా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 20% వరకూ క్యాష్‌బ్యాక్, రెండేళ్ల కాలపరిమితితో అతి సులభమైన ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. పలు బ్యాంక్ కార్డులపై పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా క్రోమా స్టోర్లతో పాటు కంపెనీ వెబ్సైట్లో ఈ ఆఫర్లు అక్టోబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే!
పండుగ సీజన్ సందర్భంగా టెలికం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా ‘జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా‘ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం అక్టోబర్ 18 – 28 మధ్యలో కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్లు, ప్లాన్లు తీసుకునే వారికి రూ. 6,500 వరకు విలువ చేసే ప్రయోజనాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వీటిలో 100% వేల్యూ బ్యాక్‌తో పాటు, 15 రోజుల అదనపు వేలిడిటీ ఉచితంగా ఉంటాయని తెలిపింది. రూ. 599 ప్లాన్‌తో 6 నెలల రీచార్జి, అలాగే రూ. 899 ప్లాన్‌తో 6 నెలల రీచార్జి పథకాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ రెండింటితో పాటు నెలకు రూ. 899 చొప్పున మూడు నెలల ప్లాన్‌కి 100 శాతం వేల్యూ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది, కానీ 15 రోజుల అదనపు వేలిడిటీ మాత్రం లభించదు. ఏజియో, రిలయన్స్ డిజిటల్, నెట్‌మెట్స్, ఇక్సిగో వోచర్ల రూపంలో వేల్యూ బ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి. సదరు ప్లాన్లను కొనుగోలు చేసే వారు రూ. 6,000 విలువ చేసే 4కే జియోఫైబర్ సెట్ టాప్ బాక్స్ ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే పొందవచ్చని కంపెనీ తెలిపింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
పండగ సీజన్: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్ జోష్‌లో ఆ రంగం!
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. వినియోగ డిమాండ్‌ను అనుకూలంగా మలుచుకునేందకు తమ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్యాషన్, అప్పారెల్, ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు ఈ పండుగల సీజన్ కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 15–20 శాతం పెంచాయి. దీన్నిబట్టి కంపెనీలు విక్రయాలకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా నుంచి పండుగల సీజన్ మొదలు కాగా, ఇప్పటికే ఈ విభాగాల్లో విక్రయాలు అంచనాలను మించాయి. దీంతో కంపెనీలు సైతం తగ్గేదేలా అంటూ ప్రకటనలకు మరింత ఖర్చు చేస్తున్నాయి. ‘‘ఈ కామర్స్, అప్పారెల్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, బ్యూటీ, వెల్నెస్ ఉత్పత్తులు, వినోద, జ్యుయలరీ సంస్థలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను (నిధుల కేటాయింపులు) 15–20 శాతం పెంచాయి. పండుగల డిమాండ్‌కు అనుకూలంగానే ఇది ఉంది. ఈ కేటగిరీల్లో ఇప్పటి వరకు విక్రయాలు లక్ష్యాలను మించి నమోదయ్యాయి’’అని మీడియా టెక్నాలజీ స్టార్టప్ ఆర్డీ అండ్‌ఎక్స్ నెట్వర్క్ చైర్మన్ ఆశిష్ భాసిన్ తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో మాత్రం ప్రకటనల పరంగా ఆచితూచి అనుసరించే ధోరణి ఉన్నట్టు చెప్పారు. ఇక ముందూ కొనసాగొచ్చు.. పండుగల సమయాల్లో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుంటారు. గత రెండు సంవత్సరాల్లో కరోనా ప్రభావం కొనుగోళ్ల డిమాండ్‌పై చూపించింది. కానీ, ఈ ఏడాది వైరస్ ప్రభావం ఏమీ లేదు. సాధారణ ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో వినియోగ డిమాండ్ పట్టణాల్లో బలంగానే ఉంది. దీంతో విక్రయాలు గణనీయంగానే నమోదవుతున్నాయి. దీపావళి వరకు ఈ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. ఆ తర్వాత పండుగల సీజన్ కూడా కలిసొస్తుందని అన్నారు. విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లను ఈ సీజన్లో అందిస్తున్నట్టు ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. అన్ని మాధ్యమాల్లో తమ ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో ఎక్కువే.. ‘‘మా జ్యుయలరీ బ్రాండ్లు తనిష్క్, మియా, జోయ, కార్ట్‌లేన్‌కు సంబంధించి ప్రకటనలపై చేసే ఖర్చు గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో పెరిగింది’’అని టాటా గ్రూపు కంపెనీ టైటాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ చావ్లా తెలిపారు. ఎగువ మధ్య తరగతి, ఖరీదైన విభాగాల్లో వినియోగదారుల ఆసక్తి పెరిగినట్టు చెప్పారు. దీంతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా, మెరుగైన వృద్ధి అంచనాలను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగ విభాగంలో ఇప్పటి వరకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రకటనలపై అధిక వ్యయాలకు మద్దతునిస్తున్నట్టు చెప్పాయి. ఫ్రెంచ్ అప్పారెల్ బ్రాండ్ సెలియో సీఈవో సత్యేన్ మొమాయ మాట్లాడుతూ.. దసరా సమయంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడంతో ప్రకటనల బడ్జెట్‌ను 25 శాతం పెంచినట్టు ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
హైదరాబాద్: మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్ చేయకండమ్మా!
లాట్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లు మొబైల్ రిటైల్‌రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, హోం థియేటర్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్, టవర్ ఫ్యాన్, టీడబ్ల్యూఎస్ ఎయిర్ పాడ్స్, పోర్టబుల్ స్పీకర్, నెక్‌బ్యాండ్ హోం థియేటర్ కాంబో ఆఫర్లు లభిస్తాయన్నారు. స్మార్ట్ టీవీ రూ.8,999, ల్యాప్టాప్స్ రూ.17,499కే లభిస్తాయని తెలిపారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ పండుగలకు సంప్రదాయంతోపాటు ఆధునికత ఉట్టిపడే సరికొత్త వస్త్రాలతోపాటు నగలనూ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు ఆర్ఎస్ బ్రదర్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్వదినాలను తెలుగు మహిళలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. షాపింగ్ చేసిన వారికి 2.5 కేజీల బంగారం, 80 కేజీల వెండి, 150 శాంసంగ్ టీవీలు, 600 గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్ కుక్కర్లతోపాటు మరెన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. సౌత్ ఇండియా డిస్కౌంట్లు దసరా, దీపావళి పండుగల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌ను అందజేస్తోంది. చీరలు, మెన్స్‌వేర్‌పై డిస్కౌంట్‌తోపాటు అతి తక్కువ తరుగుతో బంగారు ఆభరణాలను, తరుగు, మజూరీ లేని వెండి ఆభరణాలను అందుబాటులో ఉంచినట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ పి.వి.ఎస్.అభినయ్ తెలిపారు. దసరా–దీపావళి లక్కీ బంపర్‌డ్రాలో భాగంగా రూ.ఆరుకోట్ల విలువైన బహుమతులను రెండువేల మంది విజేతలకు అందజేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా ఈనెల 5న, దీపావళి సందర్భంగా ఈనెల 25న బంపర్‌డ్రా ఫలితాలు వెల్లడించినున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్! -
బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు!
బెంగళూరు: పండుగ సీజన్ కావడంతో ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా సంస్థలు పోటీ పడి మరీ వినియోగదారులకు ఊహించని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో తమ మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తొలి రోజున ఏకంగా 87.6 లక్షల ఆర్డర్లు నమోదు చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మీషో స్పందిస్తూ.. ఒకే రోజున ఇంత భారీ స్థాయిలో ఆర్డర్లు రికార్డు చేయడం ఇదే తొలిసారని, గతేడాదితో పోలిస్తే 80 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. మెగా బ్లాస్టర్ సేల్ మూడు రోజులు పూర్తవగా ఇప్పటికీ కస్టమర్లు నిమిషానికి వేలల్లో ఆర్డర్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉన్నట్లు ట్వీట్ చేసింది మీషో. కాగా ఈ సంస్థ ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించడంతో పాటు భారీ స్థాయిలో మెగా బ్లాక్‌బస్టర్ సేల్ గురించి ప్రచారం చేసింది. దీంతో అదే స్థాయిలో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. 85 శాతం పైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే వచ్చినట్లు సంస్థ సీఎక్స్‌వో ఉత్కృష్ట కుమార్ తెలిపారు. ఫ్యాషన్, బ్యూటీ సాధనాలు, చీరలు మొదలుకుని వాచీలు, జ్యుయలరీ సెట్ల వరకూ 6.5 కోట్ల పైగా లిస్టింగ్స్‌ను అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. Customers are placing several thousand orders per minute during the #MeeshoMegaBlockbuster sale. ⏱️🚀 So our sellers have their hands full. 🙌#ecommerce For more seller stories: https://t.co/qyroCn4uxG pic.twitter.com/t9jbqYIX3b — Meesho (@Meesho_Official) September 26, 2022 చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
ఫెస్టివల్ సీజన్ కదా.. చిల్ అవ్వండి, ఉద్యోగులకు 11 రోజులు సెలవులిచ్చిన కంపెనీ!
నగర వాసుల డైలీ లైఫ్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ బిజీగా గడిపేస్తుంటారు. వారమంతా తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు విశాంత్రి అనే మాట మరిచి వీకెండ్లో కాస్త చిల్ అవుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఆ కాస్త రిలీఫ్ అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించిన ఓ కంపెనీ తమ ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండాలని భావించింది. అందుకే ఫెస్టివల్ సమయంలో బిజీగా గడిపిన అనంతరం వారి విశ్రాంతి కోసం ప్రత్యేకంగా పనికి బ్రేక్ పేరుతో సెలవులు ఇచ్చింది. వరుస పండుగల్లో బిజీ విక్రయాలతో ప్రజలు తీరిక లేకుండా ఈ ఫెస్టివల్ సీజన్ గడుపుతారు. అందుకే తమ కంపెనీ తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో వరుసగా రెండవ సంవత్సరం కూడా 11 రోజుల "రీసెట్ అండ్ రీఛార్జ్ విరామం"ని ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. అందులో.. "మేము వరుసగా రెండవ సంవత్సరం కంపెనీ-వ్యాప్తంగా 11-రోజుల విరామాన్ని ప్రకటించాం! రాబోయే పండుగ సీజన్‌తో పాటు వారి వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, మీషో ఉద్యోగులకు రీసెట్ & రీఛార్జ్ అనేది కొంత అవసరం కాబట్టి వారికి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We’ve announced an 11-day company-wide break for a second consecutive year! Keeping the upcoming festive season & the significance of #WorkLifeBalance in mind, Meeshoites will take some much-needed time off to Reset & Recharge from 22 Oct-1 Nov. Mental health is important. — Sanjeev Barnwal (@barnwalSanjeev) September 21, 2022 చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్‌బర్గ్! -
Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా!
Huge Crowd On Goa Beach Roads న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న వేళ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో డిసెంబర్ చివరి వారం నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దీంతో క్రిస్టమస్-న్యూ ఇయర్ పండగ సీజన్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం దాటిందని అధికారులు వెల్లడించారు. కాగా ఉత్తర గోవాలోని రోడ్లపై వందలాది మంది పర్యాటకులు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ‘కోవిడ్ వేక్కు ఇది రాయల్ వెల్కమ్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియో వైరల్ అవుతోంది. గడచిన 24 గంటల్లో గోవాలో 388 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటన్ తెల్పుతోంది. కొత్త కేసులు పెరగడంతో కోస్తా రాష్ట్రంలో 1,81,570కి చేరుకోగా, మరణాల సంఖ్య 3,523కు పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, వేలాది దేశీయ పర్యాటకులు ఈ విధంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి గోవా బీచ్, పబ్‌లకు తరలిరావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వాల్సిందిగా తాజాగా గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: Visakhapatnam: 2 మృతదేహాలు లభ్యం, మిగతావారి కోసం ముమ్మర గాలింపు.. This was Baga Beach in Goa ,last night. Please take the Covid scenario seriously. This is a Royal welcome to the Covid wave 👋 Mostly tourists. pic.twitter.com/mcAdgpqFUO — HermanGomes_journo (@Herman_Gomes) January 2, 2022 -
పండుగకు రైలు బండి గగనమే!!
సాక్షి హైదరాబాద్: ఈసారి సంక్రాంతికి సొంత ఊరుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్న నగర వాసులను వివిధ మార్గాల్లో నడిచే రైళ్లు నిరాశకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 నుంచి 300 వరకు చేరింది. కొన్ని రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. బెర్తులన్నీ పూర్తిగా భర్తీ కావడంతో ఫిబ్రవరి వరకు బుకింగ్ సేవలను సైతం నిలిపివేశారు. సాధారణంగా మూడు నెలల ముందే రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం ఉండడంతో డిసెంబర్లోనే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఇప్పటికిప్పుడు ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లడం సాధ్యం కాదు. కానీ ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే పెద్దగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కొన్ని రూట్లలో మాత్రం అరకొరగా అదనపు రైళ్లను ప్రకటించారు. పెరగనున్న రద్దీ.. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా జనం సొంత ఊళ్లకు వెళ్లకుండా నగరంలోనే సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. మరోవైపు రైళ్లు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఎంపిక చేసిన మార్గాల్లో అదనపు చార్జీలతో ప్రత్యేక రైళ్లు నడిపారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న వాళ్లు ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలపైన ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ని రూట్లలో రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరించారు. అదనపు చార్జీలను రద్దు చేశారు. ప్రస్తుతం నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు 120 ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, విజయవాడ,తిరుపతి, బెంగళూరు, ముంబయి, షిరిడీ, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో ఇప్పటికే బెర్తులు భర్తీ అయ్యాయి. రానున్న రోజుల్లో మరింత రద్దీ పెరగనుంది. ప్రత్యేకంగా విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్లకు మరింత డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. ప్రత్యేక రైళ్లు పది.. ఒకవైపు రద్దీ భారీగా ఉండగా, దక్షిణమధ్య రైల్వే మాత్రం తాజాగా సంక్రాంతి సందర్భంగా 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాచిగూడ–విశాఖపట్టణం (07497/ 07498) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 16 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ–నర్సాపూర్ (82716/07494) సువిధ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 11న రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాకినాడ–లింగంపల్లి ( 07491/07492) స్పెషల్ ట్రైన్ ఈ నెల 19, 21 తేదీల్లో రాత్రి 8.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 22 తేదీల్లో సాయంత్రం 6.40కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. నిరీక్షణే మిగిలింది.. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే గౌతమి. విశాఖ, నర్సాపూర్, ఫలక్‌నుమా, నారాయాణాద్రి, పద్మావతి, వెంకటాద్రి, తదితర అన్ని రైళ్లలో 250 నుంచి 300 కు పైగా వెయిటింగ్ లిస్టు పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకు ప్రయాణం చేసేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. స్లీపర్, ఏసీ బోగీలన్నీ నిండిపోయాయి. -
నవంబర్ 30 వరకు ఆంక్షలు పొడిగించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ చర్యలను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ముఖ్యంగా పండుగ సీజన్లో తగిన జాగ్రత్తలతో, సురక్షితంగా ప్రజలను బయటికి అనుమతించే మార్గదర్శకాలను అమలు చేయడం చాలా కీలకమని ఆయన చెప్పారు. దేశంలో రోజువారీ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా వైరస్ వ్యాప్తి ఉందని, ఇది ప్రజారోగ్య సవాల్‌గా కొనసాగుతోందని భల్లా లేఖలో పేర్కొన్నారు. పండుగ సీజన్లో టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేషన్, కోవిడ్ ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. -
పండుగ సందడికి చిప్‌ల సెగ.. నో డిస్కౌంట్స్?
న్యూఢిల్లీ: పండుగ సీజన్ వస్తోందంటే చాలు ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, మొబైల్స్ తదితర రంగాల సంస్థలు అమ్మకాలపై ఆశావహ అంచనాలతో ముందు నుంచే కాస్త ఉత్పత్తి పెంచుకుని, విక్రయాలకు సన్నాహాలు చేసుకుంటాయి. అటు కస్టమర్లు కూడా మంచి డిస్కౌంట్లు లభిస్తాయనే అంచనాలతో ఉంటారు. కానీ, కీలకమైన సెమీ కండక్టర్ చిప్‌ల కొరతతో ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. చిప్‌ల సరఫరాలో సమస్యల కారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ పడిపోయింది. ఒక్క ఆటోమొబైల్ పరిశ్రమలోనే ఏకంగా 5 లక్షల పైచిలుకు ఆర్డర్లు పేరుకుపోయినట్లు అంచనా. సాధారణంగానైతే పండుగల సీజన్లో భారీ డిస్కౌంట్లు పొందే కొనుగోలుదారులు ప్రస్తుత సందర్భంలో మాత్రం మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని టీవీలు, కార్ల దాకా మరింత ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కి తగ్గట్లుగా ఉత్పత్తులు అందుబాటులో లేకపోతుండటంతో ఆటోమోటివ్ షోరూమ్‌లలో ఉచిత ఆఫర్లు కనిపించడం లేదు. ‘బుకింగ్స్ లేదా ఎంక్వైరీలను బట్టి చూస్తే డిమాండ్ బాగానే ఉంది. కానీ సెమీకండక్టర్ల సమస్యతో ఈసారి దురదృష్టవశాత్తు సరఫరాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బుకింగ్స్ పేరుకుపోతున్నాయి .. ఉత్పత్తుల సరఫరా ఆ స్థాయిలో ఉండటం లేదు‘ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘పరిశ్రమలో 4.5 లక్షల నుంచి 5 లక్షల దాకా పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయని అంచనా. మారుతీ సుజుకీ ఆర్డర్లే దాదాపు 2.15 లక్షల నుంచి 2.2 లక్షల యూనిట్ల దాకా ఉన్నాయి‘ అని ఆయన వివరించారు. గృహోపకరణాల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కార్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటి తయారీలోను సెమీకండక్టర్ చిప్‌లు కీలకంగా ఉంటున్నాయి. ఆగస్టు నుంచే..: చిప్‌ల కొరత, పెండింగ్ ఆర్డర్ల సమస్య అక్టోబర్‌లో కొత్తగా వచి్చంది కాదని.. ఆగస్టు నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని శ్రీవాస్తవ తెలిపారు. సరఫరాపరమైన పరిమితుల కారణంగా ఈసారి డిస్కౌంట్లు, బొనాంజా ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉండొచ్చని పేర్కొన్నారు. నవరాత్రులు, దీపావళి వంటి పండుగల సీజన్లో ఒక్కసారిగా పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లు సాధారణంగా 40 రోజులకు సరిపడ నిల్వలను అట్టే పెట్టుకుంటూ ఉంటారని.. కానీ ఈసారి ఇది 15 రోజుల కన్నా తక్కువ స్థాయిలోనే ఉందని శ్రీవాస్తవ వివరించారు. గతేడాది అక్టోబర్ 1 నాటికి డీలర్ల దగ్గర స్టాక్ నిల్వలు 3.35 లక్షల యూనిట్లుగా ఉండగా.. ఈసారి అక్టోబర్ 1న ఇది 1.75 లక్షల యూనిట్లకే పరిమితమైనట్లు అంచనా. సెప్టెంబర్ 1న నిల్వలు 2.25 లక్షల యూనిట్లుగా నమోదైయ్యాయి. విడిభాగాల సరఫరాదారులను సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో.. ఇంజిన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు, కీ లెస్ ఎంట్రీ, ఏబీఎస్ సిస్టమ్స్ వంటి భాగాల సరఫరా తగ్గిపోయి వాహనాల తయారీ సంస్థలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. (చదవండి: Diwali Offers: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితం...!) ఎల్రక్టానిక్స్ రేట్లకు రెక్కలు... ఇప్పటిదాకానైతే చిప్‌ల కొరత తక్షణ ప్రభావాలు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సరఫరాపై మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ.. కొత్త సంవత్సరంలో మాత్రం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఎల్రక్టానిక్స్, ఉపకరణాల తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. చిప్‌ల కొరతతో సరఫరా తగ్గి, అంతిమంగా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఈ ధోరణి కనిపిస్తోందని, దేశీ మార్కెట్లోను ఇది జరగవచ్చని బ్రగాంజా పేర్కొన్నారు. పండుగ సీజన్ తర్వాత దేశీయంగా తయారీ రంగంపై ప్రభావం కనిపించవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ సీనియర్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ అభిప్రాయపడ్డారు. గత కొన్ని నెలలుగా వివిధ ఉత్పత్తుల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో కూడా ఈ ధోరణి కొనసాగవచ్చన్నారు. ధరలను ప్రత్యేకంగా పట్టించుకునే దేశీ మార్కెట్లో విడిభాగాల కొరతతో రేట్లు పెరుగుతూ పోతే .. అంతిమంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని సింగ్ చెప్పారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో టీవీల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉందని థామ్సన్, కొడక్, బ్లౌపంక్ వంటి బ్రాండ్లను విక్రయించే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. రాబోయే త్రైమాసికంలో ఉత్పత్తి 20–30 శాతం మేర మందగించవచ్చని, 2022 ఆఖరు దాకా ఇదే ధోరణి కొనసాగవచ్చని చెప్పారు. సరఫరా పడిపోవడంతో ఉత్పత్తుల రేట్లు పెరుగుతున్నాయన్నారు. గత త్రైమాసికంలోనే హై డెఫినిషన్, ఫుల్ డెఫినిషన్ టీవీల రేట్లు 35 శాతం దాకా పెరిగాయని.. వచ్చే త్రైమాసికంలో మరో 30 శాతం మేర పెరిగే అవకాశం ఉందని మార్వా పేర్కొన్నారు. (చదవండి: మెర్సిడెజ్ బెంజ్.. మేడిన్ ఇండియా.. ధర ఎంతంటే?) -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లు..!
త్వరలో రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు రిటైల్ లోన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ హోమ్లోన్స్, కార్లోన్స్కు వర్తించనుంది. హోమ్లోన్స్, కార్లోన్స్కు వర్తించే వడ్డీరేట్లపై సుమారు 0.25 శాతం మాఫీని ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా హోమ్‌లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపును కూడా అందిస్తోంది. గృహ రుణాలు 6.75 శాతం నుంచి , కారు రుణాలు 7.00శాతం నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతాయి. (చదవండి: Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!) కస్టమర్లు బాబ్ వరల్డ్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా సులభంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎమ్ హెచ్.టీ. సోలంకీ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో రిటైల్ లోన్ ఆఫర్లను ప్రవేశపెట్టడంతో కస్టమర్లకు తమ బ్యాంకు తరపునుంచి పండుగ ఉత్సాహాన్ని అందించాలని భావిస్తున్నామన్నారు. బ్యాంక్ కస్టమర్లకు కొత్త రుణాలు అందించడం కోసం గృహ రుణాలు, కారు రుణాలపై ఆకర్షణీయమైన ప్రతిపాదనతో బీవోబీ ముందుకు వచ్చిందన్నారు. తక్కువ వడ్డీరేట్లకు కస్టమర్లు రుణాలను పొందవచ్చునని పేర్కొన్నారు. ఆయా రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి కూడా మినహయింపు వస్తుందని తెలిపారు. చదవండి: SBI Home Loan: పండుగ సీజన్ రాకముందే ఎస్బీఐ ఆఫర్ల వర్షం -
మండుతున్న మటన్ ధరలు.. కేజీ ఎంతంటే!?
సాక్షి, ఖమ్మం : ఒక్కసారిగా మాంసాహారం ధరలు పెరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజల వినియోగాన్ని పసిగట్టిన మాంసాహార వ్యాపారులు అనూహ్యంగా ధరలు పెంచారు. పండుగ సందర్భంగా సహజంగా మాంసాహార ప్రియులు వారికి ఇష్టమైన మాంసాన్ని తింటారు. ప్రధానంగా కొనుగోలు చేసే చికెన్, మటన్, చేపల ధరలను వ్యాపారులు పెంచారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండేవి చికెన్, చేపలు. ఈ రెండింటి ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. కిలో రూ.180 వరకు పలుతున్న చికెన్ ధరను ప్రాంతాన్ని బట్టి రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయించారు. అదేమిటంటే డిమాండ్ అలా ఉందని చికెన్ సెంటర్ల యజమానులు చెబుతున్నారు. గ్రామాల్లో కన్నా నగరాలు, పట్టణాల్లో చికెన్ ధర అధికంగా ఉంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో చికెన్‌ను రూ.250 వరకు విక్రయించారు. పరిమిత ప్రాంతాల్లో లభించే నాటు కోళ్లకు కూడా బాగా ధర పెంచారు. రూ.300 వరకు లభించే కిలో నాటుకోడి రూ.400 వరకు విక్రయించారు. వేసవి కాలంలో, కోళ్లకు వ్యాధులు వచ్చి మరణాలు సంభవించినప్పుడు సహజంగా ధర పెరుగుతుంది. ప్రస్తుతం అటువంటిదేమీ లేనప్పటికీ ప్రజల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కిలోకు రూ.50 వరకు పెంచారు. ఇక చేపల పరిస్థితి అదే. రకాన్ని బట్టి చేపలకు ధర ఉంటుంది. సాధారణంగా కిలో చేపల ధర రూ.150 వరకు ఉండేది. దీపావళి పండుగ సందర్భంగా కిలో రూ.180 వరకు పెంచి విక్రయించారు. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగటాన్ని గుర్తించి వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. రొయ్యలు, కొర్రమేను వంటి చేపల ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం చేపలు పట్టే సీజన్ కాకపోవడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి చేపల చెరువుల్లో పెంచే చేపలను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధరను చెప్పుకోలేకుండా ఆకాశానికి అంటింది. కిలో రూ.800లుగా ఉన్న మటన్ ధర పండుగ సందర్భంగా రూ.1,000గా విక్రయించారు. సామాన్యులు, మధ్య తరగతి వర్గాలు మాత్రం మటన్ జోలికి వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున మటన్ విక్రయాలు జరిగాయి. పట్టించుకోని ప్రభుత్వ శాఖలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వ్యాపారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా, అనుమతులు లేకుండా, ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనలు పాటించకపోవటంతో పాటు ధరలను కూడా ఇష్టారీతిన పెంచి విక్రయిస్తున్నారు. స్థానికంగా నియంత్రించాల్సిన కింది స్థాయి ఉద్యోగులను లోబరుచుకొని వ్యాపారులు ఈ విక్రయాలు చేస్తున్నారు. రహదారుల వెంట, కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో మాంసం, చేపలు, చికెన్ వంటి మాంసాహారాన్ని విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలు సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పలువురు అనారోగ్యానికి గురైన ఘటనలు కూడా చోటుచేసుకున్నప్పటికీ నియంత్రించాల్సిన ప్రభుత్వ శాఖలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు, ధరలపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ధరలు పెంచి విక్రయిస్తున్నారు మాంసం ధరలను బాగా పెంచారు. పండుగ పేరుతో వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచి విక్రయిస్తున్నారు. చికెన్, చేపల ధరలు అందుబాటులో ఉండేవి. వాటిని కొనుగోలు చేసే వాళ్లం. అటువంటిది వాటి ధరలు కూడా అందకుండా పోతున్నాయి. – ఎ.వెంకటేశ్వర్లు, ప్రకాష్‌నగర్, ఖమ్మం మాంసం ధరలు ప్రియం మాంసం ధరలన్నీ పెరిగాయి. ప్రజల వినియోగాన్ని గమనించి ధర పెంచారు. గత వారం కన్నా దీపావళి పండుగ రోజున ధర పెరిగింది. మటన్ ధర రూ.200 వరకు పెరిగింది. చికెన్, చేపల ధరలు కూడా రూ.50 వరకు పెరిగాయి. – నల్లమోతు లక్ష్మయ్య, గుట్టలబజార్, ఖమ్మం -
కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్’ భయం!
సాక్షి. హైదరాబాద్: కరోనా మరోసారి కోరలు చాస్తుందా? ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్న ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా?... ఆ ప్రమాదం పొంచివుందని, ‘సెకండ్‌వేవ్’మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో కోవిడ్ ఉధృతి మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ మహమ్మారి అయినా సెకెండ్‌వేవ్‌లో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, తదితర పశ్చిమదేశాల్లో కోవిడ్ సెకెండ్‌వేవ్ కేసులు, ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మనదేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి (ఫస్ట్‌వేవ్) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే సెకెండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. పండుగల సీజన్లో వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రజలు ఏమేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై సెకెండ్‌వేవ్ తీవ్రత ఆధారపడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరికొన్ని రాష్ట్రాల్లో 2 వారాలుగా అధిక కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారులు పూర్తిగా అంతమొంది, కనుమరుగైపోవడానికి ముందు ‘మల్టీపుల్ వేవ్స్’గా వస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తం గానూ లేదా కొన్నిదేశాల్లో స్థానికంగానూ జరిగే అవకాశాలున్నాయని యశోద చీఫ్ ఇంటర్వెన్షెనల్ పల్మనాలజిస్ట్ డా. హరికిషన్ గోనుగుంట్ల తెలిపారు. మళ్లీ ఆసుపత్రుల్లో కోవిడ్ అడ్మిషన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయని, గతంలోనూ ఇదేవిధంగా నెమ్మదిగా అడ్మిషన్లు మొదలై ఆ తర్వాత కేసుల తీవ్రత, వైరస్ వ్యాప్తి పెరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. సెకెండ్‌వేవ్‌తో ముడిపడిన వివిధ అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. (ఏడాదికి 50 కోట్ల డోసులు) వచ్చేది చలికాలం... మనదేశం కరోనా బారినపడినపుడు ఇక్కడ ఎండాకాలం ఉందనేది గమనార్హం. సాధారణంగా వేసవిలో వైరస్ కొంత బలహీనంగా ఉంటుంది. ఇంకా మనం చలికాలంలోకి అడుగుపెట్టలేదు. ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలయ్యాక వైరస్ స్వభావం ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. భారీవర్షాలు, వరదల అనంతరం డెంగీ, టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు చలికాలంలో సాధారణంగానే ఇన్‌ఫ్లూయెంజా ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులకు ఇవి కూడా తోడైతే సమస్య జఠిలమయ్యే ప్రమాదముంది. కోవిడ్ వ్యాధిని ఇన్‌ఫ్లూయెంజా మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. అందువల్ల ఫ్లూకు సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకుంటే ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. మరింత అప్రమత్తత అవసరం పండుగల సీజన్లో ప్రజలు పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. కలుసుకోవడం, గుంపులుగా చేరడం పెరిగినందున ఇప్పుడు అప్రమత్తత అవసరం. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రానందున జాగ్రత్తలు ముఖ్యం. కొందరు కరోనా అధ్యాయం ముగిసిందనే భావనలో మాస్క్‌లు ధరించడం లేదు. సామాజిక దూరం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటించడం మానేశారు. దీనివల్ల మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే ›ప్రమాదముంది. పండుగల సందర్భంగా పెద్దసంఖ్యలో ఒకచోట గుమికూడటం, చిన్న గుంపులుగా ఒక దగ్గర చేరడం చేయొద్దు. ఇవే కొత్త హాట్స్పాట్లుగా మారాయనే విషయాన్ని గ్రహించాలి. ఇళ్లచుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వర్షాలు తగ్గాక అక్కడక్కడా డెంగీ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. దీనిపట్ల మరింత అప్రమత్తత, జాగురూకత అవసరం. -
కేంద్ర ఉద్యోగులకు బొనాంజా
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో వినిమయ డిమాండ్‌ను పెంచి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10 వేల వేతన అడ్వాన్స్‌ను, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లను అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు రూ. 12 వేల కోట్లను కేటాయించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆర్థిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) స్థానంలో ఈ సంవత్సరం క్యాష్ ఓచర్లను ఇస్తారు. జీఎస్టీ రిజిస్టర్డ్ అమ్మకందారు వద్ద, డిజిటల్ మోడ్‌లో, 12% లేదా అంతకుమించి జీఎస్టీ ఉన్న వస్తువులను కొనేందుకే వాటిని వినియోగించాలి. ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు ఆ ఓచర్లను వినియోగించడం కుదరదు. 2021 మార్చి 31లోగా వాడేయాలి. ఎల్టీసీ ద్వారా పొందే విమాన/రైలు చార్జీ కన్నా 3 రెట్లు ఎక్కువ విలువైన వస్తువులు/ సేవలను కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు ఎల్టీసీల స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వనున్నాయి. శాలరీ అడ్వాన్స్, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లతో మార్కెట్లో రూ. 28 వేల కోట్ల విలువైన డిమాండ్ ఉంటుందని నిర్మల వెల్లడించారు. ఎల్టీసీ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలకు కూడా, షరతులకు లోబడి, సంబంధిత మొత్తంపై పన్ను రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. రూ. 10 వేల శాలరీ అడ్వాన్స్‌ను 2021మార్చి 31లోగా ఉద్యోగులు ప్రీలోడెడ్ రూపే కార్డుల రూపంలో తీసుకోవాలి. వడ్డీ లేని ఆ రుణాన్ని గరిష్టంగా 10 వాయిదాల్లో చెల్లించాలి. సొంత ఊరికి లేదా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు పలు షరతులతో ఉద్యోగులకు ఎల్టీసీ లభిస్తుంది. అయితే, కరోనా కారణంగా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితులు నెలకొనడంతో ఆ స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ఎల్టీసీ క్యాష్ ఓచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఎల్టీసీ, శా లరీ అడ్వాన్స్ కోసం రూ. 11,575 కోట్లు, రా ష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణంగా రూ. 12 వేల కోట్లు ఉన్నాయన్నారు. అదనంగా రూ. 2500 కోట్లను కేంద్రం రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనుందని తెలిపారు. రాష్ట్రాలకు ప్రకటించిన రూ. 12 వేల కోట్ల రుణంలో రూ. 1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ. 900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు, రూ. 7,500 కోట్లు ఇతర రా ష్ట్రాలకు కేటాయించామన్నారు. ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
పండుగలు ఇంట్లోనే చేసుకోండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పట్లో తగ్గిపోయే అవకాశం లేదు కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ‘సండే సంవాద్’లో భాగంగా ఆయన ఆదివారం సోషల్ మీడియాలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రాబోయే పండుగ సీజన్లో ఊరేగింపులు, మతపరమైన సభలకు దూరం గా ఉండాలని సూచించారు. పండుగ వేడుకలతో తమను మెప్పించాలంటూ ఏ మతమూ, ఏ దేవుడూ ప్రజలను కోరరని అన్నారు. ఊరేగింపుల్లో పాల్గొని ముప్పు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. మన లక్ష్యం.. కరోనా అంతం త్వరలో ప్రారంభం కానున్న చలికాలంలో కరోనా వ్యాప్తి మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారినపడే అవకాశాలు ఉంటాయన్నారు. ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఏ సమాచారమైన పూర్తిగా నిర్ధారించుకోకముందే ఇతరులతో పంచుకోరాదని సూచించారు. కరోనా వైరస్, వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. అందుకోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొదటి దశలో రూ.3,000 కోట్లు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం దేశంలో కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం ఒకటి, రెండు, మూడో దశల్లో ఉన్నాయని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. కరోనా నిర్ధారణ కోసం దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఫెలూడా పేపర్ స్ట్రిప్ టెస్టు మరికొన్ని వారాల్లో నే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. -
అమెజాన్‌లో 10 లక్షల ఉద్యోగాలు
ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పండగ వేళ దేశంలో మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇందుకుగాను వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లక్షమంది సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకున్నట్లు ప్రకటించింది. కాగా వినియోగదారుల డిమాండ్ మేరకు డెలీవరీ సిబ్బందిని నియమించుకున్నామని అమెజాన్ తెలిపింది. మరోవైపు ప్రత్యక్ష నియమకాలు మాత్రమే కాకుండా పరోక్షంగా ప్యాకేజింగ్ విభాగాలలోకూడా అనేక మందికి ఉపాధి లభించినట్లు పేర్కొంది. అయితే దేశంలో టెక్నాలజీ, మౌలిక సౌకర్యాలు, లాజిస్టిక్స్ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దేశ కీలక రంగాలలో అనేక పెట్టుబడులు పెట్టనున్నామని, భారీ పెట్టుబడుల నేపథ్యంలో 2025 సంవత్సరం వరకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొంది. అయితే మరో నివేదిక రెడ్‌సీర్ ప్రకారం పండగ సీజన్లో కొనుగోళ్లు భారీ స్థాయిలో పెరుగుతామని, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహ రుణాలు పండగ సీజన్లో భారీ డిమాండ్‌కు అవకాశం ఉందని అభిప్రాయపడింది. (చదవండి: కరోనా : అమెజాన్‌లో వారికి భారీ ఊరట) -
పండగకు పోటెత్తిన పూలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ నేపథ్యంలో నగరానికి పూలు పోటెత్తాయి. గత వారమంతా బతుకమ్మ సందడి, నవరాత్రలతో పూలకు గిరాకీ బాగా ఉండగా...దసరాకు అది మరింత పెరిగింది. దీంతో గ్రేటర్ శివారు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం నగరానికి పూలు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా బంతి, చామంతి, గులాబీ పూలతోపాటు డెకరేషన్‌కు ఉపయోగించే పూలకు డిమాండ్ బాగా ఉంది. దసరాకు ఆయుధపూజలు నిర్వహించడంతోపాటు వాహనాలు, షాపులు, వివిధ సంస్థలను పూలతో అలంకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పూల విక్రయాలు పెరిగాయి. ఈసారి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గులాబీ, చామంతి, బంతితో పాటు ఇతర పూలు ఎక్కువ మొతాదులో మార్కెట్‌కు వచ్చాయని మార్కెట్ అధికారులు తెలిపారు. సోమవారం గడ్డిఅన్నారం మర్కెట్‌కు బంతి సుమారు 2 వేల క్వింటాళ్లు, చామంతి 800 క్వింటాళ్లు దిగుమతి అయ్యాయని మార్కెట్ వర్గాల అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా కనకాంబరం పూల ధర రికార్డు స్థాయిలో కిలో రూ.1500 పలికిందని మార్కెట్ అధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే బంతి పూలు రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగినట్లు అంచనా. బంతిపూల ధరలు తక్కువగా ఉండడంతో జనం ఇతర పూల కంటే వీటినే ఎక్కువగా కొనుగోలు చేశారు. దిగుమతులు అధికమవడం వల్లే బంతి పూల ధరలు తగ్గాయని వ్యాపారులు, రైతులు అంటున్నారు. గత ఏడాది బంతి రూ.50 నుంచి 80 రూపాయలు ధర పలికితే...ఈ ఏడాది రూ.50–30 మధ్యే ధరలు ఉన్నాయంటున్నారు. దీంతో తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోయారు. కేవలం కనకాంబరాల దిగుమతి తక్కువగా ఉండడం వల్లే రేటు బాగా పలికిందన్నారు. రైతులకు గిట్టుబాటయ్యేలా చర్యలు గతేడాది బంతి పూల ధర కిలో రూ.50 లోపే ఉండగా...చామంతి ధర అత్యధికంగా రూ.100 ఉంది. ఈ ఏడాది శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మోతాదులో ప్రత్యేకంగా బంతి, చామంతి, సెంట్‌గులాబీ, కాగడాలు, లిల్లీ తదితర రకాల పూలు దిగుమతి అయ్యాయి. డిమాండ్‌కు సరిపడ దిగుమతులు ఉంటే ధరలు సర్వసాధారణంగా పెరగవు. డిమాండ్‌కు తక్కువగా దిగుమతులు ఉంటే ధరలు పెరుగుతాయి. ధరలు మరింత పడిపోకుండా నియత్రించడానికి ప్రయత్నించాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కె. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
పండుగ సీజన్లో గోల్డ్ బాండ్ ధమాకా
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భౌతిక పసిడి కొనుగోళ్లను తగ్గించి, ఆ మొత్తాలను పూర్తిస్థాయి ఇన్వెస్ట్మెంట్గా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 7వ తేదీన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019–20– సిరీస్ 5కు శ్రీకారం చుట్టింది. ఈ సిరీస్‌లో పసిడి గ్రామ్ ఇష్యూ ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసిన, డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపిన ఇన్వెస్టర్లకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే వీరికి 3,738కే గ్రాము బాండ్ అందుబాటులో ఉంటుందన్నమాట. భౌతికపరమైన పసిడి డిమాండ్ తగ్గింపు, తద్వారా దేశీయ పొదుపుల పెంపు లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది. వ్యక్తిగతంగా ఒకరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల వరకూ విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేసే వీలుంది. హిందూ అవిభక్త కుటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టీల విషయంలో ఈ పరిమాణం 20 కేజీలుగా ఉంది. -
అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఈ పండుగల సీజన్లో కస్టమర్లకు భారీ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ‘గ్రేట్ ఇండియాన్ ఫెస్టివల్’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు భారీ ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ క్యాటగిరీ మెనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినవారికి 10 శాతం డిస్కౌంట్ ఉంటుదన్నారు. బజాన్ ఫిన్సర్వ్, కార్డుల ద్వారా కొనుగోలుచేసిన వారికి నో–కాస్ట్ ఈఎంఐ ఆఫర్ వర్తిస్తుంది. లక్షలాది సెల్లర్స్ అత్యంత తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమెజాన్‌లో అందించనున్నారని పేర్కొన్నారు. వేగవంతమైన డెలివరీ, 30–రోజుల మార్పిడి విధానం ఈసారి ప్రత్యేకతలన్నారు. గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్ విభాగాల్లో అమ్మకాలు పెరుగుతున్నాయన్నారు. -
ఆఫర్లతో హోరెత్తించనున్న ఫ్లిప్‌కార్టు
సాక్షి, బెంగుళూరు: రానున్న దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగులకు ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైన దేశీయ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా పండుగ సీజన్లో బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో దాదాపు రెట్టింపు విక్రయాలను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను కూడా బాగా వాడుకోనుంది. ఈ మేరకు ప్లిప్‌కార్ట్ ప్రతినిధులు తమ వ్యూహాలను వెల్లడించింది. భారతీయ వినియోగదారులకు అత్యంత విలువైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఫ్లిప్‌కార్ట్ కార్పొరేట్ అధికారిక రజనీష్ కుమార్ తెలిపారు. ఫ్లిప్‌కార్టు దసరా నుంచి క్రిస్మస్ వరకు వరుస ఆఫర్లతో హోరెత్తించనుంది. ముఖ్యంగా కంపెనీ ప్రధాన బ్రాండ్లు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో నూతన ఒరవడి సృష్టించనుంది. సోషల్ మీడియాతో ప్రజలకు దగ్గరవ్వడంతో పాటు,సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు వినియోగదారుల సమన్వయంతోనే తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సేవలను అందించడంలో భాగంగా గిడ్డంగులు, సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూనే మెరుగైన సేవలను అందిస్తామన్నారు. ఫ్లిప్‌కార్టు ఎగ్జిక్యూటివ్ స్పందిస్తూ 20శాతం నాణ్యమైన బ్రాండ్లతో 80శాతం అమ్మకాలను సాధించే విధంగా వ్యూహం రచిస్తున్నట్లు తెలిపారు. పండగ సీజన్లలో ప్రత్యేక ఉత్పత్తులను ప్రారంభిస్తామని తెలిపారు.. ప్రీ-ఆర్డర్లు, 50-70 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించనుంది. ఒక వస్తువు కొంటే మరొక వస్తువు ఉచితం లాంటి ఆఫర్లను ప్రవేశపెట్టనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో వినియోగదారులను ఆకర్షించే విధంగా తమ ప్రణాళిక ఉంటుందని బ్రాండ్లకు పంపిన ఇమెయిల్‌లో ఫ్లిప్‌కార్టు పేర్కొంది. -
సిటీకి చక్రాలు కావాలి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలవుతోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు దాదాపుగా 30 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్తారని అంచనా. తెలంగాణ నుంచి సంక్రాంతి, దసరా సమయాల్లో రద్దీ అధి కంగా ఉంటుంది. అందులోనూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలు సంక్రాంతికి తప్పకుండా స్వగ్రామాలకు వెళ్తారు. నగరం విస్తరిస్తోన్న దరిమిలా వీరి సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లడం ఓ ప్రహసనంగా మారింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా సంస్థలే కీలకం. అయితే.. పండుగల సమయంలో ఉండే రద్దీని నియంత్రిం చడం సాధ్యంకాకపోవడంతో.. ఈ వ్యవస్థలు అదనపు చార్జీల రూపంలో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇది సామాన్యుడిని ఆవేదనకు గురిచేస్తోంది. రైలు, బస్సుల టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పండుగపూట సొంతూరికి వెళ్లే భాగ్యం తమకు లేదా? అని వాపోతున్నాడు. ‘పంచాయతీ’ నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఊరికి రావాలంటూ పిలుపులు వస్తున్నందున.. ఈసారి తెలంగాణ పల్లెలకూ ప్రయాణికులు పోటెత్తుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో సహజంగానే రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొన్నటి దసరా సమయంలోనూ తెలంగాణ జిల్లాలకు ప్రజలు పోటెత్తారు. 50% అదనపు చార్జీలు చెల్లించి బస్సుల్లో వేలాడుతూ మరీ వెళ్లారు. ఒక్క నగరం నుంచే దాదాపుగా 10 లక్షల మందికిపైగా తెలంగాణ ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో సంక్రాంతి ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు సంక్రాంతికి తప్పకుండా వెళతారు. ఇలాంటి వెళ్లే వారి సంఖ్య దాదాపు 20 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. దీంతో ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు, రైళ్లపై అపుడే చర్చ మొదలైంది. ముందస్తుగా రైళ్లల్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి అదనపు ఛార్జీలు గండం తప్పినా.. అలాంటివారు చాలా తక్కువ. ఏపీ నుంచి వచ్చి నగరంలో స్ధిరపడిన వారిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి ముందస్తుగా సెలవులు వచ్చే అవకాశం తక్కువ. ఇలాంటి వారంతా జనవరి 7 తర్వాత ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. కాగా ఎప్పటిలాగే.. రైల్వే, ఆర్టీసీలు టికెట్లపై అదనపు ఛార్జీల పేరిట బాదుడుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే అదనపుగా ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.300 ఉండే టికెట్ ఛార్జీని రూ.3000 వరకు పెంచేస్తున్నాయి. వీరి చార్జీల పెంపునకు ఒక విధానమంటూ లేకపోవడంతో ఒకే గమ్యస్థానానికి రకరకాల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో నలుగురు సభ్యులున్న కుటుంబ ప్రయాణమంటే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రజారవాణానే కీలకం జనవరి మొదటివారం నుంచే సంక్రాంతి రద్దీ మొదలవుతుంది. ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ 2వ తేదీన ప్రకటించనుంది. దాదాపు 4,500 బస్సులను తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు నడపొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జనవరి 7 నుంచే రద్దీ ఊపందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ కూడా హైదరాబాద్‌కు 1000 బస్సుల వరకు నడపనుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల ద్వారా దాదాపుగా 20 లక్షలకు పైగా ప్రయాణం చేస్తారని అంచనా. సాధారణంగా తెలంగాణ, ఆంధ్రకు కలిపి రోజుకు 40 రైళ్లలో రాకపోకలు జరుగుతాయి. వీటిలో రోజుకు 56వేల మంది ప్రయాణిస్తారు. పండగ వేళ రోజుకు 3 ప్రత్యేక రైళ్లు తోడవడంతో ఈ సంఖ్య 60 వేలు దాట నుంది. 7వ తేదీ నుంచి 13 వరకు దాదాపు 4.5 లక్షల మంది రైళ్ల ద్వారా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు దందా.. ఇవి కాకుండా తెలంగాణ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో దాదాపు 7,800కు పైగా వివిధ కంపెనీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో ఛార్జీల గురించి తెలుసుకుంటేనే భయమేస్తోంది. సాధారణ రోజుల్లో రూ.300–500 రూపాయలుండే టికెట్‌ను తత్కాల్, ఇతర ఛార్జీల రూపంలో రూ.2,500 నుంచి 3,000 వరకు పెంచేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏకంగా ఒక్కో టికెట్‌కు రూ.4000కుపైగా వసూలు చేస్తున్నాయి. వీటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ట్రావెన్స్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రైవేటు ఆపరేట్ల బస్సుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు సొంతూళ్లకు వెళ్లనున్నారు. ఇక సొంత వాహనాల ద్వారా రెండు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లేవారు 1–2 లక్షల మంది ఉంటారని అంచనా. ఏ మార్గాల ద్వారా ఎంతమంది? రెండు ఆర్టీసీలు: 20 లక్షల మందికిపైగా రైలు మార్గాలు: సుమారు 5 లక్షలు ప్రైవేటు బస్సులు: దాదాపుగా 5లక్షల మంది సొంత, ఇతర వాహనాలు: సుమారుగా 2 లక్షలు మొత్తం : దాదాపు 30–35 లక్షలకుపైగా ప్రయాణం చేయనున్నారు. రైలు ఛార్జీలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు.. రైలు చార్జీల పెంపు వ్యవహారం కేంద్రమంత్రి వరకూ వెళ్లినట్లు సమాచారం. నగరానికి చెందిన జాతీయపార్టీ నేతలు అధిక ఛార్జీలపై పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు దీనిపై మంత్రికి నివేదిక కూడా ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం 9 ప్రత్యేక రైళ్లే వేసామని, పూర్తిస్థాయిలో రైళ్లు వేయలేదని, త్వరలోనే మరిన్ని రైళ్లు వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సంక్రాంతి సీజన్లో ఈ రైళ్లన్ని తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయని అందుకే ఎక్కువ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామని గోయల్‌కు వివరించారు. త్వరలోనే జనసాధారణ్ రైళ్లు సామాన్యుల కోసం త్వరలోనే జనసాధారణ్ పేరుతో రైళ్లను వేయనున్నట్లు తెలిపారు. 14–15 జనరల్ బోగీలతో ఉండే ఈ రైళ్లలో సాధారణ చార్జీలే ఉండనున్నాయని సమాచారం. -
ధరల మంట
పటాన్చెరు టౌన్: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. రోజురోజుకూ మార్కెట్లో పెరుగుతున్న రేట్లను చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకు పిల్లలకు పిండివంటలు చేసి పెడదామని ఆశపడ్డ తల్లులు పెరిగిన ధరలకు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నిన్న మొన్నటివరకు కిలో రూ.70 ఉన్న నూనె ధర ప్రస్తుతం రూ.85కి పెరిగింది. బియ్యం కిలో రూ.38 ఉండగా రూ.45 చేరింది. నువ్వులు కిలో రూ.100 ఉండగా ప్రస్తు తం రూ.120పైనే పలుకుతోంది. బెల్లం కిలో రూ.40 ఉండగా రూ.50పైగా విక్రయిస్తున్నారు. సం క్రాంతి పం డగకు వినియోగించే నూనెలు, నువ్వులు, పెసరపప్పు ధరలు అమాంతం పెరిగాయి. పిండివంట లు ప్రియం కావడంతో అవి లేకుండా పండుగ చేసుకో వాల్సి వస్తోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలు జరుపుకొనే పండుగ.. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చిన తర్వాత వచ్చే పండగ సంక్రాంతి. రైతులు ఈ పండగను అనందోత్సహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విద్యాసంస్థలకు వారం రోజుల పాటు సెలువులు ఇవ్వనుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, ఆడబిడ్డల రాకతో ప్రతి ఇంట్లో సందడి కనిపిస్తుంది. పండగకు ఇంటింటా పిండివంటల ఘమఘమలు వెదజల్లుతుంటాయి. ఈ ఏడాది ఆశించిన పంట దిగుబడుల రాకపోవడంతో రైతులు నష్టాల పాలయ్యారు. పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండడంతో పండుగ ఎలా జరుపుకునేదని గ్రామీణ ప్రజలు వాపోతున్నారు. పిండివంటలో పండుగ ఘనంగా చేసుకోవాలంటే అప్పు చేయక తప్పదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ ఎలా చేసేది? నిన్న మున్నటి వరకు పెరసపప్పు కిలో రూ.60 ఉంటే ఇప్పుడు కిలో రూ.75కు చేరింది. నూనె ధర అమాంతం పెరిగింది. పిండివంటలు చేసుకుందామంటే పామాయిల్ ధరలు కూడా అందిరావడం లేదు. అన్ని ధరలు ఇలా పెరిగితే పండుగ ఎలా చేసుకునేది. పండుగకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులను ప్రభుత్వం తక్కువ ధరలకు అందజేయాలి. – కొత్తకోట రాజేశ్వరి, గృహిణి రూ. వేలల్లో ఖర్చు చేయాలి రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో భయమేస్తోంది. పిండివంటలతో పండుగా వైభవంగా జరుపుకోవాలంటే వందల్లో వేలల్లో ఖర్చు చేయాల్సి వచ్చేలా ఉంది. కొత్త పంటలు చేతికి వచ్చే సమయంలో పండుగకు ధరలు దిగుతాయనుకుంటే పెరిగాయి. – సుధారాణి గృహిణి ధరలు ఇలా.. సరుకు రెండు నెలల క్రితం ప్రస్తుతం నువ్వులు 100 120 బియ్యం బీపీటీ 35 40 బియ్యం హెచ్ఎంటీ 44 48 సన్‌ఫ్లవర్ నూనె 75 85 పామాయిల్ 60 70 కందిపప్పు 65 70 పెసరపప్పు 68 75 మినుపపప్పు 70 75 -
కాసుల కష్టం మళ్లొచ్చె..
బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు అవసరానికి ఉపయోగపడని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఎన్ని బ్యాంకుల ఏటీఎంలు ఉన్నా.. డబ్బులు రాని పరిస్థితి. ప్రస్తుతం నగదు కొరత కారణంగా ఏటీఎంలలో బ్యాంకింగ్ వ్యవస్థ డబ్బులు పెట్టలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్ 7న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వీటి స్థానంలో రూ.2,000, రూ.500 నోట్లను విడుదల చేసింది. రద్దు చేసిన పెద్దనోట్లను బ్యాంకుల్లో తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రజల వద్ద ఉన్న నగదు డిపాజిట్ల రూపంలో బ్యాంకుకు చేరింది. అయితే బ్యాంకుల్లో చలామణి అయ్యే నగదు కొరత ఉండటంతో కొంతకాలం ఆర్బీఐ పలు నిబంధనలు విధించింది. నిత్యం రూ.4వేలు మాత్రమే విడుదల చేసుకోవచ్చనే షరతులు విధించింది. ఆ ప్రకారం కూడా వినియోగదారులకు నగదు అందించలేకపోయారు. అంతేకాక నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని బ్యాంకర్లను ఆదేశించాయి. ఎన్ని సంస్కరణలు, మార్పులు చేసినా.. ప్రజలు మాత్రం నగదు కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా ఈ సంబురాలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల బ్రాంచ్‌లు దాదాపు 350కి పైగానే ఉన్నాయి. వీటికి చెందిన ఏనీటైం మనీ(ఏటీఎం)లు 227 ఉన్నాయి. ప్రజలకు అవసరమైన తీరుగా బ్యాంకులు, ఏటీఎంల ఏర్పాటు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎంత మాత్రం ప్రయోజనం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ఆంధ్రా బ్యాంక్‌లకు చెస్ట్ వ్యవస్థ ఉంది. ఈ చెస్ట్ బ్యాంక్‌కు ఆర్బీఐ నగదు నిల్వలను పంపుతుంది. దీంతో మాతృ బ్యాంక్ బ్రాంచ్‌లతోపాటు పలు బ్యాంకులకు కూడా నగదు అందుబాటులో ఉంచుతారు. ఆర్బీఐ నిత్యం ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్‌లకు రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు నగదును పంపుతుంది. దీనిని చెస్ట్ బ్యాంక్ ఎక్కడ నగదు కొరత ఉంటే అక్కడకు పంపుతుంది. ఈ నగదుతోపాటు బ్యాంక్ లావాదేవీలను కూడా వినియోగిస్తూ ప్రజలకు ఎటువంటి నగదు ఇబ్బందులు లేకుండా అధికారులు చూస్తుంటారు. ప్రస్తుతం నగదు కొరత కారణంగా ఆర్బీఐ చెస్ట్ బ్యాంక్‌లకు నగదును చాలినంతగా పంపించటం లేదు. మూడు, నాలుగు రోజులుగా చెస్ట్ బ్యాంకుల్లో రూ.10కోట్లకు మించి నగదు నిల్వలు లేవని, ఆ నగదును అత్యవసర బ్యాంకులకు పంపిస్తున్నారని సమాచారం. దీంతో నగదు సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాలతోపాటు మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, మణుగూరు, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు, వైరా, కూసుమంచి కేంద్రాల్లో నగదు కోసం ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంల చుట్టూ.. పండగ కోసం జీతం డబ్బులు డ్రా చేసుకుందామని ఉదయం నుంచి ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా. గాంధీచౌక్, రాపర్తినగర్, జూబ్లీపుర సెంటర్లలో ఉన్న ఏటీఎంలకు వెళ్లా ఎక్కడా నగదు లేదు. ఏమి చేయాలో అర్థం కావటం లేదు. పండగకు పిల్లలకు బట్టలు తీసుకుందామనుకున్న కోరిక తీరుతుందో..? లేదో..? – లావుడ్యా తావుర్యా, రికార్డ్ అసిస్టెంట్, ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ వైఫల్యమే.. నగదును అందుబాటులో ఉంచకపోవటం ప్రభుత్వ వైఫల్యమే. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు నగదు డ్రా చేసుకుంటారనే విషయం బ్యాంకింగ్ వ్యవస్థకు తెలియదా..? ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు..? నగదు బ్యాంకులో ఉంచుకొని డ్రా చేసుకోలేక పోతున్నాం. పది ఏటీఎంల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. – అశోక్, ప్రైవేటు ఉద్యోగి, ఖమ్మం -
పండుగలకు ప్రత్యేక రైళ్లు
విజయవాడ : వరుస పండుగల నేపథ్యంలో పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్–తిరుపతి (07441) 27న సాయంత్రం 6.00కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.00కు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి–హైదరాబాద్ (07442) 28న మధ్యాహ్నం 2.15కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–కాకినాడ పోర్ట్ రైలు (07447) ఈనెల 29న సాయంత్రం 6.50కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. కాకినాడ పోర్ట్–హైదరాబాద్ రైలు (07448) డిసెంబర్ 30న సాయంత్రం 5.55కి కాకినాడ పోర్ట్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. -
‘మిలియన్’ మార్చ్
-
‘మిలియన్’ మార్చ్
సాక్షి, హైదరాబాద్: బస్సులు.. రైళ్లు.. ప్రైవేటు ట్రావెల్స్.. ఎక్కడ చూసినా జనమే జనం.. చిన్నాపెద్ద, పిల్లాజెల్లా.. అంతా కదులుతున్నారు.. ముఖంలో పండుగ సంబురం నింపుకొని పల్లెకు తరలుతున్నారు! సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరవాసులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. వారం రోజులుగా సుమారు 12 లక్షల మంది ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారు. ఏపీ కంటే తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఈ నెల 20 నుంచి పిల్లలకు స్కూలు సెలవులు ప్రకటించడంతో నగరవాసుల పల్లెబాట మొదలైంది. రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదేస్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచే కాకుండా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, లక్డీకాపూల్ తదితర చోట్ల నుంచి కూడా ప్రయాణికులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతోపాటు గత నాలుగు రోజులుగా ఆర్టీసీ సుమారు 1000 ప్రత్యేక బస్సులను నడిపింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తదితర ప్రాంతాల వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. రైళ్లల్లో రిజర్వేషన్లు లభించకపోవడంతో పలువురు దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. అయితే ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లకు పాల్పడింది. ప్రైవేట్ బస్సులు ఏకంగా డబుల్ చార్జీలు వసూలు చేశాయి. రోజువారీగా బయల్దేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మరో 50 రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. అయినా రద్దీ తగ్గడం లేదు. -
విమానాలే కాదు.. టికెట్ల ధరలూ ఆకాశంలోనే!
విమానంలో వెళ్తే సమయం ఆదా అవుతుందని, అందులోనూ వారం మధ్యలో అయితే చార్జీలు కూడా మరీ అంత ఎక్కువగా ఏమీ ఉండవని అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి.. ఎందుకంటే ఈ వారంలో మాత్రం అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది. స్వదేశంలోనే ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే విమాన టికెట్లు ఆకాశాన్నంటుతున్నాయి. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఏకంగా 25-30 వేల రూపాయల వరకు టికెట్లు ఉన్నాయని, అందుకే పేషెంటు అయిన తన తల్లితో కలిసి ఏసీ రైల్లోనే తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని ఒక రోజు తర్వాత వెళ్తున్నానని సురేష్ అనే యువకుడు చెప్పారు. దాదాపు అన్ని టికెట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. చాలావరకు విమానయాన సంస్థలు ముందుగా బుక్ చేసుకునేవారికి ఆఫర్లు అంటూ తక్కువ ధరలకు అందించడంతో చివర్లో మిగిలిన కొన్ని సీట్లకు టికెట్ ధరలు చాలా ఎక్కువగా పెడుతున్నారు. ఈ వారంలోనే చూసుకుంటే.. మంగళవారం నాడు హనుమాన్ జయంతి కావడంతో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో విమాన టికెట్ల ధరలు మోతెక్కాయి. శుక్రవారం నాడు గుడ్‌ఫ్రైడేతో పాటు అంబేద్కర్ జయంతి కూడా కావడంతో అది కూడా సెలవు అయ్యింది. తర్వాతి రెండు రోజులు వీకెండ్ కావడంతో గురు, శుక్రవారాల్లో కూడా టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. గురువారం సాయంత్రం బయల్దేరి ఇక్కడినుంచి వెళ్లి, ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున తిరిగి రావాలంటే ధరలు భరించలేని స్థితిలో ఉంటున్నాయి. ఘజియాబాద్‌కు చెందిన ఆర్తి సక్సేనా బెంగళూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాలనుకున్నారు. అతి తక్కువ ధరలకు టికెట్లు ఉండే విమానయాన సంస్థలలో కూడా వెళ్లి రావడానికి 30 వేలు అవుతుండటంతో తాను ప్రయాణం రద్దు చేసుకున్నట్లు ఆమె చెప్పారు. అలాగే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లి రావాలంటే 20 వేలు అవుతోంది. లోడ్ ఫ్యాక్టర్లు, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడంతో చివర్లో ప్రయాణాలకు తక్కువ సీట్లు మాత్రమే ఉంటున్నాయని, అందుకే ధరలు పెరుగుతున్నాయని యాత్రా సంస్థ ప్రెసిడెంట్ శరత్ దాల్ తెలిపారు. మెట్రో నగరాలలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, కానీ అలాంటప్పుడు అదనపు విమానాలు నడపాలంటే సాధ్యం కావట్లేదని అంటున్నారు. గత సంవత్సరం దేశంలో విమానాలు 10 కోట్ల ట్రిప్పులు తిరిగాయని, అంటే సగటున నెలకు 83 లక్షల ట్రిప్పులని చెబుతున్నారు. విదేశీ ప్రయాణాలు మాత్రం పెద్దగా పెరగట్లేదని, చివరి నిమిషంలో వాటికి ప్లాన్ చేసుకునేవారు తక్కువ కాబట్టి అవి మామూలుగానే ఉంటున్నాయని తెలుస్తోంది. గత సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే ఈసారి వేసవిలో విదేశీ ప్రయాణ టికెట్ల ధరలు తక్కువగానే ఉన్నాయంటున్నారు. -
పండుగ సీజన్లో రిటైల్ అమ్మకాలు 50% అప్!
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌లోని రిటైలర్లు ఈ పండుగ సీజన్లో వాటి అమ్మకాల్లో 45-50 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తునట్లు పరిశ్రమ సమాఖ్య అసోచామ్ పేర్కొంది. సులభ రుణ సదుపాయం, వివిధ ఆఫర్లు, పలు డిస్కౌంట్లు వంటి అంశాలు విక్రయాల పెరుగుదలకు కారణంగా నిలుస్తాయని తెలిపింది. ఈ-కామర్స్ సంస్థలకు ధీటుగా రిటైలర్లు కూడా వినియోగదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారని పేర్కొంది. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి పలు పట్టణాల్లోని రిటైలర్లు ఇప్పటికే వాటి అమ్మకాల్లో పెరుగుదల ప్రారంభమైనట్లు పేర్కొన్నారని వివరించింది. -
పై ఇంటర్నేషనల్ ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ ‘పై ఇంటర్నేషనల్’ తాజాగా వచ్చే పండగ సీజన్‌ను పురస్కరించుకొని వినియోగదారుల కోసం పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లకు రూ.13.5 కోట్ల విలువైన బహుమతులను అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఈ బహుమతులు పొందాలంటే పై ఇంటర్నేషనల్ ఔట్‌లెట్స్‌లో కనీసం రూ.2,000 పెట్టి షాపింగ్ చేయాలి. వీరికి కంపెనీ ఒక లక్కీ డ్రా కూపన్‌ను అందిస్తుంది. ఇక చివరగా నిర్వహించే లక్కీడ్రాలో గెలుపొందిన వారు కార్లు వంటి పలు ఖరీదైన బహుమతులను సొంతం చేసుకోవచ్చు. కాగా వినియోగదారులకు ఈ సదుపాయం హైదరాబాద్, క ర్ణాటకలోని పై ఇంటర్నేషనల్, పై మొబైల్స్, పై డిజిటల్స్, పై ఫర్నీచర్ ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. -
పండక్కి రావడం పక్కా!
వీలయితే సంక్రాంతి.. లేదంటే దసరా.. పండగ సీజన్లో వెండితెరపై సందడి చేయడం రామ్‌చరణ్ అలవాటు. ఇప్పటివరకూ ఈ మెగాపవర్ స్టార్ నటించిన చిత్రాల్లో ‘నాయక్’, ‘ఎవడు’ సంక్రాంతికి, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్లీ’ చిత్రాలు దసరాకి విడుదలయ్యాయి. ఈ దసరాకి కూడా రామ్‌చరణ్ రావడం పక్కా. రామ్ చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధ్రువ’. అక్టోబర్ 7న విడుదల కానుందీ సినిమా. దసరాకి వారం రోజుల ముందే రామ్‌చరణ్ రానున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రం ఫస్ట్ లుక్, పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న టీజర్‌ను విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘రోజా’ ఫేమ్ అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా, రామ్‌చరణ్ స్నేహితుడిగా నవదీప్ నటిస్తున్న ఈ సినిమా తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్’కి తెలుగు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ ఆది. -
పెయింట్ల కంపెనీలకు కలర్ ఫుల్ డేస్..!
♦ కలిసొచ్చిన పండుగల సీజన్ ♦ రానున్న రోజుల్లో అమ్మకాల జోష్ ♦ రూ. 40,000 కోట్లకు పెయింట్ పరిశ్రమ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :పెయింట్ల కంపెనీలకు కలర్‌ఫుల్ డేస్ మొదలయ్యాయి. అంతంత మాత్రంగా అమ్మకాలను నమోదు చేస్తున్న పరిశ్రమకు పండుగల సీజన్ జోష్‌నిచ్చింది. మొత్తం పరిశ్రమలో 70 శాతం వాటా ఉన్న డెకొరేటివ్ పెయింట్ల విక్రయాలు రెండంకెల వృద్ధి నమోదు చేయడంతో కంపెనీల ఆనందానికి అవధులు లేవు. దీనికితోడు అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీగా పతనమవడంతో తయారీ వ్యయం దిగిరావడం కూడా కలిసొచ్చింది. ముడిపదార్థాల ధరలు పెరిగినప్పుడల్లా పెయింట్ల ధరలను పెంచుతూ వచ్చిన కంపెనీలు.. కొద్ది రోజుల క్రితం ఏకంగా ఉత్పత్తుల ధరలు 12% దాకా తగ్గించడం పరిస్థితికి అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో మార్కెట్ మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. తగ్గిన పెయింట్ల ధరలు.. ముడిపదార్థాల వ్యయం అధికమైనప్పుడల్లా లాభాలపై ఒత్తిడి పెరుగుతోందంటూ కంపెనీలు పెయింట్ల (రంగుల) ధరలను పెంచుతూ వస్తున్నాయి. అయితే క్రూడ్ ధర ఇప్పుడు బారెల్‌కు 30 డాలర్ల దిగువకు వచ్చి చేరింది. దీంతో దాదాపు అన్ని కంపెనీలు పెయింట్ల ధరలను కొద్ది రోజుల క్రితం 10-12 % దాకా తగ్గించాయి. ముడిసరుకు ధర తగ్గిన స్థాయిలో పెయింట్ల ధరలను తగ్గించలేదని వాల్యూలైన్ పెయింట్స్ సీఈవో ప్రవీణ్ గుప్తా వెల్లడించారు. ధరలను తగ్గించినప్పటికీ కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయని చెప్పారు. ధర పెంచాలన్నా, తగ్గించాలన్నా అన్ని కంపెనీలు ఆసియన్ పెయింట్స్‌ను అనుసరిస్తాయని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. లాభాల్లో కంపెనీలు.. డిసెంబర్ క్వార్టరులో ఏషియన్ పెయింట్స్ నికర లాభం 26% ఎగసి రూ.463 కోట్లను ఆర్జించింది. ఆదాయం 14% వృద్ధితో రూ.4,160 కోట్లుగా ఉంది. ‘దేశీయంగా మార్కెట్ పరిస్థితి ఇంకా సవాల్‌గానే ఉంది. పండుగల సీజన్ తోడవడంతో డెకొరేటివ్ విభాగం పరిమాణం పరంగా రెండంకెల వృద్ధి నమోదు చేసింది’ అని ఏషియన్ పెయింట్స్ ఎండీ కె.బి.ఎస్.ఆనంద్ వెల్లడించారు. క్రితంతో పోలిస్తే ఆటోమోటివ్ పెయింట్లకు డిమాండ్ పెరిగిందన్నారు. ఇక సెప్టెంబరు త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ నికర లాభం 33% వృద్ధి చెంది రూ.89 కోట్లుగా ఉంది. కన్సాయ్ నెరోలాక్ 33 శాతం వృద్ధితో రూ.97 కోట్లను ఆర్జించింది. డిసెంబర్ క్వార్ట ర్లో ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తాయన్న అంచనాలున్నాయి. రానున్నది మంచి కాలం.. గత ఏడాది పరిశ్రమ 15% వృద్ధి నమోదు చేసిందని కంపెనీలంటున్నాయి. 2014 వరకు పరిశ్రమలో సింహ భాగమైన డెకొరేటివ్ వి భాగం స్తబ్దుగా ఉంది. రీపెయింటింగ్ పెద్దగా జరగలేదు. పైగా త క్కువ ఖరీదైన ఉత్పత్తులను కస్టమర్లు ఎంచుకోవడమే ఇందుకు కారణమని పెర్లాక్ మార్కెటింగ్ డెరైక్టర్ లాజర్ ఆంటోనీ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఇక రానున్న రోజుల్లో స్మార్ట్‌సిటీల ని ర్మాణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతుల ఏర్పాటు, హౌసింగ్ స్కీమ్స్‌కు పెద్ద ఎత్తున వెచ్చించనున్నాయి. అటు వాహన రంగం రికవరీ బాటలో వెళ్తోంది. వెరశి రానున్న రోజుల్లో దేశవ్యాప్తం గా పెయింట్ కంపెనీలకు కలర్‌ఫుల్ డేస్ అని లాజర్ పేర్కొన్నారు. ఇదీ మార్కెట్.. భారత్‌లో పెయింట్ మార్కెట్ పరిమాణం సుమారు రూ.40,000 కోట్లకుపైమాటే. ఇందులో డెకొరేటివ్ (గృహాలకు వాడే) పెయింట్ల వాటా అత్యధికంగా 70 శాతముంది. మొత్తం పరిశ్రమలో వ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం కాగా, అవ్యవస్థీకృత రంగం 30 శాతం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత రంగంలో ఏషియన్ పెయింట్స్ రారాజుగా వెలుగొందుతోంది. ఈ కంపెనీకి ఏకంగా 55 శాతం వాటా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కన్సాయ్ నెరోలాక్, బెర్జర్ పెయింట్స్, అక్జో నోబెల్‌లు ఉన్నాయి. ఇక పర్యావరణ అనుకూల పెయింట్లకు మెల్లమెల్లగా డిమాండ్ పెరుగుతోంది. సాధారణ పెయింట్లతో పోలిస్తే వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో వృద్ధి మందకొడిగా ఉంది. వినియోగం పెరిగితే ధరలు దిగొస్తాయని కంపెనీలు అంటున్నాయి. విస్తరణలో దిగ్గజాలు.. రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో ఏషియన్ పెయింట్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్లాంట్ల సామర్థ్యం పెంచే పనిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ వద్ద 4 లక్షల కిలోలీటర్ల వార్షిక సామర్థ్యంగల ప్లాంటు నెలకొల్పుతోంది. కర్ణాటకలోని మైసూరు వద్ద 6 లక్షల కిలోలీటర్ల వార్షిక సామర్థ్యంతో అతిపెద్ద ప్లాంటును రూ.2,300 కోట్లతో నెలకొల్పుతోంది. హరియాణాలోని రోహ్తక్ ఫెసిలిటీ సామర్థ్యాన్ని రెండింతలు చేస్తున్నట్టు ఆసియన్ పెయింట్స్ సేల్స్, మార్కెటింగ్ ప్రెసిడెంట్ అమిత్ సింగ్లే వెల్లడించారు. అస్సాంలో రెండు ప్లాంట్లను రూ.60 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు బెర్జర్ పెయింట్స్ చైర్మన్ కె.ఎస్.ధింగ్రా తెలిపారు. కన్సాయ్ నెరోలాక్ రూ.180 కోట్లతో పంజాబ్‌లో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. నవీ ముంబైలో రూ.40 కోట్లతో భారీ ఆర్అండ్డీ కేంద్రాన్ని సైతం స్థాపిస్తోంది. స్టీలు, సిమెంటు, పవర్ రంగాల్లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పెయింట్ల పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. రూ.1,000 కోట్లతో పశ్చిమ బెంగాల్లో ప్లాంటు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సొంత అవసరాలకూ పెయింట్ ఉపయోగపడుతుందన్నది కంపెనీ ఆలోచన. -
పండుగల్లో జాగ్రత్త..!.
* దేశంలోకి చొరబడిన ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు * టార్గెట్‌లో హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాలు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నడుస్తున్న పండుగల సీజన్ నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టించడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నినట్లు కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) హెచ్చరించింది. దీని కోసం సుశిక్షితులైన ఐదుగురు ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపినట్లు స్పష్టం చేసింది. విధ్వంసాలు సృష్టించడంతో పాటు మతకలహాలు రెచ్చగొట్టగానికీ వీరు ప్రయత్నించే ప్రమాదం ఉందని అన్ని రాష్ట్రాలకూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మద్దతుతో పేట్రేగిపోతున్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థలు లష్కరేతొయిబా (ఎల్ఈటీ), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)లకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పాక్‌లో శిక్షణ పొందినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటీవలే వీరు దేశంలోకి ప్రవేశించారని, ఆయా నగరాల్లోని స్లీపర్ సెల్స్ సహకారంతో కుట్ర అమలు చేసేందుకు ప్రయత్నించవచ్చని ఎంహెచ్ఏకు నివేదించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాలకూ హెచ్చరికలు జారీ చేసింది. మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు జనసమ్మర్థ ప్రాంతాలపై డేగకన్ను వేసి ఉంచాలని, భద్రతా విధుల కోసం అదనపు బలగాలు మోహరించాలని సూచించింది. -
ఎస్ఎంఎస్లతో జర జాగ్రత్త!
* షాపింగ్ ప్రియులకు గాలం * లాటరీ పేరిట ఎస్ఎంఎస్లు * సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు * ఆశ పడితే అంతే సంగతులు సాక్షి, సిటీబ్యూరో: పండుగ సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి అరుణ్ ఓ షాపింగ్ మాల్కి వెళ్లాడు. అక్కడ ‘వెల్కమ్’ అంటూ ఓ వ్యక్తి ఎదురొచ్చాడు. వివిధ ఆఫర్ల గురించి చెబుతూ వీరి పూర్తి వివరాలను సేకరించాడు.కొన్ని రోజుల వ్యవధిలోనే అరుణ్ సెల్ నంబర్కురూ.50 కోట్ల లాటరీ తగిలిందంటూ కోకాకోలా కంపెనీ పేరిట ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో ఆయన ఎగిరి గంతేశాడు. వాళ్లు చెప్పినట్టుగా పన్నుల పేరిట దఫదఫాలుగా సుమారు రూ.పది లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న అరుణ్ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు దొరికినా... డబ్బులు మాత్రం రికవరీ కాలేదు.... ఇది ఒక్క అరుణ్ పరిస్థితే కాదు... షాపింగ్ మాల్స్‌కు వెళ్లిన వేలాది మందికి లాటరీలని, తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలిస్తామని... ఇలా వివిధ రూపాల్లో సెల్ఫోన్లకు ఎస్ఎంస్లు వెల్లువెత్తుతున్నాయి. ‘లక్’ ఎంతో పరీక్షించుకుందామని ప్రయత్నిస్తున్న వారు అడ్డంగా దొరికిపోతున్నారు. షాపింగ్ ప్రియులే టార్గెట్... ఇన్నాళ్లూ ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఫోన్ నంబర్లను సేకరిస్తున్న సైబర్ ముఠాలు... ఇప్పుడూ ఏకంగా షాపింగ్ ప్రియులనే టార్గెట్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తో పాటు వివిధ దుకాణాలు ప్రకటిస్తున్న ఆఫర్లకు క్యూ కడుతూ... లక్కీ డ్రా తలుగుతుందనే ఆశతో తమ చిరునామాతో సహా పూర్తి వివరాలను సమర్పిస్తున్న వారి నుంచి నయా పద్ధతుల్లో డబ్బులు లాక్కొనే ప్రయత్నానికి తెర లేపాయి. వివిధ పద్ధతుల్లో తమ నెట్వర్క్ ద్వారా షాప్‌ల నుంచి చిరునామాలను సేకరించి లాటరీల పేరుతో సెల్ఫోన్లో ఎస్ఎంస్లు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నాయి. బంపర్ ఆఫర్లు, లక్కీ డ్రాలపై ఆశతో ఉన్న కొందరి బలహీనతను ఆసరాగా చేసుకుంటే రూ.లక్షల్లో కొట్టేయవచ్చని పథకాలు రచిస్తున్నాయి. జంట పోలీసు కమిషనరేట్లలోనే కాదు... దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఈ తంతుకు తెరలేపి ఒకేసారి లాటరీల పేరిట లక్షల మందికి ఎస్ఎంఎస్లు పెడుతున్నారు. బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, రిబాక్, నైక్, సోనీ, మెర్సిడెజ్ బెంజ్ కంపెనీల లాటరీలు తగిలిందంటూ పంపిన ఎస్ఎంఎస్లకు స్పందించిన వారిని నమ్మించి పన్నుల రూపంలో బాదేస్తున్నారు. మరి కొంతమందికి తక్కువ వడ్డీలకు రూ.లక్షల్లో రుణం ఇప్పిస్తామని నమ్మించి కుచ్చు టోపీ పెడుతున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరిట భారీమొత్తంలో డబ్బు కాజేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి... పెద్ద మాల్స్‌లో షాపింగ్ చేసేటప్పుడు... పెట్రోల్ బంక్‌లలో కార్డులు వినియోగించినప్పుడు వాటిని నైజీరియన్లు హ్యాక్ చేస్తున్నారు. తమ నెట్‌వర్క్‌తో వారి చిరునామాలను సంపాదిస్తున్నారు. ఆ తర్వాత లాటరీ పేరుతో బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. స్పందించిన వారికి భారీ మొత్తంలో టోకరా పెడుతున్నారు. అందుకే లాటరీ వచ్చిందని ఎస్ఎంఎస్లు వస్తే జాగ్రత్తపడాలి. - జయరాం, ఏసీపీ, సైబరాబాద్ సైబర్ క్రైమ్ -
జోరుగా వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌కు ముందు సెప్టెంబర్ నెలలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోర్డ్, టాటా మోటార్స్ అమ్మకాలు పెరిగాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించడంతో వడ్డీరేట్లు దిగొస్తాయని దీంతో అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వ్యక్తం చేశారు. మారుతీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఎస్-క్రాస్ కార్లు 3,600 అమ్ముడయ్యాయి. హుందాయ్ కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ దేశీయ అమ్మకాలు(42,505) సాధించింది. క్రెటా, ఇలీట్ ఐ20, ఐ20 యాక్టివ్, గ్రాండ్ కార్ల కారణంగా రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించామని కంపెనీ పేర్కొంది. కొత్త ఫిగో, యాస్పైర్‌ల కారణంగా ఈ పండుగల సీజన్లో తమ అమ్మకాలు మరింత పుంజుకోగలవని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనురాగ్ మెహరోత్ర గణాంకాల విడుదల సందర్భంగా చెప్పారు. -
పండుగ రోజుల్లో ఢిల్లీపై ఐఎస్ఐఎస్ కన్ను?
దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి ఈ వివరాలు ప్రస్తుతం ఢిల్లీ స్పెషల్ సెల్‌కు వెళ్లాయి. వాళ్లు మొత్తం పరిస్థితిని గమనిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. 'లోన్ వుల్ఫ్' అనే బృందం లేదా ఒక వ్యక్తి ఢిల్లీలో దాడులు చేయొచ్చని ఉగ్రవాదుల సంభాషణలను రహస్యంగా సేకరించిన నిఘా వర్గాలు తెలిపాయి. సిమి సభ్యులు కూడా ఐఎస్ఐఎస్ కోసం పనిచేసే అవకాశం కూడా లేకపోలేదని, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దాడులకు పాల్పడొచ్చని చెబుతున్నారు. సిమి ఎప్పుడూ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి దాడులకు తెగబడుతుంటుంది. ఇదే తరహా వ్యూహాన్ని ఆ తర్వాత ఇండియన్ ముజాహిదీన్ కూడా అవలంబిస్తోంది. ఉగ్రవాదుల దాడులకు ఢిల్లీ సులభంగా టార్గెట్ కావొచ్చని చెబుతున్నారు. ప్రధానంగా ఏయూటీ అనే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో కలిసిపోవడంతో ఈ ప్రమాదం పెరిగిందని అంటున్నారు. 2008లో జరిగిన బాట్లాహౌస్ ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదులను 'అమరవీరులు'గా పేర్కొంటూ ఏయూటీ సంస్థ గత సంవత్సరం సెప్టెంబర్‌లో సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఇటీవలి కాలంలో ఏయూటీ సంస్థకు, ఇస్లామిక్ స్టేట్‌కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని, కొంతమంది యువకులు ఈ రెండు సంస్థలను సంప్రదించినట్లు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని నిఘా వర్గానికి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతోపాటు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి సంస్థల నుంచి కూడా ఢిల్లీకి ముప్పు పొంచి ఉంది. -
10 వేల నుంచి 10 లక్షలు పలుకుతున్న గణపయ్య
-
అన్నా-చెల్లెళ్ల బంధానికి ప్రతీక రక్షాబంధన్
-
గదుల్లేవంటూ చేతులెత్తేసిన హొటళ్లు
-
కొలువులకు పండుగ కళ
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో జాబ్ మార్కెట్ కళకళ్లాడనుంది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు 3-4.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ-కామర్స్, ఆతిథ్య, రిటైల్ తదితర రంగాల్లో హైరింగ్‌కు భారీ డిమాండ్ ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార సెంటిమెంట్లు, పరిస్థితులు మెరుగవుతుండటంతో కొన్ని నెలలుగా నియామకాలూ పెరుగుతున్నాయి. తాజాగా పండుగ సీజన్ ఇందుకు మరింత ఊతం ఇవ్వనుంది. 5-15 శాతం మేర హైరింగ్ పెరగగలదని అంచనా వేస్తున్నట్లు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. క్యాష్‌కరోడాట్‌కామ్ వెబ్సైట్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. డిస్కౌంటు ఆఫర్లు, షాపర్లు మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తుండటం వంటి కారణాలతో ఈ ఏడాది పండుగల సీజన్లో మిగతా కాలంతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 300 శాతం పెరిగినట్లు వివరించారు. దీనికి అనుగుణంగా కంపెనీలు సిబ్బందిని కూడా పెంచుకోవాల్సి ఉంటుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ సేన్ తెలిపారు. మెట్రో, కాస్మోపాలిటన్ సిటీల్లోని ఆర్గనైజ్డ్ రిటైల్ రంగంలోనే కనీసం 25,000 పైచిలుఉక ఉద్యోగాల కల్పన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత్‌లో ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ ఉన్నా.. చివరి నెలల్లో దసరాతో మొదలు పెట్టి న్యూ ఇయర్ దాకా భారీగా షాపింగ్ జరుగుతుందని లేబర్‌నెట్ సర్వీసెస్ సీఈవో గాయత్రి వాసుదేవన్ చెప్పారు. ఈ నె లల్లో వివిధ ఉత్పత్తులు, సేవల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని..తదనుగుణంగా కంపెనీలకు అదనంగా మానవ వనరులూ అవసరమవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ సేవల కోసం పార్ట్ టైమ్ సిబ్బందిని తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే, ఎఫ్ఎంసీజీ కంపెనీలు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్‌ను, రిటైల్ సంస్థలు సేల్స్ అసోసియేట్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటున్నట్లు గాయత్రి తెలిపారు. బోనస్‌లు.. ఎకానమీ కోలుకుంటున్న సంకేతాల కారణంగా ఉద్యోగాలు పండుగ బోనస్‌లు, ప్రోత్సాహకాలు మొదలైన వాటిని ఆశించవచ్చని సుదీప్ సేన్ చెప్పారు. అయితే, రంగాల వారీగా చూస్తే ఇది మిశ్రమంగా ఉంటుందన్నారు. ఐటీ రంగంలో బోనస్‌లు ఇవ్వడం కొనసాగుతుందని అయితే ఇది కచ్చితంగా నగదు రూపంలోనే కాకుండా ట్రావెల్ టికెట్లు, గిఫ్టులు, బీమా పాలసీలు (తొలి ఏడాది ఉచిత ప్రీమియంతో) మొదలైన వాటి రూపంలో ఉండొచ్చని సేన్ తెలిపారు. -
విద్యుత్ సంక్షోభం
- ఆగిపోయిన పవన్ విద్యుత్ ఉత్పత్తి - 2500 మెగావాట్లకు చేరుకున్న కొరత - రాష్ర్టంలో మళ్లీ మొదలైన అధికారిక కోతలు సాక్షి, చెన్నై : రాష్ర్టంలో రోజుకు విద్యుత్ వాడకం 13 వేల మెగావాట్లు. ఉత్పత్తి అందుకు భిన్నంగానే ఉంది. దీంతో రాష్ట్రంలో కోతలు అమలు చేయక తప్పలేదు. ఈ కోతల్ని ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. లోక్ సభ ఎన్నికల్ని టార్గెట్ చేసిన అన్నాడీఎంకే సర్కారు, విద్యుత్ ఉత్పత్తి మెరుగు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందడం, ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు చర్యలు చేపట్టడంతో కొంత మేరకు కొరతను అధిగమించారు. ఎన్నికల ముందు కొద్ది రోజులు సంపూర్ణ విద్యుత్‌ను అందించిన అధికార యంత్రాంగం, ఎన్నికల అనంతరం మళ్లీ పనితనాన్ని ప్రదర్శించే పనిలో పడింది. గత నెల వరకు కోతల రహితంగా విద్యుత్‌ను అందించారు. అయితే గత నెలాఖరులో విద్యుత్ చార్జీల వడ్డనకు కసరత్తులు ఆరంభం కావడం, మరుసటి రోజే పరిశ్రమలకు విద్యుత్ ఆంక్షల చిట్టా వెలువడడంతో మళ్లీ కోతలు ఆరంభమైనట్టేనన్న సంకేతాలు వచ్చాయి. కోతలు: పండుగ సీజన్ ఆరంభం కావడంతో సంపూర్ణ విద్యుత్ తక్కుతుందన్న ఆశాభావం ప్రజల్లో ఉన్నా, చివరకు సంక్షోభం పుణ్యమా కోతల్ని ఎదుర్కొనక తప్పలేదు. ప్రధానంగా రాష్ట్రంలో గత నెల 25 నుంచి క్రమంగా విద్యుత్ కొరత ఏర్పతోంది. 26న 940 మెగావాట్లు, 27న 1194 మెగావాట్లు, 29న 2200 మెగావాట్లు ఉన్న విద్యుత్ కొరత, బుధవారానికి 2500 మెగావాట్లకు చేరింది. రోజుకు 2500 మెగావాట్ల కొరత ఏర్పడటంతో కోతల మోత మోగించేందుకు రాష్ట్ర విద్యుత్ బోర్డు సిద్ధం అయింది. గ్రామాల్లో నాలుగు గంటల మేరకు, నగరాల్లో రెండు గంటల మేరకు కోతలు విధించే పనిలో పడ్డారు. అనధికారిక కోతలు అడపాదడపా అమల్లో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతంత మాత్రమే. ఈ సంక్షోభం క్రమంగా తీవ్రరూపం దాల్చిన పక్షంలో గ్రామాలు అంధకారంలో మునగాల్సిందే. పవనం జాడేదీ? : దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, విరుదునగర్, తేని తదితర జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. పశ్చిమ పర్వత శ్రేణుల్ని ఆనుకుని ఉన్న జిల్లాల్లో పవన విద్యుత్ ఇన్నాళ్లు ఆశాజనకంగా ఉంది. రెండు వేల మెగావాట్ల వరకు పవన విద్యుత్ అందుతుండగా, రెండు రోజుల క్రితం నుంచి క్రమంగా ఉత్పత్తి తగ్గుతూ వచ్చింది. చివరకు ఉత్పత్తి జీరోకు చేరడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. అలాగే, నైవేలిలో సాగుతున్న ఒప్పంద కార్మికుల సమ్మె పుణ్యమా అని అక్కడ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతున్నది. దీంతో రాష్ట్ర వాటాకు కోత పడడంతో మరింత లోటు తప్పలేదు. తూత్తుకుడి, చెన్నై ఉత్పత్తి కేంద్రాల్లోని యూనిట్లలో తలెత్తిన సాంకేతిక లోపంతో సమస్య మరింత జఠిలం అవుతోంది. సాంకేతిక సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు నిమగ్నం అయ్యాయి. అయినా, పవన విద్యుత్, నైవేలి రూపంలో విద్యుత్ సంక్షోభం జఠిలం అయ్యే అవకాశాలు ఎక్కువే. -
స్టైల్ ఎక్స్పో
మగువ అందాన్ని రెట్టింపు చేసే డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియుల్స్, ఆభరణాలు బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో కొలువుదీరారుు. పండుగల సీజన్‌ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ‘ట్రెండ్జ్’ లైఫ్‌స్టైల్ ఎక్స్‌పోలో బ్రైడల్ వేర్ ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నుంచి వచ్చిన ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్లు ఇక్కడ తవు డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. నటుడు కృష్ణుడు... ఆయున సతీవుణి గాయుత్రి, కువూర్తె నిత్యతో కలసి షాపింగ్ చేశారు. ప్రవుుఖ డిజైనర్ అవ్రూపాల్ హొయలొలికించారు. వుంగళవారం కూడా ప్రదర్శన ఉంటుంది. -
పండుగ షి'కారు'!
అమ్మకాలు అంతంతమాత్రంగా ఉన్నా కార్ల కంపెనీలు భారత మార్కెట్‌పై ఆశలను బాగానే పెంచుకుంటున్నాయి. అధికంగా ఉన్న వడ్డీరేట్లు, రోజురోజుకు పెరుగుతున్న ఇంధనం ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇత్యాది కారణాల వల్ల కార్ల అమ్మకాలు కుదేలవుతున్నాయి. అయినప్పటికీ, దేశీయ, అంతర్జాతీయ వాహన కంపెనీలు మాత్రం అమ్మకాలు పెంచుకోవడానికి ప్రస్తుత మున్న మోడళ్లలో కొత్త వేరియంట్లనే కాకుండా, కొత్త కొత్త మోడళ్లను కూడా రంగంలోకి తెస్తున్నాయి. గత నెలలో కార్ల అమ్మకాలు స్వల్పంగానైనా పుంజుకోవడంతో కార్ల కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయి. దీంతో పాటు మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడానికి గృహోపకరణాలు, వాహన కొనుగోళ్ల కోసం రుణాలివ్వడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనపు నిధులివ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించడం కూడా కార్ల కంపెనీలకు కలసి వస్తోంది. దసరా, దీపావళి పండుగల సీజన్ నుంచి మొదలయ్యే ఈ కార్ల పండుగ వచ్చే ఏడాది వరకూ కొనసాగనున్నది. కొన్ని కంపెనీలు కొత్త కార్లను తెస్తుండగా, మరికొన్ని కంపెనీలు ప్రస్తుతమున్న మోడళ్లలోనే కొత్త వేరియంట్లను అందించనున్నాయి. మారుతీ సుజుకి నుంచి ఎక్స్ఏ ఆల్ఫా, హోండా బ్రియో మొబిలియో, డాట్సన్ గో ప్లస్‌లు కొత్త కార్లు. ఇక వేరియంట్ల విషయానికొస్తే, మారుతీ స్విఫ్ట్, నిస్సాన్ టెర్రానో, రేనాల్ట్ డస్టర్, డాట్సన్ గో, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ ఎలాంట్రా వంటివి ఉన్నాయి. మారుతీ ఎస్యూవీ ఎక్స్ఏ ఆల్ఫా స్విఫ్ట్ ప్లాట్‌ఫామ్‌పై మారుతీ అందిస్తున్న ఎస్యూవీ ఇది. రేనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లకు పోటీగా మారుతీ తెస్తున్న ఈ ఎస్యూవీ ధర రూ. 6-8 లక్షల రేంజ్లో ఉండొచ్చు. వస్తాదుల కండరాలను గుర్తుకు తెచ్చేలా హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్‌ను డిజైన్ చేశారు. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఉన్నట్లే ఈ కారు ఇంటీరియర్స్ కూడా ఉంటాయని సమాచారం. మారుతీ కొత్త స్విఫ్ట్ ప్రస్తుతమున్న స్విఫ్ట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్త స్విఫ్ట్‌ను మారుతీ సుజుకి మార్కెట్లోకి తేనున్నది. పగటి పూట కూడా వెలుగులు విరజిమ్మే ఎల్ఈడీ లైట్లు ఈ కారు ప్రత్యేకత. ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, తదితర ప్రత్యేకతలున్నాయి. వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చు. హోండా మొబిలియో: బ్రియో కారు ప్లాట్‌ఫామ్‌పై హోండా కారు తెస్తున్న మల్టీ పర్పస్ వెహికల్ ఇది. బ్రియో ప్లాట్‌ఫామ్‌పై వస్తోన్న మూడో కారు ఇది. (రెండో కారు హోండా అమేజ్) పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానున్నది. మారుతీ సుజుకి ఎర్టిగాకు పోటీ ఇవ్వనున్న ఈ కారు ధర రూ.8-10 లక్షల రేంజ్లో ఉండొచ్చు. రేనాల్ట్ కొత్త డస్టర్ భారత్‌లో తమకు లైఫ్ ఇచ్చిన డస్టర్ మోడల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి రేనాల్ట్ కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను అందిస్తోంది. డబుల్ ఆప్టిక్ హెడ్‌ల్యాంప్స్ ఆకర్షణ. సరికొత్తగా డిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ టిప్డ్ ఎగ్జాస్ పైప్ వంటి ప్రత్యేకతలున్నాయి. టయోటా కొత్త ఇన్నోవా: కారు ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన బంపర్ ప్రత్యేక ఆకర్షణ. వెనక భాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇక ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. అవే 2.0 లీటర్ పెట్రోల్, 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు. డీజిల్ వేరియంట్లో మాన్యువల్ గేర్ బాక్స్ ఉండగా, పెట్రోల్ వేరియంట్లో మాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్లు లభిస్తాయి. ఏబీఎస్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లున్నాయి. హ్యుందాయ్ ఎలాంట్రా ఎలాంట్రా మోడల్లో కొత్త వేరియంట్‌ను హ్యుందాయ్ అందించనున్నది. 1.6 డీజిల్ ఇంజిన్‌తో ఈ ఏడాది చివరకు గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ కారును కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది. 17 అంగుళాల అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణ. నిస్సాన్ టెర్రానో : కోణాకారంలో ఉన్న హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన బంపర్, సరికొత్త టెయిల్ ల్యాంప్, వెనక వైపు బంపర్లు ఇటీవలే విడుదలైన ఈ కారు ప్రత్యేకతలు. డాట్సన్ ‘గో’ వస్తోంది డాట్సన్ కంపెనీ భారత్‌లో అందించనున్న తొలి కారు ఇది. 5 సీట్ల, 5 డోర్ల ఈ హ్యాచ్‌బాక్‌ను వచ్చే ఏడాది భారత్‌లోకి తేనున్నది. 1.2 పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. మారుతీ సుజుకి ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. డాట్సన్ గో ప్లస్ ఎంపీవీ: డాట్సన్ నుంచి వస్తోన్న 7 సీట్ల ఎంపీవీ ఇది. ఇద్దరు కూర్చోడానికి వీలుగా మూడో వరుస ఉండడం, డాష్‌బోర్డ్‌లోనే గేర్‌షిఫ్ట్ లివర్‌ను అమర్చడం, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం మొబైల్ డాకింగ్ స్టేషన్ వంటి ఫీచర్లున్నాయి. ఇటీవలే ఇండోనేిసియాలో విడుదలైంది. వచ్చే ఏడాది భారత్‌లోకి రావచ్చు. - సాక్షి, బిజినెస్ డెస్క్ -
కార్పొరేషన్ బ్యాంక్ రుణరేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్ బ్యాంక్ గృహ, ఆటో. వినియోగ వస్తువులపై రుణ రేట్లను 1.75 శాతం వరకూ తగ్గించింది. పండుగ సీజన్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గృహ రుణాలపై వడ్డీ రేటును అరశాతం, ఆటో రుణాలపై రేటును ఒకశాతం తగ్గిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక వినియోగ వస్తువుల రుణాలకు సంబంధించి వడ్డీరేటును రూ. 5 లక్షల వరకూ 1.75 శాతం తగ్గించింది. గృహ రుణాలపై ఇలా : గృహ రుణాలకు సంబంధించి రూ.50 లక్షల వరకూ అన్ని రుణాలపై రేటు 10.25 బేస్రేట్కు సమానంగా ఉంటుంది. రూ.50 లక్షలు దాటిన రుణాలపై రేటు 10.50 శాతం. రూ. 25 లక్షల వరకూ రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను పూర్తిగా మినహాయించారు. ఆపై మొత్తాలపై ఈ ఛార్జీలలో 50 శాతం వరకూ రాయితీ ఇస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. వాహన, గృహోపకరణాలు రుణాలు: వాహన రుణాల విషయంలో రూ. 50 లక్షల వరకూ రుణాలపై రేటు 10.65 శాతం. ఇందుకు వర్తించే ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ. అలాగే కిచెన్, గృహోపకరణాలు, సోలార్ ప్యానల్స్, వాటర్ హీటర్లపై రుణ రేట్లను 12.25 శాతం నుంచి 10.50 శాతానికి బ్యాంక్ తగ్గించింది. 2014 జనవరి వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కాగా ఆకర్షణీయమైన ప్రీమియంకు వాహన బీమా కవరేజ్ ఆఫర్ చేయడానికి న్యూ ఇండియా ఎస్యూరెన్స్తో బ్యాంక్ ప్రత్యేక ఏర్పాటు కూడా చేసుకుంది. పండుగసీజన్‌లో డిమాండ్ పెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం మేరకు పలు బ్యాంకులు ఇప్పటికే వివిధ విభాగాలపై వడ్డీరేట్లు తగ్గించాయి. -
ఎస్బీఐ పండుగ ధమాకా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొన్ని రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. కారు, వినియోగ వస్తువులపై వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు, ప్రాసెసింగ్ ఫీజులను సైతం తగ్గించాలని నిర్ణయించింది. పండుగ సీజన్లో రుణ డిమాండ్‌ను ఆకర్షించడంలో భాగంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఓబీ, దేనా బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచాయి. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్‌లు ఆటోమొబైల్స్సహా టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వినియోగ వస్తువులపై ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేశాయి. తాజా నిర్ణయంతో ఎస్బీఐ కూడా ఈ జాబితాలో చేరింది. తగ్గింపు ఇలా...: బ్యాంకింగ్ దిగ్గజం రేట్ల తగ్గింపు విషయానికి వస్తే- కారు రుణాలపై వడ్డీరేటు 0.20 శాతం తగ్గింది. 10.55 శాతానికి చేరింది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.51 శాతం తగ్గించింది. అంటే కనీస ప్రాసెసింగ్ ఫీజు రూ.1,020 నుంచి రూ.500 ఫ్లాట్ రేట్‌కు తగ్గుతుంది. వేతన జీవులకు ప్రత్యేకం తన బ్యాంకులో వేతన అకౌంట్లు ఉన్న ఖాతాదారులకు సంబంధించి వినియోగ వస్తువులు, కారు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల విషయంలో కూడా ప్రత్యేక పండుగల రుణ పథకాలను బ్యాంక్ ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కింద పలు డిస్కౌంట్లు లభించనున్నాయి. 12.05 శాతం నుంచి వడ్డీరేట్లపై రుణ లభ్యత అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించి ‘ఉత్సవ్ కీ ఉమంగ్ ఎస్బీఐ కీ సంగ్’ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 31 జనవరి 2014 వరకూ అందుబాటులో ఉంటుంది. నేపథ్యం ఇదీ...: కొన్ని రంగాలలో డిమాండ్ పెంపు లక్ష్యంగా కొంత తక్కువ రేటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని, ఇందుకు తగిన పెట్టుబడులను ప్రభుత్వం బ్యాంకులకు పంప్ చేయాలని కేంద్రం గతవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు బ్యాంకులు ఈ దిశలో అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య ఇటీవల జరిగిన సమావేశం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ‘బడ్జెట్లో పేర్కొన్న రూ.14,000 కోట్ల కన్నా ఎక్కువగా, బ్యాంకులకు కావాల్సినంత మూలధన నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఈ చర్య మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడగల దని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రకారం కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 9.3 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6.1 శాతం వృద్ధి ఉండగా.. ఈసారి అదే వ్యవధిలో ఏకంగా 12 శాతం క్షీణించింది. కార్ల కొనుగోళ్లు సైతం గణనీయంగా పడిపోయాయి. కాగా ఈ ప్రణాళికలను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వ్యతిరేకిస్తున్నారు. ఇవి బ్యాంకుల అసెట్ క్వాలిటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే వ్యక్తం చేశారు. ఐవోబీ కూడా... వినియోగ వస్తువులపై రుణ రేట్లను ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా 2% వరకూ తగ్గించింది. దీనితో ఈ రేటు 13.25%కి తగ్గింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వేతన జీవులు వినిమయ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి ఒక కొత్త వ్యక్తిగత రుణ పథకాన్ని కూడా ఆవిష్కరించినట్లు బ్యాంక్ తెలిపింది. దేనాబ్యాంక్ కాంబో లోన్ ప్లాన్... దేనాబ్యాంక్ కూడా కొన్ని విభాగాలకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించింది. కోటి రూపాయల వరకూ గృహ రుణాలపై వడ్డీరేట్లను బేస్‌రేట్ 10.25%గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆపైన ఈ రేటు 10.50%గా ఉంటుంది. హౌసింగ్ లోను తీసుకున్న వారికి కాంబో ప్లాన్‌గా కార్, కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాన్ని కూడా అందచేస్తామని పేర్కొంది. కాంబోప్లాన్లోని కార్ రుణానికి బేస్ రేట్ వర్తిస్తుంది. వినియోగ వస్తువులపై రుణ రేటు 11.75%గా ఉంది. కాగా కాంబో ఆఫర్‌తో సంబంధం లేకుండా కార్రుణంపై రేటును 1% తగ్గించింది. దీనితో ఈ రేటు 11%కి చేరింది. -
మార్చికల్లా హీరో 15 కొత్త మోడల్స్
మకావూ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ 15కు పైగా కొత్త ఉత్పత్తులను ( కొత్త టూవీలర్లు, ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లు కూడా కలిపి) మార్కెట్లోకి తేనున్నది. పండుగల సీజన్ సందర్భంగా అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో ఈ కొత్త ఉత్పత్తుల్లో అధిక భాగం ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన హీరో గ్లోబల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అమ్మకాలు బావుంటాయ్.. : వర్షాలు బాగా కురిసాయని, సెంటిమెంట్ మెరుగుపడిందని, ఇటీవలి ఆర్బీఐ నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉన్నాయని, ఈ పండుగల సీజన్లో అమ్మకాలు జోరుగా ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు. అమ్మకాలకు సంబంధించి అధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, ఇప్పుడు టూవీలర్ నిత్యావసరంగా మారిందని వివరించారు. వినూత్నమైన ఫీచర్లతో కొత్త టూవీలర్లను రూపొందిస్తున్నామని, వీటికి పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని వివరించారు. హై ఎండ్ బైక్, కరిజ్మాను అప్‌గ్రేడ్ చేసి కొత్త వేరియంట్‌ను హీరో మోటొకార్ప్ తెస్తోంది. అమెరికాకు చెందిన ఇరిక్ బ్యుయెల్ రేసింగ్(ఈబీఆర్) కంపెనీతో జట్టు కట్టిన తర్వాత ఇరువురి భాగస్వామ్యంలో తొలిగా వస్తోన్న బైక్ ఇది. ఇక హోండా భాగస్వామ్యంతో కాకుండా తాము సొంతంగా డెవలప్ చేసుకున్న టెక్నాలజీతో తయారు చేసిన తొలి బైక్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని పవన్ చెప్పారు. కాగా జపాన్‌తో చెందిన హోండాతో భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత హీరో కంపెనీ దూకుడుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది -
కార్ల ధరలు పైపైకి...
న్యూఢిల్లీ: సాధారణంగా పండుగల సీజన్లో కార్ల కంపెనీలు డిస్కౌంట్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించడం రివాజు. దీనికి భిన్నంగా ఈ ఏడాది కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. అమ్మకాలు పడిపోవడం, రూపాయి అనూహ్య పతనం, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పలు కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. తాజాగా హ్యుందాయ్, జనరల్ మోటార్స్ కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అన్ని మోడళ్ల ధరలను 1 నుంచి 1.5 శాతం వరకూ పెంచే విషయమై ఆలోచన చేస్తున్నామని టాటా మోటార్స్ పేర్కొంది. హ్యుందాయ్ పెంపు రూ.20వేల వరకూ అన్ని మోడళ్ల ధరలను రూ.4,000 నుంచి రూ.20,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. రూపాయి పతనం, ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని వివరించారు. వ్యయభారాన్ని చాలా వరకూ భరించగలిగామని, ఇక ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ కంపెనీ రూ.2.85 లక్షల ఖరీదుండే ఈఆన్ మోడల్ కారు నుంచి రూ.26.49 లక్షల ఖరీదుండే శాంటా ఫే మోడల్ కార్ల వరకూ విక్రయిస్తోంది. గ్రాండ్ ఐ10 కార్ల ధరలను మాత్రం పెంచడం లేదని రాకేష్ చెప్పారు. జీఎం వడ్డింపు నాలుగోసారి మరోవైపు జనరల్ మోటార్స్ కూడా కార్ల ధరలను రూ.10,000 వరకూ పెంచనున్నది. జనరల్ మోటార్స్ ధరలు పెంచడం ఈ ఏడాది ఇప్పటికిది నాలుగోసారి. ఈ కంపెనీ ఈ నెల మొదట్లో బీట్, సెయిల్, ఎంజాయ్ కార్ల ధరలను రూ.10 వేల వరకూ పెంచింది. మరో దఫా అన్ని మోడళ్ల ధరలను 1.5 శాతం పెంచాలని యోచిస్తోంది. మోడళ్లను బట్టి ధరల పెంపు రూ.2,000 నుంచి రూ.10,000 రేంజ్లో ఉంటుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, పి. బాలేంద్రన్ చెప్పారు. ఈ కంపెనీ రూ.3.33 లక్షల ఖరీదుండే స్పార్క్ మోడల్ నుంచి రూ.16 లక్షల ఖరీదుండే క్రూజ్ మోడల్ వరకూ కార్లను విక్రయిస్తోంది. త్వరలో మారుతీ నిర్ణయం పరిస్థితులను గమనిస్తున్నామని, ధరల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి తెలిపింది. కాగా, హోండా కార్స్ ఇండియా మాత్రం కార్ల ధరలను పెంచబోవడం లేదని వివరించింది. ఈ నెల 21 నుంచే కార్ల ధరలను పెంచుతున్నట్లు టయోటా కంపెనీ ఇటీవలనే ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలోనే కార్ల ధరలను 1-5 శాతం వరకూ పెంచుతున్నట్లు ఫోర్డ్ ఇండియా పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ 4.5 శాతం, బీఎండబ్ల్యూ 5 శాతం, ఆడి 4 శాతం వరకూ ధరలను పెంచాయి. -
దీపావళి, సంక్రాంతిలకు కార్తీ సినిమాలు రెడీ
పండుగల సీజన్ అంటే సినిమా హీరోలకు భలే క్రేజ్. ఏవైనా పండుగలు ఉన్నాయంటే వాటికోసం తమ సినిమా విడుదలను అప్పటికి వాయిదా వేసుకుంటారు, లేదా సరిగ్గా పండుగల సమయంలోనే సినిమాలు వచ్చేలా చూస్తారు. తమిళ హీరో కార్తీ (సూర్య తమ్ముడు) ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు. తాను ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాల్లో ఒకటి దీపావళికి, మరొకటి సంక్రాంతికి విడుదల అయ్యేలా చూసుకుంటున్నాడు. 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' చిత్రం దీపావళికి విడుదల అవుతుండగా, బిర్యానీ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. కార్తీ పూర్తిస్థాయిలో కామెడీ పండించిన 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' చిత్రం దీపావళికి విడుదల అవుతుందని ఆయన తరఫున విడుదలైన ఓ ప్రకటన తెలిపింది. ఈ చిత్ర దర్శకుడు ఎం. రాజేష్. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న 'బిర్యానీ' కామెడీ థ్రిల్లర్. వాస్తవానికి బిర్యానీ చిత్రం సెప్టెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఎందుకోగానీ, సంక్రాంతికి వెళ్లిపోయింది. గతంలో విడుదలైన రెండు చిత్రాలు శకుని, అలెక్స్ పాండ్యన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈ రెండు చిత్రాల మీద కార్తీ బాగా ఆశలు పెట్టుకున్నాడు. అయితే, మరోవైపు ఇతర హీరోల సినిమాలు కూడా దీపావళి, సంక్రాంతికి సిద్ధమవుతున్నాయి. జీవా నటిస్తున్న ఎంద్రెంద్రుం పున్నగై, విజయ్ తీస్తున్న జిల్లా, అజిత్ చేస్తున్న ఆరంభం, శంకర్ తీస్తున్న 'ఐ' ఈ కోవలో ఉన్నాయి. దీపావళి, సంక్రాంతి రెండు సీజన్లూ కోలీవుడ్‌కు చాలా ముఖ్యం. సంక్రాంతి అయితే ఏకంగా నాలుగు రోజుల పాటు పండగ ఉంటుంది కాబట్టి, మరింత కీలకంగా భావిస్తారు. ఆ నాలుగు రోజుల్లో థియేటర్లు పూర్తిగా నిండుతాయని, కలెక్షన్లు తారస్థాయిలో ఉంటాయని ట్రేడ్ ఎనలిస్టు త్రినాథ్ తెలిపారు. గత సంవత్సరం దీపావళికి విడుదలైన విజయ్ చిత్రం తుపాకీ అతడి కెరీర్లోనే భారీ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద దాదాపు వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. -
చుక్కల్లో ధరలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పండుగల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాబోయే పండుగలు సగటు జీవికి భారంగా పరిణమించేట్లున్నాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంది. వచ్చే నెలలో వినాయక చవితి ఉంది. ఈ ప్రధాన పండుగల సమయాల్లో పళ్లు, కూరగాయల ధరలు కొండెక్కడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఉల్లి, అరటి, వెల్లుల్లి ధరలు అదుపు తప్పి పోయాయి. ఉల్లి ధర కేజీ రూ.70కి పెరిగింది. నిత్యం వంటకాల్లో దీని అవసరం ఉంటుంది. కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు కానీ పూర్తిగా మినహాయించలేని పరిస్థితి. ఇక దీనితో పచ్చి మిర్చి ధర కూడా పోటీ పడుతోంది. పండుగలంటే నైవేద్యం, పంచామృతాలకు అరటి తప్పనిసరి. రాష్ట్రంలో భారీ వర్షాలకు అనేక పొలాలు, తోటలు నీట మునిగాయి. దరిమిలా క్యారెట్, మిరప, కోసు, బఠాణి, అకు కూరల ధరలూ బాగా పెరిగిపోయాయి. బీన్స్, టమోటా ధరలు తగ్గడం వినియోగదారులకు కాస్త ఊరట. మహాలక్ష్మి వ్రతానికి ఇక కేవలం మూడు రోజులు మాత్రమే ఉండగా, అరటి (ఏలక్కి) ధర కేజీ రూ.60-70 పలుకుతోంది. హాప్‌కామ్స్‌లో ఏలక్కి ధర రూ.63, పచ్చ అరటి ధర రూ.23కు పెరిగిపోయాయి. పండుగల సమయానికి వీటి ధర కేజీకీ మరో రూ.10 పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అరటి ఉత్పత్తి తగ్గిపోయిందని అధికారులు చెప్పారు. దీనికి తోడు పండుగ సమయాల్లో మంచి ధర లభిస్తుందనే అంచనాతో రైతులు వాటి కోతను వాయిదా వేస్తూ వస్తున్నారని తెలిపారు. పండుగ సమయాల్లో అరటి మార్కెట్‌ను ముంచెత్తినా డిమాండ్ దృష్ట్యా ధర తగ్గే అవకాశాలు లేవని విశ్లేషించారు. కాగా ప్రస్తుతం కేజీ క్యారెట్ ధర రూ.72, పచ్చి మిరప రూ.70, బఠాణి రూ.68 చొప్పున పలుకుతున్నాయి. టమాట కేజీ రూ.10, సిమ్లా ఆపిల్ రూ.80, దానిమ్మ రూ.90 చొప్పున విక్రయిస్తున్నారు. బళ్లారిలోనూ అంతే.. బళ్లారి మార్కెట్లో పచ్చిమిర్చి, ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. మంగళవారం బళ్లారి మార్కెట్లో పచ్చి మిర్చి కేజీ ధర ఏకంగా రూ.90, ఉల్లిధర రూ.70 కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్ర సమ్మె కారణం.. అధిక వర్షాల వల్ల ఉల్లిగడ్డలు చెడిపోవడం.. మిర్చి పంట తగినంత రాకపోవడం తదితర కారణాలతో ఈ రెండు కూరగాయలు ధరలకు రెక్కలు వచ్చాయి. వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే రూ.500లు ఖర్చుపెట్టాల్సి వస్తోందని, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు జేబునిండా డబ్బులు తీసుకెళ్లినా బ్యాగు నిండా కూరగాయలు రాని పరిస్థితి నెలకుంది. వీటితోపాటు మిగిలిన ఓ కూరగాయలు ముట్టుకున్నా కిలో రూ.50లకు పైగా ధర ఉండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కిలో టమాట రూ.60 ఉండగా.. నేడు దాని ధర రూ.6కు పడిపోయింది. ఈ కష్టకాలంలో టమాట సామాన్యుల పాలిట ఆపద్బాంధవుడిలా మారింది