అమెజాన్‌లో 10 లక్షల ఉద్యోగాలు | Amazon India Creates Huge Job Opportunities | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో 10 లక్షల ఉద్యోగాలు

Published Wed, Sep 30 2020 5:18 PM | Last Updated on Wed, Sep 30 2020 5:29 PM

Amazon India Creates Huge Job Opportunities  - Sakshi

ముంబై: ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా పండగ వేళ దేశంలో మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇందుకుగాను వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లక్షమంది సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకున్నట్లు ప్రకటించింది. కాగా వినియోగదారుల డిమాండ్‌ మేరకు డెలీవరీ సిబ్బందిని నియమించుకున్నామని అమెజాన్‌ తెలిపింది. మరోవైపు ప్రత్యక్ష నియమకాలు మాత్రమే కాకుండా పరోక్షంగా ప్యాకేజింగ్ విభాగాలలోకూడా అనేక మందికి ఉపాధి లభించినట్లు పేర్కొంది.

అయితే దేశంలో టెక్నాలజీ, మౌలిక సౌకర్యాలు, లాజిస్టిక్స్ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దేశ కీలక రంగాలలో అనేక పెట్టుబడులు పెట్టనున్నామని, భారీ పెట్టుబడుల నేపథ్యంలో 2025 సంవత్సరం వరకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొంది. అయితే మరో నివేదిక రెడ్‌సీర్‌ ప్రకారం పండగ సీజన్లో కొనుగోళ్లు భారీ స్థాయిలో పెరుగుతామని, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌, గృహ రుణాలు పండగ సీజన్లో భారీ డిమాండ్‌కు అవకాశం ఉందని అభిప్రాయపడింది. (చదవండి: కరోనా : అమెజాన్‌లో వారికి భారీ ఊరట)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement