పండుగ సీజన్లో రిటైల్ అమ్మకాలు 50% అప్!
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌లోని రిటైలర్లు ఈ పండుగ సీజన్‌లో వాటి అమ్మకాల్లో 45-50 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తునట్లు పరిశ్రమ సమాఖ్య అసోచామ్ పేర్కొంది. సులభ రుణ సదుపాయం, వివిధ ఆఫర్లు, పలు డిస్కౌంట్లు వంటి అంశాలు విక్రయాల పెరుగుదలకు కారణంగా నిలుస్తాయని తెలిపింది. ఈ-కామర్స్ సంస్థలకు ధీటుగా రిటైలర్లు కూడా వినియోగదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారని పేర్కొంది. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి పలు పట్టణాల్లోని రిటైలర్లు ఇప్పటికే వాటి అమ్మకాల్లో పెరుగుదల ప్రారంభమైనట్లు పేర్కొన్నారని వివరించింది.