
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఈ పండుగల సీజన్‌లో కస్టమర్లకు భారీ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ‘గ్రేట్ ఇండియాన్ ఫెస్టివల్’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు భారీ ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ క్యాటగిరీ మెనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినవారికి 10 శాతం డిస్కౌంట్ ఉంటుదన్నారు. బజాన్ ఫిన్‌సర్వ్, కార్డుల ద్వారా కొనుగోలుచేసిన వారికి నో–కాస్ట్ ఈఎంఐ ఆఫర్ వర్తిస్తుంది. లక్షలాది సెల్లర్స్ అత్యంత తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమెజాన్‌లో అందించనున్నారని పేర్కొన్నారు. వేగవంతమైన డెలివరీ, 30–రోజుల మార్పిడి విధానం ఈసారి ప్రత్యేకతలన్నారు. గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్ విభాగాల్లో అమ్మకాలు పెరుగుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment