
మంచి కెమెరా, డిస్‌ప్లే, పనితీరు, క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అప్పట్లో అధిక ధర కారణంగా ఈ ప్రీమియమ్ ఫోన్‌ను కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ల తరువాత రూ .93,000 కంటే తక్కువకు లభిస్తుంది. మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా వచ్చినప్పటికీ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాకు క్రేజ్ అలాగే ఉంది. కాబట్టి మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో సరైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే అమెజాన్‌కి వెళ్లి ఈ డీల్ చూడవచ్చు.
తగ్గింపు అలర్ట్
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.98,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,29,999. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే రూ.2,955 తగ్గింపు లభిస్తుంది. అలాగే కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ ఆదా కోసం), రూ .4,775 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు కోసం మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. దీనికి ఆ ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్, బ్రాండ్‌ను బట్టి రూ.22,800 వరకు పొందవచ్చు. యాడ్-ఆన్లుగా వినియోగదారులు రూ .6,999 టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్లు
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల క్యూహెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. ఈ డివైజ్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్‌పై నడుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 45వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రాబోయే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్డేట్‌తో ఇది మరిన్ని ఏఐ ఫీచర్లను పొందుతుంది.
కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో పాటు అదనంగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment