
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్‌పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్స్ పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.
చేతిలోనే ఫ్యాన్స్
విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్‌లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్‌కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్‌బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment