
న్యూఢిల్లీ: ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్‌లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) అత్యంత తక్కువ ధరకి, గంటకు రూ. 67కే అందుబాటులో ఉంటాయని కేంద్ర ఐటీ మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఇండియా ఏఐ మిషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్, డేటాసెట్ ప్లాట్‌ఫాం ఏఐకోశ మొదలైనవి ఆయన ఆవిష్కరించారు.
అంకుర సంస్థలు, విద్యార్థులు, పరిశోధకులకు మొదలైన వారికి ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్‌లో 18,000 జీపీయులు, క్లౌడ్ స్టోరేజ్, ఇతరత్రా ఏఐ సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. సొంత ఫౌండేషనల్ మోడల్స్‌ను రూపొందించుకోవడంపై భారత్ పురోగతి బాగుందన్నారు. ఇందుకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.
ఏఐ అప్లికేషన్స్, సొల్యూషన్స్‌ను తయారు చేయడంలో పరిశోధకులు, ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్‌లకు ఉపయోగపడేలా డేటాసెట్లు, సాధనాలు మొదలైనవన్నీ ఏఐకోశలో ఉంటాయి. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆవిష్కరణలకు తోడ్పడే సమగ్ర వ్యవస్థను తయారు చేసే దిశగా కేంద్ర క్యాబినెట్ గతేడాది మార్చిలో రూ. 10,372 కోట్ల బడ్జెట్‌తో ఇండియాఏఐ మిషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment