
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై 95శాతం, ఇయర్‌ఫోన్‌లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్‌లో అన్నీ రకాల ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.
మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్‌ప్లస్‌తో పాటు ఇతర ఫోన్‌లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్‌లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్‌లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment