Premium Smartphone
-
మార్కెట్ లీడర్‌గా వన్‌ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్ టాప్ లో నిలిచింది. జూన్ త్రైమాసికంలో 29.3 శాతం మార్కెట్ వాటాతో ఇండియన్ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని తాజా నివేదిక తెలిపింది. (వన్‌ప్లస్ నార్డ్ వచ్చేసింది..ధర ఎంతంటే) కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం వన్‌ప్లస్ 8 5 జీ మొబైల్ రెండవ త్రైమాసికంలో (క్యూ 2) ప్రీమియం విభాగంలో (30వేల రూపాయలు అంతకంటే ఎక్కువ) టాప్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా అవతరించింది. ఒక బ్రాండ్‌గా, తమ విశ్వాసం ఉంచిన భారత సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ప్రకటించారు. అసమానమైన నాణ్యతతో పెద్దగా భారం లేని అనుభవాన్ని అందించే ఉత్పత్తులను రూపొందించే కృషి కొనసాగుతుందన్నారు. (భారత్‌లో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో లాంఛ్) కాగా ఏప్రిల్‌లో లాంచ్ చేసిన వన్‌ప్లస్ 8 సిరీస్ 5 జీ వన్ ప్లస్ 8 ప్రో వన్ ప్లస్ 8 స్మార్ట్ఫోన్లకు భారతీయ వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి మూడు స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ 8 ప్రో ఒకటి. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం: వన్‌ప్లస్) -
ప్రీమియం హ్యాండ్సెట్స్ విభాగంలోకి మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తాజాగా ప్రీమియం హ్యాండ్సెట్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘డ్యూయెల్ 5’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.24,999. కొత్త స్మార్ట్‌ఫోన్‌లో మూడు 13 ఎంపీ కెమెరాలు (రెండు వెనుక భాగంలో, ఒకటి ముందు భాగంలో) ఉన్నాయి. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5.5 అంగుళాల స్క్రీన్, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఇవి ఏప్రిల్ 10 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ‘ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రధానమైన కంపెనీగా అవతరించాలని ప్రయత్నిస్తున్నాం. ఇక నుంచి అన్ని మైక్రోమ్యాక్స్ ఫోన్లు 4జీ ఫీచర్‌తోనే మార్కెట్లోకి వస్తాయి. 2017–18లో 20–25 శాతం వ్యాపార వృద్ధిని ఆశిస్తున్నాం’ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. మైక్రోమ్యాక్ కంపెనీ తొలి 4జీ ఫీచర్ ఫోన్ ‘భారత్–1’ను మార్కెట్లోకి తీసుకురానుంది. వీటి ప్రారంభ ధర రూ.1,999 ఉండొచ్చని అంచనా.