ప్రీమియం హ్యాండ్‌సెట్స్‌ విభాగంలోకి మైక్రోమ్యాక్స్‌ | Micromax Dual 5 First Impressions | Sakshi
Sakshi News home page

ప్రీమియం హ్యాండ్‌సెట్స్‌ విభాగంలోకి మైక్రోమ్యాక్స్‌

Published Thu, Mar 30 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

ప్రీమియం హ్యాండ్‌సెట్స్‌ విభాగంలోకి మైక్రోమ్యాక్స్‌

ప్రీమియం హ్యాండ్‌సెట్స్‌ విభాగంలోకి మైక్రోమ్యాక్స్‌

న్యూఢిల్లీ: దేశీ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్‌’ తాజాగా ప్రీమియం హ్యాండ్‌సెట్స్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘డ్యూయెల్‌ 5’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.24,999. కొత్త స్మార్ట్‌ఫోన్‌లో మూడు 13 ఎంపీ కెమెరాలు (రెండు వెనుక భాగంలో, ఒకటి ముందు భాగంలో) ఉన్నాయి. ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 5.5 అంగుళాల స్క్రీన్, 3,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.

 ఇవి ఏప్రిల్‌ 10 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ‘ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ప్రధానమైన కంపెనీగా అవతరించాలని ప్రయత్నిస్తున్నాం. ఇక నుంచి అన్ని మైక్రోమ్యాక్స్‌ ఫోన్లు 4జీ ఫీచర్‌తోనే మార్కెట్‌లోకి వస్తాయి. 2017–18లో 20–25 శాతం వ్యాపార వృద్ధిని ఆశిస్తున్నాం’ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ తెలిపారు. మైక్రోమ్యాక్‌ కంపెనీ తొలి 4జీ ఫీచర్‌ ఫోన్‌ ‘భారత్‌–1’ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. వీటి ప్రారంభ ధర రూ.1,999 ఉండొచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement