Amazon Teams with Affirm to Offer Buy Now Pay Later Option - Sakshi
Sakshi News home page

అమెజాన్‌ కొత్త ఆఫర్‌... కొద్ది మందికే అవకాశం!

Published Sun, Aug 29 2021 11:35 AM | Last Updated on Sun, Aug 29 2021 1:17 PM

Amazon TieUp With Affirm And Introduce Buy Now Pay Later Option - Sakshi

ఇ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, స్టార్టప్‌​ కంపెనీ అఫిర్మ్‌ సంస్థలు సంయుక్తంగా కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. పైలట్‌ ప్రాజెక్టుగా ప్రస్తుతం కేవలం అమెరికాలో కొద్ది మందికే ఆఫర్‌ను వర్తింప చేస్తున్నారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు ఈ ఆఫర్‌ను వర్తింప చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి
ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అనే పాలసీని ఇప్పుడు అన్ని కంపెనీలు అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌ సంస్థ ఈ తరహా ఆఫర్‌ను అమల్లోకి తేగా తాజాగా అమెజాన్‌ సైతం అదే బాట పట్టింది. దీని కోసం అమెరికాకే చెందిన అఫిర్మ్‌ సంస్థతో జత కట్టింది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంచుతున్నారు.

ఎవరికి ప్రాధాన్యం
పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల వారు అమెజాన్‌ కస్టమర్‌ బేస్‌లో ఉన్నారు. అయితే వీరిలో యూత్‌ , పార్ట్‌టైం జాబ్‌ చేసే వాళ్లు లక్ష్యంగా ఈ బయ్‌ నౌ పే లేటర్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం, ఆసక్తి ఉన్నా ఒకే సారి కొనేందుకు డబ్బులు చాలక  క్రెడిక్‌ కార్డులు లేక ఇబ్బందులు పడే వారికి ఈ ఆఫర్‌లో ప్రాథాన్యత ఇవ్వనున్నారు. 

ఆఫిర్మ్‌దే బాధ్యత
ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి పథకానికి సంబంధించి షాపింగ్‌ చేసేది అమెజాన్‌ సైట్‌లో అయినా సొమ్ము చెల్లింపు వ్యవహారం సజావుగా జరిగేలా చూసుకునే బాధ్యత అఫిర్మ్‌ స్టార్టప్‌దే. ఇప్పుడు బాధ్యతగా ఉండే యూత్‌కి ఈ ఆఫర్‌ అందివ్వడం ద్వారా బలమైన కస్టమర్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో ఆఫిర్మ్‌ సంస్థ ఈ కాన్సెప్టును అందుబాటులోకి తెచ్చింది. 

ఉపయోగాలు
ప్రస్తుతం ఇకామర్స్‌ సైట్లలో రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నా అందులో నూటికి తొంభైశాతం ఆఫర్లు ప్రత్యేకంగా ఏ ప్రొడక్టుకు ఆ ప్రొడక్టు అన్నట్గుగానే ఉంటాయి. అయితే ఈ కొత్త ఆఫర్‌లో వివిధ కేటగిరీలకు చెందిన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత వచ్చిన మొత్తం బిల్లును తర్వాత చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది. తర్వాత చెల్లింపులు పేరు చెప్పి అధిక వడ్డీలు, హిడ్డెన్‌ ఛార్జీలు ఏమీ విధించమని ఆ సంస్థ అంటోంది. ఈ ఆప్షన్‌ ద్వారా యాభై డాలర్ల వరకు విలువైన వివిధ వస్తువులను ఒకేసారి కొనుగోలు చేసి ఆ తర్వాత చెల్లింపులు చేయవచ్చు.

మన దగ్గర
బయ్‌ నౌ పే లేటర్‌ ఆఫర్‌ను ప్రస్తుతం అమెరికాలోనే అందిస్తున్నారు. అది కూడా అమెజాన్‌ కస్టమర్‌ బేస్‌లో ట్రాక్‌ రికార్డు బాగున్న వారికే అందుబాటులోకి తెచ్చారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టే ఈ పథకం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దగ్గర క్రెడిక్‌ కార్డు ఈఎంఐలే అందుబాటులో ఉన్నాయి.
 

చదవండి : Boutique Business: లాభసాటి బిజినెస్‌, మోడ్రన్‌ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement