గోవా రోడ్లపై కిక్కిరిసన జన సంద్రం
Huge Crowd On Goa Beach Roads న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న వేళ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో డిసెంబర్ చివరి వారం నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దీంతో క్రిస్టమస్-న్యూ ఇయర్ పండగ సీజన్‌లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం దాటిందని అధికారులు వెల్లడించారు. కాగా ఉత్తర గోవాలోని రోడ్లపై వందలాది మంది పర్యాటకులు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ‘కోవిడ్ వేక్కు ఇది రాయల్ వెల్‌కమ్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియో వైరల్ అవుతోంది.
గడచిన 24 గంటల్లో గోవాలో 388 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటన్ తెల్పుతోంది. కొత్త కేసులు పెరగడంతో కోస్తా రాష్ట్రంలో 1,81,570కి చేరుకోగా, మరణాల సంఖ్య 3,523కు పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, వేలాది దేశీయ పర్యాటకులు ఈ విధంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి గోవా బీచ్, పబ్‌లకు తరలిరావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వాల్సిందిగా తాజాగా గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: Visakhapatnam: 2 మృతదేహాలు లభ్యం, మిగతావారి కోసం ముమ్మర గాలింపు..
This was Baga Beach in Goa ,last night. Please take the Covid scenario seriously. This is a Royal welcome to the Covid wave 👋 Mostly tourists. pic.twitter.com/mcAdgpqFUO
— HermanGomes_journo (@Herman_Gomes) January 2, 2022
Comments
Please login to add a commentAdd a comment