Viral video
-
Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్ వీడియో
ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్ను ఆకర్షిస్తోంది.ఇండోర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన యువతి నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’, ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి)కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో ఐఐటీ బాబా, విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.एक गरीब लड़की इंदौर(MP) से महाकुंभ आती है, मालाएं बेचती है और दिन के 2 से ढाई हजार कमा लेती है।ये मेले हमारी सांस्कृतिक पहचान ही नहीं बल्कि आर्थिक समृद्धि के भी प्रतीक हैं। pic.twitter.com/BGhwuFbm0D— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 17, 2025 పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. इनसे मिलिए ये हैं महाकुंभ मेला में माला बेचने वाली वायरल गर्ल मोनालिसा.. इनकी आंखे बहुत सुंदर है.. इसको कहते हैं किस्मत बदलते देर नहीं लगती.. #महाकुम्भ_अमृत_स्नान #महाकुंभ2025 #MahaKumbhMela2025 pic.twitter.com/Et87nnpRql— 🌿🕊️RACHNA MEENA 🌿❤️ (@RACHNAMEENA34) January 18, 2025 -
36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’
‘ఛాయ్.. ఛాయ్.. టీ కావాలా మేడమ్.. సర్ ఛాయ్ ఇమ్మంటారా?’ సాధారణంగా బస్సు స్టాప్లోనో లేదా రైళ్లలోనూ ఇలా టీ సర్వ్ చేయడం చూస్తూంటారు. కానీ ఏకంగా 36,000 అడుగుల ఎత్తులో టీ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది.. విమానంలో టీ సర్వ్ చేసి ఓ వ్యక్తి తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. ఈమేరకు తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు తన సీటులో నుంచి లేచి ‘ఛాయ్.. ఛాయ్..’ అంటు తోటి ప్రయాణికులకు టీ సర్వ్ చేశాడు. అందుకు మరో ప్రయాణికుడు సాయం చేశాడు. డిస్పోజబుల్ గ్లాస్లో తోటి ప్యాసింజర్లకు టీను అందిస్తున్నట్లు తీసిన వీడియోను ఎయిర్‌క్రూ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Aviation/CabinCrew's HUB 🇮🇳 (@aircrew.in)ఇదీ చదవండి: ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..‘ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు టీ ఎలా తీసుకుళ్లుంటారు?’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఒక భారతీయుడు మాత్రమే టీని ఎప్పుడైనా ఎక్కడైనా సర్వ్ చేయగలడు’ అని మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు. -
నీ కష్టం పగోడికి క్కూడా రాకూడదు మచ్చా... వైరల్ వీడియో
సాధారణంగా పెళ్లి కాని ప్రసాదులు ఏం చేస్తారు? పెళ్లిళ్ల పేరయ్యలనో, పెళ్లిళ్లు కుదిర్చే వెబ్‌సైట్లనో ఆశ్రయిస్తారు. అదీ కాదంటే స్నేహితుల ద్వారానో తనకు కావాల్సిన అమ్మాయిని వెతుక్కుంటారు. కానీ ఒక యువకుడు వెరైటీగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. స్టోరీ ఏంటంటే... రైళ్లలో చాయ్, సమోసాలు, పల్లీలు వగైరాలు అమ్ముకోవడం చూస్తాం.కానీ ఒక మెట్రో ట్రైన్లో ఉన్నట్టుండి ఒక యువకుడు గట్టి, గట్టిగా అరుస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా అతను మాట్లాడుతున్నదేంటో అర్థమై పగలబడి నవ్వేశారు. అంతేకాదు అమ్మాయిలు కూడా ముసి ముసినవ్వులు కోవడం ఈ వీడియోలో చూడొచ్చు. "మీ రోజుకి అంతరాయం కలిగించినందుకు క్షమించండి. నేను డ్రగ్స్ వాడను నాకు పిల్లలు లేరు. కానీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఐ లవ్ అమెరికా, ప్లీజ్ నన్ను వరైనా నన్ను వివాహం చేసుకోండి. తద్వారా అమెరికాలో ఉండగలను. నాకు మంచి వంట వచ్చు. మంచిగా మాలిష్ చేయడం వచ్చు. డిస్కో సంగీతం వింటాను’’ ఇలా సాగుతుండి అతగాడి అభ్యర్థన. ‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు, నా డబ్బు కూడా మీకే ఇస్తాను. మంచి బట్టలు, బూట్లు కొనుగోలు చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చేశాడు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో.. ఆడా, మగా ఎవరైనా, నాకు ఆఫర్ చేయడానికి సమాన అవకాశాలు’’ అనడంతో అక్కడున్నవారంతా గొల్లుమన్నారు. దీంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు.‘‘హిల్లేరియస్, ఇతగాడు మంచి సేల్స్ మేన్, తనను తాను అమ్మేసుకుంటున్నాడు’’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. వీళ్లను చూసి ‘‘మీకు భలే హ్యాపీగా ఉండాది గదా’’ అని పుష్ప స్టైల్లో ఉడుక్కుంటున్నారట పెళ్లి కాని ప్రసాదులు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గెయెంకా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియో ప్రామాణికత, మూలంపై స్పష్టత లేదు. యూఎస్ లో పరిస్థితి ఇదీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. In trains in India, people sell chai, toys, combs, samosa, etc. But in USA ??? Watch & enjoy ................. ! 😄😜😃 pic.twitter.com/dfXcEOEbOh— Harsh Goenka (@hvgoenka) December 12, 2024 -
యూట్యూబ్‌లో నెమలికూర వంటకం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.అయితే శనివారం తన యూట్యూబ్ చానల్లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
హీరో రానా క్యూట్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో రానా పేరు చెప్పగానే అందరికీ 'బాహుబలి' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎందుకో కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. కొన్నాళ్ల క్రితం 'రానా నాయుడు' సిరీస్‌లో నటించాడు. యాక్టింగ్ చేయనప్పటికీ నిర్మాణం, ఇతర తెలుగు సినిమాల్ని ప్రమోట్ చేసే విషయంలో ముందుంటాడు. ఇదంతా పక్కనబెడితే తాజాగా రానా ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))తాజాగా ఓ హోటల్లో స్టే చేసేందుకు రానాకు అక్కడ సిబ్బంది పుష్ప గుచ్చంతో పాటు శాలువా బహుకరించారు. అందరిలానే వాటిని తీసుకుని పక్కనవాళ్లకు ఇచ్చేయకుండా తనకు ఎవరైతే ఇచ్చారో ఆ మహిళా సిబ్బందికే ఫ్లవర్ బొకే ఇచ్చి, శాలువా కూడా తన చేతులతో కప్పేశాడు. దీన్ని చూసి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రానా ఫ్రెండ్లీ నేచర్‌ని మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)Actor @RanaDaggubati in his natural habitat off screen 🤩#RanaDaggubati #Rana #Tollywood #PopperStopTelugu pic.twitter.com/FiCISww8Ip— Popper Stop Telugu (@PopperstopTel) July 22, 2024 -
ఇన్‌స్టా పోస్ట్ వైరల్ కావాలంటే.. సీఈఓ సూచన
ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌కు చాలా క్రేజ్ ఉంది. ఏదైనా పోస్ట్ వైరల్‌గా మారాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయాల్సిందే. అయితే ఎన్ని పోస్ట్‌లు పెట్టినా రీచ్ ఎక్కువగా రావడం లేదనుకునేవారికి ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి కొన్ని చిట్కాలు చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. అదికాస్త వైరల్‌గా మారింది.ఆయన వీడియోలో మాట్లాడుతూ..‘సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో లేదా ఫొటో వైరల్‌గా మారాలని కోరుకుంటాం. మన కంటెంట్ ఎక్కువ మందికి చేరాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేసి అలా వదిలేయకుండా నిత్యం కామెంట్లను పరిశీలిస్తుండాలి. మన ఫాలోవర్లు, ఇతరులు మన కంటెంట్ తీరుపై చాలా విలువైన కామెంట్లు చేస్తారు. వారీ ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం చేసుకుని దానికి తగిన కంటెంట్‌ను ఇవ్వడానికి ప్రయత్నించాలి. పోస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత కనీసం రెండు వారాలపాటు కామెంట్లను ట్రాక్ చేయాలి. వాటికి తగిన రిప్లై ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) -
మరీ ఓవర్ చేయకు: పంత్ క్యాచ్.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అమెరికా వేదికగా లీగ్ దశలో ఓటమన్నదే ఎరుగుక ముందుకు సాగిన రోహిత్ సేన.. వెస్టిండీస్‌లో జరుగుతున్న సూపర్-8లోనూ శుభారంభం చేసింది.గ్రూప్-1లో భాగంగా అఫ్గనిస్తాన్ గురువారం నాటి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. అఫ్గన్ జట్టును 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ ఇన్నింగ్స్‌లో పంత్- రోహిత్ క్యాచ్‌ల విషయంలో పోటాపోటీగా తలపడ్డారు.బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తంగా మూడు క్యాచ్‌లు అందుకోగా.. రోహిత్ శర్మ రెండు క్యాచ్‌లు పట్టాడు. అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు.ఈ క్రమంలో రెండో బంతిని అఫ్గన్ బ్యాటర్ గుల్బదిన్ నయీబ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడబోయి బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో పంత్ పరిగెత్తుకు వెళ్లి బంతిని అందుకున్నాడు.ఆ సమయంలో రోహిత్ కూడా పంత్‌కు సమీపంలోనే ఉండగా.. ఎగ్జైట్మెంట్లో పంత్ అతడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి సంతోషం పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఈ క్యాచ్ నీదేలే.. నేనేమీ అడ్డుపడను’’ అన్నట్లుగా రోహిత్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్‌గా మారింది.కాగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పంత్.. రహ్మనుల్లా గుర్బాజ్(11), గుల్బదిన్ నయీబ్(17), నవీన్ ఉల్ హక్(0) క్యాచ్‌లు అందుకోగా.. రోహిత్ శర్మ ఇబ్రహీం జద్రాన్(8), నూర్ అహ్మద్(12) ఇచ్చిన క్యాచ్‌లను ఒడిసిపట్టాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్‌మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్‌స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్‌స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్‌ని చేస్తూ ఆమె చివరి ఇన్‌స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్‌కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్‌లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్‌గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్‌స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్‌తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్ -
Virat Kohli: ఇంటర్నెట్లో క్యూటెస్ట్ వీడియో
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. విరాట్ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడాడు. Virat Kohli talking to Anushka Sharma and Vamika after won the match. - CUTEST VIDEO OF THE DAY. ❤️ pic.twitter.com/srREuiqS8u — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 కోహ్లి తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో సందడి చేస్తుంది. కోహ్లి ఇటీవలే రెండో బిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. కోహ్లి భార్య అనుష్క ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. కోహ్లి దంపతులు ఆ పిల్లాడికి అకాయ్ అని నామకరణం చేశాడు. కోహ్లి దంపతులకు ఇదివరకే ఓ అమ్మాయి ఉంది. ఆమె పేరు వామిక. THE VINTAGE KING KOHLI...!!!!! 🐐 One of the Greatest Post Match Interview by any Cricketer in the History - King Kohli You're the GOAT. pic.twitter.com/cZ331UXGlI — CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం ప్రజెంటేటర్ హర్షా భోగ్లేతో కోహ్లి మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం వైరలవుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో తన వ్యక్తిగత అనుభవాల (లండన్) గురించి హర్షా కోహ్లిని అడుగగా.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. రెండో సారి తండ్రైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది తనకు తన కుటుంబానికి మరపురాని అనుభూతి. కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేసే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. తమను గుర్తు పట్టని ప్రదేశంలో సాధారణ జీవనం గడిపే అవకాశం దొరికింది. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలని కోహ్లి తెలిపాడు. క్రికెట్‌కు సంబంధించి కోహ్లి మాట్లాడుతూ.. అంతిమంగా గణాంకాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకుంటారు. రాహుల్ ద్రవిడ్ చెప్పేది ఇదే. ఆర్సీబీ అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ, ప్రశంసలు, మద్దతు అద్భుతమైనవి. ఇవి నేనెప్పటికీ మరచిపోలేనని కోహ్లి అన్నాడు. ఇదే సందర్భంగా కోహ్లి మరిన్ని ఆసక్తికర అంశాల గురించి కూడా ప్రస్తావించాడు. విశ్వవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ ప్రమోషన్ కోసం తన పేరు ఉపయోగపడుతుందని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది ఇంకా రెండో మ్యాచ్ మాత్రమే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని ఆర్సీబీ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. హర్షా భోగ్లే విరాట్‌కు ఆరెంజ్ క్యాప్ అందజేశాడు. -
USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ‘ఒబామా ఐసిస్ ఫౌండర్. ఐసిస్ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్’ అని వీడియోలో ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్ స్పందన అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్ మాట్లాడిన వీడియో కాదని తేలింది. ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. Big Statement By Donald Trump. He said, "Obama is the fuckin founder of ISIS. I'll never let you go Obama "#Russia #Moskau #MoscowAttack pic.twitter.com/4dRJRY5Phu — Umair Ali (@UmairAli_7) March 23, 2024 ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్ సాలా కప్ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘‘ఇస్ సాలా కప్ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్ ఫస్ట్’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్ టీమ్’’ అంటూ ఫాఫ్ డుప్లెసిస్ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!! 18 🤝 18 📸: JioCinema pic.twitter.com/0SDwzLHvRM — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 RCB fans entering the office tomorrow#WPL2024 #WPLFinal #RCB pic.twitter.com/SKbaWNwqbN — ನಗಲಾರದೆ 𝕏 ಅಳಲಾರದೆ (@UppinaKai) March 17, 2024 Oreyy 😂 pic.twitter.com/FyEMLpAWws — Likhit MSDian (@LIKHITRTF) March 17, 2024 pic.twitter.com/93FufawCOn — t-riser (@techsaturation) March 17, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్‌గా అవతరించింది. చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్ Every RCB Fan right now 🥺😭pic.twitter.com/CLS1MDrEeZ — Vikas (@VikasKA01) March 17, 2024 -
బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యామిలీ
పెళ్లి వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను పలకరించడం, పెళ్ళి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. ‘టైమే బంగారమాయెనే’ అనుకునే సమయం లోనూ ఒక పెళ్లిలో వధువు తల్లిదండ్రులు చేసిన డ్యాన్స్ వీడియో వీర లెవెల్లో వైరల్ అయింది. స్టైలిష్ బ్లాక్ అండ్ గోల్డెన్ చీరలో వధువు తల్లి, స్మార్ట్ త్రీ పీస్ సూట్లో తండ్రి వేదికపై వివిధ హావభావాలతో చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. స్టేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో బాల్యం నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు వధువుకు సంబంధించిన రకరకాల విజువల్స్ కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ‘బ్యూటీఫుల్... లవ్లీ ఫ్యామిలీ’ లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వెల్లువెత్తాయి. -
అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!
మనం రెస్టారెంట్‌కి వెళ్లితే బిల్ తోపాటు బాగా సర్వింగ్ చేసిన వ్యక్తికి కాస్త టిప్ ఇస్తాం. ఇది సహజం. కానీ ఇక్కడొక కస్టమర్ తాను బిల్లు చేసింది వేలల్లో అయితే టిప్పి మాత్రం ఏకంగా లక్షలు ఇచ్చాడు. ఎక్కడ జరిగిందంటే ఈ ఘటన.. ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. యూస్‌లోని మిచిగాన్‌లో ఉన్న ది మాసన్ జార్ కేఫ్ అనే రెస్టారెంట్‌కి మార్క్ అనే వ్యక్తి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే అతడు అక్కడ తిన్న బ్రేక్ ఫాస్ట్‌కి అయ్యిన ఖర్చు కేవలం రూ. 2,500/- మాత్రమే అయ్యింది. కానీ అతను ఏకంగా రూ. 8 లక్షలు టిప్ చెల్లించాడు. దీంతో అవాక్కయిన సర్వర్ ఈ విషయం మేనేజర్‌కి చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు సదరు రెస్టారెంట్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో వివరిస్తూ..ఆ వ్యక్తి విశాల హృదయానికి ధన్యావాదాలు తెలిపింది. అతను ఇచ్చిన డబ్బును సహోద్యోగులు సమంగా పంచుకున్నారని, ప్రతి ఒక్కరూ రూ. 90 వేల చొప్పున ఇంటికి తీసుకువెళ్లారని అన్నారు. ఆయన తన బిల్లు కంటే ముప్పై వేల రెట్టు చెల్లించాడని రెస్టారెంట్ మేనేజర్ అన్నారు. అతనికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అని భావోద్వేగంగా అన్నాడు. నిజానికి డిజిటల్ టిప్పింగ్ కల్చర్ సర్వే ప్రకారం..యూఎస్‌లోని వ్యక్తులు భోజనం చేసేటప్పుడు వారి బిల్లులో సగటున అంటే.. 16% టిప్పుగా ఇస్తారు. కానీ మార్క్ దాతృత్వం చాలా దయతో చేసిన చర్య అని కొనియాడారు. View this post on Instagram A post shared by Mason Jar Cafe (@masonjarcafe_) (చదవండి: ఫుల్‌గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?) -
చీరకట్టులో జిమ్ వర్క్ఔట్స్!
ఇటీవల కాలంలో చీర ధరించడాన్నే ట్రెండీగా ఫాలో అవుతోంది యువత. అందులోనూ చీర కట్టులో స్కూటర్ నడపడం, లేదా వ్యాయామాలు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. నెటింట కూడా అలాంటి వీడియోలకే మంచి ఆదరణ ఉందని చెప్పొచ్చు. అంతేగాదు చీర కట్టులో ఎలాంటి పనులైన సునాయాసంగా చెయ్యొచ్చని నిరూపిస్తున్నారు. ఇక్కడ కూడా ఓ ఫిటెనెస్ కోచ్ చీరకట్టులో వర్క్ఔట్లు చేసి అందర్నీ ఆకర్షించింది. శారీ వర్కవుట్ వీడియోలతో ఇంటర్నెట్లో ఫేమ్ అయింది ఫిట్నెస్ కోచ్ రీనాసింగ్. చీరకట్టుతో ఫుష్–అప్స్, పుల్–అప్స్, స్వ్కాట్స్, జంప్స్లాంటి ఎక్సర్సైజులు చేస్తూ నెటిజనులను ఆకట్టుకొంటుంది. పాత, కొత్తా అనే తేడా లేకుండా ఆమె వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీనాసింగ్ తాజా వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 21.3 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ‘వర్కవుట్ల సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని సిఫారసు చేసినప్పటికీ సౌకర్యంగా అనిపిస్తే చీర ధరించి వ్యాయామాలు చేయడం పొరపాటేమీ కాదు. అయితే గ్రిప్ తప్పకుండా ఉండడానికి అవసరమైన ఫుట్‌వేర్ ధరించాలి’ అంటుంది యోగా ట్రైనర్ అనూష రామ్. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) (చదవండి: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!) -
బిగ్‌బాస్ ఫైనలిస్టుని సన్మానించిన ఎస్ఐకి బదిలీ
యశవంతపుర: బిగ్‌బాస్ రియాలిటీ షో లో ఫైనల్స్‌కు చేరిన వర్తూరు సంతోష్‌ను బెంగళూరులో ఎస్ఐగా పని చేసే తిమ్మరాయప్ప సన్మానించారు. ఇది సబబు కాదంటూ పోలీసు కమిషనర్ దయానంద.. ఆ ఎస్ఐని వర్తూరు పీఎస్ నుంచి ఆడుగోడికి బదిలీ కానుక ఇచ్చారు. బిగ్‌బాస్‌లో పేరుగాంచిన సంతోష్‌కు అనేక మంది అభిమానులు ఉన్నారు. గతంలో మెడలో పులిగోరు వేసుకోవడంతో అతనిపై కేసు కూడా అయి జైలుకెళ్లి వచ్చాడు. అలాంటి వ్యక్తికి యూనిఫాంలో ఉన్న ఎస్ఐ గంధమాల వేసి మైసూరు పేటాతో సత్కరించడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా అనేకమంది ఎస్ఐని తప్పుబట్టారు. -
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్‌లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్‌ను భారత్ వాంటెడ్‌గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్‌కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే?
సింహం, పులి, చిరుత.. వీటి పేర్లు వినగానే మన మనసులో ఎక్కడో భయం నెలకొంటుంది. ఒకవేళ ఈ అటవీ జంతువులు ఎదురైతే ఎవరైనా సరే ఒక్క ఉదుటున పరుగులందుకుంటారు. ఈ ప్రమాదకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ ఇంటర్నెట్లో దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తొలుత ఒక వ్యక్తి రహదారి గుండా హాయిగా నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పులి అతని ముందు నుంచి వేగంగా పరుగులు తీస్తూ వెళుతుంది. దానిని చూసి ఆ వ్యక్తి షాకవుతాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన దాని క్యాప్షన్‌లో ఇలా రాశారు. ‘ఇతను అందరికన్నా అదృష్టవంతుడైన వాడా? టైగర్ అతనిని చూసి అస్సలు స్పందించలేదు..’ అని రాశారు. కేవలం 41 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను డిసెంబర్ 8న ఎక్స్‌లో షేర్ చేయగా, దీనిపై వ్యూవర్స్ రకరకాలుగా తమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 లక్షల 76 వేల మంది వీక్షించగా, 5 వేల మందికి పైగా వ్యూవర్స్ ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్.. ‘సర్, ఇది ఉత్తరాఖండ్ ప్రజలకు సాధారణమైన అంశం’ అని రాశారు. మరొకరు ‘ఆ టైగర్ ఉపవాస దీక్షలో ఉంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరు? సస్పెన్స్ వీడేదెన్నడు? Is he the luckiest man alive. Tiger seems least bothered. From Corbett. pic.twitter.com/ZPOwXvTmTL — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 8, 2023 -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ లో కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్‌ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్‌ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్‌కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్‌నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్‌ను అమితాబ్‌తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్‌తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఘటనలో కీలక పరిణామంచోట చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు బిహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆ యువకుడిని ప్రశ్నించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. నిందిత యువకుడి సోషల్ మీడియా ఖాతానుండే అప్లోడ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మరోవైపు విచారణ సందర్భంగా వేరే ఇన్‌స్టా ఖాతానుంచి ఆ వీడియోను తాను డౌన్లోడ్ చేసుకున్నట్లు యువకుడు చెప్పినప్పటికీ, విచారణ కొనసాగుతుందని సంబంధిత సీనియర్ అధికారులు తెలిపారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే:ఆ దిగ్గజాలు ఇపుడేమంటాయో?) మొబైల్ ఫోన్‌తో సహా బిహార్‌కు చెందిన యువకుడిని ఐఎఫ్ఎస్ఓ యూనిట్ ముందు హాజరుకావాలని పోలీసులు అదేశించారు. అలాగే FIR నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనలో నవంబర్ 10న, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO)లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465 (ఫోర్జరీకి శిక్ష) , 469 (పరువుకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66E కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్) కాగా నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్లైన్లో మహిళల సెక్యూరిటీపై ఆందోళన రేపింది. బిగ్‌బీ అమితాబ్ సహా పలువురు నటీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించి మరోసారి సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని గుర్తు చేసింది. (చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!) -
వారానికి 70 గంటల పని: ఇన్ఫో ‘సిస్’ వీడియో వైరల్.. మీ పొట్ట చెక్కలే!
70 hour work week remark hilarious video viral భారతీయు యువత వారానికి 70 గంటలు పని పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రాజేశాయి. కొంతమంది కంపెనీల ప్రతినిధులు, నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రధానంగా ఇండస్ట్రీలో మహిళా ఉద్యోగులపై వివక్షపై ఎక్కువ చర్చ నడిచింది. ఇంటా బయటా మహిళా ఉద్యోగుల పనిగంటలు, వారికి లభిస్తున్న గుర్తింపు, అందుతున్న వేతనం తదితర విషయాలు చర్చనీయాంశమైనాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇన్ఫీ ‘సిస్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియోను వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. 70-80-90 గంటలు పనిచేస్తున్నారు గృహిణులు దగ్గర మొదలు పెట్టి.. నారాయణ ..నారాయణ.. అంటూ ఇన్ఫో ‘సిస్’ మీకు ఇన్ఫో ఇస్తోంది బ్రో.. అంటూ తనదైన యాక్సెంట్‌తో సాగిన ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. ఈ హిలేరియస్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వావ్.. నిజం చెప్పారు. గృహిణులు 70 నుండి 80 గంటలు పని చేస్తారు.. లవ్ యూ ఫర్ అండర్ స్టాండింగ్ .. ఇన్ఫో ‘సిస్’ అని ఒక యూజర్ కమెంట్ చేశారు. ఇది నూటికి నూరు శాతం, ఈ వీడియోను ఇన్ఫీ మూర్తి అంకుల్ చూడాలి అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం Info sis giving you info on 70 hour week! 😂😂 pic.twitter.com/rh6Jw1n2TD — Harsh Goenka (@hvgoenka) November 6, 2023 -
HYD: పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ !
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు. అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
కాలం కలిసి వస్తే డంప్‌యార్డ్ కూడా నందనవనం అవుతుంది!
కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్ కూడా కనుల విందు చేసే పార్క్ అవుతుంది. రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్‌లో ఒక డంప్ యార్డ్ ఉండేది. దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల నుంచి నడిచి వెళ్లాలంటే జనాలు జడుసుకునేవారు. అలాంటి చోటుకు ఇప్పుడు జనాలు వెదుక్కుంటు వస్తున్నారు. దీనికి కారణం ఈ డంప్‌యార్డ్‌ను మున్సిపాలిటీ సిబ్బంది అందమైన పార్క్‌గా తయారుచేయడమే. వాటర్ ఫౌంటెన్లు, పచ్చటి గడ్డితో ఈ పార్క్ కనువిందు చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సవిత దావియా ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఎన్నో పట్టణాలలో ఎన్నో డంప్‌యార్డ్‌లు భయపెడుతున్నాయి. అవి కూడా ఇలాగే నందనవనంలా మారితే ఎంత బాగుంటుంది’ అంటూ ఒక ఎక్స్ యూజర్ స్పందించాడు. A former dumpyard converted to this public park on Municipality land by #ForestDept #Churu in 3 months#Motivation - Kids like mine hv a place to go, staff learnt new skill, dept got recognition & a public asset created 🌿#urban #Forestry@ParveenKaswan@RajGovOfficial pic.twitter.com/SG0OVigORS — God's Favourite Child (@Savi_IFS) September 7, 2023 (చదవండి: బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్)