కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్ కూడా కనుల విందు చేసే పార్క్ అవుతుంది. రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్‌లో ఒక డంప్ యార్డ్ ఉండేది. దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల నుంచి నడిచి వెళ్లాలంటే జనాలు జడుసుకునేవారు. అలాంటి చోటుకు ఇప్పుడు జనాలు వెదుక్కుంటు వస్తున్నారు. దీనికి కారణం ఈ డంప్‌యార్డ్‌ను మున్సిపాలిటీ సిబ్బంది అందమైన పార్క్‌గా తయారుచేయడమే.
వాటర్ ఫౌంటెన్‌లు, పచ్చటి గడ్డితో ఈ పార్క్ కనువిందు చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సవిత దావియా ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఎన్నో పట్టణాలలో ఎన్నో డంప్‌యార్డ్‌లు భయపెడుతున్నాయి. అవి కూడా ఇలాగే నందనవనంలా మారితే ఎంత బాగుంటుంది’ అంటూ ఒక ఎక్స్ యూజర్ స్పందించాడు.
A former dumpyard converted to this public park on Municipality land by #ForestDept #Churu in 3 months#Motivation - Kids like mine hv a place to go, staff learnt new skill, dept got recognition & a public asset created 🌿#urban #Forestry@ParveenKaswan@RajGovOfficial pic.twitter.com/SG0OVigORS
— God's Favourite Child (@Savi_IFS) September 7, 2023
(చదవండి: బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్)
Comments
Please login to add a commentAdd a comment