ప్రతీకాత్మక చిత్రం
జైపూర్ : మనుషుల ప్రైవసీకే గౌరవం ఇవ్వని మనుషులు జంతువుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో వేరే చెప్పాలా. కానీ జంతువులతో ఆటలు ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు అధికారులు. ఓ సినిమాలో చెప్పినట్లు ‘పులిని చూడాలనుకుంటే దూరం నుంచి చూడాలి తప్ప చనువిచ్చింది కదా అని సవారీ చేయాలని చూస్తే వేటాడేస్తుంది’. ఈ డైలాగ్‌కు సరిపోయే సంఘటన ఒకటి రాజస్తాన్ రణథంబోర్ పార్కులో చోటు చేసుకుంది.
ఎందా గ్రామానికి సమీపంలో రెండు పులులు తమ ఏకాంతాన్ని ఆస్వాధిస్తున్నాయి. ఇది గమనించిన స్థానుకులు ఆ పులుల చుట్టూ చేరి వాటి మీదకు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఆగ్రహించిన పులి తమపై దాడి చేసిన గ్రామస్తులను ఓ ఆట ఆడించాయి. దాంతో పులి బారి నుంచి తప్పించుకోవడానికి వారంతా చెట్లు, పుట్టలను ఆశ్రయించారు. అయితే వీరిలో మోహన్ అనే యువకుడు తప్పించుకోలక పోవడంతో పులి పంజాకు చిక్కి తీవ్ర గాయాలపాలయ్యాడు.
దాంతో అటవి అధికారులు చికిత్స నిమిత్తం మోహన్‌ని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయం గురించి అటవి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభయారణ్యాల్లోనే జంతువులకు రక్షణలేకుండా పోతుందంటూ ఆరోపిస్తున్నారు. పార్క్‌లో ఉన్నంతా మాత్రానా ఆయా జంతువులు వాటి ప్రవృత్తి మర్చిపోవని హెచ్చరిస్తున్నారు. దూరం నుంచే వాటిని చూడాలి కానీ ఇటువంటి సాహసాలు చేయకూడదని, కాదని ప్రయోగాలు చేస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయని తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment