dust
-
బీరులో చెత్త, చెట్నీలో బొద్దింక
-
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్‌లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
‘దుమ్ము’ రేపిన విక్రమ్!
బెంగళూరు: చంద్రయాన్–3లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన సందర్భంగా భారీ పరిమాణంలో దుమ్మును వెదజల్లింది. ఫలితంగా అక్కడ చిన్న గుంతలాంటి ప్రదేశం ఏర్పడినట్టు ఇస్రో శుక్రవారం వెల్లడించింది. ‘ఉపరితలంలోని ఏకంగా 2.09 టన్నులకు పైగా దుమ్ము, ధూళి, ఖనిజ శకలాల వంటివి 108 మీటర్ల పరిధిలో చెల్లాచెదురయ్యాయి. దాంతో విక్రమ్ చుట్టూ భారీ వలయాకార పరిధి (గుంత వంటిది) ఏర్పడింది’’ అని వివరించింది. ల్యాండింగ్‌కు ముందు, జరిగిన వెంటనే తీసిన ఫొటోలను ఉపగ్రహ ఆర్బిటార్‌లోని హై రిజల్యూషన్ కెమెరా సాయంతో హైదరాబాద్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం సైంటిస్టులు ఈ మేరకు వెల్లడించారు. -
కాలం కలిసి వస్తే డంప్‌యార్డ్ కూడా నందనవనం అవుతుంది!
కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్ కూడా కనుల విందు చేసే పార్క్ అవుతుంది. రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్‌లో ఒక డంప్ యార్డ్ ఉండేది. దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల నుంచి నడిచి వెళ్లాలంటే జనాలు జడుసుకునేవారు. అలాంటి చోటుకు ఇప్పుడు జనాలు వెదుక్కుంటు వస్తున్నారు. దీనికి కారణం ఈ డంప్‌యార్డ్‌ను మున్సిపాలిటీ సిబ్బంది అందమైన పార్క్‌గా తయారుచేయడమే. వాటర్ ఫౌంటెన్లు, పచ్చటి గడ్డితో ఈ పార్క్ కనువిందు చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సవిత దావియా ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఎన్నో పట్టణాలలో ఎన్నో డంప్‌యార్డ్‌లు భయపెడుతున్నాయి. అవి కూడా ఇలాగే నందనవనంలా మారితే ఎంత బాగుంటుంది’ అంటూ ఒక ఎక్స్ యూజర్ స్పందించాడు. A former dumpyard converted to this public park on Municipality land by #ForestDept #Churu in 3 months#Motivation - Kids like mine hv a place to go, staff learnt new skill, dept got recognition & a public asset created 🌿#urban #Forestry@ParveenKaswan@RajGovOfficial pic.twitter.com/SG0OVigORS — God's Favourite Child (@Savi_IFS) September 7, 2023 (చదవండి: బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్) -
సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!
మన కళ్ల ముందు కనిపించేవి, మన నిత్య జీవితంలో ఉపయోగించేవి చెడు చేస్తాయని ఊహించం. నష్టం వాటిల్లంత వరకు.. తేరుకోం, తెలుసుకోం. సరదాగా తీసుకుంటాం. ఏం కాదనకుంటాం. జరగకూడనిది జరిగినప్పుడూ గానీ మనకు అవగతం కాదు. టైం బాలేనప్పుడూ తాడే పామై మృత్యువు అవుతుందని పెద్దలు అందుకే అన్నారేమో!. అచ్చం అలాంటి విషాదకర ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించిన సున్నపు రాయి పౌడర్ రోడ్డుకి ఒకపక్కన రాసిలా ఉంది. అక్కడే రొమాల్డో బిటెన్కోర్ట్ కుటుంబం నివశిస్తుంది. వాళ్ల ఏడేళ్ల బాబు ఆడుకోవడం కోసం అని బయటకు వచ్చి ఈ సున్నపు రాయి పౌడర్ వద్దకు వచ్చాడు. దాంట్లో దొర్లి ఆడుకుంటూ కేరింతలు కొట్టాడు. అతడి కుటుంబ సభ్యులు ఫోటోలు కూడా తీశారు. సరదాపడుతున్నాడు కదా అని ఏమి అనలేదు. అంతే సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుటుంబసభ్యలుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే ఆ బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ పౌడర్ శ్వాసనాళల్లోకి చేరిందని అందువల్లే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. మరొక చిన్నారి ఇలా మృత్యువాత పడకూడదనే సదుద్దేశంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు ఆ సున్నపు రాయి వద్ద ఆడుకున్న చివరి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వివరించారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి దగ్గరకి పిల్లల్ని వెల్లనీయకుండా చూసుకోండి అని సూచించారు. సున్నపు రాయి ప్రమాదకరమా..పీల్చితే అంతేనా! అయితే ఈ సున్నపు రాయి రేణువు సాధారణ ఇసుక రేణువు కంటే వంద రెట్లు చిన్నదని ఈజీగా శ్వాసక్రియా నాళాల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు వైద్యులు. అయితే దీన్ని పిల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబస్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, కిడ్నీ వ్యాధి, సిలికోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే సున్నపు రాయి రేణువులు ఊపిరితిత్తుల కణజాలంలో చిక్కుకోవడం వల్ల శరీరంపై వాపు, మచ్చలు ఏర్పడతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్ని తీసుకునే సామర్థ్యం తగ్గిపోయి ఊపిరితిత్తుల వ్యాధికి దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!) -
గ్లోబల్ వార్మింగ్‌కు... చంద్రధూళితో చెక్.. తవ్వి తీసి వెదజల్లడమే!
చంద్రుడంటేనే చల్లదనానికి చక్కని ప్రతీక. అందుకే చల్లని రాజా అంటూ చందమామపై సినీ కవులు ఎన్నో పాటలు కూడా కట్టారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నానాటికీ ప్రమాదకరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేసి భూమిని చల్లబరిచేందుకు కూడా చంద్రుడు ఎంతో సాయపడగలడట. అమెరికా సైంటిస్టుల బృందమొకటి ఈ దిశగా వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రధూళిని అంతరిక్షంలోకి వెదజల్లడం! తద్వారా భూమిపై పడే సూర్యరశ్మిని కొద్దిగా మళ్లించడం!! ఆ మేరకు భూమిని చల్లబరచడం..!!! ఏమిటీ ప్రతిపాదన...? చంద్రునిపై ఉన్న ధూళిని భారీ పరిమాణంలో తవ్వి తీయాలి. దాన్ని సూర్యునికేసి వెదజల్లాలి. అది భారీ ధూళి మేఘాల రూపంలో కనీసం ఓ వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో నిలిచి ఉండేలా చూడాలి. అది చెదిరిపోయాక చంద్రునిపై మరో దఫా తవ్వకం. మరో వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో మరిన్ని ధూళి మేఘాలు. ఇలా మొత్తమ్మీద ఏటా ఏకంగా కోటి టన్నుల చంద్ర ధూళిని భూమికి, సూర్యునికి మధ్య మేఘాల రూపంలో వెదజల్లాలన్నది ప్రతిపాదన. ఏమిటి సమస్య? ► చంద్ర ధూళిని అంతరిక్షంలో వెదజల్లడం వినడానికి బానే ఉన్నా అందుకు చాలా సాంకేతికత అవసరం. అంతేగాక సాంకేతిత, రాజకీయ సవాళ్లతోనూ, అంతకుమించి భారీ వ్యయ ప్రయాసలతోనూ కూడిన పని కూడా. ఎందుకంటే... ► అన్నింటికంటే ముందుగా చంద్రునిపై భారీ సైజులో ఓ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూళిని తవ్వి పోసే పరికరాలు తదితరాలను అక్కడికి చేరేసుకోవాలి. ► గత 50 ఏళ్లలో మనిషి చంద్రునిపై కాలు పెట్టలేదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా ఎంత కష్టమో అర్థమవుతుంది. ► రాజకీయంగా చూస్తే ఈ మొత్తం ప్రయోగానికి ఎవరు సారథ్యం వహించాలి, ఇందులో ఏ దేశం పాత్ర ఎంతమేరకు, ఎలా ఉండాలన్నది మరో పెద్ద ప్రశ్న. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం ఇప్పటికే పెద్ద దేశాల మధ్య పోటీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న వేళ కేవలం ఓ పర్యావరణ లక్ష్యసాధన కోసం ఆభిజాత్యాలను పక్కన పెట్టి అవన్నీ ఏ మేరకు కలిసొస్తాయన్నది అనుమానమే. ► అంతరిక్షంలో భూమికి, సూర్యునికి మధ్య ప్రాంతమంతా పలు దేశాలు ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలతో నిండిపోయి ఉంది! ► ఇన్ని కష్టాలూ పడి ఒకవేళ విజయవంతమైనా ధూళిని వెదజల్లే ఉపాయం తాత్కాలిక ఫలితాలే ఇస్తుంది తప్ప గ్లోబల్ వార్మింగ్‌కు శాశ్వతంగా అడ్డుకట్టు వేసే స్థాయిలో దీర్ఘకాలికంగా పెద్దగా ప్రయోజనం కన్పించకపోవచ్చని కొందరు సైంటిస్టులు పెదవి విరుస్తున్నారు. చంద్రధూళే ఎందుకు? ► భూమిపై పడే సూర్యరశ్మి పరిమాణాన్ని కొంత మేరకు తగ్గించడం ద్వారా భూమిని చల్లబరచాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా ఉన్నవే. దీన్ని సోలార్ జియో ఇంజనీరింగ్, సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్‌గా పిలుస్తున్నారు. ► భూ వాతావరణపు పై పొరలోకి వాయు కణాలతో కూడిన సన్నని లేయర్‌ను పంపి భూమిపైకి వచ్చే సూర్యరశ్మిని కొద్దిమేరకు అడ్డుకోవాలన్న ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఇది ఆచరణసాధ్యం కాదని, ఇలా వాతావరణపు పొరలతో చెలగాటమాడితే భూమిపై పలు ప్రాంతాల్లో వర్షపాతం తదితరాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చన్న భయాల నేపథ్యంలో దానిపై ముందడుగు పడలేదు. ► మరికొందరు అంతరిక్షంలో భారీ అద్దాలు, లేదా ఫిల్టర్లను ఉంచాలని సూచించినా అవేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ► అదే చంద్రధూళిని వాడుకోగలిగితే ఇలాంటి సమస్యలేవీ లేకుండానే దిగ్విజయంగా పని పూర్తవుతుందన్నది తాజా యోచన. ► ఎందుకంటే చంద్రుని ఉపరితలంపై అది అపారంగా అందుబాటులో ఉంది. ► గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే చంద్రుని పై నుంచి ధూళి మేఘాలను అంతేగాక భూమి పై నుంచి జరిపే ఏ ప్రయోగంతో పోల్చినా అత్యంత తక్కువ వ్యయ ప్రయాసలతో సులువుగా అంతరిక్షంలోకి తరలించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దుమ్ము రేపుతోంది!
– కాలుష్యపు కోరల్లో ‘అనంత’ – ఏ రోడ్డులో చూసినా అపరిశుభ్రతే – ట్రాఫిక్ రద్దీతో వాహనాల కాలుష్యమూ అధికమే – కళ్ల సమస్యలతో బాధపడుతున్న జనం అనంత నగరంలో కాలుష్యం తారస్థాయికి చేరుకుంది. ఎగిసి పడుతున్న దుమ్ముతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనారోగ్యం చుట్టుముడుతుండడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నివాస గృహాల నుంచి బయటకు వచ్చేందుకు స్థానికులు భయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలో అత్యధికులు ఊపిరితిత్తులు, కంటి, శ్వాసకోస వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. - అనంతపురం మెడికల్ వాహన కాలుష్యమూ ఎక్కువే అనంతపురంలోని రాం నగర్ సమీపంలో ఫై ఓవర్ పనులు సాగుతున్న నేపథ్యంలో అటుగా వెళ్లాలంటే చాలా మంది జంకుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఇంట్లోంచి బయటకు రావాలంటే స్థానికులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగరంలో వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంది. టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, పాతూరు, కలెక్టరేట్, కమలానగర్, సాయినగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల నుంచి వెలువడే వాయువులు మనిషిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కంటి సమస్యలతో ఆస్పత్రికి రోజూ 120 మంది దుమ్ము ధూళి కణాలు నేరుగా కళ్లలో పడడంతో జనం పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మంటగా ఉండడం, ఎర్రబారడం వంటి రుగ్మతలతో ఆస్పత్రుల బాట పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దుమ్ము ధూళి కణాలు కళ్లలో పడి కళ్లు మసకబారుతున్న 120 మంది వరకు నిత్యమూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని కంటి విభాగానికి చికిత్స కోసం వస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ కంటి ఆస్పత్రులను ఆశ్రయించే వారు దీనికి రెండింతలు ఉంటారని అంచనా. దుమ్ము ధూళి పడిన వెంటనే కళ్లను శుభ్ర పరచకుండా నలుపుతుండడంతో సమస్యలు తీవ్రమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు కంటి పైపొర దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. బయటకు రావాలంటే భయం నగరంలో దుమ్ముధూళి ఎక్కువగా ఎగిసి పడుతోంది. చిన్న పిల్లలను తీసుకుని బయటకు రావాలంటే భయమేస్తోంది. ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న చోట అయితే పరిస్థితి మరీ ఘోరం. అసలు ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియడం లేదు. నేను ఇక్కడే చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంటాను. ఈ దుమ్ముతో ఇటువైపు వచ్చే వాళ్లే తగ్గిపోతున్నారు. నా వ్యాపారం దుమ్ముకొట్టుకుపోతోంది. – జహీర్‌బాషా, రహమత్‌నగర్, అనంతపురం పరిస్థితి అధ్వానంగా మారింది నగరంలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఎప్పుడు బయటకు వద్దామన్నా గాలి దుమారం రేగుతూ ఉంటుంది. రోడ్లు కూడా సరిగా శుభ్రం చేయకపోవడంతో గాలికి ధూళి కళ్లలో పడుతోంది. ఇంటికెళ్లగానే కళ్లను శుభ్రం చేసుకుంటే గానీ ఉపశమనం కలగడం లేదు. – సతీష్, కోర్టు రోడ్డు, అనంతపురం కాలుష్యమే కంటి సమస్యలకు కారణం కళ్లలో మంట, గరుకుగా ఉండడం, తరచూ నేత్రాలు ఎర్రబారుతున్నాయంటే వైద్యులను సంప్రదించండి. పెరుగుతున్న కాలుష్యమే దీనికి కారణం. ద్విచక్రవాహనాల్లో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన అద్దాలు ధరించడం వల్ల సూక్ష్మ ధూళి రేణువులు, కణాలు కంటిలో పడకుండా చూసుకోవచ్చు. బైక్‌లపై తిరిగే వారు హెల్మెట్, గాగుల్స్ ధరించడం మంచిది. ధూళి కణాలు కంటి రెప్పల అడుగుభాగంలో చేరిపోతున్నాయి. చికిత్స తీసుకుంటే సరిపోతుంది. తరచూ కళ్లు, ముఖం కడుక్కోవడం మంచిది. – డాక్టర్ పల్లా శ్రీనివాసులు, కంటి విభాగాధిపతి, సర్వజనాస్పత్రి నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం దుమ్ము,ధూళి కణాలు ముక్కులోకి వెళ్లడం వల్ల ముందుగా అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. ముక్కు దిబ్బడ, నీరు కారడం వంటివి జరుగుతాయి. ఇది కాస్తా ‘సైససైటిస్’కు దారితీస్తుంది. తలనొప్పిగా ఉండడం, ముక్కులో గడ్డలు వచ్చే ప్రమాదం ఉంది. కొంత వరకు కాలుష్యాన్ని ముక్కు నియంత్రించగలదు. చాలా రోజులు పరిస్థితి అలాగే ఉంటే దుమ్ము శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. బ్రాంకెటైటిస్, ల్యారింజైటిస్‌కు గురై ఊపిరితిత్తుల్లో పేరుకుపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. బయట ఎక్కువగా తిరిగేవాళ్లు తప్పనిసరిగా ముక్కుకు మాస్కులు ధరించండి. – డాక్టర్ రాజేశ్, ఈఎన్టీ వైద్యుడు, సర్వజనాస్పత్రి -
దుమ్మెత్తిపోస్తున్న వాహనాలు
► శాపంగా మారినరహదారి విస్తరణ పనులు ► ఆగ్రహంతో టిప్పర్లు అడ్డుకున్న గ్రామస్తులు కాల్వశ్రీరాంపూర్: సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి నుంచి గంగారం బ్రాడ్జిక్రాస్ రోడ్డు వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులతో వాహనాలు వెదజల్లుతున్న దుమ్ముతో ప్రయాణికులు, గ్రామీణ ప్రాంత ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా అస్తమా పేషెంట్లు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు తేడాలేకుండా దుమ్ముతో ఊపిరాడక ఇబ్బందులపాలవుతున్నారు. ఊపిరితిత్తుల్లో దుమ్ముచేరి ఆస్పత్రులకు పరుగులుతీస్తున్నారు. రహదారి విస్తరణలో భాగంగా రోడ్లపై నీరు చల్లాల్సి ఉన్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దుమ్ములేస్తూ ఇళ్లపైనే కాకుండా, ఆరేసిన దుస్తులపై, వండుకున్న వంటలపైకి చేరడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతోంది. మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో మండలంలోని పెగడపల్లిలోని దళితకాలనీ వాసులు రోడ్డు పనుల కోసం కంకర తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ప్రయాణికులు, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టిన రోడ్లపై దుమ్ములేవకుండా ప్రతీరోజూ మూడుపూటలా నీళ్లుచల్లించాలని వేడుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ఇదే వరుస చాలారోజుల నుంచి ఇదే వరుస. దుమ్ములేస్తూ ఇళ్లపైనే కాకుండా ఆరేసిన బట్టలపై, ఇంట్లో వండుకున్న వంటలపై దుమ్ము పడుతుంది. టిప్పర్లు కంకర, మొరం, తారు చేరవేస్తుండటంతో దుమ్ము లేచి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. – కుమార్, వార్డు సభ్యుడు, పెగడపల్లి దమ్ము రోగం వత్తాంది రోడ్లు పనులు ఎప్పుడు పూర్తయితవో కానీ ఇప్పడు రోజూ మాప్రాణాలు పోతున్నయి. పిల్లలకు, పెద్దోలకు ఊపిరాడత లేదు. దవాఖాన్లకు పోతే మిషన్ పెట్టి ఊపిరితిత్తుల్లో పేరుకు పోయిన దుమ్ము తీస్తున్నామని ఫీజు గుంజుతున్నరు. దుమ్ముతో దమ్మురోగం వత్తాంది. – స్వామి, సర్వారాంపల్లి -
బాబు గీరుకుంటున్నాడు. సమస్య ఏమిటి?
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. గత మూడు నెలలుగా చేతి వేళ్లు, మెడ భాగంలో దురద వస్తోంది. రాత్రిపూట తీవ్రంగా ఉంటోంది. మావాడు డస్ట్‌లో ఎక్కువగా ఆడుతుంటాడు. శుభ్రంగా ఉండడు. దీనికి హోమియోలో పరిష్కారం చెప్పండి. - నర్సింహారావు, ఆదిలాబాద్ ఇది ఒక అంటువ్యాధి. ఇది సర్కోప్టిస్ స్కేబీ అనే పరాన్నజీవి (ప్యారసైట్) వల్ల వస్తుంది. పరాన్నజీవి (ప్యారసైట్) అంటే తన ఆహారం, నివాసం కోసం ఇతరులపై ఆధారపడే జీవులు. ఇది చిన్నగా 1 - 3 మిల్లీమీటర్ల పొడవుంటాయి. ఇవి చర్మంలో కన్నాలు/రంధ్రాలు (బరోస్) చేసి దురదను కలిగిస్తాయి. ఆ రంధ్రాలు దారాల లాగా కనిపిస్తాయి. ఇవి 2 -15 మిల్లీమీటర్ల పొడవుంటాయి. దురద వల్ల ఈ కన్నాలు కనిపించకపోవచ్చు. ఈ ప్యారసైట్లు పాకుతాయి. ఎగరలేవు. స్కేబీస్ అనే పదం లాటిన్లో స్కేబర్ నుంచి వచ్చింది. అంటే గోకడం అని అర్థం. ఇది సాధారణంగా శరీర శుభ్రతా వ్యవస్థ లోపించిన వారిలో, లింఫోమా ఉన్నవారిలో కనిపించవచ్చు. కారణాలు : వ్యాధిగ్రస్థులు వాడే వస్తువులు వాడటం స్కూలు పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం ఇతరుల పక్కబట్టలను వాడడం కుక్క లేదా పిల్లి వంటి పెంపుడు జంతువుల నుంచి కూడా వ్యాపించవచ్చు. లక్షణాలు : చర్మంపై చిన్న చిన్న కురుపుల్లాగా వస్తాయి. ఇవి చేతి వేళ్ల మధ్యలో, మణికట్టు, కీళ్ల వెనక, నడుము, నాభి, పాదాల దగ్గర ఎక్కువగా వస్తాయి. చిన్న పిల్లల్లో ముఖం, మెడ, అరచేతులు, అరికాళ్ల మీద రావచ్చు. ఇవి బొబ్బల మాదిరిగా కనిపిస్తాయి. దురద రాత్రివేళ ఎక్కువగా కనిపిస్తుంది. మొదట తక్కువగానే ఉన్నా... వ్యాధి వచ్చిన 1 - 2 నెలల తర్వాత అది చాలా ఎక్కువై నిద్రాభంగం కూడా అవుతుంది. చికిత్స : స్కేబిస్కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను, రోగి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. మెర్క్‌సాల్, హెపార్‌సల్ఫ్, సల్ఫర్, పెట్రోలియం వంటి మందులు ఈ వ్యాధి చికిత్స కోసం అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ సర్జరీ లేకుండానే... గుండె రంధ్రాలను పూడ్చవచ్చు! కార్డియాలజీ కౌన్సెలింగ్ మా బాబుకు ఐదేళ్లు. వాడు పుట్టినప్పుడు ఒకవైపు ఛాతీ ఉబ్బినట్లుగా ఉండటం, బరువు తక్కువగా ఉండటం, బరువు తక్కువతో పాటుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు. డాక్టర్లు పరీక్షించి, గుండెలో చిన్న హోల్ ఏర్పడిందని, కంగారు పడాల్సిన పనిలేదనీ, మందులతో పూడ్చేయవచ్చనీ సలహా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాం. అయితే మా బాబు ఆరోగ్య పరిస్థితిలో కొంతకాలం నుంచి పుట్టినప్పుడు కనిపించిన ఆరోగ్య సమస్యలే మళ్లీ చోటుచేసుకుంటున్నాయి. కార్డియాలజిస్ట్‌కు చూపిస్తే పరీక్షలు చేసి, గుండెలో వెంట్రికల్ గదుల మధ్య 5.5 ఎం.ఎం.కు పైగా రంధ్రం ఉందని, సర్జరీ చేయాలని అంటున్నారు. సర్జరీ కాకుండా మరేమైనా ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా? దయచేసి మా బాబు సమస్యకు పరిష్కారం చూపండి. - సుజాత, వైజాగ్ పిల్లల్లో గుండెకు సంబంధించిన రంధ్రాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. గర్భం దాల్చిన సమయంలో ఒక పొడవాటి గొట్టం నుంచి శిశువు గుండె రూపుదిద్దుకోవడం, వాటి భాగాలు అభివృద్ధి చెందడం జరుగుతాయి. ఈ దశలో ఏర్పడే లోపాలే తదనంతరం గుండెలో రంధ్రాలకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన అంశాలు కూడా ఈ రంధ్రాలకు కారణమవుతాయి. ఆట్రియా లేదా వెంట్రికల్ గదుల గోడల మధ్య పుట్టుకతో ఏర్పడే రంధ్రాల కారణంగా రక్తం ఒక గది నుంచి మరొక గదిలోకి ప్రవహించి, తిరిగి ఆక్సిజన్ కోసం మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాంతో ఊపిరితిత్తులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. పుట్టుకతో గుండెలో రంధ్రాలతో జన్మించేవారిలో 25 - 30 శాతం మంది వీఎస్డీ లోపం అనే సమస్యతో బాధపడుతుంటారు. మీ అబ్బాయి విషయంలో కూడా అదే జరిగిందని మీరు వెల్లడించిన వివరాలను బట్టి చెప్పవచ్చు. అప్పటి కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు అదే రంధ్రం వల్లనే మీ బాబు మళ్లీ గుండె సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్షలో రంధ్రం పరిమాణం 5 ఎం.ఎం. కంటే పెద్దదిగా ఉందని తేలిందన్నారు. ఈ రంధ్రాలు పూడ్చటానికి అప్పట్లో సర్జరీ మాత్రమే అందుబాటులో ఉండేది. అలాంటి పిల్లలు తీవ్రమైన నొప్పిని భరించాల్సి వచ్చేది. అలాగే మచ్చలు శాశ్వతంగా మిగిలిపోయేవి. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పురోగతి వల్ల ఇలాంటి పిల్లలకు అలాంటి అసౌకర్యం, నొప్పి లేకుండా గుండెలోని రంధ్రాలను పూడ్చటం చాలా సాధారణమైన వైద్యప్రక్రియగా మారిపోయింది. ఇందుకోసం సర్జరీ అవసరమే లేదు. మొదట గజ్జల్లో ఉండే రక్తనాళాల ద్వారా కార్డియాక్ కేథటర్‌ను సూది ద్వారా పంపి గుండె పనితీరును తెలుసుకుంటారు. అలాగే గుండె రంధ్రం పరిమాణంతో పాటు దాని తీరును రేడియో కాంట్రాస్ట్‌ను ఇంజెక్ట్ చేసి తెలుసుకుంటారు. ఆ తర్వాత రంధ్రాన్ని మూసివేసే ప్రక్రియను చేపడతారు. ఈ చికిత్స పూర్తయ్యాక గుండెలోకి పంపిన కేథటర్స్ అన్నింటినీ బయటకు తొలగిస్తారు. ఆ తర్వాత ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష చేసి, రంధ్రం పూడుకుందా లేదా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలకూ గురికాకుండా మీ బాబును కార్డియాలజిస్ట్‌కు చూపించి మెరుగైన, శాశ్వతమైన చికిత్సను అందించండి. డాక్టర్ ఆర్. ప్రసాద రెడ్డి సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
దుమ్ము లేపుతున్న వాహనాలు
► హౌసింగ్‌బోర్డులో కానరాని సీసీ రోడ్లు ► ఎండస్తో దుమ్ము.. వానస్తో బురద ► కాలనీ వాసులకు తప్పని అవస్థలు కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కేంద్రంలో హౌసింగ్‌బోర్డు కాలనీ ఏర్పడి 20 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆ కాలనీలో కనీస సౌకర్యాల్లేవు. మారుమూల పల్లెలకంటే అధ్వానంగా ఉంది. సీసీ రోడ్డు చూడాలంటే బూతద్దం పెట్టుకొని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎండ ఉంటే దుమ్ము, వానొస్తే బురదతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా.. హౌజింగ్‌బోర్డు ప్రజల జీవన స్థితిగతులు మాత్రం మారకపోవడం గమనార్హం. ఓట్ల కోసం వచ్చే నాయకులు రెండేళ్లలో సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఓట్లు వేరుుంచుకోవడం, ఆ తర్వాత తొంగిచూడకపోవడం పరిపాటిగా మారింది. హౌజింగ్‌బోర్డు పరిధిలో ఉన్నన్ని రోజుల కష్టాలు అనుభవించిన ప్రజలు, నగరపాలక సంస్థకు అప్పగిస్తే బతుకులు మారుతాయని భావించారు. నగరపాలక సంస్థకు అప్పగించి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇళ్లు దుమ్ముమయం హౌజింగ్‌బోర్డు కాలనీలో సీసీ రోడ్లు లేక దుమ్ముతో తల్లడిల్లుతున్నారు. వాహనాలు వెళ్తే ఇక అంతే సంగతులు. రోడ్లపై కంటే ఇళ్లలోనే ఎక్కువగా దుమ్ము కనబడుతోంది. వంటపాత్రలు, బట్టలు, గృహోపకరణాలు అన్నీ దుమ్ముమయంగా మారుతున్నారుు. ఇక పిల్లలు, వృద్ధులు దుమ్ముతో ఉబ్బసం వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక వానొస్తే ఆ బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నారుు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. రోడ్లన్నీ పొలాలను తలపిస్తారుు. వర్షం పడిన తర్వాత వారం రోజుల వరకు బురద ఉంటోంది. హౌజింగ్‌బోర్డు కాలనీ నిర్మాణం రేగడి నేలలో జరగడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాలు కరువు కార్పొరేషన్లో ఉన్నా ఇతర డివిజన్లతో పోలిస్తే హౌజింగ్‌బోర్డు కాలనీ ప్రజలు మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోవడం లేదు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరగలేదు. మంచినీటి సౌకర్యం పూర్తిస్థారుులో లేదు. వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. యూజీడీ పైపులైన్ కోసం తవ్వకాలు చేపట్టడంతో మట్టిరోడ్లు కూడా ఛిద్రమై గుంతలమయంగా మారారుు. ద్విచక్ర వాహనాలపై వెళ్తే నడుం నొప్పి ఖాయం. కాలినడకన వెళ్లినా అడుగు తీసి అడుగు వేయలేనంత ఇబ్బందిగా ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితులున్నా కాలనీ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికై నా నగరపాలక సంస్థ అధికారులు హౌజింగ్‌బోర్డు కాలనీపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సమీపిస్తున్న కార్తీకం.. ఘాట్లు ఘోరం
-
మళ్లీ తెరపైకి రామ్ మందిర్ పాలిటిక్స్
-
మీ పనితీరేం బాగోలేదు!
– చెత్త సమస్య ఇప్పటి వరకు నెరవేరలేదు – శానిటేషన్ అధికారులు, సిబ్బందిపై ఆర్డీ ఆగ్రహం కర్నూలు (టౌన్): నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడం లేదు. ఎన్నిసార్లు మీకు చెప్పాలి. మీ పనితీరేం బాగోలేదు అని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక నగరపాలకలోని సమావేశ భవనంలో పారిశుద్ధ్య, రెవెన్యూ విభాగాలతో ఆర్డీ సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారీగా శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిప్పర్ల సమస్య ఉందని చెబుతున్నారు... ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు. మూడు నెలలుగా సమస్య ఉంటే ఎందుకు పరిష్కరించుకోలేదని వారిని ప్రశ్నించారు. మీ నిరా్వకంతో నగరంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. జమ్మి చెట్టు నుంచి గార్గేయపురం కంపోస్టు యార్డుకు చెత్త తరలించడంలో సమస్యలు వస్తున్నాయన్నాయన్నారు. కంపోస్టు యార్డు వద్ద పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త తరలింపు అధ్వానంగా తయారయ్యిందని మండిపడ్డారు. వారానికి ఒకరు చొప్పున్న శానిటరీ ఇన్స్పెక్టర్ కంపోస్టుయార్డు, జమ్మిచెట్టు వద్ద పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీవో 279 ప్రకారం వర్కర్లను టెండర్ ద్వారా తీసుకుని ఇంటింటి చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి పన్నుల వసూళ్లు వందశాతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, ఇన్చార్జీ పర్యావరణ ఇంజినీరు రాధకృష్ణ, రెవెన్యూ అధికారులు వీరస్వామి, మల్లిఖార్జున, రెవెన్యూ ఇన్సె్పక్టర్లు పాల్గొన్నారు. -
మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం
మదనపల్లె రూరల్: మదనపల్లె పట్టణంలో సేకరించిన చెత్తాచెదారంను తమ గ్రామ సమీపంలో డంపింగ్ చేయడంపై తట్టివారిపల్లె, పుంగనూరువాండ్లపల్లె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆదివారం చెత్తను మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం వద్ద దింపి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలోని బాహుదా కాలువలో తొలగించిన చెత్తాచెదారాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి తమ గ్రామాల సమీపంలో డంపింగ్ చేయడం దారుణమన్నారు. మున్సిపాలిటీకి పంచాయతీలో డంపింగ్ యార్డు కేటాయించినా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను అక్కడకు చేర్చకుండా తమ గ్రామాల్లో దించడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మళ్లీ పట్టణంలోని చెత్తను తీసుకువచ్చి చెరువు, తూముల్లో దించడం దారుణమని మండిపడ్డారు. వెంటనే చెత్తదిబ్బలు తొలగించకుంటే కార్యాలయం ఎదుట గ్రామస్తులంతా ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. -
డస్ట్ మైట్స్‌తో ఆరోగ్యం దుమ్ము దుమ్ము!
అలర్జీస్ అలర్జీలతో బాధపడుతూ దానికి కారణమైన అంశాల కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. కానీ ఆ అలర్జీని కలిగించే అంశాల్లో ఒకటైన డస్ట్‌మైట్ ‘పక్కలో బల్లెం’లా మన పక్కనే ఉండవచ్చు. మన తలగడలోనే నివసిస్తూ ఉండవచ్చు. మన కార్పెట్లలో ఉండవచ్చు. అవి నేరుగా నీళ్లు తాగలేవు. అయితే వాటి మనుగడ కోసం నీరు కావాలి. అందుకే తమ ముందు కాళ్ల వద్ద ఉండే ఒక రకం గ్రంథుల ద్వారా వాతావరణంలోని తేమను స్వీకరిస్తుంటాయి. దాదాపు 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్ ఉండవచ్చు. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) డస్ట్ మైట్స్ ఉండవచ్చు. ఒక పరుపులో కనీసం కోటి డస్ట్‌మైట్స్ ఉంటాయి. దుమ్ము కారణంగా అలర్జీ కలుగుతుందని అనుకుంటారు. కానీ దుమ్ములోని ఈ డస్ట్‌మైట్స్ వల్లనే అలర్జీ వస్తుంది. అందునా అవి విసర్జించే విసర్జకాల కారణంగా కూడా అలర్జీ కలుగుతుంటుంది. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఒక్కోసారి ఆ అలర్జీ కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. -
‘చెత్త’ నిర్ణయం
స్టోర్‌రూంలో పుష్కాట్స్, డస్ట్‌బిన్స్ వాడకుండానే మూలకు.. రూ.35 లక్షలు వృథా నాలుగు నెలలకే చిలుముపట్టిన కొత్త రిక్షాలు రామగుండం బల్దియాలో ప్రజాధనం దుర్వినియోగం కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో ప్రజాధనం వృథా చేస్తున్నారు. పాలకులు, అధికారులు అనాలోచిత నిర్ణయంతో ఏకంగా బల్దియాకు రూ.35లక్షల నష్టం కలిగింది. చెత్త సేకరించడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు కొనుగోలు చేసి మూడేళ్లు గడిచినా వాడకుండా మూలన పడేశారు. మళ్లీ నాలుగు నెలల క్రితం ట్రైసైకిళ్లు కొన్నా వాటిది అదే పరిస్థితి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పుబట్టిపోతున్నాయి. వాటిని వాడకుండానే మళ్లీ కొత్తగా కొనేందుకు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. కనీసం వాటిని వినియోగించేందుకు కార్మికులను తీసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. పాలకులు, అధికారులు తీసుకునే చెత్త నిర్ణయాలతో బల్దియా పేరు అభాసుపాలువుతున్నారు. మూడున్నరేళ్ల క్రితం 12వ ఆర్థిక సంఘానికి చెందిన రూ.25 లక్షల నిధులతో 90 పుష్‌కాట్(చెత్తను సేకరించడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు),1,250 డస్ట్బీన్స్ను టెండర్ల ద్వారా అధికారులు కొనుగోలుచేశారు. సంవత్సరాల తరబడి ఒక్క పుష్కాట్స్ బండిని కూడా ఉపయోగించకుండానే గదుల్లో మూలకు పడేశారు. వీటి కొనుగోలుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ గతంలో కొందరు మాజీ కౌన్సిలర్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్‌కు ఫిర్యాదుచేశారు. అయినా స్పందన లేదు. ఇప్పటికే చాలావరకు పుష్కాట్స్, ప్లాస్టిక్ డబ్బాలు మాయమయ్యాయని ఆరోపణలున్నాయి. పుష్కాట్స్, డస్ట్బీన్స్ ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుండానే... ప్రస్తుత పాలకర్గం 12వ ఆర్థిక సంఘానికి చెందిన మరో రూ.10 లక్షల నిధులతో నాలుగునెలల క్రితం 56 ట్రైసైకిళ్లను కొనుగోలు చేసింది. మరో వంద ట్రైసైకిళ్లు, ఇంటింటికీ రంగు డబ్బాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త ట్రైసైకిళ్లలో నాణ్యతెంత? రూ.10 లక్షలతో కొనుగోలు చేసిన 56 ట్రైసైకిళ్లను అధికారులు నిర్లక్ష్యంగా చెట్ల కిందపడేశారు. ఎండకు ఎండుతూ... వానలకు తడుస్తూ ప్రస్తుతం రిక్షాలన్నీ తుప్పుబట్టి పాడవుతున్నాయి. నాసిరకం విడిభాగాలతో ట్రైసైకిళ్లను తయారుచేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా పారిశుధ్యం మెరుగుకు ఉపయోగంలేకుండానే రూ.35 లక్షల ప్రజాధనం వృథా అయింది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం పాలకవర్గం నోరు మొదపడంలేదు. కొలిక్కిరాని రిక్షా కార్మికుల ఎంపిక ఇంటింటా చెత్త సేకరించి రీసైక్లింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుత పాలకవర్గం 12వ ఆర్థిక సంవత్సరం మిగులు నిధులు రూ.10 లక్షలతో 56 ట్రైసైకిళ్లను కొనుగోలు చేసింది. ఒక్కో రిక్షాపై ఇద్దరు కార్మికులను పనిలోకి తీసుకుంటామని చెప్పి ఇటీవల రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. గతంలో పనిచేసిన ర్యాగ్పిక్కర్ల(రిక్షా కార్మికులు)ను పనిలోకి తీసుకోవాలని, వారిని పారిశుధ్య కార్మికులుగా గుర్తించి కార్పొరేషన్ తరఫున వేతనాలు ఇవ్వాలని చాలాకాలంగా కార్మిక సంఘాల నాయకులు, ర్యాగ్‌పిక్కర్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై కొలిక్కి రాలేదు. వినియోగంలోకి తెస్తాం.. –డి.జాన్‌శ్యాంసన్, కమిషనర్ ఇంటింటా చెత్త సేకరించడానికి 56 ట్రైసైకిళ్లు కొనుగోలు చేశాం. వీటిపై కార్మికులను తీసుకునేందుకు రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చాం. ఎవరూ ముందుకు రావడంలేదు. మున్సిపల్ కార్పొరేషనే జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇది సాధ్యంకాదు. మరోసారి నోటిఫికేషన్ ఇస్తాం. రాకుంటే మేమే 50 డివిజన్లలో ఉన్న కార్మికులతో అవసరమున్నచోట ట్రైసైకిళ్లతోపాటు పుష్కాట్స్ ఏర్పాటుచేస్తాం. 20 రోజుల్లో డివిజన్లలోకి రిక్షాలు – కొంకటి లక్ష్మీనారాయణ, రామగుండం నగర మేయర్ రిక్షాలపైన పనిచేయడానికి నోటిఫికేషన్ పిలిస్తే కార్మికులు ముందుకురాలేదు. ట్రైసైకిళ్ల వినియోగంపై దృష్టి సారించాం. 20 రోజుల్లో రిక్షాలను వినియోగంలోకి తీసుకువస్తాం. అవసరమైతే పుష్కాట్స్ కూడా పారిశుధ్యం కోసం వినియోగిస్తాం. -
నిమ్మ ముక్కతో దుర్వాసన మాయం
ఇంటిప్స్ వంటగదిలో దుర్వాసన పోవాలంటే చిన్న గిన్నెలో నీళ్లు పోసి, నిమ్మముక్క వేసి మరిగించాలి. ఈ నీళ్లు చల్లారక స్టౌ, కిచెన్ గట్టు, అవెన్.. వంటివి తుడిచి, ఆ తర్వాత పొడిక్లాత్‌తో తుడవాలి. మరకలు ఉండవు. కిచెన్‌లో ఉపయోగించే స్పాంజ్‌లను బేకింగ్ సొడా కలిపిన నీటిలో రాత్రిపూట ఉంచి, మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరచాలి. ఇలా చేస్తే బాక్టీరియా నశించి, చక్కగా శుభ్రపడతాయి.రోజూ రాత్రి వేళ అవెన్ లోపల తడి స్పాంజ్‌తో తుడిచి, 3 నిమిషాలు ఆన్ చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా వృద్ధి చెందదు. ఇలాగే, రాత్రిపూట కూరగాయలు కట్ చేసే బోర్డులు, కత్తులు శుభ్రపరిచి, పొడి క్లాత్‌తో తుడిచి ఉంచాలి. చంటి పిల్లలు పార్క్ లేదా బీచ్‌లలో ఇసుకలో ఆడుతుంటారు. అలా వదిలేస్తే మట్టి అంటుకుంటుందని తల్లులు వారిస్తుంటారు. బేబీ పౌడర్ని పిల్లల కాళ్లకు, చేతులకు రాసి, వదలాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము అంతగా అంటుకోకుండా ఉంటుంది. -
మీ టీవీ ని ఎలా శుభ్రం చేస్తున్నారు?
ముందు మానిటర్ని ఆఫ్ చేయండి. దీంతో మురికి ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ♦ పొడిగా ఉండే మెత్తటి క్లాత్‌ను (కళ్లద్దాలను తుడిచేలాంటి క్లాత్) తీసుకొని, ముందు దుమ్ము పోయేలా తుడవండి. ఎక్కువ ఒత్తిడి లేకుండా పై నుంచి కిందకు తుడవాలి. ♦ వెనిగర్, నీళ్లు సమభాగాలు తీసుకొని దీంట్లో మెత్తటి క్లాత్ ముంచి, పిండి దాంతో స్క్రీన్‌ను తుడవాలి. ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడవాలి. ♦ పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్స్, షర్ట్ క్లాత్స్‌ను స్క్రీన్ తుడవడానికి ఉపయోగించకూడదు. ♦ అమ్మోనియా, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ వంటి రసాయనాలతో స్క్రీన్ తుడిస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ♦ లిక్విడ్స్ ఏ మాత్రం డెరైక్ట్‌గా స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు. స్ప్రే మానిటర్ లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో త్వరగా స్క్రీన్ పాడవ్వచ్చు. -
రోడ్లు ఊడ్వరు.. చెత్త తీయరు..
గ్రేటర్లో అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ గల్లీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులు పట్టింపులేని కార్పొరేషన్ అధికారులు గాడిన పడని ప్రజారోగ్యం వరంగల్ అర్బన్ : మునిసిపల్ కార్పొరేషన్ స్థారుు నుంచి గ్రేటర్ వరంగల్‌గా రూపాంతరం చెందిన ఓరుగల్లు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. క్లీన్‌సిటీ చాంపియన్ షిప్ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది న వరంగల్ బల్దియా జాతీయస్థాయి అవార్డు లు, సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుంది. అరుుతే ఇంతటి ప్రఖ్యాతిగాంచిన మహా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడకపోవ డంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణకు ఏటా కోట్లు వెచ్చించి వాహనా లు కొనుగోలు చేస్తున్నా సమస్య గాడిలో పడ డం లేదు. దీంతో నగరంలోని పలు వీధుల్లో చెత్తకుప్పలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. అలాగే మురికి కాల్వలు కంపు కొడుతున్నాయి. వీటితోపాటు రోడ్లను శుభ్ర ం చేయకపోవడం తో దుమ్ముధూళితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రీసైక్లింగ్‌కు నోచుకోక డంపింగ్ యార్డులో చెత్త గు ట్టలుగా పేరుకుపోతుంది. దీంతో బయోగ్యాస్ విద్యుత్ నామమాత్రంగా సాగుతోంది. డంపింగ్ యార్డులుగా ఖాళీ స్థలాలు.. నగరంలోని పలు డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోరుు రోడ్ల వెంట మురుగునీరు ప్రవహిస్తుంది. డంపర్ బిన్లు, కాంఫ్యాక్టర్ బిన్లు చెత్తతో నిండిపోతున్నా పట్టించుకునేనాథుడే లేడు. ఫలితంగా నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డులుగా మారి మురికికూపాలను తలపిస్తున్నాయి. కాగా, మరుగుదొడ్ల నుంచి మల, మూత్రాలను నేరుగా డ్రెయినేజీల్లోకి వదలడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇదిలా ఉండగా, బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం ఇంటిం టా చెత్త సేకరణలో పాల్గొనడంతో కాల్వలు శుభ్రం చేసే వారే కరువయ్యారు. దీంతో కాల్వలు చెత్తాచెదారంతో నిండి పోయి ముక్కు పుటాలను అదరగొడుతున్నా యి. పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వ్యాప్తిచెంది ప్రజలు డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. కార్యరూపం దాల్చని ప్రణాళికలు.. ట్రైసిటీలో మొత్తం 1.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. 2012లోనే క్లిన్‌సిటీ చాంపియన్ షిప్ కార్యక్రమం మొదలుపెట్టారు. దేశంలో మొదటిసారిగా వరంగల్‌లోనే ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆరు నెలల పాటు బా గానే కొనసాగినా తర్వాత తగ్గింది. ప్రస్తుతం 60 శాతం ఇళ్లలో నుంచి ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నారు. కాగా, పలు కారణాలతో తోపుడు బండ్ల మరమ్మతులను నిలిపివేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు.. జవాన్ల పనితీరును పట్టించుకోవడం లేదు. బల్దియా డిప్యూటీ కమిషనర్ మినహా ఇతర అధికారులు తనిఖీలు చేపట్టడంలేదు. పేరుకుపోతున్న డంపింగ్ యార్డు మడికొండ శివారులోని డంపింగ్ యార్డులో చెత్త గుట్టల్లా పేరుకుపోతుంది. మహా నగరం నుంచి రోజు 145 మెట్రిక్ టన్నుల చెత్తను వాహనాల ద్వారా తరలిస్తున్నారు. దీంతో దశాబ్దకాలంగా యార్డులో చెత్త కుప్పులు గుట్టలుగా మారుతున్నాయి. చెత్త రీసైక్లింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టకపోవడంతో భవిష్యత్‌లో అనర్థాలు చోటు చేసుకోనున్నాయి. రీ సైక్లింగ్.. రీయూజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల్లో భాగంగా 2012 అక్టోబర్‌లో హన్మకొండ బాలసముద్రంలో తడి చెత్త ద్వారా బయో విద్యుత్ ఆధారిత ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో తయారవుతున్న 15 కేడబ్ల్యూ కరెంట్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ. 24 లక్షలతో 24 కేడబ్ల్యూ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, బాలసముద్రంలో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా 4 నుంచి 5 మెట్రిక్ టన్నుల చెత్త రీ సైక్లింగ్ జరుగుతోంది. అంతేకాకుండా ఐటీసీ కంపెనీ పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటా సేకరిస్తున్న పొడి చెత్తను కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా రోజు 10 మెట్రిక్ టన్నుల చెత్తను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఈ పదిహేను మెట్రిక్ టన్నుల చెత్త మాత్రమే రీసైక్లింగ్, రీయూజ్ జరుగుతోంది. ఏడాదికి రూ.30 కోట్లు మహా నగర పాలక సంస్థ పరిధిలో శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు మినహా 2621 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరి వేతనాలు, వాహనాల మరమ్మతులు, డీజిల్ కోసం ప్రతి నెల రూ. 2.50 కోట్లు వెచ్చిస్తోంది. అంటే ఏడాదికి రూ.30 కోట్లు వెచ్చిస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవచూపి నగరంలో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. -
సిటీ నెం.1
♦ ‘దుమ్ము’ దులిపిన నివేదిక ♦ ధూళిలో గ్రేటర్‌దే అగ్రస్థానం ♦ కాలుష్య నియంత్రణ మండలి ♦ అధ్యయనంలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధి మాట ఏమోగానీ... దుమ్ము, ధూళి కాలుష్యంలో గ్రేటర్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. నగర వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అనేకమంది ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినడం... ఎడతెరిపి లేని దగ్గు... గుండె జబ్బులకు ధూళి కాలుష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మహా నగరంలో రోజుకు 11.9 టన్నుల ధూళి కాలుష్యం వెలువడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా ఆరు మహా నగరాలు... హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, పాట్నా, షోలాపూర్‌లలో కాలుష్యంపై సీపీసీబీ ఇటీవల అధ్యయనం చేసింది. దీనిలో గ్రేటర్ సిటీఅగ్రస్థానంలో ఉంది. ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీనగరంలోని చాలా ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాములకు మించుతోందని కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. కారణాలివే... ♦గ్రేటర్లో మొత్తం 43 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పదిహేనేళ్లకు పైబడినవి సిటీ నెం.1 ఆరు లక్షలు. వీటిలో ఆటోలు, బస్సులు, కార్లు, జీపులు, ఇతర రవాణా వాహనాల పొగతో ధూళి కాలుష్యం(ఆర్‌ఎస్‌పీఎం) అనూహ్యంగా పెరుగుతోంది. ♦ మెట్రో పనుల నేపథ్యంలో కాంక్రీటు, సిమెంటు మిశ్రమం నుంచి వెలువడే ధూళికణాలు, పిల్లర్ల కోసం తవ్వినపుడు వెలువడే దుమ్ము రేణువులు గాలిలో కలుస్తున్నాయి. ♦నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం, తరచూ రహదారుల మరమ్మతులు, విద్యుత్, టెలిఫోన్, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల కోసం తవ్వకాలతో కాలుష్యం పెరుగుతోంది. ♦జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తి చేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీంతో తరచూ ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ♦పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం పెరుగుతోందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ♦వాహనాల వేగానికి రహదారులపై లేచే దుమ్ము, ధూళి, ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగతోనూ ధూళి కాలుష్యం పెరుగుతోందని పీసీబీ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే కాలుష్యం అధికం ♦పంజగుట్ట, జేఎన్టీయూ, జీడిమెట్ల, జూపార్కు, ప్యారడైజ్, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో అధికంగా ధూళి కాలుష్యం (ఆర్‌ఎస్‌పీఎం-రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులార్ మ్యాటర్) ప్రమాణాలు నమోదయ్యాయి. ♦కొన్నిచోట్ల నెలకు సగటున క్యూబిక్ మీటర్‌కు 150 మైక్రోగ్రాముల ఆర్‌ఎస్‌పీఎం చేరుతోంది. ♦కొన్ని సందర్భాల్లో ఘనపు మీటరు గాలిలో 250- 300 మైక్రోగ్రాములకు ఆర్‌ఎస్‌పీఎం చేరుకుంటోంది. అనర్థాలివీ... ♦ధూళి కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాస కోస సంబంధ వ్యాధులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ♦ఆస్తమా, బ్రాంకైటీస్, హై బీపీ, ఊపిరితిత్తుల వృద్ధి రేటు తగ్గిపోవడం వంటివ్యాధులతో జనం సతమతమవుతున్నారు. ♦నగరంలోని వివిధ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో 90 శాతానికి పైగా ధూళి కాలుష్యం బారిన పడుతున్న వారేనని వైద్యులు చెబుతున్నారు. -
కలుషితమవుతున్న పెదజాలరి పేట బీచ్
-
ఎర్త్ టు ఎర్త్ యాషెస్ టు యాషెస్ డస్ట్ టు డస్ట్
మార్సీ బార్డర్స్ ఎవరో సెప్టెంబర్ 11, 2001కి ముందు ఎవరికీ తెలియదు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట శిఖరాలను కుప్పకూల్చినప్పుడు శకలాల దుమ్ము ఆమెను కప్పేసింది. ధూళి నిండిన ఆమె ఫోటో ప్రపంచమంతా ఫ్లాష్ అయింది. అప్పటి నుంచీ ఆమెను డస్ట్ లేడీ అంటున్నారు.ఆమె శకలాల ధూళి వల్ల క్యాన్సర్ వచ్చి గత వారమే చనిపోయింది. ఉగ్రవాద భూతం చచ్చిన వాళ్లను ఎలాగో చంపేసింది. చావని వాళ్లను కూడా ఎలా చంపుతుందో డస్ట్ లేడీ విషాదాంతం చెబుతుంది. వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు) పుట్టినప్పుడు వామనుడిలా అమెరికాలోనే ఉండేది. ఇప్పుడది త్రివిక్రముడై మూడో పాదం ఎక్కడ మోపాలి అని ప్రశ్నిస్తోంది. పిడికిట్లో పట్టే సెల్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచమంతా గుప్పెట్లో ఉన్నట్టే. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రేయసిలా కళ్లలో కళ్లు పెట్టి చూసే డెస్క్ టాప్, ఒళ్లో గువ్వలా ఒదిగి కూచునే లాప్ టాప్, పుస్తకమంత ఉండి ప్రపంచమంతా మోసే టాబ్లెట్లు, అరచేతిలో అఖిల విశ్వాన్ని చూసే మొబైల్స్ మనకు క్షణాల్లో చెప్పేస్తున్నాయి. అక్కడ్నుంచి, ఇక్కడ్నుంచి, ఎక్కడెక్కడ్నుంచో మీ కోసం పోగేసిన కాసిని నెట్టింటి కబుర్లు... ఇవిగో... సల్మాన్ ఖాన్ సే షాదీ కరూంగీ! సోమీ అలీ, సంగీతా బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, కతినా కైఫ్‌లు చేయలేని పనిని చేసేస్తానంటోంది ఈ మూడేళ్ల పాప. ఎక్కడిదో తెలియదు కానీ ఈ పిడుగులాంటి పిల్ల సల్మాన్ సే షాదీ కరూంగీ అంటోంది. షాదీ అంటే హ్యాపీ బర్త్ డే లాంటిదని కూడా మనబోంట్లకు విడమర్చి చెబుతోంది. ఈ బుల్లిపాప మన చుల్ బుల్ పాండేకి గిలిగింత పెట్టేసింది. అంతే! ఆయన లవ్లీ సింగ్‌గా మారిపోయాడు. సల్మాన్ ఖాన్ ఈ పిడుగు పంపిన విడియో పాలిట ‘షేర్’ ఖాన్‌గా మారిపోయాడు. వేల లైక్‌లతో గోలగోలగా ఉన్న ఈ విడియోను https://www.youtube.com/watch? v=S1GTnIAgNu0చూడండి. జస్లీన్ వర్సెస్ సరబ్ జీత్ సోషల్ మీడియా కత్తి లాంటిది. కత్తితో కూరగాయలూ తరగొచ్చు. తలలూ తరగొచ్చు. ఢిల్లీకి జస్లీన్ కౌర్‌కి ఈ విషయం బాగానే తెలిసి వచ్చింది. వీధిలో గిల్లి కజ్జాని మొబైల్ ఫోన్ మసాలా, ఫేస్ బుక్ తాలింపూ దట్టించి సరబ్ జీత్ అనే కుర్రాడిని కూర వండేసింది. సరబ్ జీత్ తన వాదనను వినిపించేలోగానే టీవీ ఛానెళ్లు ఆయనకి శిక్ష వేసేశాయి. కానీ మరుసటి రోజే కథలో ట్విస్ట్ వచ్చేసింది. అసలు జస్లీనే సరబ్ జీత్‌ని తిట్టిందని, కుర్రాడు అంత తప్పేమీ చేయలేదని బయటపడింది. నిన్నటిదాకా ఆమె వీరనారి అన్న నరంలేని నాలుకలు ఒక్క క్షణంలో మాట మార్చేశాయి. దీంతో జస్లీన్ ఏకంగా ఫేస్ బుక్ అకౌంట్‌నే క్లోజ్ చేసేసుకోవాల్సి వచ్చింది. ఛమ్కీ గిమ్కీ పెట్టేస్కోనీ ... షాదీ గీదీ చేసేస్కోనీ .... పెళ్లంటే నూరేళ్ల పంటే కాదు. వెయ్యింతల వెరైటీగా కూడా ఉండాలనుకుంటారు చాలామంది. అనూహ్య ప్రదేశాల్లో అద్భుత వివాహాలు చేసుకోవాలనుకునే వాళ్లకి ఆస్ట్రేలియాకి చెందిన జూన్ బగ్ అనే వెడ్డింగ్ ప్లానర్ గొప్ప గొప్ప అయిడియాలు ఇస్తోంది. ఆ జూన్ బగ్ ప్రతి ఏటా స్టన్నింగ్ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఫోటో కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది అవార్డు విన్నింగ్ వెడ్డింగ్ ప్రదేశాల ఫొటోలు రిలీజయ్యాయి. ఇప్పటికే 3.51 లక్షల మంది చూశారు. http://junebugweddings.com/పై క్లిక్ చేసి చూడండి. చూస్తే ఖాయంగా మళ్లీ పెళ్లి చేసేసుకోవాలనిపిస్తోంది. ఇది ఇంద్రాణి వారం పోయిన వారం రాధేమా వారం అయితే ఈ వారం ఇంద్రాణీ ముఖర్జీ వారం. ఇంద్రాణికి మూడుసార్లు పెళ్లయింది. షీనా ఇంద్రాణికి కూతురు. కానీ పీటర్ ఆమెకి తండ్రి కాడు. మిఖైల్ షీనాకి సోదరుడు. కానీ సంజీవ్ ఖన్నా అతనికి తండ్రి కాడు. షీనా ఇంద్రాణికి చెల్లెలు కూడా. కానీ రాహుల్ ఇంద్రాణి మొదటి భర్తకి కుమారుడు కాడు. రాహుల్ మిఖైల్కి సోదరుడు కాడు. కానీ షీనాతో లవ్‌లో ఉన్నాడు. విధి సంజీవ్ ఖన్నా కూతురు. కానీ రాహుల్ ఆమెకి అన్న కాదు. షీనా పదిహేనేళ్లకే ఇంద్రాణికి పుట్టింది. ఇంతకీ దాస్ వయసెంత? ఈ ప్రశ్నలకు జవాబు తెలిసీ చెప్పకపోతే మీ తల వెయ్యి వక్కలవుతుంది. -
హై'డర్టీ'బాద్
-
ఎటు చూసినా చెత్తే!
-
ఎటు చూసినా చెత్తే!
* కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం * పరిష్కారంపై దృష్టిపెట్టని రాష్ట్ర ప్రభుత్వం * ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్తాచెదారం * ఐదు రోజులుగా కుళ్లి దుర్గంధం.. వెలువడుతున్న విష వాయువులు * పూడికతో మూసుకుపోయిన డ్రైనేజీలు * వర్షాలు పడితే అంటురోగాలు ప్రబలే ప్రమాదం * అరకొర రెగ్యులర్ కార్మికులపైనే భారం * సమ్మె విరమించినా.. ‘చెత్త’ పోవాలంటే వారం పట్టే అవకాశం జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కాంట్రాక్టు కార్మికులు (సుమారుగా): 26,000మంది ఒకరోజులో తరలించే వ్యర్థాలు: 3,800 టన్నులు రోజులో ఊడ్చే రహదారుల పొడవు: 8,000 కి.మీ. రోజులో శుభ్రం చేసే కాల్వల పొడవు: 749 కి.మీ. సాక్షి, హైదరాబాద్: ప్రధాన రహదారుల నుంచి వీధుల చివరిదాకా ఎక్కడ చూసినా చెత్త.. పూడికతో మూసుకుపోయిన డ్రైనేజీలు.. రోడ్లపైనే పారుతున్న మురికినీరు.. ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం, విష వాయువులు.. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంస్థల్లో పరిస్థితి ఇది. కుళ్లిపోతున్న వ్యర్థాలతో కాలనీలన్నీ కంపు కొడుతున్నాయి. వీధులన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పురపాలక సంస్థల కార్మికుల సమ్మెతో ఏర్పడిన పరిస్థితి ఇది. వేతనాల పెంపు సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం వారు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా.. పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కార్మిక నేతలతో మంత్రులు ఈటల, నాయిని చర్చించినా.. ఎవరూ ఒక మెట్టుకూడా దిగిరాకపోవడంతో ఫలితం శూన్యం. మరోవైపు ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, డ్రైనేజీ నీరు రోడ్లపైనే ప్రవహిస్తుండడంతో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చెత్త తరలింపునుకు అధికారులు చేస్తున్న యత్నాలేవీ ఫలించడం లేదు. దాదాపు 40 వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉండగా.. అరకొర సంఖ్యలో ఉన్న రెగ్యులర్ కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. అక్కడే ప్రతిష్టంభన.. కనీస వేతనాల పెంపుతో పాటు 16 డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగినప్పటికీ.. ప్రధానంగా వేతన పెంపుపైనే ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో రూ.8,500, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 కనీస వేతనం చెల్లిస్తున్నారు. అయితే ఉద్యోగుల తరహాలో 43 శాతం ఫిట్మెంట్తో 10వ పీఆర్సీని తమకు కూడా వర్తింపజేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలను పారిశుద్ధ్య కార్మికులకు రూ.14,170కి, ఇతర కార్మికులకు రూ.17,380కి పెంచాలని నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కార్మిక నేతలతో సోమ, మంగళ, బుధవారాల్లో మంత్రులు ఈటల, నాయిని జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గురువారమైతే చర్చల కోసం ప్రభుత్వం నుంచి కార్మిక నేతలకు పిలుపే రాలేదు. వ్యర్థాల తరలింపు కష్టమే! ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రోజూ 3,800 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తవుతుండగా.. మిగతా 67 నగర, పురపాలికల్లో మరో 2,000 టన్నుల చెత్త వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో రోజుకు దాదాపు 6,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. సమ్మె కారణంగా నాలుగు రోజులుగా పారిశుద్ధ్య పనులు 90 శాతం నిలిచిపోవడంతో... రాష్ట్రవ్యాప్తంగా 20 వేల టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్మికులు సమ్మె విరమించినా.. ఈ వ్యర్థాలను తొలగించేందుకు వారంపైనే పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనిభారంతో సతమతం ఆరు వేల టన్నుల వ్యర్థాల తరలింపు, 15వేల కిలోమీటర్లకు పైగా పొడవున్న రోడ్లు, వీధులను ఊడ్చడం, 10 వేల కిలోమీటర్ల పొడవున్న మురికి కాల్వలను శుభ్రం చేయడం... ఇదంతా కేవలం 40 వేల మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ చేస్తున్న పని. ఒక్కో కార్మికుడు ముగ్గురు, నలుగురి పని చేస్తున్నారు. అసలు వీరి సేవలను వేతనాలతో పోల్చడం సాధ్యం కాదు కూడా. ప్రస్తుతం ఈ కార్మికులకు అరకొర వేతనాలే అందుతున్నాయి. అందులోనూ ఈఎస్ఐ, పీఎఫ్‌ల పేరిట మినహాయించుకున్న కోట్ల రూపాయలను లేబర్ కాంట్రాక్టర్లు, అధికారులు స్వాహా చేసేశారు. జబ్బు చేస్తే ఈఎస్ఐ సదుపాయం సైతం అందడం లేదని కార్మికులు వాపోతుండడం ఆందోళనకరం. కాగా.. నాలుగు రోజులుగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాజధానిలోనూ దుస్థితి సాక్షి నెట్వర్క్: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె కారణంగా నాలుగు రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 16,000 టన్నుల చెత్త పేరుకుపోయింది. చాలా చోట్ల రోడ్లు, బస్తీలన్నీ దుర్గంధ భరితంగా మారాయి. దోమలు పెరిగిపోయాయి. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్‌లోని దాదాపు 1,500 బస్తీలు, 900 కాలనీల్లో ఇదే దుస్థితి. చెత్త గుట్టలుగా పేరుకుపోయి.. రోడ్ల నిండా విస్తరిస్తోంది. ఇక హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో గురువారం చార్మినార్ వద్ద చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. తాము సమ్మె చేస్తుండగా.. ఈ పనులెలా చేస్తారంటూ నిలదీశారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఓ కార్మికురాలికి చేతికి గాయమైంది. అయితే తమది ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమమేనని పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. పురపాలికల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు జీహెచ్ఎంసీ మినహా ఇతర మున్సిపాలిటీల్లో.. తరలించే వ్యర్థాలు: 1,961.75 టన్నులు పట్టణ రోడ్ల మొత్తం పొడవు: 9,609.14 కిలోమీటర్లు ఒకరోజులో ఊడ్చే రహదారులు: 7,591 కిలోమీటర్లు (79%) మొత్తం మురికి కాల్వల పొడవు: 8,547.59 కిలోమీటర్లు ఒకరోజులో శుభ్రపరిచే మురికి కాల్వల పొడవు: 6,698.34 (78%) కంపు కొడుతున్న కాలనీలు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతోఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ప్రధాన రహదారుల నుంచి వీధుల వరకు ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 964 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులతో పాటు వారికి మద్దతుగా 256 మంది సిబ్బంది కూడా సమ్మెకు దిగారు. దీంతో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా జరుగుతోంది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. వరంగల్ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో 3,074 మంది కార్మికులు ఉండగా.. 2,051మంది సమ్మెలో పాల్గొంటున్నారు. రోడ్లు, వీధులన్నీ అపరిశుభ్రంగా మారారుు. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, తాండూరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలలో రోడ్లన్నీ చెత్తమయం అయ్యాయి. పందులు స్వైర విహారంతో దుర్గంధం వ్యాపిస్తోంది. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, మిర్యాలగూడ మున్సిపాలిటీలు చెత్తతో నిండిపోయాయి. పలు కాలనీల్లో డ్రైనేజీలు నిండిపోయి కంపుకొడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, మధిర మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారాయి. వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. తీవ్రమైన దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని పట్టణ కేంద్రాలు కంపుకొడుతున్నాయి. కాలనీలన్నీ కంపుకొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, మందమర్రి మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం పూర్తిగా నిలిచిపోయింది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా తొలగిస్తున్నాం: జీహెచ్ఎంసీ జంట నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం హైకోర్టుకు నివేదించింది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా చెత్తను తొలగిస్తున్నామని, పారిశుద్ధ్య కార్మికుల సేవలను కూడా వాడుకుంటున్నామని వివరించింది. చెత్తను తొలగించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన రాజేశ్వరి అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. చెత్త తొలగించేందుకు చర్యలు చేపట్టామన్న జీహెచ్ఎంసీ వివరణను నమోదు చేసుకుని విచారణను వాయిదా వేసింది. -
ఎక్కడి చెత్త అక్కడే
మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభం - జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీల్లో స్తంభించిన పనులు - కార్మిక జేఏసీతో చర్చలు విఫలం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె శంఖాన్ని పూరించారు. వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి సమ్మెలోకి దిగారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు స్తంభించిపోయాయి. మరోవైపు కార్మికులతో సమ్మె విరమింపజేయడానికి తొలిరోజు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి సచివాల యంలో కార్మిక ఐక్య సంఘాల నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారానికి చర్చలను వాయిదా వేశారు. వేతనాల పెంపు, ఎక్స్‌గ్రేషియా తదితర డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉండడంతో వీటిపై సీఎం నిర్ణయం తీసుకోవాలని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. సీఎం హరితహారంలో భాగంగా జిల్లాల పర్యటనల్లో ఉన్నందున నిర్ణయం తీసుకోడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు సమ్మె వాయిదా వేసుకోవాలని కార్మిక నేతలకు సూచించారు. అయితే సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని చర్చల అనంతరం కార్మిక నేతలు ప్రకటించారు. మంత్రుల ప్రతిపాదనపై క్షేత్రస్థాయిలో కార్మికులతో చర్చించిన తర్వాతే సమ్మె విరమణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం రెండో దఫా చర్చల్లో అవగాహన కుదిరితే సమ్మె వాయిదా వేస్తామని కార్మిక నేతలు తెలిపారు. -
అంగారకుడి ఉపరితలం కింద హిమనీనదాలు!
లండన్: అరుణగ్రహంపై భారీ హిమనీనదాలు ఉన్నాయట. ఉపరితలంపై దట్టమైన దుమ్ము, ధూళితో కూడిన పొర కింద 150 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంలో గడ్డకట్టిన హిమనీనదాలు ఉన్నాయట. వాటిలోని మొత్తం మంచును పర్చితే.. అంగారకుడి ఉపరితలంపై ఏకంగా మీటరు మందంతో మంచు పొర ఏర్పడుతుందట. సాధారణంగా మార్స్ ఉపరితలంపై ఎక్కడ చూసినా ఎర్రటి దుమ్ము మాత్రమే కనిపిస్తుంది. కానీ దట్టమైన ఆ దుమ్ముపొర కింద అనేక చోట్ల గడ్డకట్టిన నీరుతో కూడిన భారీ హిమనీనదాలు ఉన్నాయని తాజాగా వెల్లడైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్వో) పంపిన రాడార్ సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే అరుణగ్రహం ఉపరితలం కింద మంచు ఉండవచ్చని గతంలోనే అంచనా వేసినా, ఆ మంచు నీటితో ఏర్పడిందా? లేక కార్బన్ డయాక్సైడ్ వల్ల ఏర్పడిందా? అన్నది నిర్ధారించలేకపోయారు. ఈ నేపథ్యంలో రాడార్ సమాచారాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అది నీటిమంచేనని తేల్చారు. దుమ్ము పొర ఉండటం వల్లే ఆ మంచు ఆవిరైపోకుండా ఉన్నట్లు తెలిపారు. -
కాలనీ అంతా ఈ చెత్తేంది..?
* హైదరాబాద్‌లోని మమతానగర్‌లో సీఎం ఆకస్మిక పర్యటన * చెత్తాచెదారం ఎందుకుందంటూ కాలనీవాసులకు ప్రశ్న * వారం రోజుల్లో మళ్లీ వస్తా.. అంతా శుభ్రంగా ఉండాలని సూచన హైదరాబాద్: ఓ వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా వాహనం దిగి కాలనీవాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘బిల్డింగ్లు చూస్తే మంచిగా ఉన్నాయి.. ఇక్కడ అంతా చెత్తాచెదారం పేరుకుపోయింది ఎందుకు’ అని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన అట్లూరి రామకృష్ణ ఆర్‌అండ్‌బీలో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతని కుమారుడు గౌతమ్ వివాహం హైదరాబాద్ నాగోలులోని శుభం కన్వెన్షన్ హాలులో ఆదివారం జరిగింది. ఈ వివాహానికి హాజరైన సీఎం.. వధూవరులను ఆశీర్వదించి నాగోల్ నుంచి మమతానగర్‌కాలనీ రోడ్డు నం బర్-4 మీదుగా వెళ్తుండగా అక్కడ రోడ్డంతా చెత్తాచెదారంతో నిండి ఉండడం గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించి అక్కడున్న కాలనీవాసుల వద్దకు వెళ్లిన కేసీఆర్.. రోడ్డంతా చెత్తాచెదారంతో ఎందుకు ఉందని వారిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న విజయలక్ష్మి... తమ కాల నీలో దొంగతనాలు కూడా బాగా జరుగుతున్నాయని, గతంలో దొంగలు తన గొలుసు లాక్కెళ్లారని, పోలీ సులు కూడా స్పందించడం లేదని విలపిస్తూ ఫిర్యాదు చేసింది.వెంటనే స్పందించిన ఆయన ఈ ప్రాంతం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని పక్కనే ఉన్న ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్ సీపీ ఆనంద్‌కు సమాచారం అందించి కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం కాలనీవాసులతో మాట్లాడుతూ..‘వారం రోజుల్లో మళ్లీ మీ కాలనీకి వస్తా.. అంతటా పర్యటిస్తా.. కాలనీ శుభ్రంగా ఉండాలి’ అని సూచించి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం పీఏ.. కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ చేసి కాలనీ అంతా అపరిశుభ్రంగా ఉండడంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ విషయంపై తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, గుర్రపుడెక్కతో నాగోలు చెరువు పూర్తిగా నిండిపోయిం దని శ్రీనివాస్‌రెడ్డి వారికి బదులిచ్చారు. కాగా, సీఎం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసు యంత్రాంగం సాయంత్రంలోపే కాలనీకి చేరుకుంది. సీపీ సీవీ ఆనంద్ హుటాహుటిన మమతానగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిటీ సెక్యూరిటీ- స్మార్ట్ కాలనీస్’ పేరిట సదస్సు నిర్వహించారు. -
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి
సింగరేణి సీఎండీ వాహనాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తుల యత్నం వెళ్లిపోయిన సీఎండీ... గంట పాటు రోడ్డుపై బైఠాయింపు టేకులపల్లి : కోయగూడెం ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల వలన వచ్చే దుమ్ము, ధూళితో తమ ప్రాణాలు పోతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణి సీఎండీ శ్రీధర్ వాహనాన్ని సోమవారం పెట్రాంచెలక స్టేజీ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. సీఎండీ కేఓసీని సందర్శించి తిరిగి వస్తుండగా గ్రామస్తులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే వేగంగా వాహనం వారిని దాటి వెళ్లిపోవడంతో వెనుక వస్తున్న డెరైక్టర్లు,మిగిలిన అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్‌రావు, ఎంపీపీ భూక్య లక్ష్మి, సొసైటీ అధ్యక్షులు వాంకుడోత్ పూన్యా, కోయగూడెం సర్పంచ్ పూనెం సురేందర్ మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సైలు బత్తుల సత్యనారాయణ, ముత్తా రవికుమార్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. కానీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంట పాటు ఆందోళన కొనసాగించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆందోళన ఉధృతం అవుతుండటంతో పోలీసులు, కేఓసీ పీఓ అభ్యర్ధన మేరకు సింగరేణి డెరైక్టర్లు కారు దిగి వచ్చి వారితో మాట్లాడారు. వారం రోజుల్లో పెట్రాంచెలక స్టేజీ నుంచి టేకులపల్లి రోడ్డు పనులు ప్రారంభం అవుతాయని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డి ప్రసాద్, గణితి కోటేశ్వరరావు, ఎండీ రాసుద్దీన్, నోముల భానుచందర్, జమీల్, శ్రీనివాస్, ప్రకాశ్, శంకర్, మారుతీరావు,రెడ్యానాయక్ పాల్గొన్నారు. -
మరీ ఇంత ‘సెల్ఫి’షా..!
ప్రస్తుతం సెల్ఫీలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ వీటిపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. వీటిలో అదిరిపోయే సెల్ఫీలతోపాటు అత్యంత చెత్తవి కూడా ఉన్నాయి. అలాంటి చెత్తలో కూడా అత్యంత పరమ చెత్త సెల్ఫీలివి. అగ్నిప్రమాదానికి గురై తగలబడిపోతున్న ఇంటి ముందు నవ్వుతూ ఇతడు ఎలా తన చిత్రాన్ని బంధించుకుంటున్నాడో చూడండి. ఇక నీటిలో పడిపోయి సాయం కోసం ఓ యువతి అరుస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా మరో యువకుడు ఇలా సెల్ఫీలో నిమగ్నమయ్యాడు. -
దుమ్ము సిటీ
పెరుగుతున్న వాయు కాలుష్యం ధూళితో పరిస్థితి ఆందోళనకరం పీసీబీ నివేదికలో వెల్లడి సిటీ జనులపై వ్యాధుల పంజా దుమ్ము...ధూళి... కలసికట్టుగా దండెత్తుతున్నాయి. నగర జీవిపై వ్యాధుల పంజా విసురుతున్నాయి. మన చుట్టూ ఉన్న వాహనాలు... మనం వినియోగిస్తున్న వాహనాలు... మన ఆయువునే హరించేందుకు చూస్తున్నాయి. విషతుల్య రసాయనాలు వదులుతూ కొన్ని పరిశ్రమలు వీటికి తోడుగా నిలుస్తున్నాయి. గ్రేటర్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలని కలలుగంటున్న పాలకులు...చాపకింద నీరులా జనం ఆరోగ్యాన్ని హరిస్తున్న కాలుష్య భూతంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. నగరంలోని 22 ప్రధాన ప్రాంతాలను ఎంచుకున్న కాలుష్య మండలి అధికారులు... అక్కడ నాలుగేళ్లలో నమోదైన కాలుష్య తీవ్రతను గుర్తించారు. సిటీబ్యూరో: గ్రేటర్ నగరాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా... విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఒకవైపు సర్కారు ప్రణాళికలు సిద్ధంచేస్తుంటే... మరోవైపు మానవాళి మనుగడకు అత్యావశ్యకమైన పీల్చే గాలిలో కాలుష్య మోతాదు పెరిగిపోయి సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమలను కట్టడి చేయకపోతే అంతర్జాతీయ విపణిలో నగర కీర్తిప్రతిష్ఠలు మసకబారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐటీ, హార్డ్‌వేర్, టూరిజం, రియల్టీ రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న క్రమంలోనేకాలుష్య నివారణపైనా శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. నగరంలో వాయు కాలుష్య తీవ్రతను పరిశీలిస్తే ఆందోళన కలిగించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పొగ చూరుతోంది మహా నగరంపై దుమ్ము, ధూళి పంజా విసురుతున్నాయి. కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కడం, ఇంధన కల్తీ, పారిశ్రామిక కాలుష్యం సిటీజనులతో చెలగాటమాడుతున్నాయి. నాలుగేళ్లుగా గ్రేటర్ పరిధిలో పీల్చే గాలిలో ధూళి రేణువుల (రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్-ఆర్‌ఎస్‌పీఎం) సాంద్రత ఆందోళన కలిగించే స్థాయిలో పెరిగిపోయిందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కగట్టింది. 2011, 2012, 2013, 2014 సంవత్సరాల్లో మహా నగరంలోని 22 ప్రధాన కేంద్రాల్లో ఆర్‌ఎస్‌పీఎం ఏమేరకు పెరిగిందో ఓ నివేదికలో వివరించింది. పెరుగుతున్న ఇంధన వాడకం గ్రేటర్లో నాలుగేళ్లుగా ఏటా రెండు లక్షల చొప్పున కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అన్ని రకాల వాహనాల సంఖ్య సుమారు 41 లక్షలకు చేరుకుందని పీసీబీ వర్గాల అంచనా. వీటికి ఏటా 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఇంధన వినియోగం పెరగడంతో గాలిలో ధూళి రేణువుల మోతాదు పెరుగుతోందని పీసీబీ నిగ్గు తేల్చింది. రాష్ట్రంలో ఇంధనం వినియోగంలో మహా నగరం పరిధిలోనే 50 శాతం ఉంది. గ్రేటర్లో రహదారులు 6411 కిలోమీటర్లే ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి... సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతోంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి ఆర్‌ఎస్‌పీఎం గాలిలో కలుస్తున్నాయి. ఆర్‌ఎస్‌పీఎం నమోదైన ప్రాంతాలివే... రాజేంద్రనగర్, సెంట్రల్యూనివర్సిటీ, శామీర్‌పేట్, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, సైనిక్‌పురి, జూపార్క్, ట్యాంక్‌బండ్, చిక్కడపల్లి, ఇమ్లిబన్, మాదాపూర్, నాచారం, కూకట్పల్లి, ఉప్పల్, అబిడ్స్, జీడిమెట్ల, సనత్‌నగర్, బాలానగర్,చార్మినార్, ప్యారడైజ్, లంగర్‌హౌజ్, పంజగుట్ట. ధూళి రేణువులతో దుష్ర్పభావాలివే ఆర్‌ఎస్‌పీఎం రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాస కోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది. చికాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతాయి. ఆర్‌ఎస్‌పీఎం మోతాదు పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు అధికమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, అస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే.గంట పాటు ట్రాఫిక్ రద్దీలో ప్రయాణం చేసిన వారు చురుకుదనం కోల్పోయి, ఒళ్లంతా మగత, నొప్పులతో బాధ పడుతున్నారు.ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ర్పభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. నివారణ చర్యలు అత్యవసరం... నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు 12 ఏళ్లు పైబడి, పొగ వెదజల్లుతున్న వాహనాలు రోడ్డెక్కకుండా రవాణా శాఖ చర్యలు తీసుకోవాలి. పొగ వెదజల్లుతున్న ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయాలి. కలీ ్తఇంధనాలు, కిరోసిన్‌తో నడుపుతున్న ఆటోలు రోడ్డెక్కకుండా చర్యలు తీసుకోవాలి. జీడిమెట్ల, పాశమైలారం, బాలానగర్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున పొగ వెదజల్లుతున్న కాలుష్య కారక పరిశ్రమలను కట్టడి చేయాలి.పరిశ్రమల్లో అధిక ఎత్తున్న పొగ గొట్టాలను ఏర్పాటు చేయాలి. కాలుష్య ఉద్గారాలను ఫిల్టర్ల ద్వారా తొలగించిన తరవాతనే వాయువులను బయటికి వదిలేలా చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు తథ్యం నగరంలో పీల్చే గాలిలో ఆర్‌ఎస్‌పీఎం మోతాదు పెరగడంతో న్యుమోనియా, అస్తమా కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి.క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి-సీఓపీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడడం) వంటి వి ప్రబలుతున్నాయి. చిన్న పిల్లల్లో ఊపిరితిత్తుల పెరుగుదల అర్థంతరంగా ఆగిపోతోంది. గర్భిణులు కాలుష్యం బారిన పడడంతో తక్కువ బరువున్న పిల్లలు పుడతారు. అలర్జీతో బాధపడే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. -డాక్టర్ సునంద, పల్మనాలజిస్టు, కేఆర్ ఆస్పత్రి -
సమస్య: చెత్త.. పరిష్కారం: కంపోస్టు
ప్రతి కుటుంబం పాల్గొన్నప్పుడే ‘స్వచ్ఛ భారత్’ పేరిట ప్రారంభమైన ప్రజాఉద్యమం విజయవంతమవుతుంది. ప్రతి ఇల్లూ చెత్త ఉత్పత్తి కేంద్రమే! వంట చేస్తూ ఉండే ఇంట్లో రోజుకు 750 గ్రాముల నుంచి 1500 గ్రాముల తడి/పొడి చెత్త(కూరగాయలు, పండ్ల తొక్కలు వగైరా) తయారవుతుంది. ఇది చక్కని కంపోస్టుగా మార్చదగిన ప్రకృతి వనరు! కుళ్లే అవకాశం ఉన్న (సేంద్రియ) చెత్తలో 60% నీరే ఉంటుంది. కానీ, సాధారణంగా ఏ ప్లాస్టిక్ కవర్లోనో, చెత్తబుట్టలోనో వేసి అవతల పడేస్తుంటాం. ఇందుకోసం బోలెడంత మంది సిబ్బంది, డీజిల్.. ప్రజాధనం ఎంతో వృథా అవుతోంది. అందువల్లే ఇది సమాజానికి సమస్యగా మారుతోంది. వట్టి సేంద్రియ చెత్త అయితే నేలలో కలిసిపోతుంది. కానీ, బాటిల్స్, ప్లాస్టిక్, ట్యూబ్‌లైట్లు, కాలం చెల్లిన మందులతో సేంద్రియ చెత్తను కలిపి పారేస్తుండడం వల్లనే నగరాలు, పట్టణాల వెలుపల చెత్తకుప్పలు పర్యావరణానికి గొడ్డలిపెట్టులా తయారవుతున్నాయి. ఆ చుట్టుపక్కల మనుషులకు, జీవజాలానికి పెనుసమస్యగా మారుతోంది. మన వల్ల తయారవుతున్న చెత్త సమస్యను పరిష్కరించే బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి ఆవాసంలోనూ కంపోస్టు తయారీ యూనిట్లు విధిగా ఏర్పాటు చేయాలని బిల్డర్లు, ప్లానర్ల మీద వత్తిడి తెద్దాం. వాన నీటి సంరక్షణకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీయించమని అడుగుదాం. మనలో ఈ చైతన్యం రాకపోతే నగరాలు కుప్పకూలే రోజెంతో దూరంలో లేదు. తడి చెత్తను ఇంటి దగ్గరే కంపోస్టు చేసుకుంటూ.. పొడి చెత్తను మాత్రమే మున్సిపాలిటీ వాళ్లకివ్వాలి. ఈ పని చేయడం వల్ల భూమిలో కలవని చెత్తలోంచి పనికొచ్చే వాటిని ఏరుకొని బతికే పేదల పని సులువవుతుంది. కంపోస్టు తయారీ కోసం సిద్ధం చేసిన మట్టి కుండల్లో సేంద్రియ చెత్తను వేయడం అలవాటు చేసుకుందాం.. మూడు నెలలకు అది చక్కని కంపోస్టుగా మారుతుంది. కాలనీ స్థాయిలో పెట్టుకునే కంపోస్టు యూనిట్లలో మరింత త్వరగానే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పంటల ద్వారా మనకు కూరగాయలు, పండ్లు, ధాన్యాలను ఇస్తున్నది నేలతల్లి. వంటింటి వ్యర్థాల్లోని పోషకాలను తిరిగి నేలతల్లి ఒడికి చేర్చడం మన కనీస బాధ్యత. ‘స్వచ్ఛ భారత్’కు మన వంతు తోడ్పడదాం. మీకు కిచెన్ గార్డెన్ లేకపోయినా సరే కంపోస్టు చేయడం మొదలుపెట్టండి! చెత్త ఒక సమస్య.. కంపోస్టు ఒక పరిష్కారం. కంపోస్టు పద్ధతులపై అదనపు సమాచారం కోసం www.dailydump.org/ వెబ్సైట్ చూడండి! -
శిరోజాలకు ఆవ...
అందం దుమ్ము, ధూళి, కాలుష్యం, పోషకాహార లోపం.. చిన్నాపెద్దల్ని బాధిస్తున్నాయి. ఈ ప్రభావం శిరోజాల మీద పడడంతో అతిగా వెంట్రుకలు రాలడం, నిర్జీవమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు ఉపశమనంగా కొన్ని జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకోవచ్చు.. ఆవ నూనె ఆవనూనెలో కొన్ని ఉసిరిముక్కలు, మెంతి గింజలు కలిపి వేడిచేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ నూనెను వెచ్చబరిచి కుదుళ్లకు పట్టించాలి. రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా 2-3 నెలలు చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాదు, ఒత్తుగా పెరుగుతుంది. 2-3 నెలలకు ఒకసారి చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించాలి. దీని వల్ల వెంట్రుక పెళుసుబారి, తెగిపోకుండా బలంగా పెరుగుతుంది. హెయిర్ కలర్, సీరమ్, కండిషనర్స్, కర్లింగ్ మెషిన్ లేదా రీ బాండింగ్ ఉత్పత్తులు వెంట్రుకలను దెబ్బతీస్తాయి. పొడిబారేలా చేసి, వెంట్రుక పెరుగుదలను నిరోధిస్తాయి. అందుకని వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. కేశాలంకరణలో తప్పనిసరి అయితే, నిపుణుల సూచనలు పాటించాలి. ప్రతిరోజూ వెంట్రుక పెరుగుదల ఉంటుంది. తాజా పండ్లు, బాదంపప్పు, గుడ్డులోని తెల్లసొన, ఉసిరిక పొడి, నీరు వెంట్రుక బలానికి, నిగనిగలాడుతూ పెరగడానికి దోహదం చేస్తాయి. -గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్ -
పట్టపగలే చిమ్మచీకట్లు
నగరవాసులకు వింత అనుభూతి సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో శుక్రవారం వాతావరణం స్థానికులకు వింత అనుభూతి మిగిల్చింది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపగా, సాయంత్రం గాలి దుమ్ము, ధూళితోపాటు ఉరుములతో కూడిన వానజల్లుపడింది. దీంతో ఒక్కసారి వాతావరణం చల్లబడింది. గాలిదుమ్ము ప్రభావం తో సాయంత్రం ఐదు గంటల సమయానికే చిమ్మచీకట్లు అలుముకున్నాయి. వాతావరణమంతా ధూళిమయం కావడంతో సాయంత్రం కార్యాలయం నుంచి ఇళ్లకు బయల్దేరినవారు అందులో చిక్కుకుపోయారు. గాలి బలంగా వీయడంతో కొన్నిచోట్ల చెట్లకొమ్మలు నేలకూలాయి. పాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 46, కనిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. రాజస్థాన్‌లో మూడు రోజులుగా వడగాడ్పులు వీస్తున్నాయని, దీని ప్రభా వం కారణంగా ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గొచ్చని, అయితే వచ్చే నెల రెండో తేదీ మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ విభాగం డైరక్టర్ ఎం.దొరైస్వామి చెప్పారు. ఇదిలాఉంచితే ఎండతీవ్రతతో పాటు విద్యుత్ కోత కూడా నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. మెట్రో రైలుసేవలకు అంతరాయం దుమ్ముధూళితో కూడిన బలమైన గాలు లు వీయడంతో మెట్రో రైలుసేవలకు సైతం అంతరాయం కలిగింది. దాదాపు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఎక్కడి రైళ్లు అక్కడే నిలి చిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని డీఎంఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అంజుదయాళ్ వెల్లడించారు. బలమైన గాలుల ధాటికి పైపులు, ఇతర ఇనుప సామగ్రి జనక్‌పురి, ఇందర్‌లోక్ తదితర స్టేషన్లలోని ఓవర్‌హెడ్ తీగలపై పడడంకూడా మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఏదిఏమైనప్పటికీ సాయంత్రం ఆరు గంటల సమయంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ విషయమై కృతి మిస్త్రీ అనే ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ జనక్‌పురి స్టేషన్లో దాదాపు గంటపాటు రైలు కోసం ఎదురు చూడాల్సి వచ్చిందన్నాడు. సేవలను పునరుద్ధరించినప్పటికీ తొలుత వచ్చిన రెండు రెళ్లలో ఎక్కలేకపోయానని, ఇందుకు కారణం అవి కిక్కిరిసిపోవడమేనని వివరించాడు. -
పట్టపగలే చిమ్మచీకటి
చైనాలో పట్టపగలే చిమ్మచీకటి అలుముకుంది. పశ్చిమ చైనాలో ఇసుక తుఫాను రావడంతో దక్షిణ షింజాంగ్, ఇన్నర్ మంగోలియా, గాన్సు, నింజియా, ఉత్తర షాంగ్జి లలో దట్టమైన దుమ్ము ధూళి అలుముకుని పట్టపగలై కార్లలో లైట్లు వేసుకోవాల్సి వస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటకి రావడం లేదు. ప్రజలకు దగ్గు, ఊపిరి తిత్తుల సమస్యలు, అలర్జీలు వస్తున్నాయి. చాలా చోట్ల ఒక్క అడుగు ముందున్న వస్తువులు కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రజలను ఇళ్లలోనే ఉండమని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశించింది. ఇప్పటికే వాయు కాలుష్యంతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దానికి ఇసుక తుఫాన్లు తోడు కావడం తో పరిస్థితి మరింత దిగజారింది. -
దుమ్ము... దుమ్ము ... దుమ్ దుమ్ దుమ్ దుమ్ దుమ్ము...
ఆస్తమా పేషంట్లూ ఇంట్లోనే ఉండండి! ఎలర్జీలున్న వాళ్లూ బయటకి రాకండి. మామూలు వాళ్లూ కళ్లద్దాల్లేకుండా బైక్ ఎక్కకండి!! ఇంగ్లండ్ ఇప్పుడు తన ప్రజలందరికీ జారీ చేసిన హెచ్చరిక ఇది. లండన్, సౌత్ ఇంగ్లండ్, మిడ్ లాండ్స్, వేల్స్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రమాదకర పరిస్థితులున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో మొదలైన ఈ ధూళి తుఫాను ఆఫ్రికా దేశాలను చుట్టబెట్టింది. నెమ్మదిగా యూరప్ మీద పడింది. ఇప్పటికే పారిస్, బ్రసెల్స్ వంటి ప్రాంతాల్లో ఆఫ్రికా దుమ్ము దుమ్ము రేపుతోంది. ఇక లండన్ వరకూ వచ్చేస్తోంది. ఈ దుమ్ము, ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉన్న వాహన కాలుష్యం కలిసి లవ్వాడేసుకుంటున్నాయి. దీంతో ముందు ఏముందో కనపడని పరిస్థితి ఉంది. ఇప్పుడు లండన్ నగరానికి కూడా ఆఫ్రికన్ దుమ్ము వచ్చేస్తే పరిస్థితి ఏమవుతుందోనని బ్రిటన్ ఇప్పుడు కంగారు పడుతోంది. ఇప్పుడు ఉత్తర దిశగా దుమ్ము వ్యాపిస్తోంది. ఇప్పుడు బ్రిటన్ 'ఉత్తరం ఊపి కొట్టింది. దక్షిణం దంచి కొట్టింది. ఇక ఏమవుతుందో' అని కలవరపడుతోంది.