
పట్టపగలే చిమ్మచీకటి
ఇప్పటికే వాయు కాలుష్యంతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దానికి ఇసుక తుఫాన్లు తోడు కావడం తో పరిస్థితి మరింత దిగజారింది.
చైనాలో పట్టపగలే చిమ్మచీకటి అలుముకుంది. పశ్చిమ చైనాలో ఇసుక తుఫాను రావడంతో దక్షిణ షింజాంగ్, ఇన్నర్ మంగోలియా, గాన్సు, నింజియా, ఉత్తర షాంగ్జి లలో దట్టమైన దుమ్ము ధూళి అలుముకుని పట్టపగలై కార్లలో లైట్లు వేసుకోవాల్సి వస్తోంది.
ప్రజలు ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటకి రావడం లేదు. ప్రజలకు దగ్గు, ఊపిరి తిత్తుల సమస్యలు, అలర్జీలు వస్తున్నాయి. చాలా చోట్ల ఒక్క అడుగు ముందున్న వస్తువులు కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రజలను ఇళ్లలోనే ఉండమని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశించింది. ఇప్పటికే వాయు కాలుష్యంతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దానికి ఇసుక తుఫాన్లు తోడు కావడం తో పరిస్థితి మరింత దిగజారింది.