
మరీ ఇంత ‘సెల్ఫి’షా..!
ప్రస్తుతం సెల్ఫీలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ వీటిపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. వీటిలో అదిరిపోయే సెల్ఫీలతోపాటు అత్యంత చెత్తవి కూడా ఉన్నాయి. అలాంటి చెత్తలో కూడా అత్యంత పరమ చెత్త సెల్ఫీలివి. అగ్నిప్రమాదానికి గురై తగలబడిపోతున్న ఇంటి ముందు నవ్వుతూ ఇతడు ఎలా తన చిత్రాన్ని బంధించుకుంటున్నాడో చూడండి. ఇక నీటిలో పడిపోయి సాయం కోసం ఓ యువతి అరుస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా మరో యువకుడు ఇలా సెల్ఫీలో నిమగ్నమయ్యాడు.