దుమ్ము లేపుతున్న వాహనాలు
► హౌసింగ్‌బోర్డులో కానరాని సీసీ రోడ్లు
► ఎండస్తో దుమ్ము.. వానస్తో బురద
► కాలనీ వాసులకు తప్పని అవస్థలు
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కేంద్రంలో హౌసింగ్‌బోర్డు కాలనీ ఏర్పడి 20 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆ కాలనీలో కనీస సౌకర్యాల్లేవు. మారుమూల పల్లెలకంటే అధ్వానంగా ఉంది. సీసీ రోడ్డు చూడాలంటే బూతద్దం పెట్టుకొని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎండ ఉంటే దుమ్ము, వానొస్తే బురదతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా.. హౌజింగ్‌బోర్డు ప్రజల జీవన స్థితిగతులు మాత్రం మారకపోవడం గమనార్హం. ఓట్ల కోసం వచ్చే నాయకులు రెండేళ్లలో సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఓట్లు వేరుుంచుకోవడం, ఆ తర్వాత తొంగిచూడకపోవడం పరిపాటిగా మారింది. హౌజింగ్‌బోర్డు పరిధిలో ఉన్నన్ని రోజుల కష్టాలు అనుభవించిన ప్రజలు, నగరపాలక సంస్థకు అప్పగిస్తే బతుకులు మారుతాయని భావించారు. నగరపాలక సంస్థకు అప్పగించి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
ఇళ్లు దుమ్ముమయం
హౌజింగ్‌బోర్డు కాలనీలో సీసీ రోడ్లు లేక దుమ్ముతో తల్లడిల్లుతున్నారు. వాహనాలు వెళ్తే ఇక అంతే సంగతులు. రోడ్లపై కంటే ఇళ్లలోనే ఎక్కువగా దుమ్ము కనబడుతోంది. వంటపాత్రలు, బట్టలు, గృహోపకరణాలు అన్నీ దుమ్ముమయంగా మారుతున్నారుు. ఇక పిల్లలు, వృద్ధులు దుమ్ముతో ఉబ్బసం వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక వానొస్తే ఆ బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నారుు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. రోడ్లన్నీ పొలాలను తలపిస్తారుు. వర్షం పడిన తర్వాత వారం రోజుల వరకు బురద ఉంటోంది. హౌజింగ్‌బోర్డు కాలనీ నిర్మాణం రేగడి నేలలో జరగడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
మౌలిక సదుపాయాలు కరువు
కార్పొరేషన్‌లో ఉన్నా ఇతర డివిజన్లతో పోలిస్తే హౌజింగ్‌బోర్డు కాలనీ ప్రజలు మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోవడం లేదు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరగలేదు. మంచినీటి సౌకర్యం పూర్తిస్థారుులో లేదు. వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. యూజీడీ పైపులైన్ కోసం తవ్వకాలు చేపట్టడంతో మట్టిరోడ్లు కూడా ఛిద్రమై గుంతలమయంగా మారారుు. ద్విచక్ర వాహనాలపై వెళ్తే నడుం నొప్పి ఖాయం. కాలినడకన వెళ్లినా అడుగు తీసి అడుగు వేయలేనంత ఇబ్బందిగా ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితులున్నా కాలనీ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికై నా నగరపాలక సంస్థ అధికారులు హౌజింగ్‌బోర్డు కాలనీపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.