రోడ్లు ఊడ్వరు.. చెత్త తీయరు.. | Greater worse sanitation management | Sakshi
Sakshi News home page

రోడ్లు ఊడ్వరు.. చెత్త తీయరు..

Published Fri, Mar 4 2016 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

రోడ్లు ఊడ్వరు..     చెత్త తీయరు..

రోడ్లు ఊడ్వరు.. చెత్త తీయరు..

గ్రేటర్‌లో అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ
గల్లీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం
దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులు
పట్టింపులేని కార్పొరేషన్ అధికారులు
గాడిన పడని ప్రజారోగ్యం

 
వరంగల్ అర్బన్ : మునిసిపల్ కార్పొరేషన్ స్థారుు నుంచి గ్రేటర్ వరంగల్‌గా రూపాంతరం చెందిన ఓరుగల్లు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. క్లీన్‌సిటీ చాంపియన్ షిప్ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది న వరంగల్ బల్దియా జాతీయస్థాయి అవార్డు లు, సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుంది. అరుుతే ఇంతటి ప్రఖ్యాతిగాంచిన మహా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడకపోవ డంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణకు ఏటా కోట్లు వెచ్చించి వాహనా లు కొనుగోలు చేస్తున్నా సమస్య గాడిలో పడ డం లేదు. దీంతో నగరంలోని పలు వీధుల్లో చెత్తకుప్పలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. అలాగే మురికి కాల్వలు కంపు కొడుతున్నాయి. వీటితోపాటు రోడ్లను శుభ్ర ం చేయకపోవడం తో దుమ్ముధూళితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రీసైక్లింగ్‌కు నోచుకోక డంపింగ్ యార్డులో చెత్త గు ట్టలుగా పేరుకుపోతుంది. దీంతో బయోగ్యాస్ విద్యుత్ నామమాత్రంగా సాగుతోంది.
 
డంపింగ్ యార్డులుగా  ఖాళీ స్థలాలు..
నగరంలోని పలు డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోరుు రోడ్ల వెంట మురుగునీరు ప్రవహిస్తుంది. డంపర్ బిన్లు, కాంఫ్యాక్టర్ బిన్లు చెత్తతో నిండిపోతున్నా పట్టించుకునేనాథుడే లేడు. ఫలితంగా నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డులుగా మారి మురికికూపాలను తలపిస్తున్నాయి. కాగా, మరుగుదొడ్ల నుంచి మల, మూత్రాలను నేరుగా డ్రెయినేజీల్లోకి వదలడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇదిలా ఉండగా, బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం ఇంటిం టా చెత్త సేకరణలో పాల్గొనడంతో కాల్వలు శుభ్రం చేసే వారే కరువయ్యారు. దీంతో కాల్వలు చెత్తాచెదారంతో నిండి పోయి ముక్కు పుటాలను అదరగొడుతున్నా యి. పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వ్యాప్తిచెంది ప్రజలు డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాల బారిన పడుతున్నారు.
 
కార్యరూపం దాల్చని ప్రణాళికలు..

ట్రైసిటీలో మొత్తం 1.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. 2012లోనే క్లిన్‌సిటీ చాంపియన్ షిప్ కార్యక్రమం మొదలుపెట్టారు. దేశంలో మొదటిసారిగా వరంగల్‌లోనే ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆరు నెలల పాటు బా గానే కొనసాగినా తర్వాత తగ్గింది. ప్రస్తుతం 60 శాతం ఇళ్లలో నుంచి ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నారు. కాగా, పలు కారణాలతో తోపుడు బండ్ల మరమ్మతులను నిలిపివేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు.. జవాన్ల పనితీరును పట్టించుకోవడం లేదు. బల్దియా డిప్యూటీ కమిషనర్ మినహా ఇతర అధికారులు తనిఖీలు చేపట్టడంలేదు.
 
పేరుకుపోతున్న డంపింగ్ యార్డు
మడికొండ శివారులోని డంపింగ్ యార్డులో చెత్త గుట్టల్లా పేరుకుపోతుంది. మహా నగరం నుంచి రోజు 145 మెట్రిక్ టన్నుల చెత్తను వాహనాల ద్వారా తరలిస్తున్నారు. దీంతో దశాబ్దకాలంగా యార్డులో చెత్త కుప్పులు గుట్టలుగా మారుతున్నాయి. చెత్త రీసైక్లింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టకపోవడంతో భవిష్యత్‌లో అనర్థాలు చోటు చేసుకోనున్నాయి.
 
రీ సైక్లింగ్.. రీయూజ్

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల్లో భాగంగా 2012 అక్టోబర్‌లో హన్మకొండ బాలసముద్రంలో తడి చెత్త ద్వారా బయో విద్యుత్ ఆధారిత ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో తయారవుతున్న 15 కేడబ్ల్యూ కరెంట్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ. 24 లక్షలతో 24 కేడబ్ల్యూ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, బాలసముద్రంలో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా 4 నుంచి 5 మెట్రిక్ టన్నుల చెత్త రీ సైక్లింగ్ జరుగుతోంది. అంతేకాకుండా ఐటీసీ కంపెనీ పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటా సేకరిస్తున్న పొడి చెత్తను కొనుగోలు చేస్తున్నారు.
 మూడు నెలలుగా రోజు 10 మెట్రిక్ టన్నుల చెత్తను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఈ పదిహేను మెట్రిక్ టన్నుల చెత్త మాత్రమే రీసైక్లింగ్, రీయూజ్ జరుగుతోంది.
 
ఏడాదికి రూ.30 కోట్లు
మహా నగర పాలక సంస్థ పరిధిలో శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు మినహా 2621 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరి వేతనాలు, వాహనాల మరమ్మతులు, డీజిల్ కోసం ప్రతి నెల రూ. 2.50 కోట్లు వెచ్చిస్తోంది. అంటే ఏడాదికి రూ.30 కోట్లు వెచ్చిస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవచూపి నగరంలో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement