Sanitation management
-
ఫలిస్తున్న ఆపరేషన్ ‘క్లీన్’
సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సంస్కరణలు ఫలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ ఇప్పటికే మెరుగుపడింది. ఇంటింటికీ మూడు రంగుల చెత్త డబ్బాల పంపిణీతో ప్రజల్లో సైతం మార్పు కనిపిస్తోంది. ఇంటి వద్దకే చెత్త తరలింపు వాహనాలు వస్తుండటంతో ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ జనాభా గల మునిసిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్–1 మునిసిపాలిటీల్లో చెత్త తరలింపునకు ఆధునిక హైడ్రాలిక్ టిప్పర్లను ప్రభుత్వం అందించింది. మొత్తం 42 యూఎల్బీలకు 2,525 హైడ్రాలిక్ టిప్పర్లు అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. వాటిలో 2,465 హైడ్రాలిక్ టిప్పర్లను ఆయా యూఎల్బీలకు అందజేశారు. మరో 60 టిప్పర్లను సంక్రాంతి తర్వాత అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేడ్–2, 3 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం 1,123 ఈ–ఆటోలను అందించనున్నారు. వీటిలో 387 వాహనాలను వచ్చే నెలలో అందించనున్నారు. హైడ్రాలిక్ టిప్పర్ల ద్వారా చెత్తను సేకరించి, ట్రాన్స్‌పోర్టు స్టేషన్లకు తరలించేందుకు వినియోగిస్తున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం తగ్గినట్టు అధికారులు గుర్తించారు. గతంలో వీధుల్లో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను తొలగించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తిరిగి చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు. 137 జీటీఎస్‌ల నిర్మాణానికి ప్రణాళిక ఏరోజుకారోజు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ప్రాధమిక దశలో స్థానికంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పోర్టు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఆయా పట్టణాల్లో ప్రతి 8 నుంచి 10 వార్డుకు ఒకటి చొప్పున చెత్త రవాణా కేంద్రాన్ని (జీటీఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇలా 83 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం రూ.185 కోట్లతో 137 జీటీఎస్‌ల నిర్మాణానికి ప్రణాళిక అమలు చేయగా.. ప్రస్తుతం 100 జీటీఎస్‌ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ జీటీఎస్‌ల నుంచి ప్రాసెస్ చేసిన చెత్తను పునర్ వినియోగానికి ఉపయోగపడే వాటిని వేరు చేసి, మిగిలిన చెత్తను విద్యుత్ తయారీ ప్లాంట్‌కు తరలించనున్నారు. అందుకోసం చెత్తను సమగ్ర పద్ధతిలో నిర్వహించేందుకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలించనున్నారు. అందుకోసం రాష్ట్రంలోని 71 యూఎల్బీల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు (ఐఎస్‌డబ్ల్యూఎం) ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఐదు ప్లాంట్లు నిర్మాణంలో ఉండగా.. వినుకొండ, రాయచోటి యూఎల్బీల్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లలో తడి చెత్తను శుద్ధి చేసే పనులు ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్లలో తడి, పొడి చెత్తను ఒకేసారి ఒకేచోట శుద్ధి చేసేందుకు అవకాశముంటుంది. -
కరోనా కట్టడికి శరవేగంగా చర్యలు
-
పారిశుధ్య యుద్ధం!
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు పారిశుధ్య నిర్వహణ, భౌతిక దూరం నిబంధన అమలుపై ప్రధానంగా దృష్టి సారించాయి. కరోనా కేసులు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో 120 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం పురపాలక శాఖ రూ.31 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేసింది. ► సాధారణ ప్రాంతాల్లో తరచూ బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. రెడ్ జోన్లలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కరోనా కేసులు నమోదైన వారి నివాసం నుంచి 3 కి.మీ. పరిధిలో రెడ్ జోన్‌గా ప్రకటిస్తున్నారు. అక్కడి నుంచి మరో 2 కి.మీ. మేర బఫర్ ప్రాంతంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 35,982 మంది పారిశుధ్య కార్మికులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. ► పారిశుధ్య నిర్వహణకు పురపాలక శాఖ 650 టన్నుల బ్లీచింగ్ పౌడర్, 500 టన్నుల సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నెలల పాటు అవసరమైనవి కొనుగోలు చేసేందుకు కూడా సమాయత్తమవుతోంది. కార్మికుల కోసం 1.49లక్షల మాస్కులు, 59,390 గ్లౌజులు, 10 వేల జతల అప్రాన్లు/బూట్లు కొనుగోలు చేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి మరో 35 వేల ఫుల్ సూట్లు, బూట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో పక్కా ప్రణాళిక... ► గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించేందుకు పది లక్షల బస్తాల బ్లీచింగ్ పౌడర్, పది లక్షల లీటర్ల ఫినాయిల్, 20 లక్షల లీటర్ల సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసింది. ► రాష్ట్ర వ్యాప్తంగా 31,892 గ్రామీణ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పిచికారీ చేశారు. గత వారం రోజుల వ్యవధిలో 16,725 ప్రాంతాల్లో ఫాగింగ్ మిషన్ల ద్వారా పొగ వెదజల్లారు. మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా ప్రతి గ్రామంలో దుకాణాల వద్ద మీటరు దూరంతో మార్కింగ్ చేశారు. ► ఏఎన్ఎంలు, వలంటీర్లు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి, రెడ్‌జోన్‌గా ప్రకటించిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్నిస్ప్రే చేస్తున్న శానిటేషన్ సిబ్బంది కరోనా కట్టడికి పటిష్ట చర్యలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పురపాలక శాఖ అన్ని చర్యలు చేపడుతోంది. పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత కూడా ఇదే రీతిలో చర్యలు చేపట్టి పట్టణాలు, నగరాలను ఆరోగ్యంగా ఉంచేలా ప్రణాళిక రూపొందించాం – జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ (పురపాలక శాఖ కమిషన్ డైరెక్టర్) ప్రతి రోజూ సమీక్ష గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలపై రోజూ సమీక్ష చేస్తున్నాం. పాజిటివ్, అనుమానిత కేసులు గుర్తించిన చోట తరచూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు సరిపడినన్ని కొనుగోలు చేయాలని ఆదేశించాం. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది పూర్తి సహకారం అందిస్తున్నారు – గోపాలకృష్ణ ద్వివేది (పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి) -
పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్య నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఐదుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పాత భవనాల కూల్చివేత, పడావుపడిన బావుల పూడ్చివేత, పనుల బిల్లుల చెల్లింపు విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని ఈ దిశగా గ్రామ పంచాయతీలకు అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొంది. శనివారం గ్రామీణ పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన మొదటిసారి సమావేశమైంది. సమావేశంలో మ్రంతులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఇంటి నుంచే క్లీనింగ్ డ్రైవ్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలు విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్కారు చర్యలు చేపట్టింది. పారిశుధ్య నిర్వహణా లోపాన్ని సరిచేస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు విజృంభించకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జీహెచ్ఎంసీ అధికారులతో కేటీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సొంత ఇళ్లలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. దానిలో భాగంగా తన నివాస గృహం ప్రగతి భవన్లో మంగళవారం పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారించారు. తన ఇంటిని కేటీఆర్ స్వయంగా క్లీన్ చేశారు. దోమల మందును చల్లారు. నీటి తొట్లలో నూనె వేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సొంత ఇంటి పారిశుధ్య నిర్వహణ డ్రైవ్‌లో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ సొంత ఇంటిలోపల.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కేటీఆర్ వెంబడి నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు శాసన సభలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కూడా ఉన్నారు. మంత్రి ఇచ్చిన పిలుపుమేరకు తాము కూడా సొంత ఇంటి పారిశుధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడతామని కేటీఆర్‌తో చెప్పారు. ప్రజలకు కేటీఆర్ చేసిన సూచనలు.. ‘ఇంటి లోపల పేరుకుపోయిన, వినియోగంలో లేని వస్తువులను తొలగించాలి. ఇళ్లలో నీటి తొట్లు, పూలమొక్కలు ఉన్న చోట్లలో నీరు నిలువకుండా చూడాలి. ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్ వ్యాధుల నివారణ సులభమవుతుంది. జన సమ్మర్థ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ తరపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత నిర్వహణకై అన్ని చర్యలు చేపడుతున్నాం’ అని కేటీఆర్ ఓ ప్రకటనలో అన్నారు. -
కత్తిమీద సాములా మారిన సర్పంచ్ పదవి!
సాక్షి, జోగిపేట: గ్రామ సర్పంచ్‌తోపాటు పాలకవర్గ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గురుతర బాధ్యతలు అప్పగించింది. వారు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే పదవికే గండం వాటిల్లేలా నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజాప్రతినిధుల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఏదో గెలిచాం. గ్రామాభివృద్ధి చూసుకుందాం అనుకున్నవారికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోకుంటే పదవికే ఎసరు వచ్చే కొత్త చిక్కు వచ్చిపడడం ఆందోళనలో పడేసింది. ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు విధిగా హరితహారం, పారిశుధ్య, జల సంరక్షణ వంటి అంశాలపై అత్యంత శ్రద్ధ పెట్టాలి. నాటిన ప్రతీ మొక్కను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. గ్రామాల్లో ఇంటింటా ఇంకుడు గుంతలను విధిగా తవ్వించి వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించింది. ప్రతీ గ్రామంలో శత శాతం పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకునేలా ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, దోమలు, ఈగల నిర్మూలన వంటి అంశాల్లో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతీ శుక్రవారం ‘స్వచ్ఛ శుక్రవారం’ పేరిట అన్ని పంచాయతీల్లోని ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి అపరిశుభ్రతను పారదోలడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయంలోనూ గ్రామ సర్పంచ్‌లే క్రియాశీలకంగా వ్యవహరించాలి. అన్నీ తానై.. తానే అన్నీ అన్న చందంగా వారు పని చేయాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవి గతంకంటే భిన్నంగా.. మరింత బాధ్యతాయుతంగా ఉండనుంది. ఒకవైపు పాలనాపరమైన నిర్ణయాలతోపాటు మరోవైపు పదవిని కాపాడుకునేందుకు ఎలాగైనా ప్రభుత్వ లక్ష్యాలను విధిగా పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే సర్పంచ్ పదవీ గండం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. పారిశుధ్య నిర్వహణపై సమగ్ర కార్యాచరణ పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతీ గ్రామంలో మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై ఉంది. దీంతోపాటు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వారు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రమక్రమంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పడం, ప్రజలను ప్లాస్టిక్‌కు దూరంగా ఉంచడం, ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీని సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలి. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపు యార్డులకు సక్రమంగా తరలిస్తున్నారో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై ఉంటుంది. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త ఉంటే దానికి ఆ గ్రామ సర్పంచ్, కార్యదర్శులే బాధ్యులవుతారని ప్రభుత్వం హెచ్చరించింది. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో సర్పంచ్‌లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మొక్క ఎండితే పదవికి ముప్పే జిల్లావ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 1.91 కోట్ల మొక్కలను నాటించాలనే సంకల్పంతో యంత్రాంగం పనులు ప్రారంభించింది. వర్షాభావ పరిస్థితులతో హరితహారం కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిర్వహించ లేదు. అక్కడక్కడా ఎవెన్యూ ప్లానిటేషన్‌ను ప్రారంభించారు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో నీటి లభ్యత లేక మొక్కలు ఎండిపోయాయి. ఈ క్రమంలో పరిస్థితి ఇలాగే ఉంటే నాటిన మొక్కల సంరక్షణ అనేది సర్పంచ్‌లకు కఠిన సవాలుగా మారనుంది. అధికారుల లెక్కల ప్రకారం ఉన్న మొక్కలు, నర్సరీల్లో ఉన్న మొక్కలకు చాలా వ్యత్యాసాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 647 గ్రామపంచాయతీల్లో 80 శాతం వరకు మొక్కలను సర్పంచ్‌లే రక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తేల్చింది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం అవినీతికి పాల్పడినా, విధులు, బాధ్యతల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించినా ఆ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, కార్యదర్శులను తీసివేసే అధికారం ప్రభుత్వానికి ఉండటంతో పంచాయతీ పాలకవర్గాల్లో గుబులు మొదలైంది. అంతే కాకుండా ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త చట్టంపై పునరాలోచించాలి ప్రజాస్వామ్య పద్ధతిలో సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ ప్రథమ పౌరులుగా ఉండే వ్యక్తులను మొక్కల పెంపకం సాకుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. పారదర్శకమైన పాలన అందించకుండా, గ్రామాభివృద్ధి, గ్రామ సమస్యలపై నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేయడం వంటి విషయాలపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది తప్ప వాతావరణ పరిస్థితులపై ఆధారపడే మొక్కల పెరుగుదలకు లింకు పెట్టడంపై అభ్యంతరాలున్నాయి. ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు. నాతో చాలా మంది సర్పంచ్‌లు ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రజాప్రతినిధుల గౌరవం పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కత్తి పట్టుకొని సర్పంచ్‌లతో పని చేయించే విధంగా కొత్త చట్టం ఉందనిపిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. – కలాలి పూజ, డాకూరు సర్పంచ్ -
దేవుళ్లకే శఠగోపం
ద్వారకాతిరుమల : రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా దేవుళ్ల సొమ్ముకే.. శఠగోపం పెడుతోంది. ప్రముఖ ఆలయాల్లో పారిశుధ్య ప్రక్షాళన పేరుతో దోపిడీకి తలుపులు తెరిచింది. టీడీపీ ప్రభుత్వం మూడేళ్లుగా ‘పద్మావతి హాస్పిటాలిటి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే సంస్థకు కోట్లాది రూపాయల సొమ్మును ముట్టజెప్పింది. దీనికి కారణం సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ కాంట్రాక్టరు భాస్కర్ నాయుడు బంధువు కావడమే. ఈకారణంతో ఇప్పటి వరకు ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు అందకపోయినా, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోయినా అధికారులెవరూ పట్టించుకోలేదు. ఈ నెలాఖరుతో కాంట్రాక్టు కాల పరిమితి ముగియనుంది. అయినా ఆలయ అధికారులు ఇప్పటి వరకు పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఎటువంటి టెండర్లు పిలువక పోవడం అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టు పొడిగించాలని దరఖాస్తు ఈ నేపథ్యంలోనే మరో ఏడాది పాటు కాంట్రాక్టును పొడిగించాలంటూ భాస్కర్‌నాయుడు దేవదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. టెండర్ ప్రక్రియ లేకుండానే కాంట్రాక్టును దక్కించుకునేందుకు బాబు ఆశీస్సులతో ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆలయ అధికారుల నుంచి పనితీరు బాగుందనే సర్టిఫికెట్లను సైతం పొంది, పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతంఈ సంస్థ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం ఆలయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ, హౌస్ కీపింగ్ పనులను నిర్వహిస్తోంది. భారీగా చెల్లింపులు మూడేళ్ల క్రితం ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలకు నెలకు సుమారు రూ. 3 లక్షలు, అలాగే శానిటేషన్ సామగ్రి కొనుగోలుకు మరో రూ.4 లక్షలు వెరసి రూ. 7 లక్షలు ఖర్చు చేసేది. ఇప్పుడు అన్ని ఖర్చులు కాంట్రాక్టరు భరించేలా నెలకు దాదాపు రూ.16 లక్షలు పైగా చెల్లిస్తోంది. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి మెటీరియల్ ఖర్చుతో కలిపి దేవస్థానం రోజుకు కాంట్రాక్టరుకు రూ. 517 చెల్లిస్తోంది. గతంలో ఒక్కో కార్మికుని జీతం నెలకు రూ. 5,300 ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 5,500, నుంచి రూ. 6,200 వరకు ఇస్తున్నారు. కాంట్రాక్టరుకు చెల్లించే సొమ్ము గతంకంటే భారీగా రెట్టింపు అయినా.. కార్మికుల వేతనాలు మాత్రం పెద్దగా పెరగలేదు. అన్ని ఆలయాల్లోను అదే పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా పారిశుధ్య ఖర్చు బాగా పెరగడంతో ఆలయాల నిర్వహణ సైతం భారంగా మారింది. ఆందోళనలో కార్మికులు శ్రీవారి దేవస్థానం ఏజెన్సీ వారికి మొదటి ఏడాదిలో నెలకు రూ. 15.47 లక్షలు చెల్లించింది. అయితే ఒప్పందం ప్రకారం ఏటా 5 శాతం చొప్పున ఈ సొమ్మును పెంచుతూ ఇస్తోంది. ఈ సంస్థలో దాదాపు 110 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐలు మినహాయించగా ఒక్కొక్కరికి నెలకు సుమారు రూ. 5,500 లను కాంట్రాక్టరు అందిస్తున్నారు. కార్మిక చట్టం, అలాగే కాంట్రాక్టరు ఒప్పందం ప్రకారం కార్మికుడితో రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయించాలి. అలాగే నెలకు నాలుగు రోజులు సెలవు ఇవ్వాలి. అదే విధంగా ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందించాలి. పని గంటలు పెరిగితే కాంట్రాక్టరు వారికి ఓటీ ఇవ్వాలి. అలాగే ప్రతి నెలా కార్మికుని పేరున చెల్లించే పీఎఫ్ సమాచారాన్ని వారికి తెలియజేయాలి. కానీ అవేవీ సక్రమంగా అమలు కావడం లేదు. సిబ్బందితో 12 గంటలు పనిచేయిస్తూ, వారికి ఇవ్వాల్సిన సెలవు దినాల్లో కూడా వారి శ్రమను దోచుకుంటున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గతేడాది అక్టోబరు 11న శేషాచలకొండపై ఆందోళనకు దిగారు. అయితే ఎప్పటికప్పుడు కాంట్రాక్టరు అనుయాయులు కార్మికులను బుజ్జగిస్తున్నారు. ఇలాంటి సంస్థకు మళ్లీ కాలపరిమితి ఎలా పొడిగిస్తారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించిన ప్రతిపక్షనేత తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడిలో ఈనెల 5న జరిగిన ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆలయాల్లో పారిశుధ్యం పేరుతో జరుగుతున్న దోపిడీపై ఆయన మండిపడ్డారు. బంధువుల కోసం దేవుళ్ల సొమ్మును దోచిపెడతారా అని ప్రశ్నించారు. -
డబుల్ ధమాకా
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, ట్రేడ్ ఫీజులను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు గాను మొబైల్ కోర్టులను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసినా చర్యలు తీసుకునేందుకు వీలుంది. జీహెచ్ఎంసీ అధికారుల స్థాయిలో బాధ్యులకు జరిమానాలు విధించవచ్చు. చెల్లించని వారిని మొబైల్ కోర్టుకు తీసుకువెళితే అంతకంటే ఎక్కువ జరిమానా విధించడమే కాక చెల్లించని పక్షంలో రెండు రోజుల వరకు శిక్షకు ఆదేశించే అవకాశం ఉంది. అయితే వీటిపై జీహెచ్ఎంసీ అధికారులు ఇంతవరకు పెద్దగా దృష్టి సారించలేదు. ముఖ్యంగా ఈ అంశాలను పర్యవేక్షించే పారిశుధ్యం– ఆరోగ్యం విభాగంలోని అధికారులకు వారి దినవారీ పనులతోనే తీరిక లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌లలో తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకునేందుకు ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ పారిశుధ్య నిర్వహణ, రోడ్లపై చెత్త లేకుండా చూడటంతోపాటు బహిరంగ మూత్ర విసర్జన, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ వంటి కార్యక్రమాలను నిరోధించేందుకు మొబైల్ కోర్టుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. సాధారణ కోర్టుల్లో కేసు వేసినా చర్యలకు చాలా కాలం పడుతుండటంతో అప్పటికప్పుడు శిక్షలు వేసే మొబైల్ కోర్టులను వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో 1వ మెట్రో పాలిట¯ŒS మెజిస్ట్రేట్ (మున్సిపల్ కోర్టు) ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇటీవల ఈ మొబైల్‌కోర్టులను ప్రారంభించారు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో ప్రతి మంగళవారం ఒక సర్కిల్లో ఈ మొబైల్‌కోర్టు నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ అధికారులు విధించిన జరిమానాలను చెల్లించని వారిని ఈ మొబైల్‌కోర్టు ఎదుట ప్రవేశపెడతారు. మొబైల్ కోర్టు ఆదేశానుసారం జరిమానాను వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో రెండు రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని ముషీరాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్‌నారాయణ తెలిపారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి సైతం ఇది వర్తిస్తుంది. జరిమానా కట్టడమే కాకుండా తదుపరి మొబైల్‌కోర్టు నిర్వహించే నాటికి తప్పనిసరిగా ట్రేడ్‌లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లేకుంటే చర్యల తీవ్రత పెరుగుతుంది. తద్వారా ఇప్పటిదాకా ట్రేడ్‌లైసెన్సులేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నవారు లైసెన్సులు తీసుకుంటారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయం వస్తుంది. మరోవైపు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల అమలు తీరు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలోనూ మొబైల్‌కోర్టు పనిచేసినా గత 15 ఏళ్లుగా వాటిని పక్కనబెట్టారు. తిరిగి ఇప్పుడు పునరుద్ధరించడంతో ఇటు ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు.. అటు నగర పరిశుభ్రత రెండూ మెరుగుపడటమే కాక ప్రజల్లో తగిన మార్పు వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ముషీరాబాద్, సనత్‌నగర్ తదితర నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ఈ మొబైల్ కోర్టుల ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 50 మంది నుంచి రూ. 25 వేల జరిమానా విధించారు. -
రోడ్లు ఊడ్వరు.. చెత్త తీయరు..
గ్రేటర్లో అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ గల్లీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులు పట్టింపులేని కార్పొరేషన్ అధికారులు గాడిన పడని ప్రజారోగ్యం వరంగల్ అర్బన్ : మునిసిపల్ కార్పొరేషన్ స్థారుు నుంచి గ్రేటర్ వరంగల్‌గా రూపాంతరం చెందిన ఓరుగల్లు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. క్లీన్‌సిటీ చాంపియన్ షిప్ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది న వరంగల్ బల్దియా జాతీయస్థాయి అవార్డు లు, సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుంది. అరుుతే ఇంతటి ప్రఖ్యాతిగాంచిన మహా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడకపోవ డంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణకు ఏటా కోట్లు వెచ్చించి వాహనా లు కొనుగోలు చేస్తున్నా సమస్య గాడిలో పడ డం లేదు. దీంతో నగరంలోని పలు వీధుల్లో చెత్తకుప్పలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. అలాగే మురికి కాల్వలు కంపు కొడుతున్నాయి. వీటితోపాటు రోడ్లను శుభ్ర ం చేయకపోవడం తో దుమ్ముధూళితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రీసైక్లింగ్‌కు నోచుకోక డంపింగ్ యార్డులో చెత్త గు ట్టలుగా పేరుకుపోతుంది. దీంతో బయోగ్యాస్ విద్యుత్ నామమాత్రంగా సాగుతోంది. డంపింగ్ యార్డులుగా ఖాళీ స్థలాలు.. నగరంలోని పలు డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోరుు రోడ్ల వెంట మురుగునీరు ప్రవహిస్తుంది. డంపర్ బిన్లు, కాంఫ్యాక్టర్ బిన్లు చెత్తతో నిండిపోతున్నా పట్టించుకునేనాథుడే లేడు. ఫలితంగా నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డులుగా మారి మురికికూపాలను తలపిస్తున్నాయి. కాగా, మరుగుదొడ్ల నుంచి మల, మూత్రాలను నేరుగా డ్రెయినేజీల్లోకి వదలడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇదిలా ఉండగా, బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం ఇంటిం టా చెత్త సేకరణలో పాల్గొనడంతో కాల్వలు శుభ్రం చేసే వారే కరువయ్యారు. దీంతో కాల్వలు చెత్తాచెదారంతో నిండి పోయి ముక్కు పుటాలను అదరగొడుతున్నా యి. పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వ్యాప్తిచెంది ప్రజలు డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. కార్యరూపం దాల్చని ప్రణాళికలు.. ట్రైసిటీలో మొత్తం 1.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. 2012లోనే క్లిన్‌సిటీ చాంపియన్ షిప్ కార్యక్రమం మొదలుపెట్టారు. దేశంలో మొదటిసారిగా వరంగల్‌లోనే ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆరు నెలల పాటు బా గానే కొనసాగినా తర్వాత తగ్గింది. ప్రస్తుతం 60 శాతం ఇళ్లలో నుంచి ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నారు. కాగా, పలు కారణాలతో తోపుడు బండ్ల మరమ్మతులను నిలిపివేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు.. జవాన్ల పనితీరును పట్టించుకోవడం లేదు. బల్దియా డిప్యూటీ కమిషనర్ మినహా ఇతర అధికారులు తనిఖీలు చేపట్టడంలేదు. పేరుకుపోతున్న డంపింగ్ యార్డు మడికొండ శివారులోని డంపింగ్ యార్డులో చెత్త గుట్టల్లా పేరుకుపోతుంది. మహా నగరం నుంచి రోజు 145 మెట్రిక్ టన్నుల చెత్తను వాహనాల ద్వారా తరలిస్తున్నారు. దీంతో దశాబ్దకాలంగా యార్డులో చెత్త కుప్పులు గుట్టలుగా మారుతున్నాయి. చెత్త రీసైక్లింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టకపోవడంతో భవిష్యత్‌లో అనర్థాలు చోటు చేసుకోనున్నాయి. రీ సైక్లింగ్.. రీయూజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల్లో భాగంగా 2012 అక్టోబర్‌లో హన్మకొండ బాలసముద్రంలో తడి చెత్త ద్వారా బయో విద్యుత్ ఆధారిత ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో తయారవుతున్న 15 కేడబ్ల్యూ కరెంట్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ. 24 లక్షలతో 24 కేడబ్ల్యూ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, బాలసముద్రంలో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా 4 నుంచి 5 మెట్రిక్ టన్నుల చెత్త రీ సైక్లింగ్ జరుగుతోంది. అంతేకాకుండా ఐటీసీ కంపెనీ పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటా సేకరిస్తున్న పొడి చెత్తను కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా రోజు 10 మెట్రిక్ టన్నుల చెత్తను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఈ పదిహేను మెట్రిక్ టన్నుల చెత్త మాత్రమే రీసైక్లింగ్, రీయూజ్ జరుగుతోంది. ఏడాదికి రూ.30 కోట్లు మహా నగర పాలక సంస్థ పరిధిలో శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు మినహా 2621 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరి వేతనాలు, వాహనాల మరమ్మతులు, డీజిల్ కోసం ప్రతి నెల రూ. 2.50 కోట్లు వెచ్చిస్తోంది. అంటే ఏడాదికి రూ.30 కోట్లు వెచ్చిస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవచూపి నగరంలో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. -
‘స్వచ్ఛ’తకు బహుమతి
పారిశుద్ధ్య నిర్వహణలో జిల్లాలకు కేంద్రం అవార్డులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జాతీయ స్థాయిలో ‘స్వచ్ఛ విద్యాలయ’ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో జిల్లా ముందంజలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పాలనా వ్యవహారాల, సంస్కరణల శాఖ కార్యదర్శి దేవేంద్ర చౌదరి జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థుల హాజరుశాతం వంటి 8 అంశాలపై సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన కేంద్రం ‘స్వచ్ఛ విద్యాలయ’ అవార్డుకు జిల్లా పేరును తుది ఎంపిక జాబితాలో చేర్చింది. పరిపాలనలో మెరుగైన సేవలందించిన జిల్లాలకు అక్టోబర్‌లో ప్రధాని పురస్కారాలను ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్ గ్రామీణ్, స్వచ్ఛ విద్యాలయ, సాయిల్ హెల్త్‌కార్డు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకు ఈ అవార్డులను అందించనుంది. ఇందులో భాగంగా పథకాల అమలు, పురోగతిని ఆవిష్కరిస్తూ నివేదికలు పంపాలని జిల్లా కలెక్టర్లను కేంద్రం ఆదేశించింది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన అమలులోనూ జిల్లా యంత్రాంగం ప్రతిభ కనబరిచింది. మార్చిలో అవార్డుల తుది జాబితాను ప్రకటించే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. -
పారిశుధ్యమా నీవెక్కడ..?
ఎక్కడ చూసినా ‘చెత్త’ గుట్టలే. ఏ రహదారినా వెళ్లినా ముక్కుపుటలదిరే దుర్వాసనే. చెత్త డంపింగ్‌కు కాదేదీ అనర్హం.. అన్నట్టు మహానగరమంతా వ్యర్థాలతో నిండిపోతోంది. పారిశుధ్యం పడకేసి.. చారిత్రక భాగ్యనగరి.. పరమ ‘చెత్త’గా మారుతోంది. ఎందుకీ దుస్థితి..? దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల వైఫల్యం కాదా.? అవును ముమ్మాటికీ వారిదే ఈ మూల్యం. గ్రేటర్ ఎన్నికల వేళ మహానగరి మహాసమస్య మళ్లీ ముందుకొచ్చింది. వాగ్దానాల వాగ్బాణాలను ‘చెత్త’ బుట్టలో వేసే నాయకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చెత్త’ను కడిగేసే ‘స్వచ్ఛ’మైన హామీలిచ్చే నాయకుడికే పట్టం కడతామంటున్నారు నగరవాసులు. - సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, అంబర్‌పేట 4 వేల టన్నులు.. ప్రతిరోజు గ్రేటర్లో పోగవుతున్న చెత్త. ఇదీ జీహెచ్ఎంసీ అధికారుల లెక్క. కానీ అసలు లెక్క వేరు. లెక్కకు మిక్కిలి చెత్త నగరంలో పోగవుతోంది. పారిశుధ్యం పడకేసి అదంతా రోడ్లపైనే దర్శనమిస్తోంది. బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ డంపర్బిన్లు నిండిపోయి చెత్త చెల్లాచెదురవుతోంది. ఫలితంగా దుర్వాసన వెదజల్లి, దోమలు వృద్ధి చెంది ప్రజలకు ప్రాణాంతక వ్యాధులొస్తున్నాయి. సాధారణ చెత్తకు ఎలక్ట్రానిక్ వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా తోడవుతుండడంతో ఇది మరింత ఎక్కువవుతోంది. ‘స్వచ్ఛ’తకు స్వస్తి..! ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ పథకం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సినీ ప్రముఖులు అందరూ రోడ్లెక్కి చెత్తను ఊడ్చి ఫొటోలకు ఫోజులిచ్చేశారు. సీఎం పార్శీగుట్ట డివిజన్‌ను దత్తత తీసుకోగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కో డివిజన్‌కు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. అయినా ఎక్కడ ‘చెత్త’ అక్కడే ఉండిపోతోంది. కారణం పథకం అమలులో అలసత్వం. నిర్వహణ లోపం. ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రారంభమై 8 నెలలు అవుతోంది. నెలనెలా జరగాల్సిన ఈ కార్యక్రమం కేవలం తొలి రెండు పర్యాయాలు మాత్రమే జరిగిందంటే పరిస్థితి అర్థమవుతోంది. దీంతో పథకం ‘ఆరంభ శూరత్వం’గానే మారిందనే విమర్శలున్నాయి. మరోవైపు ‘స్వచ్ఛ హైదరాబాద్’లో చేసిన పనులకు ఎనిమిదినెలలైనా ఇంకా బిల్లులు చెల్లించలేదని వాహనాలు అద్దెకిచ్చిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. నిర్వహణ లోపమే అసలు సమస్య..! నగరంలో 8 వేల కిలోమీటర్ల రహదారులుండగా.. కేవలం 2 వేల కి.మీ పరిధిలో మాత్రమే పారిశుధ్య నిర్వహణ చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడానికి ఇదే అసలు సమస్య. దీనికి తోడు కార్మికులు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపర్‌బిన్లలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకపోవడంతో పరిసరాలు పూర్తిగా చెత్త మయమవుతున్నాయి. కొన్ని డివిజన్లలో డంపర్బిన్లు లేక చెత్తను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. సమస్యలిలా.. ‘స్వచ్ఛ’తెలా..? * చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు 564 వాహనాలు ఉన్నాయి. చెత్త తరలింపునకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. వీటిలోనూ 458 మాత్రమే జీహెచ్‌ఎంసీవి. మిగతా 106 అద్దె వాహనాలు. వాహనాల్లోనూ సగం తుప్పు పట్టడంతో మరమ్మతులకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. * పారిశుధ్య కార్మికులు గ్రూపులో ఏడుగురు ఉండాలి. కానీ నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తున్నారు. చాలా మంది పేర్లు హాజరుపట్టిలో ఉంటాయి. కానీ మనుషులుండరు. ఇలా సుమారు 5 వేల మంది జీతాలు కొందరి అక్రమార్కుల ఖాతాల్లోకి మళ్లుతున్నాయి. వీటిని పంచకుంటున్న వారిలో శానిటరీ సూపర్వైజర్లలు ఇతర సిబ్బంది, యూనియన్ల నేతలు కూడా ఉండడం గమనార్హం. నూతన జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రారంభించిన ‘పరిచయం’ కార్యక్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. అవినీతి ఇంత బహిరంగంగా జరుగుతుంటే.. ఇక పారిశుధ్యం ఎప్పటికి బాగుపడుతుంది.? * నగరంలో రోజుకు వందల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. నిజం చెప్పాలంటే గ్రేటర్ చెత్తలో ఇదే సగం. ప్లాస్టిక్ నిషేధించాలనే ప్రయత్నాలన్నీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఒత్తిడితో నీరుగారిపోయాయి. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించినా అమలు లేదు. కొన్నాళ్లు అమలు చేసి తర్వాత చేతులెత్తేశారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే చెత్త సమస్యకు చెక్ చెప్పొచ్చు. ఇప్పటికే పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. * ఐటీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ-వ్యర్థాలు) వెన్నంటే వెంటాడుతోంది. ఈ-వ్యర్థాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తర్వాత స్థానం హైదరాబాద్‌దే. గ్రేటర్లో ఏటా సుమారు 45 వేల టన్నుల ఈ-వ్యర్థాలు పోగవుతున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్ల చెత్తే 12 వేల టన్నులు ఉందని ఈటీ పీఆర్ఐ సర్వేలో తేలింది. వీటిలో 55 శాతం సాధారణ చెత్తతో కలుస్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. * వీటన్నింటితో పాటే బయోమెడి‘కిల్’ వేస్ట్ గ్రేటర్‌ను కలవరపెడుతోంది. ఆస్పత్రుల నుంచి వెలువడే ఈ డేంజర్ వేస్ట్‌ను సాధారణ చెత్తతో రోడ్లపైనే తగలబెడుతున్నారు. దీంతో 20 శాతం జనాభా అంటువ్యాధుల బారిన పడుతున్నారని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్లో ఏడాదికి 18 వేల టన్నుల బయోమెడి‘కిల్’ వ్యర్థాలు వెలువడుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కల్లో తేలింది. నగరంలో ప్రతిరోజు 50 టన్నుల బయోమెడికల్ వేస్ట్ పరిసరాల్లో కలుస్తోంది. ఏదీ ‘చెత్త’ శుద్ధి..? సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించడం లేదు. రోడ్లపైనే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. జీడిమెట్ల నాలా పక్కన ఎన్నో ఏళ్ల నుంచి చెత్త డంప్ చేస్తున్నారు. గతంలో అధికారులు వచ్చి చూసి వెళ్లినా ఇంత వరకు చెత్తను తరలించలేదు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేయాలి. ఆ దిశగా కృషి చేసే నాయకులకే నా ఓటు. - సంతోష్, ఆటోడ్రైవర్, జయరాంనగర్ చెత్తతో నిత్యం కుస్తీలే.. పారిశుధ్య నిర్వహణ సరిగా లేక రోడ్లపై చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. చెత్త తరలింపునకు పాలకులు సరైన ప్రణాళికలు రూపొందించడం లేదు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పథకం అమలు లేక అటకెక్కింది. గ్రేటర్ బరిలో నిలిచే పార్టీలు చెత్త నిర్వహణకు సరైన ప్రణాళికలతో ముందుకు రావాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందించే పార్టీకే నా ఓటు. - సిరాజుద్దీన్, అంబర్‌పేట -
ఎలుకా వచ్చె.. భద్రం తల్లో!
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తున్నాయి. పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కాంట్రాక్టులో ‘లుకలుకల’మూలంగా చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఫలితంగా ఎలుకలు, పందికొక్కులు సైతం నిత్యం తిరగాడుతున్నాయి. పరిశుభ్రతకు నిలయంగా ఉండాల్సిన సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుపై ఇటీవల ఎలుక దాడి చేసి పొట్టన పెట్టుకున్న హృదయ విదారక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. ఆ వెంటనే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కలెక్టర్ కోన శశిధర్ గత నెల 27న సర్వజనాస్పత్రిని పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడాన్ని గమనించి ఏజెన్సీ నిర్వాహకుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులను పరిశీలించి అపరిశుభ్రతగా ఉండడంతో ఏకంగా రూ.1.20 లక్షలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎలుకల సంచారం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్న కలెక్టర్.. ఇకపై ఒక్క ఎలుక కన్పించినా కాంట్రాక్టర్ నుంచి ఎలుకకు రూ.1000 వసూలు చేస్తానని హెచ్చరించారు. నెలనెలా రూ.13 లక్షలు ఇస్తున్నప్పుడు పారిశుద్ధ్యం మెరుగుపడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తూ జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. ఇంత జరిగినా ఆస్పత్రిలో పరిస్థితి మారిందా అంటే అది నామమాత్రమే. ప్రధానంగా కాన్పుల వార్డులో ఎలుకల సంచారం ఎక్కువగా ఉంటోంది. ప్రతి రోజూ ఆస్పత్రిలో సగటున 25 వరకు కాన్పులు జరుగుతున్నాయి. డెలివరీ తర్వాత వారిని వార్డుల్లోకి తరలిస్తుంటారు. అయితే ఇక్కడ క్షణక్షణం భయంతో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆస్పత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ఫలితంగా పంది కొక్కులు, ఎలుకల సంచారం ఎక్కువైంది. కాన్పుల వార్డు పక్కనే డ్రెయినేజీ ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఎలుకలు వస్తున్నాయి. అవి నేరుగా గదుల్లోకి వస్తున్నాయి. కాన్పుల వార్డులోని ఆరోగ్యశ్రీ విభాగంలోని ఏసీల వద్దకు, ఆ పక్కనే ఉన్న గదుల్లోకి వస్తుండడంతో అక్కడున్న వారు భయపడుతున్నారు. అసలే పసిబిడ్డలు ఉంటున్న వార్డులివి. ఇక్కడ చూస్తే అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కనీసం ఎలుకలను పట్టడానికి వీలుగా బోన్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఐసీయూలో మాత్రం బోను ఏర్పాటు చేశారు. ఇక నవజాత శిశు కేంద్రం పక్కన కూడా అపరిశుభ్రత ఎక్కువగా ఉండడంతో పందికొక్కులు వస్తున్నాయి. అయితే ఈ వార్డుకు కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో లోపలికి వెళ్లలేకపోతున్నాయి. ఆర్థో విభాగంలో కూడా పంది కొక్కులు, ఎలుకల సంచారం ఉంది. గాయపడిన వారికి కడుతున్న బ్యాండేజ్‌లను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండడంతో ఎలుకలు వస్తున్నాయి. ఎఫ్ఎస్-1, ఎఫ్ఎస్-2 వద్ద కూడా పరిశుభ్రత పడకేసింది. -
చెత్తమయం
కనీస వేతనాల అమలు కోసం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె గురువారంతో నాలుగు రోజులు పూర్తయింది. చాలీచాలని వేతనాలతో ఇల్లు గడవడం కష్టంగా మారుతోందని, పెరుగుతున్న జీవన వ్యయూలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులు సమ్మెబాట పట్టారు. పారిశుధ్య కార్మికుల సమ్మెతో మున్సిపాలిటీల్లోని గల్లీలన్నీ చెత్తమయంగా మారుతున్నాయి. రోజురోజుకు చెత్తకుప్పలు పెరుగుతుండడంతో పట్టణ ప్రజలు ఈగలు, దోమలు, దుర్వాసన మధ్య జీవితం గడుపుతున్నారు. - కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె - సమ్మెతో స్తంభించిన పారిశుధ్య నిర్వహణ - వీధుల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం - ఈగలు, దోమలు, పందుల స్వైరవిహారం - జిల్లా కేంద్రంలో కనిపించని ప్రభావం - కాంట్రాక్టు సిబ్బంది గోడు పట్టని సర్కారు కరీంనగర్ : జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపాలక సంస్థలు ఉండగా, కరీంనగర్ కార్పొరేషన్ మినహా మిగతా పది చోట్ల సమ్మె ప్రభావం ఉంది. రామగుండం కార్పొరేషన్‌తో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల మున్సిపాలిటీలు, పెద్దపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, వేములవాడ నగర పంచాయతీల్లో మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. రామగుండం కార్పొరేషన్లో 363 మంది, జగిత్యాలలో 292 మంది, సిరిసిల్లలో 125 మంది, కోరుట్లలో 145 మంది, మెట్పల్లిలో 124 మంది, వేములవాడలో 154 మంది, పెద్దపల్లిలో 110 మంది, హుజూరాబాద్‌లో 100 మంది, హుస్నాబాద్‌లో 100 మంది, జమ్మికుంటలో 117 మంది కాంట్రాక్టు కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటుండడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో చెత్తను తీసేందుకు సిబ్బంది లేకపోవడంతో ఆయూ పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. రోజూ చెత్త తీస్తేనే రోడ్ల వెంట చెత్త కుప్పలు కనిపించే మున్సిపాలిటీల్లో నాలుగు రోజుల సమ్మె ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. చెత్తకు తోడు పందులు చేరి నానా హంగామా చేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కలెక్షన్ పాయింట్ల సమీపంలో ఉండే నివాసాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెను కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని కార్మిక సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు. పర్మినెంట్ కార్మికులు పదుల సంఖ్యలోనే.. చెత్తను తొలగించేందుకు ఆయా మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో ఉన్న పర్మినెంట్ కార్మికులను ఉపయోగిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకపోవడంతో పర్మినెంట్ కార్మికులతో చేపట్టే పారిశుధ్య పనులు ఏ మూలనా పూర్తిగా జరగడం లేదు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోడంతో చెత్త తొలగేంచే మార్గమే కనబడకుండా పోతోంది. సమ్మె ఇలాగే కొనసాగితే పేరుకుపోతున్న చెత్తతో అంటువ్యాధులు, విషజ్వరాలు, ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కనిపించని ప్రభావం కరీంనగర్లో సమ్మె ప్రభావం కనబడడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగానికి చెందిన సంఘంలోనే మెజారిటీ కార్మికులు సభ్యులుగా ఉండడంతో విధులకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. నగరపాలక సంస్థలో మొత్తం 747 మంది కార్మికులు పనిచేస్తుండగా, సీఐటీయూలో 70 మంది కార్మికులు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొంటున్నారు. మిగతా 667 మంది కార్మికులు విధుల్లో ఉండడంతో సమ్మె ప్రభావం మచ్చుకు కూడా కానరావడం లేదు. జిల్లా కేంద్రంలో సమ్మె ప్రభావం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు సైతం పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు. -
ఏం తమాషాగా ఉందా..
- శానిటరీ మేస్త్రిపై కమిషనర్ మండిపాటు, సస్పెన్షన్ - పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి - అధికారులకూ చీవాట్లు విజయవాడ సెంట్రల్ : ‘ఏం తమాషాగా ఉందా. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. పారిశుధ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. కఠిన చర్యలు ఉంటే కానీ మీరు దారికి రారు..’ అంటూ కమిషనర్ జి.వీరపాండియన్ శానిటరీ మేస్త్రిపై మండిపడ్డారు. నగర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన 19వ డివిజన్లో పర్యటించారు. అక్కడ విధుల్లో ఉండాల్సిన వర్కర్లు కొందరు కబుర్లతో కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు కనిపించలేదు. దీనిపై మేస్త్రి వి.శ్రీనివాసరావును కమిషనర్ నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన కమిషనర్ అతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. మారకపోతే.. మీరే మారిపోతారు నగరంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కమిషనర్ అక్కడున్న ప్రజారోగ్యశాఖ అధికారులతో అన్నారు. డంపర్ బిన్ల వద్ద చెత్త పేరుకుపోతోందని, రాజధాని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చెబుతున్నా పనితీరు మారడం లేదని చీవాట్లు పెట్టారు. ఈనెల 20వ తేదీన రామలింగేశ్వరనగర్లో విధి నిర్వహణలో అలసత్వం వహించిన 11వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్వీ రమణను సస్పెండ్ చేస్తూ సోమవారం ఆదేశాలిచ్చారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, ఎస్ఈ ఆదిశేషు, ఈఈలు ధనుంజయ, సీవీకేభాస్కర్, ఎ.ఉదయ్‌కుమార్, కార్పొరేటర్ వీరమాచినేని లలిత తదితరులు పాల్గొన్నారు. -
ఏందీ మూకుమ్మడి సెలవులు?
⇒ హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి వైద్యులపై సీఎం కేసీఆర్ ఫైర్ ⇒ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి ⇒ ఆర్ఎంవో, సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆగ్రహం ⇒ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంపై మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘సీనియర్ వైద్యులంతా ఒకేసారి సెలవులో వెళితే ఎలా..? అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం ఎవరు చేస్తారు..?’.. అంటూ హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి వైద్యులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడాన్ని గమనించిన ఆయన.. ఇలాగైతే రోగులు ఎలా కోలుకుంటారని మండిపడ్డారు. శనివారం ఉదయం 11.30 సమయంలో సీఎం కేసీఆర్ ఫీవర్ ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలతో పాటు ఉండాల్సిన 20 మంది వైద్యుల్లో పది మంది కూడా లేకపోవడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ ఒక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారని, ఆర్ఎంవో సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పడంతో.. సీఎం నిర్ఘాంతపోయారు. సీనియర్ వైద్యులంతా శనివారం, ఆదివారం రాగానే సాకులు చెబుతూ ఒకేసారి సెలవు పెడితే... అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు చికిత్స ఎవరు చేస్తారని ప్రశ్నించారు. సకాలంలో వైద్యం అందక రోగులెవరైనా మృత్యువాత పడితే బాధ్యత ఎవరిదంటూ నిలదీశారు. ఈ తనిఖీల సందర్భంగా సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల తదితరులు ఉన్నారు. చర్యలు చేపడతాం..: డీఎంఈ శ్రీనివాస్ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వైద్యులు, ఇతర సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య విద్యా డెరైక్టర్ (డీఎంఈ) పుట్టా శ్రీనివాస్ చెప్పారు. శనివారం ఉదయం ఫీవర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వెళ్లిన అనంతరం మధ్యాహ్నం సమయంలో ఫీవర్ ఆస్పత్రికి డీఎంఈ చేరుకున్నారు. విధులకు హాజరై కూడా బయటకు వెళ్లిన సిబ్బంది ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. పరిశుభ్రత ఏది..? ఆస్పత్రి ఆవరణలో భారీగా చెత్తాచెదారం ఉండడాన్ని గమనించిన సీఎం.. ఇలాగైతే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఎలా కోలుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి కాంపౌండ్ వాల్‌ను ఆనుకుని ఉన్న ఇళ్లలోంచి జనం చెత్త వేస్తున్నారని సిబ్బంది చెప్పగా.. అలా వేసేవారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో ఈస్ట్‌జోన్ పోలీసులతో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి చెత్తాచెదారాన్ని తొలగించాల్సిందిగా అక్కడే ఉన్న డీసీపీ రవీందర్‌కు సూచించారు. అవసరమైనే తాను కూడా తట్టపట్టి చెత్త ఎత్తుతానని సీఎం పేర్కొన్నారు. అనంతరం ఫైలేరియా, స్వైన్‌ఫ్లూ వార్డులను సీఎం పరిశీలించారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పాత భవనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం... రోగుల కోసం ఖాళీ స్థలంలో కొత్త భవనాలు నిర్మిస్తామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సు పోస్టులన భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు కోరగా... పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. -
జీహెచ్ఎంసీ ‘చెత్త’ యోచన
ఇళ్లు, షాపుల ముందు చెత్త డబ్బాలు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించనందుకేనట స్మార్ట్ సిటీ అంటే ఇదేనా? ఓవైపు ‘స్వచ్ఛ భారత్ ’ అంటూ ప్రభుత్వ ప్రచారం... ప్రభుత్వ శాఖల అధికారులు... స్వచ్ఛంద సంస్థలు... ప్రజల భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేసేందుకు యత్నం. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణలో... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ శాఖల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ స్వైన్ ఫ్లూ పరిహాసం. ఈ మహమ్మారి కళ్ల ముందే ప్రజల ప్రాణాలు హరిస్తున్నా... చేష్టలుడిగి చూస్తున్న యంత్రాంగం. ఆ నడుమ ‘ఈ లోకం ఏమైపోతే మాకేం’ అన్నట్టుగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్వాకం. నరక లోకపు శిక్షలు ఇక్కడే అమలు చేసేందుకు ‘చెత్త’ ప్రయత్నం. పన్నులు కట్టని వారి ఇళ్ల ముంద ర చెత్త పోసి... శిక్షించే ‘మహా’ ఘన కార్యం... అడుగడుగునా విమర్శలు మూటగట్టుకుంటోంది. గురువారం ఉదయం.. సోమాజిగూడలోని ఓ వ్యాపారి షాపు తెరవడానికి వెళ్లాడు.. షాపు ఎదుట చెత్త డబ్బా (డంపర్ బిన్) దర్శనమిచ్చింది. ఆరా తీస్తే... ఆ పని జీహెచ్ఎంసీ చేసినట్టు తెలిసింది. గత రెండేళ్లుగా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఆ పని చేసినట్లు తెలిసి ఘొల్లుమన్నాడు. ఎస్బీఐ కార్వాన్ శాఖ కార్యాలయం ముందు రెండు డంపర్ బిన్లు ఉన్నాయి. బ్యాంకులోకి ఎవరూ వెళ్లకుండా తాళం వేశారు. బ్యాంకు ఉన్న భవన యజమాని దాదాపు రూ.5.40 లక్షల ఆస్తిపన్ను బకాయి చెల్లించనందుకే ఈ‘శిక్ష’ట. కొద్ది రోజులుగా ఆస్తిపన్ను వసూళ్లకు జీహెచ్ఎంసీ సిబ్బంది ఇలాంటి పనులకు తెగబడుతున్నారు. అబిడ్స్లోనిబిజినెస్ టవర్స్‌లో మొత్తం 80 దుకాణాలు ఉన్నాయి. అందులో 15 దుకాణాలను సీజ్ చేశారు. దాదాపు రూ.1.29 కోట్ల బకాయిల వసూళ్ల కోసం ఈ మార్గం ఎంచుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36, రోడ్ నెం. 45లలో మూడు చోట్ల ఇలాగే చెత్తకుండీలు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం ఉప్పల్ స్టేడియంలో సామగ్రి జప్తు చేశారు. అక్కడ రూ.12 కోట్ల బకాయిల కోసం ఈ చర్యలకు సిద్ధమయ్యారు. ఇంకో చోట సుమారు రూ.6 లక్షల ఆస్తిపన్ను బకాయి పడిన భవన యజమాని కారును సీజ్ చే శారు. సిగ్గు పడాలని.. ఆస్తిపన్ను వసూలుకు జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 1050 కోట్లు ఆస్తిపన్నును వసూలు చేసిన అధికారులు ఈసారి రూ.1464 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. చాలా భవనాల యజమానులు ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించకపోవడం.. ఎక్కువ విస్తీర్ణంలోని వాటిని తక్కువ గాచూపుతూ కొద్ది మొత్తంలో చెల్లిస్తుండడం వంటి అంశాలు అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో లెక్క తేల్చేందుకు తిరిగి సర్వే చేయించారు. నివాస గృహంగా చూపుతూ.. వ్యాపారాలు నిర్వహిస్తున్న భవనాలను గుర్తించారు. దాంతో కొందరి ఆస్తిపన్ను రెట్టింపు కంటే మించిపోయింది. మరోవైపు పాత బకాయిలే రూ. వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో రూ. 1464 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేం కాదని భావించారు. వివిధ విభాగాల అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి..రంగంలోకి దిగారు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీంతో షాపులు, భవనాల ముందు డంపర్ బిన్లు పెట్టడం... భవనాలు, వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలకు దిగారు. సంబంధిత యజమానులు సిగ్గుతోనైనా ఆస్తిపన్ను చెల్లించకపోతారా అనేది వారి ఆలోచన. అనుకున్నట్టుగానే.. సీజ్ చేసిన భవనాల యజమానులు ఆస్తిపన్ను చెల్లించేందుకు ఒప్పకోవడం.. ఒకటి, రెండు రోజుల గడువు కావాలని కోరుతుండడంతో ఈ పద్ధతిని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. సగం కూడా పూర్తి కాని లక్ష్యం గత ఏడాది ఇదే రోజుకు ఆస్తిపన్ను రూ.559 కోట్లు వసూలు కాగా... ప్రస్తుతం రూ.630 కోట్లుగా ఉంది. గతానికి భిన్నంగా ఈసారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫలితం లేకపోవడంతో ఇళ్ల ముందు చెత్త డబ్బాలు.. కార్యాలయాల సీజ్ వంటి కార్యక్రమాలకు దిగారు. గతంలోనూ ఒకటి, రెండు చోట్ల ఇలాంటి సంఘటనలు ఉన్నా...ఈసారి ఎక్కువ కావడం విమర్శలకు దారి తీస్తోంది. సేవల స్తంభన అప్పటికీ దారికి రాకపోతే విద్యుత్, తాగునీటి సరఫరా వంటి సేవలను స్తంభింపజేసేందుకు బడాబాబులే అధికం జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న నివాస, వాణిజ్య భవనాలు మొత్తం 13,63,607 ఉండగా... వీటిలో రూ.4వేల లోపు ఆస్తిపన్ను చెల్లించే ఇళ్లు సుమారు 10 లక్షల 10వేలుగా గుర్తించారు. వీరు మొత్తం రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. మిగతా మొత్తం చెల్లించాల్సింది, బకాయిలున్నది బడాబాబులే కావడం గమనార్హం. బకాయిలపై వడ్డీని ప్రభుత్వం రద్దు చేయడంతో ఆస్తిపన్ను డిమాండ్‌లో దాదాపు రూ.130 కోట్లు తగ్గాయి. మరికొందరికి పన్ను రద్దు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అది ఎంతనే విషయంలో స్పష్టత లేదు. ఈ కారణంతోనూ వసూళ్లు తగ్గాయి. మరోవైపు ఎఫ్ఎం రేడియో సహా వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చినా ఉపయోగం లేకుండాపోయింది. -
అబ్బా..ఇది ఏమి దోమ
* దోమల నివారణకు ‘పశ్చిమ’ వాసుల నెల ఖర్చు రూ.10 కోట్లు * వైద్య ఖర్చులు దీనికి 10 రెట్లు అధికం * అయినా జనం రక్తాన్ని పీల్చేస్తున్న మశకాలు తాడేపల్లిగూడెం : ఎండా.. వాన.. చలి.. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా దోమలు జనాన్ని కుట్టి కుట్టి ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. వీటి తీవ్రత ఎంతగా ఉందంటే.. పగటిపూట కూడా మస్కిటో రిపెల్లెంట్స్, మేట్స్, కాయిల్స్ ఉపయోగించాల్సిన స్థాయిలో మశకాలు విజృం భిస్తున్నాయి. ఈ సమస్య దోమలగూడెంగా ప్రసిద్ధికెక్కిన తాడేపల్లిగూడెం పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏలూరు నగరం, భీమవరం, నరసాపురం, పాల కొల్లు, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పట్టణాలతోపాటు ప్రతి గ్రామంలోనూ ప్రజలను వేధిస్తున్నాయి. వీటివల్ల వైరల్, టైఫాయిడ్ జ్వరాలు సోకుతున్నాయి. సకాలంలో వైద్యం చేయించుకోకపోతే కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితి సంభవిస్తోంది. ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు. రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయి జ్వర పీడితులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. వేరే వ్యక్తుల నుంచి ప్లేట్లెట్స్ దానంగా తీసుకుని.. వైద్య ఖర్చుల కోసం వేలాది రూపాయలు వెచ్చించి ప్రాణాలు నిలబెట్టుకుంటున్న వారెందరో ఉన్నారు. నెల బడ్జెట్ రూ.10 కోట్లు జిల్లా జనాభా 39 లక్షల 34 వేల 782. కుటుంబాల పరంగా చూస్తే జిల్లాలో మొత్తం 10 లక్షల 91 వేల 525 కుటుంబాలున్నాయి. జిల్లాలోని ప్రతి కుటుం బం దోమల నివారణకు మస్కిటో రిపెల్లెంట్, మేట్స్, కాయిల్స్‌లో ఏదో ఒకటి విధిగా వాడుతోంది. అధిక శాతం కుటుం బాల్లో గదికి ఒకటి చొప్పున వీటిని వాడుతున్నారు. కొందరైతే పగలు, రాత్రి కూడా వీటిని వెలిగిస్తున్నారు. ప్రతి కుటుంబం రోజుకు ఒక రిపెల్లెంట్ లేదా ఒక కాయిల్ చొప్పున మాత్రమే వాడుతున్నట్టు భావిస్తే నెలకు రూ.90 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. రిపెల్లెంట్ (లిక్విడ్) వాడకానికి అయితే రూ.70 నుంచి రూ.120 వరకూ ఖర్చవుతోంది. ఎవరు ఏది వాడుతున్నా నెలకు సగటు ఖర్చు రూ.90 చొప్పున లెక్కిస్తే.. మొత్తం కుటుంబాలు దోమల నివారణకు నెలకు రూ.9,85,97,250 ఖర్చు చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల ఆధారంగా చూస్తే ఈ ఖర్చు ఇంతకంటే ఎక్కువే. కుదేలవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు దోమల ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారుు. దోమల వల్ల అనారోగ్యానికి గురవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు మంచాన పడటంతో పనులకు వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల పూట గడవటం కష్టంగా మారుతోంది. మరోవైపు వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవుతున్నారు. దీని ప్రభావం పైకి సాదాసీదా విషయంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఎన్నో కుటుం బాల జీవన పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఎన్నో కుటుం బాలను కుదేలు చేస్తున్నాయి. దిగజారిన పారిశుధ్యం పారిశుధ్య నిర్వహణకు నిధులు లేవంటూ మునిసిపాలిటీలు చేతులెత్తేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఖాళీ జాగాలు, వాటినిండా పిచ్చి మొక్కలు, మురికి గుంటలు దర్శనమిస్తున్నాయి. అవన్నీ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. మురుగు కాలువల్లో దోమల లార్వాను నివారించే బెటైక్స్ వంటి మందులను మునిసిపాలిటీలు పిచికారీ చేయడం లేదు. దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. ఫలితంగా దోమలు కుప్పలు తెప్పలుగా పెరుగుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో.. మరీ ముఖ్యంగా మునిసిపల్ కార్యాలయూల్లో సైతం పగటి పూట దోమల నివారణకు రిపెల్లెంట్స్, మేట్స్ వంటివి వాడుతున్నారు. మునిసిపాలిటీలు ఏం చేయూలి పారిశుధ్య పరిరక్షణకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నట్టు మునిసిపాలిటీలు గణాంకాల్లో పేర్కొంటున్నప్పటికీ.. దోమల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. దోమలను గుడ్డు దశ నుంచి లార్వా.. ఆ తరువాత దశల్లో నివారించేందుకు ప్రతి నిత్యం చర్యలు చేపట్టాల్సి ఉంది. డ్రెయిన్లలో గుడ్లు, లార్వాలు దోమలుగా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలి. వీటిని వేయడం వల్ల నీటిపై ఆయిల్ తెట్టు కడుతుంది. తద్వారా లార్వా ఊపిరి అందక చనిపోతుంది. గుడ్లు లార్వాలుగా అభివృద్ధి చెందవు. గంబూషియా చేపలను తరచూ మురుగు కాలువలలో వదలాలి. ఇవి దోమల లార్వాలను తినేస్తుంటాయి. ఈ పనులు చాలాచోట్ల ప్రహసనంలా మారడంతో దోమల నివారణ ఎండమావిలా మారిందనే విమర్శలు ఉన్నాయి. -
మీ యంత్రాంగం పని చేయడం లేదు
పారిశుధ్యం నిర్వహణలో వైఫల్యంపై ఎంసీడీకి హైకోర్టు మొట్టికాయ న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో విఫలమైనందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. నగరంలోని ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతమంది సఫాయి కార్మికులు ఉన్నారు, వారు ఎక్కడ పని చేస్తున్నారో వివరిస్తూ ఓ స్థాయీ నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు బదర్ దుర్రేజ్ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం ఎంసీడీని ఆదేశించింది. ‘‘మీ యంత్రాంగం పని చేయడం లేదు. దీనిపై దృష్టి సారించండి’’ అని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను అందచేయాలని ఎంసీడీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఆదివారాలు, సెలవు దినాలతో సహా ఢిల్లీలో ప్రతిరోజూ వీధులు, బహిరంగ ప్రదేశాలు, మురుగు కాల్వలు, పార్కులను శుభ్రం చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు గత సెప్టెంబర్ 10న పునరుద్ధరించింది. చరిత్రాత్మకమైన నగరం, భారతదేశ రాజధాని ఢిల్లీప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాలలో ఒకటిగా మారిందంటూ సుప్రీం కోర్టు 1996లో వ్యాఖ్యానించినప్పటికీ, పారిశుధ్యం నిర్వహణలో ప్రభుత్వ సంస్థలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ న్యాయభూమి అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రోడ్లు ఊడ్చే వ్యక్తి తన విధులకు గైర్హాజరైతే ఎంసీడీ చట్టంలోని 387 సెక్షన్ ప్రకారం మున్సిపల్ మేజిస్ట్రేట్లు 30 రోజుల జైలుశిక్షను విధించవచ్చు. నగరంలోని విద్య, వైద్య సంస్థలు మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, మరుగుదొడ్లు కూడా లేవని స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది శరణ్ పేర్కొన్నారు. నగరంలో పారిశుధ్యాన్ని నిర్వహించేందుకు, పరిస్థితులను మెరుగుపరిచేందుకు సుప్రీం కోర్టు 14 మార్గదర్శకాలను జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. -
అసలిది ఆస్పత్రేనా?
పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా.. * జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్ర హం * తీరు మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరిక * జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని వెల్లడి సంగారెడ్డి అర్బన్: ‘అసలిది ఆస్పత్రేనా.. పారిశుద్ధ్య నిర్వహణ ఇలా ఉంటే రోగాలు నయమవడం కాదు...కొత్త వ్యాధులొస్తాయి...ప్రైవేటు ఆస్పత్రులు ఇలాగే ఉంటాయా...అసలు మీరు పనిచేస్తున్నారా.. మీరే సరిగా పనిచేస్తే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటుందా...ప్రధానమంత్రే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నారు.. మీరు అంత కంటే ఎక్కువా..సిబ్బంది పనిచెప్పేముందు మనమూ చేసి చూపాలి’ అంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులన్నీ తిరిగి పరిశీలించారు. గైనిక్ ఓపి, నవజాత శిశు సంరక్షణ వార్డు తదితర విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని పిల్లల వార్డులో పారిశుద్ధ్యం కొరవడటం, గోడలు బూజు పట్టి ఉండటంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడైనా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించారా అని ప్రశ్నించారు. అలసత్వం వీడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతకుముందు ఆస్పత్రి సిబ్బంది ఆయనకు స్వాగతం పలకగా ఏజేసీ మూర్తి పుష్పగుచ్ఛం అందజేశారు. మెడికల్ కళాశాల మంజూరుకు చర్యలు సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం రాజయ్య వెల్లడించారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇది వరకే కోరారన్నారు. వైద్యకళాశాల ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని 250 నుంచి 500 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు అందాయని, త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మెరుగైన వైద్యం అందించాలి సర్కార్ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు. సిబ్బందిలో చిత్తశుద్ధి లోపిస్తే, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదన్నారు. ఆస్పత్రిలో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నారు. వారు పనితీరు మెరుగుపర్చుకోకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. పారిశుద్ధ్య పనులు కాంట్రాక్టర్ చేస్తున్నట్లయితేఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించాలన్నారు. డ్యూటీ డాక్టర్ 24 గంటలూ వైద్యసేవలందించాలన్నారు. కాల్ డ్యూటీ డాక్టర్ పనిచేసే చోట అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వైద్యులైనా సరే ఇంటికి సాగనంపుతామన్నారు. జిల్లాలో వైద్యుల కొరత కారణంగా 80 శాతం రోగులు హైదరాబాద్‌లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 22 వైద్యాధికారుల పోస్టులను త్వరలో భ ర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రివాల్వింగ్ ఫండ్ రూ.28 లక్షలు ఉన్నాయని ప్రతిపాదనలు పంపిస్తే ఆ నిధులు మంజూరు చేయిస్తామన్నారు. హెచ్‌డీఎస్‌లో ఉన్న రూ.5 లక్షలు కనీస అవసరాలు తీర్చేందుకు కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు విరివిగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ సీఎం వెంట జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ నాయకులు పిట్టెల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్ గౌడ్, అదనపు జే సీ మూర్తి, డీఎంహెచ్ఓ డా.బాలాజీ పవార్, ఆర్ఎంఓ డా.మురహరి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధుకర్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌కుమార్, ఆస్పత్రి వైద్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
విషజ్వరాలు
మంచం పడుతున్న ప్రజలు వైద్య సేవలపై దృష్టిపెట్టని ఆరోగ్య శాఖ ప్రైవేట్ చికిత్సలతో జనం జేబులు ఖాళీ గాలిలో కలుస్తున్న పేదల ప్రాణాలు సాక్షి, హన్మకొండ : పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రజలు మంచం పడుతున్నారు. సర్కారు వైద్యసాయం కింద అందే అరకొర గోలీలకు జ్వరాలు అదుపులోకి రావడం లేదు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రి యజమాన్యాలు రకరకాల పరీక్షలు చేస్తుండటంతో రోగులు అప్పుల పాలవుతున్నారు. ఈ ఏడాది సగటు వర్షపాత తక్కువగా ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఓ మోస్తారు వర్షాలే కురిశాయి. వరదలు వచ్చేలా భారీ వర్షాలు కురవలేదు. ఈ తేలిక పాటి వర్షాల కారణంగా నీటి ఆవాసాల్లో పాతనీరు పోయి కొత్త నీరు వచ్చింది తక్కువ. అంతేకాకుండాగతేడాదితో పోల్చితే వర్షాలు తక్కువగా ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. గ్రామాల్లో మొక్కుబడిగా ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. నీటి ఆవాసాల్లో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టడం లేదు. సమస్యాత్మక గ్రామాలు అంటూ కేవలం 108 పల్లెల్లోనే ఫాగింగ్ చేపట్టారు. మిగిలిన గ్రామాల్లో ఈ పని చేయలేదు. దానితో దోమలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తే వెంటనే ఆ కుటుంబంలోని సభ్యులందరికీ పాకుతోంది. పరీక్షలతో జేబులు గుల్ల.. సర్కారీ వైద్యసేవలు అరకొరగా అందుతుండటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 40కి పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే ప్రతీరోగికి అవసరం ఉన్నా లేకపోయినా పలు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారుు. దానితో వైద్య ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇప్పటికైనా దోమలు పెరగకుండా తక్షణమే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఫాగింగ్ చేయూలి. నీటి ఆవాసాల్లో దోమలు పెరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు సరఫరా చేసే నీటిపై నమ్మకం లేక చాలా మంది క్యాన్లలో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇచ్చిన గోలీలే ఇస్తాండ్రు నాకు ఇరవైరోజుల సంది జరమొత్తాంది. గౌర్నమెంట్ డాక్టర్లు వచ్చిండ్రంటే పోయిన. జరం, కాళ్లు, కీళ్లనొప్పులు, నీరసం ఉందన్నా. నాకు రెండు రకాల గోళీలు ఇచ్చిండ్రు. ఆ మందులు వాడినా ఏం తగ్గలే. మళ్లా డాక్టర్లు వచ్చిండ్రు. మళ్ల పోతే అయే గోళీలు ఇచ్చిండ్రు. ఇదేంది మేడమ్ మళ్ల అయ్యే గోళీలు ఇచ్చిండ్రు అని అడిగితే, పై నుంచి ఇవే వత్తనాయ్ అన్నరు. చేసేది లేక మా ఊళ్లో డాక్టర్ కాడికి పోయినా. గ్లూకోజ్ బాటిల్ పెట్టి మానుకోటలోని ఆస్పత్రికి పంపిండ్రు. అక్కడ బాటిళ్లు ఎక్కించి మందులు రాసిండ్రు. పరీక్షలకు, మందులకు రూ.12 వేలు అయినయ్. అయినా జరం తక్కువైతలేదు. పైసలు లేక ఇంటికి వచ్చిన. చేతిలో ఉన్న మందులనే వాడుతున్న. - బోడ అస్లీ, కాట్రపల్లి చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన తప్పనిసరి. పిల్లలను చలిలో తిప్పడం, వర్షంలో తడనివ్వడం, ఐస్‌క్రీంలు తినిపించడం, శీతలపానీయాలు అతిగా తాగిపించడం మంచిది కాదు. జలుబు, జ్వరం ప్రారంభం కాగానే ఆవిరిపట్టడం, వెచ్చని దుస్తులు ధరించడం వంటివి చేస్తే సాధ్యమైనంత వరకు జ్వరంతో పాటు న్యుమోనియా వంటి వ్యాధులను అరికట్టవచ్చు. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదముంది. డాక్టర్ల సూచనలు పాటిస్తూ యాంటీబయాటిక్స్ మందులను ఏడు రోజుల పాటు కోర్సుగా వాడాలి. ఒకటి రెండు రోజులు వాడి వదిలిస్తే ఇబ్బందులు తప్పవు. - శేషుమాధవ్, పీడియాట్రీషన్ వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి... వర్షాకాలం రాగానే విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పరిసరాలలో నీరు నిల్వ ఉండ డంతో పాటు పారిశుధ్యం లోపించడం వల్ల జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వల వల్ల దోమలు వృద్ధి చెంది జ్వరాలు సోకే ప్రమాదం ఉంది. అంతే కాకుండా వర్షకాలంలోచల్లని పదార్థాలు సేవించకూడదు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. - వి.చంద్రశేఖర్, ప్రొఫెసర్, ఎంజీఎం 40 మందికి డెంగ్యూ ప్రాణాంతక మలేరియా, డెంగ్యూలతో పాటు చికున్‌గున్యా వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు జిల్లాలలో 2,67,366 మంది నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా.. వీరిలో 76 మందికి మలేరియా సోకినట్లుగా నిర్థారణ అయింది. అదేవిధంగా 421 మంది జ్వరపీడితులకు పరీక్షలు చేయగా వీరిలో 40 మంది ప్రాణాంతక డెంగ్యూ, మరో 14 మందికి చికున్‌గున్యా సోకినట్లు తేలింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రాణాంతక వ్యాధుల ఆనవాళ్లు కనిపిస్తున్నా అందుకు తగ్గట్లుగా పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడంలో జిల్లా ఆరోగ్యశాఖ తరఫున అందడం లేదని రోగులు అంటున్నారు. పైసల్లేక ఇంటికి వచ్చిన 15రోజులుగా జరమొత్తాంది. సర్కారోళ్లు మా ఊరికి వచ్చి అందరికీ పరీక్ష చేత్తాన్నరని ఎల్లిన. రెండు మార్లు పోతే నాకు, నాతోటోళ్లకి ఒకే రకం గోలీలు ఇచ్చిండ్రు. జరం తగ్గకపోవడంతో మానుకోట ఆసుపత్రికి పోయిన. అక్కడ రూ.10 వేల దాక ఖర్చయింది. ఇంకా ఉండాలని డాక్టర్లు అన్నరు. కానీ పైసల్లేక ఇంటికి వచ్చినమ్. - ఆంగోతు తుల్సమ్మ, కాట్రపల్లి జ్వరాల ‘కోట’ మహబూబాబాద్ : విషజ్వరాలతో మానుకోట డివిజన్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. సాధారణ రోజుల్లో ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య 400 నుంచి 500 మధ్య ఉంటుంది. కానీ... సీజనల్ వ్యాధుల మూలంగా ప్రతి రోజు ఓపీకి 500 నుంచి 800 మంది రోగులు వస్తున్నారు. వీరిలో సగానికి పైగా జ్వరపీడితులే కావడం గమనార్హం. -
ఆర్ఎంసీలో ఎంబీబీఎస్ సీట్ల కోత
- వైద్య వర్గాల్లో ఆందోళన - కోత విధించవద్దంటూ అధికారుల లేఖ కాకినాడ క్రైం : నిత్యం వేలాది మంది రోగులు, క్షతగాత్రులకు వైద్య సేవలందించే కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పారి శుధ్య నిర్వహణ లోపం రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ)కు శాపంగా పరిణమించింది. కళాశాలలోని 50 ఎంబీబీఎస్ సీట్లు కోత విధిస్తూ ఇటీవల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులు జారీ చేయడంతో వైద్యవర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై తీవ్రం గా స్పందించిన ఆర్ఎంసీ పాలనాధికారులు కోత విధిం చవద్దంటూ లేఖ రాశారు. తిరిగి 50 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయనే నమ్మకం లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని డీఎం నియోనటాలజీ కోర్సు ఆర్ఎంసీలో ఉంది. ఇద్దరు విద్యార్థులు డీఎం నియోనటాల జీ కోర్సు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న వైద్య కళాశాలలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. అన్నీ పరిష్కార సమస్యలే ఎంసీఐ బృందం నివేదికలో పేర్కొన్న సమస్యలన్నీ పరిష్కరించగలిగేవేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకినాడ జీజీహెచ్‌కు ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం సుమారు మూడు వేల మంది రోగులు, క్షతగాత్రులు వైద్యం కోసం వస్తుంటారు. అంతేకాకుండా జీజీహెచ్ వెయ్యి పడకలకే పరిమితమైనప్పటికీ సుమారు 1500 మంది ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతుంటారు. వారికి సేవలందించేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన సుమారు 150 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ విధానాలు, ఇతర కారణాల రీత్యా వారికి సక్రమంగా జీతాలందకపోవడంతో పలుమార్లు ఆందోళనలకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ దీనిపై స్పందించి ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కార్మికులకు జీతాలు విడుదల చేయించారు. పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగిన సమయంలో ఎంసీఐ బృందం పర్యటించడంతో ఆస్పత్రిలో అపరిశుభ్రత చోటుచేసుకోవడాన్ని వారు తీవ్రంగా పరిగణించారు. ల్యాబ్‌లో రసాయనాలు లేకపోవడం, విద్యార్థినులకు వసతి గృహం, లెక్చర్ గ్యాలరీ నిర్మాణం పూర్తి కాకపోవడం వంటి సమస్యలను మాత్రమే నివేదికలో పేర్కొన్నారు. ఆస్పత్రిలో విద్యార్థులకు మించి రోగులుండడం, ఆధునిక వైద్య పరికరాల కారణంగా పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుంచి కూడా క్షతగాత్రులు ఇక్కడికి వస్తుండడం వైద్య విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పారిశుధ్యాన్ని సాకుగా చూపించి ఆర్ఎంసీలో సీట్లు కోత విధించడంపై వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 700 సీట్లు కోత విధించినట్టు నిపుణులు చెబుతున్నారు.