జీహెచ్‌ఎంసీ ‘చెత్త’ యోచన | Homes, stores and garbage cans in front | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ‘చెత్త’ యోచన

Published Fri, Feb 13 2015 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

జీహెచ్‌ఎంసీ ‘చెత్త’ యోచన

జీహెచ్‌ఎంసీ ‘చెత్త’ యోచన

ఇళ్లు, షాపుల ముందు చెత్త డబ్బాలు
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించనందుకేనట
స్మార్ట్ సిటీ అంటే ఇదేనా?

 
ఓవైపు ‘స్వచ్ఛ భారత్ ’ అంటూ ప్రభుత్వ ప్రచారం... ప్రభుత్వ శాఖల అధికారులు... స్వచ్ఛంద సంస్థలు... ప్రజల
 భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేసేందుకు యత్నం. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణలో... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ శాఖల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ స్వైన్ ఫ్లూ పరిహాసం. ఈ మహమ్మారి కళ్ల ముందే ప్రజల ప్రాణాలు హరిస్తున్నా... చేష్టలుడిగి చూస్తున్న యంత్రాంగం. ఆ నడుమ ‘ఈ లోకం ఏమైపోతే మాకేం’ అన్నట్టుగా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్వాకం. నరక లోకపు శిక్షలు ఇక్కడే అమలు చేసేందుకు ‘చెత్త’ ప్రయత్నం. పన్నులు కట్టని వారి ఇళ్ల ముంద ర చెత్త పోసి... శిక్షించే ‘మహా’ ఘన కార్యం... అడుగడుగునా విమర్శలు మూటగట్టుకుంటోంది.
 
గురువారం ఉదయం.. సోమాజిగూడలోని ఓ వ్యాపారి షాపు తెరవడానికి వెళ్లాడు.. షాపు ఎదుట చెత్త డబ్బా (డంపర్ బిన్) దర్శనమిచ్చింది. ఆరా తీస్తే... ఆ పని జీహెచ్‌ఎంసీ చేసినట్టు తెలిసింది. గత రెండేళ్లుగా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఆ పని చేసినట్లు తెలిసి ఘొల్లుమన్నాడు.

ఎస్‌బీఐ కార్వాన్ శాఖ కార్యాలయం ముందు రెండు డంపర్ బిన్‌లు ఉన్నాయి. బ్యాంకులోకి  ఎవరూ వెళ్లకుండా తాళం వేశారు. బ్యాంకు ఉన్న భవన యజమాని దాదాపు రూ.5.40 లక్షల ఆస్తిపన్ను బకాయి చెల్లించనందుకే ఈ‘శిక్ష’ట. కొద్ది రోజులుగా ఆస్తిపన్ను వసూళ్లకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇలాంటి పనులకు తెగబడుతున్నారు. అబిడ్స్‌లోనిబిజినెస్ టవర్స్‌లో మొత్తం 80 దుకాణాలు ఉన్నాయి. అందులో 15 దుకాణాలను సీజ్ చేశారు. దాదాపు రూ.1.29 కోట్ల బకాయిల వసూళ్ల కోసం ఈ మార్గం ఎంచుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36, రోడ్ నెం. 45లలో మూడు చోట్ల ఇలాగే చెత్తకుండీలు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం ఉప్పల్  స్టేడియంలో సామగ్రి జప్తు చేశారు. అక్కడ రూ.12 కోట్ల బకాయిల కోసం ఈ చర్యలకు సిద్ధమయ్యారు. ఇంకో చోట సుమారు రూ.6 లక్షల ఆస్తిపన్ను బకాయి పడిన భవన యజమాని కారును సీజ్ చే శారు.

సిగ్గు పడాలని..

ఆస్తిపన్ను వసూలుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 1050 కోట్లు ఆస్తిపన్నును వసూలు చేసిన అధికారులు ఈసారి రూ.1464 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. చాలా భవనాల యజమానులు ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించకపోవడం.. ఎక్కువ విస్తీర్ణంలోని వాటిని తక్కువ గాచూపుతూ కొద్ది మొత్తంలో చెల్లిస్తుండడం వంటి అంశాలు అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో లెక్క తేల్చేందుకు తిరిగి సర్వే చేయించారు. నివాస గృహంగా చూపుతూ.. వ్యాపారాలు నిర్వహిస్తున్న భవనాలను గుర్తించారు. దాంతో కొందరి ఆస్తిపన్ను రెట్టింపు కంటే మించిపోయింది. మరోవైపు పాత బకాయిలే రూ. వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో రూ. 1464 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేం కాదని భావించారు. వివిధ విభాగాల అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి..రంగంలోకి దిగారు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీంతో షాపులు, భవనాల ముందు డంపర్ బిన్లు పెట్టడం... భవనాలు, వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలకు దిగారు. సంబంధిత యజమానులు సిగ్గుతోనైనా ఆస్తిపన్ను చెల్లించకపోతారా అనేది వారి ఆలోచన. అనుకున్నట్టుగానే.. సీజ్ చేసిన భవనాల యజమానులు ఆస్తిపన్ను చెల్లించేందుకు ఒప్పకోవడం.. ఒకటి, రెండు రోజుల గడువు కావాలని కోరుతుండడంతో ఈ పద్ధతిని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సగం కూడా పూర్తి కాని లక్ష్యం
 
గత ఏడాది ఇదే రోజుకు ఆస్తిపన్ను రూ.559 కోట్లు వసూలు కాగా... ప్రస్తుతం రూ.630 కోట్లుగా ఉంది. గతానికి భిన్నంగా ఈసారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫలితం లేకపోవడంతో ఇళ్ల ముందు చెత్త డబ్బాలు.. కార్యాలయాల సీజ్ వంటి కార్యక్రమాలకు దిగారు. గతంలోనూ ఒకటి, రెండు చోట్ల ఇలాంటి సంఘటనలు ఉన్నా...ఈసారి ఎక్కువ కావడం విమర్శలకు దారి తీస్తోంది.

 సేవల స్తంభన
 
అప్పటికీ దారికి రాకపోతే విద్యుత్, తాగునీటి సరఫరా వంటి సేవలను స్తంభింపజేసేందుకు
 
బడాబాబులే అధికం

జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న నివాస, వాణిజ్య భవనాలు మొత్తం 13,63,607 ఉండగా... వీటిలో రూ.4వేల లోపు ఆస్తిపన్ను చెల్లించే ఇళ్లు సుమారు 10 లక్షల 10వేలుగా గుర్తించారు. వీరు మొత్తం రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. మిగతా మొత్తం చెల్లించాల్సింది, బకాయిలున్నది బడాబాబులే కావడం గమనార్హం. బకాయిలపై వడ్డీని ప్రభుత్వం రద్దు చేయడంతో ఆస్తిపన్ను డిమాండ్‌లో దాదాపు రూ.130 కోట్లు తగ్గాయి. మరికొందరికి పన్ను రద్దు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అది ఎంతనే విషయంలో స్పష్టత లేదు. ఈ కారణంతోనూ వసూళ్లు తగ్గాయి. మరోవైపు ఎఫ్‌ఎం రేడియో సహా వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చినా ఉపయోగం లేకుండాపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement