కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్‌ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు.. | Cabinet Approves Setting Up Of 12 Industrial Smart Cities Across 10 States | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్‌ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..

Published Wed, Aug 28 2024 3:56 PM | Last Updated on Wed, Aug 28 2024 5:12 PM

Cabinet Approves Setting Up Of 12 Industrial Smart Cities Across 10 States

ఢిల్లీ : దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

దేశంలో 12 గ్రీన్‌ ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.28,602 కోట్ల నిధుల్ని కేటాయించింది.

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏర్పాటు కానున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్‌లో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్‌కు 2 కేటాయించింది.  కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో, కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇక తెలంగాణ జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా సమావేశంలో కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement